Monday, October 10, 2016

మల్లెపూలు తెల్పు మంచు తెల్పు


మల్లెపూలు తెల్పు మంచు తెల్పు


సాహితీమిత్రులారా!
రంగులగురించిన పద్యాలు
చాటుపద్యమణిమంజరిలో
వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఏరి కూర్చారు.
కాని వీటికి చివరి పాదాలు ఆయనకు లభించలేదట.
ఇది తెలుపును గూర్చి చెప్పెడి పద్యం
చూడండి-

పార్వతీపతి తెల్పు పాలసంద్రము తెల్పు
           కామధేనువు తెల్పు కంచు తెల్పు
నారదముని తెల్పు, శారదాభ్రము తెల్పు
           శారదాంబిక తెల్పు, సంకు తెల్పు
ఐరావతంబు తెల్ప మృతపూరము తెలు
           పాదిశేషుఁడు తెల్పు హంస తెల్పు
కల్పవృక్షము తెల్పు కైలాసగిరి తెల్పు 
           మల్లెపూవులు తెల్పు మంచు తెల్పు
తెలుపు చెప్పనేల వెలఁదికి మేలైన
గుణము గల్గనేని కోటిసేయు
...................
......................
(చాటుపద్యమణిమంజరి -2- పుట.130)

No comments:

Post a Comment