Wednesday, November 30, 2022

వీళ్ళెవరు? - సూర్యుడు - సంజ్ఞాదేవి - ఛాయాదేవి

వీళ్ళెవరు?  

సూర్యుడు - సంజ్ఞాదేవి - ఛాయాదేవి




సాహితీమిత్రులారా

పురాణ పాత్రలు - కథలు!

“వీళ్ళెవరు” అనే ఈ కార్యక్రమంలో … “పురాణ పాత్రలు - కథలు” అనే ఉపశీర్షికలో ప్రత్యక్షనారాయణుడిగా కొలువబడే సూర్యభగవానుని గురించి, అతని కుటుంబం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. 

ఇక కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


 

Monday, November 28, 2022

అడవి బాపిరాజు గారి చిరుపరిచయం

 అడవి బాపిరాజు గారి చిరుపరిచయం




సాహితీమిత్రులారా!

మన ప్రాచీన కవుల దగ్గరనుండి నేటి ఆధునిక కవులు రచయితల పరిచయాలను సంగ్రహంగా పరిచయం చేయడానికి ప్రారంభించిన కార్యక్రమమే ఈ "మన కవులు రచయితల చిరు పరిచయాలు". అందులో భాగంగా ఈరోజు మనం కవి, కథకుడు, నవలా రచయిత, ఆచార్యుడు, కళా దర్శకుడు, పత్రికా సంపాదకుడూ అయిన అడవి బాపిరాజు గారి గురించి చెప్పుకుందాం. 

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Saturday, November 26, 2022

ప్రముఖుల మాటలు - నవ్వుల మూటలు

 ప్రముఖుల మాటలు - నవ్వుల మూటలు




సాహితీమిత్రులారా!

హాయిగా నవ్వించే ప్రముఖుల ఛలోక్తులు!

ఈరోజు.. మన సాహిత్యంలోని చమత్కారాలనూ, మన సాహితీకారులు విసిరిన చమక్కులను చెప్పుకుని కాసేపు నవ్వుకుందాం. ఇలాంటి చమక్కులెన్నింటినో సేకరించి శ్రీరమణగారు “హాస్యజ్యోతి”గాను, ద్వానాశాస్త్రిగారు “తెలుగు సాహిత్యంలో హాస్యామృతం”గాను, ఆచార్య తిరుమల గారు “నవ్వుటద్దాలు” గాను, మృణాళిని గారు “తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు” గాను, ఇంకా ఎందరో ప్రసిద్ధులు మరెందరో ప్రఖ్యాతుల జీవితాలలోని చమత్కారఘట్టాలను సంకలనాలుగా చేసి మనకు అందించారు. అటువంటి సునిసితమైన హాస్య సన్నివేశాలను చదువుతున్నా, వింటున్నా మనసంతా తేలికపడి కాసింత హాయిగా ఉంటుంది. ఇది వరకు కూడా, మన అజగవలో “కడుపుబ్బా నవ్వించే ప్రముఖుల ఛలోక్తులు”, “శ్రీశ్రీ చమక్కులు”, “చురుక్కుమనిపించే విశ్వనాథ చమక్కులు”, “హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు” అనే శీర్షికలతో నాలుగు భాగాలుగా నవ్వుకున్నాం. మరోసారి నవ్వుకోవడానికి ఈ “ప్రముఖుల మాటలు - నవ్వుల మూటలు” భాగంలో ప్రవేశిద్దాం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Thursday, November 24, 2022

దేవీ అశ్వధాటి స్తోత్రం, తాత్పర్యము

 దేవీ అశ్వధాటి స్తోత్రం, తాత్పర్యము




సాహితీమిత్రులారా!

సృజనాత్మకతను, రచనా శక్తిని పెంపొందించే దేవీ అశ్వధాటీ స్తోత్రం, అర్థముతో సహా!

