Showing posts with label బంగ్లా. Show all posts
Showing posts with label బంగ్లా. Show all posts

Sunday, February 4, 2018

నిత్యానంద ఘోషు


నిత్యానంద ఘోషు




సాహితీమిత్రులారా!

మన తెలుగులో భారతాన్ని
నన్నయ తిక్కన ఎఱ్ఱన(కవిత్రయం)
సంస్కృతం నుండి అనువదించారు
అలాగే నిత్యానందఘోషు బాంగ్లలో
వ్యాసభారతాన్ని 18 పర్వాలుగా
రచించాడు. అయితే దీన్ని
విజయ పాండవ కథ అని పిలుస్తారు.

"విజయ పాండవ కథా అమృతలహరీ
సునిలె అధర్మఖండె పరలోకె తరి
సున సున అరె భాయి హయె ఏకమన
నిత్యానంద ఘోష బలె భారత కథన"
(విజయ పాండవ కథామృతలహరి వింటే అధర్మం
ఖండనదిమవుతుంది. పరలోకం లభిస్తుంది. వినండి
వినండి సోదరులారా ఏకాగ్రచిత్తంతో వినండి.
నిత్యానంద ఘోషు చెబుతున్నాడు.)

నిత్యానందఘోషు అశ్వమేధపర్వం మాత్రం
వ్యాసుని రచననే కాకుండా జైమిని రచనను
కూడ తీసుకొని అనువదించాడు. అతని రచన
సరళమైంది. ఆబాల వృద్ఝుల వరకు అవగతమౌతుంది.
కురుక్షేత్రం రణరంగంలో దుర్యోధనుడి
మృతదేహాన్ని చూచిన గాంధారి అన్న మాటలు చూడండి-

"దేఖ కృష్ణ! మరి ఆఛె రాజా దుర్యోధన,.
సంగేతె నాదెఖి కెన కర్ణదుశ్శాసన?
శకుని సంగెతె కెన నా దేఖి రాజన?
కథాభీష్మ మహాశయ, గాంధార నందన?
ఏకాదశ అక్షౌహినీ యార సంగె జాయ్,
హేన దుర్యోధన రాజా ధులాయ్ లుటాయ్,
సువర్ణేర ఖాటై జారీ సతత శయన,
ధూలాయ్ ధూపర తను హయ్యాఛె ఏఖన."
(చూడు కృష్ణ దుర్యోధనరాజు చచ్చి పడున్నాడు.
దగ్గర కర్ణ దుశ్శాసనులు కనబడరేమీ రాజరాజుతో శకుని లేడేమి
భీష్మమహాశయుడేడీ పదకొండు అక్షోహిణుల సేన వెంట
నడిచే మహారాజు ధూళిలో ఎలా పొర్లాడుతున్నాడో
బంగారు మంచంమీద ఎల్లప్పుడూ శయనించే రాజు ఇప్పుడు
ధూళిధూసర దేహంతో పడున్నాడు)

Tuesday, January 30, 2018

కవీంద్ర పరమేశ్వరదాసు


కవీంద్ర పరమేశ్వరదాసు



సాహితీమిత్రులారా!



కవీంద్ర పరమేశ్వరదాసు బెంగాలీ కవి.
15వ శతాబ్ది చివరిలో జన్మించి 16వ శతాబ్ది
తొలిభాగంలో కాలం చేసిన వారు వీరు.
హుసేనుషా(1497-1518) సేనాపతి అయిన
పారగల్ ఖాను ఆస్థానకవిగా ఉండినవాడు.
ఈ పారగలుఖాను అనంతరం కూచి బీహారు
రాజయిన నరనారాయణుడి దగ్గర మంత్రిగా
పనిచేశాడు. అలా చివరి దినాలు శారీపురంలో
గడిచాయి.

