Sunday, October 9, 2016

కావ్యశృంగారవర్ణనాకర్ణనమున


కావ్యశృంగారవర్ణనాకర్ణనమున


సాహితీమిత్రులారా!



కవిరసాయనమనే కావ్యాన్ని
సంకుసాల నరసింహకవి చేశారు.
అందులో మాంధాత చక్రవర్తి కథ చెప్పబడింది.
ఆ కావ్య అవతారికలో కవి  తన కవిత్వాన్ని గురించి
ఎంత ధీమాతో చెప్పాడో తెలుస్తుంది.
ఆ పద్యం చూడండి-

యతి విటుడు గాకపోవుటె ట్లస్మదీయ
కావ్యశృంగారవర్ణనాకర్ణనమున
విటుడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్యవైరాగ్యవర్ణనాకర్ణనమున

నా యీ కావ్యంలో వర్ణించిన శృంగార రస ఘట్టాలను విన్న
ఏ సన్యాసయినా రసికుడై విటుడు కాకుండా ఉండగలడా?
అదే విధంగా దీనిలోని వైరాగ్య వర్ణనలు విన్న
ఎంతకాముకుడైనా జారడైనా విరక్తుడై సన్యసించకుండా ఉండగలడా?
- అని భావం.

అందుకే ఈ కవి తన కావ్నానికి
కవికర్ణరసాయనము అని పేరు పెట్టాడు.
అంతటి రసాయనమన్నమాట.

No comments:

Post a Comment