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే 

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

అంటూ.. వాక్కు, అర్థము ఒకదానిని విడిచి, మరొకటి ఎలా ఉండలేవో, అలాంటి కలయికే కలిగి, అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లే ఆ ఆదిదంపతులను, తనకు శబ్దార్థ జ్ఞానము అనుగ్రహించమంటూ, తన రఘువంశ మహాకావ్య ప్రారంభానికి ముందు, ప్రార్థించాడు, మహాకవి కాళిదాసు. ఇప్పటికీ ఎంతోమంది, తమ రచనలు ప్రారంభించే ముందు, ఈ శ్లోకాన్నే  ప్రార్థనా శ్లోకంగా వాడటం పరిపాటి. 

అలానే, వేరొక సందర్భంలో.. ఆ మహాకవి, తనకు ఆశుకవితాశక్తిని ప్రసాదించమంటూ, ఆ జగన్మాతను, అద్భుతమైన రీతలో స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం నడక ఎలా ఉండాలో, ముందుగానే కాళిదాసు నిశ్చయించుకోవడం వల్ల అశ్వధాటీ వృత్తంలో  రచన సాగించాడు. అందుకే ఈ 13శ్లోకాల నడకలోనూ ఆ సొగసు, ధాటి కనబడుతుంది. పండితపామర జనరంజకమైన ఈ శ్లోకాలను చదువుతుంటే.. కవులైన వారికి, తమకూ ఇలాంటి రచన ఒకటి చెయ్యాలనిపిస్తుంది. పామరులకు ఇలాంటి స్తోత్రాలు మరిన్ని వినాలనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. అందరికీ ఈ స్తోత్రం హృదయోల్లాసాన్ని కలిగిస్తుంది. అలానే.. హృదయాన్ని అమ్మ పాదపద్మాలపై ఉంచి, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల, ఆ జగదంబ అనుగ్రహం పరిపూర్ణంగా లభించి, ఆశుకవితా శక్తి కలుగుతుందన్నది ఋుషులవంటి మన పెద్దలు చెప్పినమాట. ముందుగా ఆ స్తోత్రాన్ని ఒకసారి చదువుకుని, తరువాత ఒక్కో శ్లోక భావాన్నీ సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఇక దేవీ అశ్వధాటి స్తోత్రాన్ని మొదలు పెడదాం..

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Tuesday, November 22, 2022

ప్రియురాలిని పొగడటం ఎలా?

 ప్రియురాలిని పొగడటం ఎలా?



సాహితీమిత్రులారా!

ప్రియురాలిని ఎలా పొగడాలి? - సాహిత్యంలో చమక్కులు

“ఎంత తీయని పెదవులే ఇంతి నీవి!

తిట్టుచున్నప్పుడును గూడ తీపి కురియు” 

అంటూ తాను వలచిన వనితను ఉబ్బేశాడో రసికుడు. నువ్వు తిడుతున్నా తియ్యగానే ఉంటుందని ప్రియుడు అంత మురిపెంగా అంటుంటే, పెదవుల్లో మధువులు కురిపించని ప్రేయసి ఉంటుందా. అలానే ఆమెకు ప్రియునిపై కోపమొచ్చి నీ సంగతేంటో తేలుస్తానాగు అన్నట్లుగా తన కొంగును నడుముకు బిగిస్తుంటే.. వెంటనే అతగాడు..

“నడుము బిగియించు చుంటివి నన్ను దునుమ

నాకు తెలియులే నీ కెంత నడుము కలదొ?” అన్నాడు తడుముకోకుండా. “నా మీద కోపంతో నడుం బిగిస్తున్నావ్ కానీ.. ఇంతకూ అసలు నీకు నడుమెక్కడుందీ” అని ఆ గాలిబ్ గీతాల కుర్రవాడు అంటుంటే ఆ జవ్వని పొంగిపోకుండా ఎలా ఉంటుంది. ఆమె కోపమంతా కరిగిపోక ఏం చేస్తుంది. అసలు మన కవులు పురుషుల్ని పొగిడినా, స్త్రీలను పొగిడినా ఈ నడుముని మాత్రం విడిచిపెట్టరు. ఇక ఆ తరునాత సంగతులు వినడానికి వీడియోలో ప్రవేశిద్దాం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Sunday, November 20, 2022

