సఖీవాంఛల్ తుదల్ ముట్టునే
సాహితీమిత్రులారా!
బాల్యంనుండి యౌవనంలోకి
వెళ్ళే వారిని గురించి
చెప్పెడి చక్కని ఈ శ్లోకం చూడండి-
నవా సోఢుం శక్యం నళినశరబాణా నవిరతాన్
న దైర్యం తారుణ్యం నవ మధికబాల్యం వితను తే
సువక్తవ్య లజ్జా విరమయతి పూతం కుల మపి
స్వతంత్రత్వం లుంప త్యథ కి మలలావాంఛితశతై:
అవిరతాన్ - నిరంతరముగ పయిబడుచండు,
నళినశరబాణాన్ - మన్మథబాణములను,
సోఢుం - ఓర్చుటకు, నవాశక్యం - శక్యమే కాకున్నది,
అధికబాల్యం - బాల్యము అతిశయించియుండునదియగు,
తారుణ్యం - యౌవనము, ధైర్యం - ధీరభావమును,
నవితనుతే - కలిగింపదు, సువ్యక్తవ్యే - మంచి
మాటలాడునర్థమునందు, లజ్జా - సిగ్గు,
విరమయతి - ఊరకుండుమనుచున్నది,(నోరెత్తనివ్వడంలేదు),
పూతం - పావనమగు, కులమపి - అభిజనమును,
స్వతంత్రత్వం - స్వాతంత్ర్యంను, లుంపతి - త్రుంచివేయుచున్నది,
అథ - ఇంక, అబలావాంఛితశతై: - అబలలకు మనోరథశతంబులు
కలిగి ఉండినను, కిం - ఏమి ఉపయోగము?
ఈ శ్లోకానికి తెలుగుపద్యం చూడండి
వనజాతాస్త్రకుఁడేయుసాయకములన్ వారింపఁగా రాదు నూ
తనబాల్యాధిక యౌవనంబు మదికిం ధైర్యంబు రా నీదు స
త్యనిరుక్తిన్ మిముఁబోంట్లకుం దెలుప నాహా సిగ్గు మైకోదు పా
వనవంశంబు స్వతంత్ర మివ్వదు సఖీవాంఛల్ తుదల్ ముట్టునే
No comments:
Post a Comment