Thursday, March 31, 2022

ఉగాదికి సంబంధించిన

ఉగాదికి సంబంధించిన 




సాహితీమిత్రులారా!

ఉగాదికి సంబంధించిన 

నండూరి శ్రీనివాస్ గారి వీడియో

ఆస్వాదించండి-





Tuesday, March 29, 2022

వేదవ్యాసుడు ఎందుకు భారతం రాయాలనుకున్నాడు?

 వేదవ్యాసుడు ఎందుకు భారతం రాయాలనుకున్నాడు?




సాహితీమిత్రులారా!

వేదవ్యాసుడు ఎందుకు భారతం రాయాలనుకున్నాడు?

అనే ఈ విషయాన్ని గురించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి

గారి వివరణ తెలిపే వీడియో వీక్షించండి-



Sunday, March 27, 2022

మేడారం-సమ్మక్క-సారక్క రహస్యాలు

 మేడారం-సమ్మక్క-సారక్క రహస్యాలు 




సాహితీమిత్రులారా!

మేడారం-సమ్మక్క-సారక్క రహస్యాలు 

నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఆస్వాదించండి-



Wednesday, March 23, 2022

దిద్దుబాటు । గురజాడ అప్పారావుగారి తొలికథ

 దిద్దుబాటు । గురజాడ అప్పారావుగారి తొలికథ




సాహితీమిత్రులారా!

దిద్దుబాటు । గురజాడ అప్పారావుగారి తొలికథ

గురించిన కిరణ్ ప్రభ గారివీడియో వీక్షించండి-



Monday, March 21, 2022

మంత్ర సిధ్ధులు మౌనస్వామి విచిత్ర చరిత్ర

 మంత్ర సిధ్ధులు మౌనస్వామి విచిత్ర చరిత్ర




సాహితీమిత్రులారా!

మంత్ర సిధ్ధులు మౌనస్వామి విచిత్ర చరిత్ర

అనే ఈ వీడియో నండూరి శ్రీనివాస్ గారిది

వీక్షించండి-



Saturday, March 19, 2022

ఏల ప్రేమింతును?

ఏల ప్రేమింతును?




సాహితీమిత్రులారా!



దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి

కృష్ణపక్షంలోని కవిత

ఏల ప్రేమింతును? ఆస్వాదించండి


సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను?


మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల?

పరుల తనియించుటకొ ?తన బాగుకొరకొ?

గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ?

 

Thursday, March 17, 2022

ఓ యువకవీ!

 ఓ యువకవీ!




సాహితీమిత్రులారా!



సినీనటుడు రంగనాథ్ గారి 

కవితాసుదర్శనం నుండి 

ఓ యువకవీ! కవిత ఆస్వాదించండి-


కొత్తగా కలంగొన్న

ఉద్వేగపు యువకవీ-

కవితంటే ఏదోయ్


సంఘం ఒక కవ్వంగా

హృదయాన్ని చిలకగా

ఉద్భవించే నవనీతం-

కవిత అని తెలుసుకో-


కళ్లున్న గుడ్డివాళ్ల 

కంటిపొరలు కోయగలకత్తిరా - కలం-

పేదరికం పేరుతో

దోచుకునే అన్నలకు - బల్లెంరా - కలం

అజ్ఞానపు చీకట్లో 

తారాడే తమ్ములకు - దివిటీరా  - కలం-

కుల మతాల కుళ్లుతున్న

కుచ్ఛితపు మనస్సులకు - మంచిగంధం - కలం-


ఓ యువకవీ 

గంజాయి గళాలకు నీ కవిత 'తులసి' కావాలి-

మానవత్వం ఊపిరిగా 'నీగుండె' ఆడాలి-

మమతల పరిమళాలు వెదజల్లే గోళంగా

కలకాలం భూగోళం - నీ కలం కొసన తిరగాలి.

Tuesday, March 15, 2022

ఎవడు అన్నీ జయిస్తాడు

 ఎవడు అన్నీ జయిస్తాడు




సాహితీమిత్రులారా!



ఎవడు అన్నీ జయిస్తాడు అనే విషయం

తెలియజేసే ఈ శ్లోకం చూడండి-


సభా జితా వస్త్రవతా మిష్టాశా గోమతా జితా

అధ్వా జితో యానవతా సర్వం శీలవతా జితా


మంచి వస్త్రాలు ఉన్నవాడు సభను జయిస్తాడు

ఆవుపాడి ఉన్నవాడు మధురభక్ష్యాల ఆశను జయిస్తాడు

వాహనం ఉన్నవాడు మార్గాన్ని జయిస్తాడు

సచ్ఛీలం ఉన్నవాడు అన్నిటినీ జయిస్తాడు

కాబట్టి అన్నిటిని జయించాలంటే మంచి శీలం ఉండాలి

Sunday, March 13, 2022

కుందవరపు కవిచౌడప్పా

 కుందవరపు కవిచౌడప్పా




సాహితీమిత్రులారా!