శృంగార నాయికలు - కావ్య నాయికలు



సాహితీమిత్రులారా!
పద్మినీ, చిత్రిణీ, శంఖినీ. హస్తినీజాతి స్త్రీల లక్షణాలు క్రితం భాగంలో మనం కావ్య శృంగార నాయకులలో ఉన్న విభాగాల గురించీ, పురుషులలో ఉన్న చతుర్విధ జాతుల గురించీ చెప్పుకున్నాం. ఈరోజు త్రివిధ కావ్యనాయికల గురించి అష్టవిధ శృంగారనాయికల గురించి, చతుర్విధ స్త్రీజాతుల గురించీ తెలుసుకుందాం. కావ్య నాయికలు: స్వీయ పరకీయ సామాన్య ఇందులో స్వీయ మరలా మూడు విధములు.. ముగ్ధ మధ్య ప్రౌఢ అలానే పరకీయ.. కన్య, అన్యోఢ అని రెండు విధములు. శృంగార నాయికలు అష్ట విధములు: స్వాధీనపతిక వాసకసజ్జిక విరహోత్కంఠిత విప్రలబ్ధ ఖండిత కలహాంతరిత ప్రోషితభర్తృక అభిసారిక స్త్రీ జాతులు నాలుగు: పద్మిని - Padmini చిత్రిణి - Chitrini శంఖిని - Sankhini హస్తిని - Hastini 
రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

 

Friday, November 18, 2022

శృంగార నాయకులు - కావ్య నాయకులు

 శృంగార నాయకులు - కావ్య నాయకులు




సాహితీమిత్రులారా!

ఏ జాతి పురుషునకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి?

మన సినిమాలలో హీరోలు పదిమందినో ఇరవైమందినో ఒక్కసారే చితక్కొట్టెయ్యగలరు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే, బాధితుల పక్షాన నిలబడి పోరాడగలరు. తమవారి జోలికి ఎవరన్నా వస్తే వాళ్ళకు బుద్ధిచెప్పనూ గలరు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు. చాలా అందంగా కూడా ఉంటారు. అలానే హీరో కోసం ప్రాణాలివ్వడానికైనా వెనుకాడరు. ఇటువంటి లక్షణాలున్న హీరోహీరోయిన్లను మనం ఎంతగానో అభిమానిస్తాం. కొండొకచో ఆరాధిస్తుంటాం కూడా. అసలు మన ప్రాచీన కావ్యాలలోనూ, నాటకాల లోనూ కథానాయకునికి, కథానాయికకి ఉండవలసిన లక్షణాల గురించి ఏం చెప్పారు. నాయికా నాయకులలో ఎన్ని విభాగాలున్నాయి; మొదలైన వివరాలను ఈ నాయికలు - నాయకులు అనే రెండు భాగాలలో తెలుసుకుందాం. 

ముందుగా ఈరోజు నాయకుల గురించి చెప్పుకుందాం.

ఆనాటి కాలంలో రాజుని విష్ణ్వంశ సంభూతుడిగానే ప్రజలు భావించేవారు. అతని గుణగణాలు, నడవడిక, జీవనవిధానం సామాన్య ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసేవి. అందుకే ఒక సామాన్యుని కథ కంటే, పరిపాలకుడైన ఒక రాజు చరిత్ర మీదనే ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ కారణం చేతనే కావ్యాలలోనూ, నాటకాలలోనూ ఆదర్శప్రాయుడైన రాజునే నాయకునిగా ఉంచి రచనలు చేసేవారు మన ప్రాచీన కవులు. అయితే చాలా కొద్ది కావ్యాలలో మాత్రం ఉత్తమలక్షణాలు కలిగిన ఇతర వర్ణములవారు కూడా నాయకులుగా ఉంటుండేవారు.

ఈరోజు మనం కావ్య, శృంగార నాయకుల కోసం, పురుషులలో జాతుల కోసం, నాయకులకు సహాయకుల కోసం చెప్పుకుందాం.

