యవనీ నవనీత కోమలాంగీ
సాహితీమిత్రులారా!
మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానంలో
జగన్నాథ పండితరాయలు అనే తెలుగువాడు
కొంతకాలం ఉన్నాడట. అతడు చిన్నతనంలోనే కాశీచేరి
గొప్పవిద్వాంసుడయి అప్పటి మొగల్ రాజైన షాజహాన్
దగ్గర ఉన్న సందర్భంలో చక్రవర్తి ఆస్థానంలోని
ఒక యువతిని చూచి ఈ శ్లోకం చెప్పాడట.
చూడండి.
యవనీ నవనీత కోమలాంగీ
శయనీయే యది మామకే శయానా
అవనీతలమేవ సాధు మన్యే
న వనీ మాఘవనీ వినోదహేతు:
వెన్నవలె కోమలమైన శరీరంగల
ఈయవన(మహమ్మదీయ) స్త్రీ
నా శయ్యపై శయనించినట్లయితే
ఇంద్రుని నందనోద్యానవన విహారం కంటే
మామూలు నేల శ్రేష్ఠమని భావిస్తాను - అని శ్లోక భావం.
ఆయువతితో పొందుకలిగితే కటికనేలకూడ
నందనవనంకంటె గొప్పదిగా భావించగలను అని
ఆమెపై తనకుగల గాఢానురాగాన్ని వెల్లడించాడాయన.
No comments:
Post a Comment