      మన తెలుగులో రాజరాజనరేంద్రుడు మహాభారతాన్ని
ఆంధ్రీకరించినట్లు బాంగ్లాలో మహాభారతాలు మహమ్మదీయ
ప్రభువులు వ్రాయించారు. తమ ఆస్థానాలలో భారతం
చదివించాలని అభిలాషపడ్డారు వారు. అయితే సంస్కృత
గ్రంథాలు వారికి అడవిలా అంధకారబంధుమైనాయి.
అందువల్ల తేటతెల్లమైన బాంగ్లా అనువాదాలు చేయించారు.

    పానగల్ ఖాను ఆదేశం ప్రకారం మహాభారతాన్ని సంస్కృతం
నుంచి బాంగ్లా చేశాడు పరమేశ్వరదాసు. అందుకని ఇతని భారతానికి
పానగల్ మహరాభారతమని పేరు. తన గ్రంథంలో మొదట్లోనే
ఆ గ్రంథరచనకు కారణం వివరించాడు.

ఆ ప్రస్తావనం-

"లస్కర పారగల్ సునంత కాహినీ,
యేనమతె పాండవె హారాయిల రాజధాని
వనవాసె బంచిలేక ద్వాదశవత్సర,
కేనమతె ధర్మ రయిల వనేర్ భితర.
వత్సరేక అభిలంత అజ్ఞాత వసతి,
కేనమ తె తారా సబె పాయిల వసుమతీ?
వహి సబ కథా కహ సంక్షిప్త కరియా,
దినేక సునితె పారి పాంచాలీ కరియా,
తాఁహార ఆదేశమాల్య మస్తకె కరియా,
కవీంద్ర కహిల కథా పాంచాలీ రచియా"

(పాండవులు రాజధాని ఎలా పోగొట్టుకున్నారు
ధర్మానికి కట్టుబడి పన్నెండేళ్లు వనవాసమూ,
సంవత్సరమూ అజ్ఞాతవాసమూ ఎలాచేశారు
ఎలాతిరిగి రాజ్యం సంపాదించారు
ఇదంతా సంక్షిప్తంగా ఒక్కదినంలో వినగలిగినంత
పద్యకావ్యంగా రచించమని పానగల్ సేనాని ఆదేశించాడు.
అతని ఆదేశం శిరస్సున దాల్చి కవీంద్రుడు
పద్యంగా(భారత)కథ వ్రాశాడు.)

భారత కథంతా వొక్కరోజులో చదవగలినంత
మొదట సంక్షిప్తంగానే వ్రాశాడు కవీంద్రుడు.
తరువాత దానినే విస్తృపరచి వ్రాశాడు.
ఇప్పుడది మొత్తం 17000 పద్యాలతో వుంది.
మన భారతమేకాదు భారతదేశంలో అనేకానేక
భారతాలు వివిధభాషల్లో కూర్చారని దీన్ని బట్టి
తెలుస్తున్నదికదా మిత్రులారా!

Thursday, January 18, 2018

"స్వప్నప్రయాణం" నుంచి చిన్నతునక


"స్వప్నప్రయాణం" నుంచి చిన్నతునక




సాహితీమిత్రులారా!



ద్విజేంద్రనాథ ఠాకూరు(1840-1926)
ఈయన "విశ్వకవి" రవీంద్రనాథ ఠాగూరుగారి
అన్న. ఈయన కవిత్వంలోనే కాదు,
సంగీతంలోనూ,  చిత్రకళలోనూ, గణితంలోనూ,
తత్వవిద్యలోనూ, దర్శన శాస్త్రంలోనూ సమర్థుడు.
గద్యపద్యాల రెండింటా రచన సాగించాడు.
బీహారీలాలు కావ్యాలతో ఇతని కావ్యలకు
సామంజస్యం కనిపిస్తుందంటారు. ఇతని
స్వప్నప్రయాణం, కావ్యమాల, రేఖాక్షర
వర్ణమాల, జౌతుకనాకౌతుక ప్రసిద్ధకావ్యాలు.
"స్వప్నప్రయాణం" నుంచి చిన్నతునక-

కరియా జయె
మహా ప్రళయ
బాజియా ఉఠిల బాజనా నానా.
తాల వేతాల
దిచ్ఛేతాల
థెయి థెయి నాచే పిశాచదానా.
గాధాయ చడి
లాగాయ ఛడి
అదభుతరస కింపురుష.
దుటి అధరె
హాసి నా ధరె
లంబా ఉదర బేంటె మానుష.