కావ్య నాయకులు - Kavya Nayakulu

ధీరోదాత్తుడు - Dheerodaattudu

రోద్ధతుడు - Dheeroddhatudu

ధీరలలితుడు - DheeraLalitudu

ధీరశాంతుడు - DheeraShantudu

    శృంగార నాయకులు - Srungara Nayakulu

    దక్షిణుడు - Dakshinudu

    అనుకూలుడు - Anukooludu

    ధృష్టుడు - Dhrushtudu

    శఠుడు - Shathudu


పురుష జాతులు - Purusha Jaatulu

పాంచాలుడు - Paanchaaludu

దత్తుడు - Dattudu

భద్రుడు - Bhadrudu

కూచిమారుడు - Koochimaarudu

    నాయకా సహాయకులు

    పీఠమర్దుడు - Peethamardudu

    చేటుడు - Chetudu

    విటుడు - Vitudu

    విదూషకుడు - Vidooshakudu


Rajan PTSK గారికి ధన్యవాదాలు

Wednesday, November 16, 2022

గొడుగుపాలుడు - శ్రీకృష్ణదేవరాయల కథ

 గొడుగుపాలుడు - శ్రీకృష్ణదేవరాయల కథ




సాహితీమిత్రులారా!

చరిత్రలో ఎన్నో సంఘటనలు మనకు కథల రూపంలో లభిస్తున్నాయి. 

అటువంటి కథల్లో ఒక కథే ఈ గొడుగుపాలుని కథ. 

రాజభక్తికి నిదర్శనంగా నిలిచే ఈ కథను మనం ఈరోజు  చెప్పుకుందాం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


Monday, November 14, 2022

పొన్నియిన్ సెల్వన్ కు నన్నయ భారతానికీ ఉన్న సంబంధం ఏమిటి?

 పొన్నియిన్ సెల్వన్ కు నన్నయ భారతానికీ ఉన్న సంబంధం ఏమిటి?




సాహితీమిత్రులారా!

క్రీ.శ. 955 ప్రాంతంలో తంజావూరుని రాజధానిగా చేసుకుని గండరాదిత్యచోళుడు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు తన తమ్ముడైన అరింజయచోళునితో కలసి అధికారం పంచుకుంటూ పరిపాలన చేశాడు. ఈ గండరాదిత్యుని కొడుకు మధురాంతక ఉత్తమచోళుడు. అయితే గండరాదిత్యుడు, అరింజయచోళుడు మరణించాక, అరింజయుని కుమారుడైన సుందరచోళుడు సింహాసనమెక్కాడు. ఈ సుందరచోళునికి ఆదిత్య కరికాలన్, అరుణ్మోలివర్మన్ అనే ఇద్దరు కుమారులు, కుందవై అనే కుమార్తె పుట్టారు. సుందరచోళుని తరువాత చోళ సామ్రాజ్యానికి వారసుడు అతని పెద్ద కొడుకైన ఆదిత్యకరికాలన్. ఈ ఆదిత్య కరికాలన్ చాలా పరాక్రమశాలి. యుద్ధాలలో ఆరితేరినవాడు. పాండ్యరాజైన వీరపాండ్యుని యుద్ధంలో ఓడించి, పారిపోతున్న అతగాడిని వెంటాడి మరీ తల నరికాడు. ఆ సంఘటన పాండ్యదే శరాజభక్తుల రక్తాన్ని ఉడికించింది. ఎలా అయినాసరే ఆదిత్యకరికాలుని హత్యచేయాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. మరోప్రక్క గండరాదిత్యుని కుమారుడైన మధురాంతక ఉత్తమచోళుడు కూడా తాను సింహాసనం ఎక్కడానికి పావులు కదపసాగాడు. మొత్తం మీద అనేక కుట్రల ఫలితంగా ఆదిత్యకరికాలన్ హత్య చేయబడ్డాడు. ఈ ఆదిత్య కరికాలన్ యువరాజుగానే కాక, రాజుగా కూడా కొద్దికాలంపాటూ రాజ్యపాలన చేశాడన్నది కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Saturday, November 12, 2022

మృచ్ఛకటికమ్ - వసంతసేన చారుదత్తుల ప్రేమ కథ

మృచ్ఛకటికమ్ - వసంతసేన చారుదత్తుల ప్రేమ కథ




సాహితీమిత్రులారా!