కవిచౌడప్ప పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి

కందపద్యాలే అందులోనూ బూతులతో కూడుకొన్నవి

అధిక్షేప శతకాలలో చెప్పదగినది చౌడప్ప శతకం

ఇక్కడ కొన్ని పద్యాలను గమనిద్దాం-


కందంబులు సకలజనా

నందంబులు సరసమధుర నవరసఘటికా 

బృందంబులు నీకవితా

కందంబులు కుందవరపు కవిచౌడప్పా


మునుపటి సుకవులనీతులు

జననుతములు, కుందవరపు చౌడుని నీతుల్

వినవినఁదేటతెనుంగై

కనబడుఁగద కుందవరపు కవిచౌడప్పా


నీతులకేమి యొకించుక

బూతాడక దొరకు నవ్వుపుట్టదు ధరలో

నీతులు బూతులు లోక

ఖ్యాతులురా కుందవరపు కవిచౌడప్పా


బూతన నగుదురు తమతమ

తాతలు ముత్తాత మొదలు తన తరముల వా

రేతీరున జన్మిచిరో

ఖ్యాతిగ మఱి కుందవరపు కవిచౌడప్పా


పదినీతులు  పదిబూతులు

పదిశృంగారములు గల్గు పద్యములు సభం

జదివినవాఁడేఁ యధికుఁడు

గదరప్పా కుందవరపు కవిచౌడప్పా


లంజలు రాకుండిన గుడి

రంజిల్లదు ప్రజలమనసు రాజిల్లదుగా

లంజలనేల సృజించెను

గంజజుడిల గుందవరపు కవిచౌడప్పా


నా నీతి వినని వానిని

భానుని కిరణములు మీఁదఁ బాఱని వానిన్

వానను దడవని వానిని

గానమురా కుందవరపు కవిచౌడప్పా

Friday, March 11, 2022

జియర్ స్వామి జీవితంలోని కొన్ని విషయాలు

 జియర్ స్వామి జీవితంలోని కొన్ని విషయాలు




సాహితీమిత్రులారా!

జియర్ స్వామి జీవితంలోని కొన్ని విషయాలు

చెప్పిన నండూరి శ్రీనివాస్ వీడియో ఆస్వాదించండి-




Monday, March 7, 2022

అక్షయ పాత్రని ఎప్పుడైనా చూశారా?

 అక్షయ పాత్రని ఎప్పుడైనా చూశారా?




సాహితీమిత్రులారా!

అక్షయపాత్ర భారతంలో ధర్మరాజుకు

సూర్యుడు ఇస్తాడు ఇంకా అనే చోట్ల

అక్షయపాత్ర ప్రస్తావన వస్తుంది

మరి దాన్ని ఎక్కడైనా చూశారా

అంటే దాన్ని గురించి చెప్పే

నండూరి శ్రీనివాస్ గారి 

వీడియోను ఆస్వాదిండి




Saturday, March 5, 2022

ప్రయాణం ఎప్పుడు చేయాలి

ప్రయాణం ఎప్పుడు చేయాలి




సాహితీమిత్రులారా!



ప్రయాణం చేయాలంటే మనం ఎన్నో

గమనించుకొని వెళుతుంటాం

మరి ఈ శ్లోకం ఏం చెబుతుందో చూడండి-


ఉషఃకాలశ్చ గర్గశ్చ శకునం చ బృహస్పతిః

అఙ్గిరాశ్చ మనోత్సహో  విప్రవాక్యం జనార్ధనః


గర్గ మహర్షి ప్రకారం ప్రయాణానికి ప్రాతఃకాలం ఉత్తమం

బృహస్పతి ప్రకారం శకునం చూసుకొని వెళితే మంచిది

అంగిరసుని ప్రకారం మనసు ఉత్సహంగా ఉన్నపుడు వెళ్లాలి

జనార్ధనుని ప్రకారం బ్రాహ్మణ వాక్యం అనుకూలంగా ఉంటే వెళ్లాలి

ఇదీ శ్లోక భావం

మరి ఎలాచేయాలి అంటే ఎవరికి ఏది నచ్చితే అదే సరైంది

రాజు మెచ్చింది రంభ కదా

Thursday, March 3, 2022

ఎలా లొంగదీసుకోవాలి?

 ఎలా లొంగదీసుకోవాలి?




సాహితీమిత్రులారా!



ఈ ప్రపంచంలో ఎవరిని ఎలా లొంగదీసుకోవాలో

ఈ శ్లోకం చెబుతుంది 

ఇది నిజమో కాదో గమనించండి-


ఉత్తమం ప్రణిపాతేన శూరం భేదేన యోజయేత్

నీచమల్పప్రదానేన ఇష్టం ధర్మేన యోజయేత్


ఉత్తమమైనవాని లోబరుచుకోవాలంటే నమస్కారం చెయ్యాలి.

శూరుని భేదోపాయం చేత లోబరుచుకోవాలి. 

నీచుణ్ణి లొంగదీసుకోవాలంటే వాడికి ఏదో కొంత ముట్టజెప్పాలి.

ఇష్టుణ్ణి లొందోగదీసుకోవాలంటే ధర్మమార్గంలో నడిపించాలి.

ఇదీ శ్లోకభావం నిజమో కాదో మీరేగ్రహించండి-