(మహాప్రళయం జయించి నానా వాద్యాలు మోగాయి.
లయతోనూ, లయతప్పీ తాళాలు, రేగాయి. థెయిథెయి
పిశాచాలు నాట్యం చేశాయి. గాడిద లెక్కి, చబుకువేసి,
అద్భుతంగా కింపురుషులు - పెదవుల నవ్వులేదు.
పెద్ద పొట్టల పొట్టిమనుషులు)

Monday, January 15, 2018

పద్మానది


పద్మానది



సాహితీమిత్రులారా!



హుమాయును కబీరు బాంగ్లాలో మంచి కవి
అని తక్కువ మందికే తెలుసు. ప్రకృతి
మనోహర దృశ్యం చిత్రించడంలో సిద్ధ
హస్తుడు ఈయన. ఇతని పద్మా(నది)
కవితను చూడండి-
బ్రహ్మపుత్రానదిని బంగ్లాదేశ్ లో
పద్మా అని పిలుస్తారు.
ఇక్కడ బంగ్లా కవితను అలాగే చూసి
అర్థాన్ని తరువాత చూద్దాం-

దూరదేశే తోరె బహుదిన ఛిను భులె పద్మా మోర,
అబార శాంగనే తోర కూలే కూలే భాంగన లెగె ఛెజోర?
నెమెఛె వర్షా ఘోర
చరేర చిహ్నధుయె ముఛెదియె
వుపుల సలిల సంబార నియె
యౌవన తోరె బోయె నియె జాన్ కాహార దోర్?
కే మనో చోర?
పద్మా మోర..
సబుజ మాయాయ భరేఛె దుకూల తబొ
పద్మా మోర.
జలేర కినారె ఎసెఛె దుర్వానవ
తెబు దయా నహీ తోర?
అతిథి శిశురె హాసిన కి కరి?
నిఠుర ప్రహారె ఉఠిఛె శిహలీ
ఠకరి పడిచె క్షురధారీ ప్రోత నిరంతర
దెఖి తె కోమల తబు ఎతొ తోర
హియా కఠోర? 

భావం-
         నా పద్మా, దూరదేశాన ఎన్నాళ్ళో మరిచి వున్నావు.
తిరిగి శ్రావణం రాగానే నీ వొడ్లు విరిగి పడుతున్నాయి.
ఘోరమైన వర్షం దిగి వస్తోంది. పొడిపొడిగురుతులు 
తుడిచేసి, కడిగేసి, విపుల సలిల సంబారం నీయవ్వనం 
పారించి ఎవరి ద్వారానికి తర్లించుకు పోతుంది ఎవరే 
నీ మనసు దొంగిలించారు. నా పద్మా
         ఆకుపచ్చటి మాయ నీ ఉభయ తీరాలు దట్టంగా
వున్నాయి.నీటి వొడ్డున కొత్తగరిక వచ్చింది. అయినా దయలేదే
నీకు అతిథి పైగా శిశువు ఇలా అనాదరణ తగునే నీ నిష్ఠుర
ప్రహారాలతో అది అనవతరం వొణికి పోతూ వుంది. నీ క్షుర 
ధారాప్రవాహం నిరంతరం కోస్తూనేవుంది. చూసేందుకు ఇంత 
కోమలవు. నీహృదయ మింత కఠోరమేమి, నా పద్మా