"మృచ్ఛకటికమ్" అన్నమాటను సంధిగా విడదీస్తే.. మృత్+శకటికమ్ అవుతుంది. మృత్ అంటే మట్టి అనీ, శకటికమ్ అంటే చిన్నబండి అనీ అర్థం. కనుక.. మృచ్ఛకటికమ్ అన్నమాటకు చిన్నబండి అనిఅర్థం.  ఈ నాటకంలో రెండు కథలున్నాయి. ఒకటి.. వసంతసేన, చారుదత్తుల ప్రేమకథ అయితే.. రెండవది.. క్రూరుడైన రాజుపై ప్రజలు తిరుగుబాటు చేసి, ఒక గోపాలకుణ్ణి రాజును చేసే కథ. ఇక మనం కథలోకి ప్రవేశిద్దాం. 


 Rajan PTSK గారికి ధన్యవాదాలు 

Thursday, November 10, 2022

అతిరథ మహారథులు అంటే ఎవరు?

 అతిరథ మహారథులు అంటే ఎవరు?




సాహితీమిత్రులారా!

అతిరథ మహారథులు అంటే ఎవరు? - 

అనే వీరుల శ్రేణులను గురించి ఇక్కడ

తెలుసుకుందాం-


రాజన్ పి. టి. యస్ . కె గారికి ధన్యవాదాలు

Tuesday, November 8, 2022

తప్పకుండా వినాల్సిన 5 జెన్ కథలు

 తప్పకుండా వినాల్సిన 5 జెన్ కథలు




సాహితీమిత్రులారా!

భారతదేశంలో పుట్టిన బౌద్ధం, చైనాలో పుట్టిన తావోయిజం కలసి జెన్ అనే ఒక అద్భుతమైన ధర్మం పుట్టిందన్నది పరిశోధకుల మాట. ఈ జెన్ బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం జపాన్ దేశంలో. నిజానికి ఈ జెన్ అనేది ఒక మతం కాదు. ఒక జీవన విధానం. సూత్రాలూ, సిద్ధాంతాలతో దానికి పనిలేదు. జెన్ చేసే పని మనల్ని మనం తెలుసుకునేలా చేయడం. రేపటి గురించిన భయాన్నీ, నిన్నటి గురించిన బాధనూ తొలగించి వర్తమానంలోని ఆనందాన్ని మనం పొందేలా చేయడం. ఎంతో సరళంగా మనకు అర్థమయ్యేలా సత్యాన్ని బోధించే అనేక జెన్ కథలు లోకంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. అటువంటివాటిలో  ఓ అయిదు కథల్ని ఈరోజు మనం చెప్పుకుందాం.

1 వ కథ: మూడో ముద్రణ

2 వ కథ: అదృష్టం దురదృష్టం

3 వ కథ: స్వర్గం నరకం ఎక్కడున్నాయి?

4 వ కథ: నేనొక్కడినే మాట్లాడలేదు

5 వ కథ: ఎక్కడినుంచో అక్కడికే


రాజన్ పి.టి.యస్ .కె గారికి ధన్యవాదాలు

Saturday, November 5, 2022

64 కళలు - ఏ కళ ఎందుకొరకు?

 64 కళలు - ఏ కళ ఎందుకొరకు?




సాహితీమిత్రులారా!

వాత్స్యాయన కామశాస్త్రములో చెప్పబడిన 64 కళలు

“విజ్ఞానాన్ని కలిగించేది విద్య - ఆనందాన్ని కలిగించేది కళ” అన్నారు మన పెద్దలు. అసలు ఆ మాటకొస్తే మనం నేర్చుకున్న విద్యను ప్రదర్శించడం కూడా ఒక కళే. ఉదాహరణకు వైద్యం వేర్చుకోవడం ఒక విద్య. నేర్చుకున్న ఆ వైద్యవిద్యతో రోగుల రోగాలను సరైన రీతిలో తగ్గించగలగడం ఒక కళ. ఒకే తరహా వైద్యవిద్య అభ్యసించినవాళ్ళు ఎందరో ఉంటారు. కానీ, వారిలో కొందరికే దానిని సమర్థవంతంగా ఉపయోగించే కళ అబ్బుతుంది. అలానే మిగిలిన విద్యలు కూడాను. సరే ఇక కళల్లోకి వద్దాం. “కవిత్వము, సంగీతము, చిత్రలేఖనము, విగ్రహ శిల్పము, నాట్యము” ఈ అయిదింటినీ లలిత కళలు అంటారు. వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీటిలో కవిత్వాన్ని, సంగీతాన్ని చరకళలనీ, చిత్రలేఖనము, విగ్రహ శిల్పము స్థిర కళలనీ, నాట్యము సమాహార కళ అనీ వ్యవహరిస్తూ ఉంటాం. మరి అయితే ఈ అరవై నాలుగు కళల సంగతేమిటి? ఈ కళలకు సంబంధించిన వివరాలు ఏ గ్రంథంలో ఉన్నాయి. ఈ అరవై నాలుగు కళల్లో ఏ కళ ఎందుకొరకు ఉపయోగపడుతుంది? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

మనకు ఈ 64 కళల ప్రస్తావన వాత్స్యాయన కామశాస్త్రంలో కనబడుతుంది. అందులో మొదటి అధికరణమైన సాధారణాధికరణములో మూడవ అధ్యాయమైన విద్యాసముద్దేశములో ఈ చతుష్షష్టి కళల వివరణ ఇవ్వబడింది. ఈ 64 కళలనే మూల కళలు అని కూడా అంటారు. సుమారు 95 సంవత్సరాల క్రితమే ఈ వాత్స్యాయన కామసూత్రాలను శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు తెలుగులో అనువదించారు. ఆ గ్రంథంలో ఇవ్వబడిన ఈ అరవై నాలుగు కళలకు చక్కని వ్యాఖ్యానం కూడా చేశారు. ఇక ఆ అరవై నాలుగు కళలకు సంబంధించిన పాఠంలోకి వెళదాం.

గీతమ్, వాద్యమ్, నృత్త్యమ్, ఆలేఖ్యమ్, విశేషకచ్ఛేద్యమ్, తండులకుసుమబలివికారాః, పుష్పాస్తరణం, దశనవసనాంగరాగః, మణిభూమికాకర్మ, శయనరచనం, ఉదకవాద్యం, ఉదకాఘాతః, చిత్రాశ్చయోగాః, మూల్యగ్రథనవికల్పాః , శేఖరకాపీడయోజనం, నేపథ్యప్రయోగాః, కర్ణపత్రభంగాః, గంధయుక్తిః, భూషణ యోజనం, ఐంద్రజాలాః, కౌచుమారాశ్చయోగాః, హస్తలాఘవం, విచిత్ర శాకయూషభక్ష్య వికారక్రియా పానకరసరాగాసవయోజనం, సూచీవానకర్మాణీ, సూత్రక్రీడా, వీణాడమరుక వాద్యాని, ప్రహేళికా, ప్రతిమాలా, దుర్వాచకయోగాః, పుస్తకవాచనమ్, నాటకాఖ్యాయికాదర్శనమ్, కావ్యసమస్యాపూరణం, పట్టికావానవేత్రవికల్పాః, తక్షకర్మాణి, తక్షణం, వాస్తువిద్యా, రూప్యరత్న పరీక్షా, ధాతువాదః, మణిరాగాకరజ్ఞానం, వృక్షాయుర్వేదయోగాః, మేషకుక్కుట లావక యుద్ధవిధిః, శుకసారికాప్రలాపనం, ఉత్సాదనే సంవాహనే కేశమర్దనే చ కౌశలమ్, అక్షర ముష్టికాకథనం, మ్లేచ్ఛితకవికల్పాః, దేశభాషా విజ్ఞానం, పుష్పశకటికా, నిమిత్తజ్ఞానమ్, యంత్రమాతృకా, ధారణమాతృకా, సంపాఠ్యం, మానసీకావ్యక్రియా, అభిధాన కోశః, ఛందోజ్ఞానం, క్రియాకల్పః, ఛలితకయోగాః, వస్త్ర గోపనాని, ద్యూతవిశేషాః, ఆకర్ష క్రీడా, బాలక్రీడనకాని, వైనయికానాం, వైజయికానాం, వ్యాయామికానాం చ విద్యానాం జ్ఞానం ఇతి చతుషష్టి రంగ విద్యాః కామసూత్రస్యావయవిన్యః

ఇదీ వాత్స్యాయన కామశాస్త్రములో ఇవ్వబడిన 64 కళలకు సంబంధించిన పాఠం. ఇప్పుడు ఒక్కొక్క కళ గురించీ క్లుప్తంగా తెలుగుకుందాం. 


Rajan PTSK గారికి ధన్యవాదాలు


Thursday, November 3, 2022

వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?

 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?




సాహితీమిత్రులారా!

చతుర్వేదములు - దశోపనిషత్తులు

వేదము అనే మాట విద్ అనే ధాతువు నుండి పుట్టింది. ఏది తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసిన అవసరము లేదో ఆ పరిపూర్ణజ్ఞానమే వేదము. ప్రత్యక్ష ప్రమాణం చేతకానీ లేదా తర్కంచేత కానీ తెలుసుకోలేనటువంటి బ్రహ్మపదార్థాన్ని ఎలా తెలుసుకోవాలో ఈ వేదం చెబుతుంది. ఈ వేదాలనే శ్రుతులు అని కూడా పిలుస్తారు. అలానే వేదములకు భాష్యం వ్రాసిన సాయణాచార్యులవారు.. “ప్రతీజీవీ తనకు ఇష్టమైనవి పొందడానికి, ఇష్టములేనివాటిని తొలగించుకోవడానికి, మంత్రజపాలు, హోమాలూ వంటి అలౌకికములైన ఉపాయాలను తెలియజేసేదే వేదము” అన్నారు.  “అనంతా వై వేదాః” అన్న మాటను బట్టి ఈ వేదములు అనంతములు. అలానే ఇవి అపౌరుషేయములు. అంటే ఒకరిచేత వ్రాయబడినవో, పుట్టించబడినవో కావు. వేదములు సాక్షాత్తూ పరమాత్మయొక్క నిశ్వాసము. ఆ అనంతమైన వేదాలనుండి అతి కొద్ది భాగాన్నే మన మహర్షులు గ్రహించి లోకకల్యాణం కోసమై మానవాళికి అనుగ్రహించారు. వేదవ్యాసుల వారు ఆ కొద్దిపాటి వేదభాగాన్నే బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అనే పేర్లతో విభజించి మనకందించారు. ఈ ఋుగ్, యజుర్, సామ, అథర్వ వేదాలనూ, వాటి శాఖలనూ ప్రచారంలోకి తీసుకురావడానికి వాటిని వరుసగా తన శిష్యులైన పైలునికీ, వైశంపాయనునికీ, జైమినికీ, సుమంతునికీ అప్పగించాడు. పూర్వం ఈ నాలుగు వేదాలకూ కలిపి 1131 శాఖలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిలో కేవలం 7 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. అంటే మనకిప్పుడు లభిస్తున్న వేద విజ్ఞానం అసలులో  ఒక్కశాతం కూడా కాదన్న మాట.  ఈ వేదాలు మళ్ళీ మూడు భాగాలుగా ఉంటాయి. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. వేదాల అంతరార్థాన్ని మంత్రాల రూపంలో చెప్పేవి సంహితలు. ఆ మంత్రాలలో ప్రతీ మాటకూ  అర్థం చెప్పి, వాటిని యజ్ఞంలో సరైన రీతిలో వాడడానికి ఉపయోగపడేవి బ్రాహ్మణాలు. సంహితలోని మంత్రాలకు, బ్రాహ్మణాలలోని కర్మలకూ వెనుకనున్న అంతరార్థాన్ని వివవరించేవి అరణ్యకాలు. అంటే ఒక కర్మ ఎలా చెయ్యాలో అన్నదానికంటే కూడా అసలు ఆ కర్మ ఎందుకు చెయ్యాలి? అన్నదానినే.. ప్రధానంగా చెప్పేది అరణ్యకం. ఈ అరణ్యకాల చివరిలోనే ఉపనిషత్తులుంటాయి. వేదాలకు చివరిలో ఉండేవి కనుక వీటినే వేదాంతములు అని పిలుస్తారు. మొత్తంగా చూస్తే ఈ వేదాలను కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. సంహితలు, బ్రాహ్మణాలు కర్మకాండలోకి వస్తే.. ఉపనిషత్తులతో కూడిన అరణ్యకాలు జ్ఞానకాండలోనికి వస్తాయి.

కర్మకాండను అధ్యయనం చేసిన జైమినీ మహర్షి.. వేదములలో కర్మకాండ భాగమే గొప్పదన్నాడు. ఆయన చేసిన ఆ కర్మకాండ విశ్లేషణకే పూర్వమీమాంస శాస్త్రమని పేరు. అలానే జ్ఞానకాండను విశ్లేషించిన వేదవ్యాసుడు అదే వేదముల సారమన్నాడు. దానికే ఉత్తరమీమాంస అని పేరు. ఉపనిషత్తులతో పాటూ, బ్రహ్మసూత్రములు, భగవద్గీత కూడా ఉత్తరమీమాంసలోకే వస్తాయి.

వేదాల తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి యజ్ఞాలవంటి విధుల ద్వారా ఒక జీవనవిధానాన్ని చెబుతుంది కర్మకాండ. అలా చేయడం ద్వారా కొంతకాలానికి శరీరమూ, మనస్సూ శుద్ధి అవుతాయి. చిత్తశుద్ధి కలుగుతుంది. మన బుద్ధికి సత్యాన్ని గ్రహించే శక్తి లభిస్తుంది. అప్పుడు ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే జీవాత్మ, పరమాత్మల అద్వైత స్థితి అనుభవంలోకి వస్తుంది. వేదముల పరమప్రయోజనం మానవుడు జీవన్ముక్తుడు అవ్వడమే, అంటే ఈలోకంలో ఉండగానే మోక్షాన్ని పొందడం.  అప్పుడు మాత్రమే వేదాల సారమైన నాలుగు మహావాక్యాలు విశదమవుతాయి.

ఇక ఇప్పుడు నాలుగు వేదాల గురించీ సంగ్రహంగా చెప్పుకుందాం. 


Rajan PTSK గారికి ధన్యవాదాలు

Tuesday, November 1, 2022

కవిసమ్రాట్ విశ్వనాథ - మహాకవి శ్రీశ్రీల రాగద్వేషానుబంధం

కవిసమ్రాట్ విశ్వనాథ - మహాకవి శ్రీశ్రీల రాగద్వేషానుబంధం 




సాహితీమిత్రులారా!

మహాకవి శ్రీశ్రీకి, కవిసమ్రాట్ విశ్వనాథకూ మధ్య ఎన్నో స్పర్థలుండేవనీ, ఒకరంటే ఒకరికి అస్సలు పడదనీ, సంప్రదాయవాదియైన విశ్వనాథకూ, విప్లవపంథా తొక్కిన శ్రీశ్రీకి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేదనీ చెబుతూ అనేక కథనాలు యూట్యూబ్ వీడియోల్లోను, ఫేస్‌బుక్ పోస్టుల్లోనూ దర్శనమిస్తుంటాయి. అసలు నిజంగా వారిద్దరి మధ్యా అంతటి శతృత్వం ఉండేదా? ఉంటే ఆ స్పర్థకు కారణాలేమిటి? అలానే వారు ఒకరినొకరు అభిమానించుకున్న సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఏవి? మొదలైన విషయాలను ఈనాటి మన కవిసమ్రాట్టు మహాకవుల రాగద్వేషానుబంధం శీర్షికలో చెప్పుకుందాం.


రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు