Monday, January 30, 2023

'ముగింపు మీకు తెలుసు' - బుచ్చిబాబు రచన

 'ముగింపు మీకు తెలుసు' - బుచ్చిబాబు రచన




సాహితీమిత్రులారా!

'ముగింపు మీకు తెలుసు' - బుచ్చిబాబు రచన

కిరణ్ ప్రభ గారి కథాపరిచయం

ఆస్వాదించండి-

Sivaraju Venkata Subbarao (14 June 1916 – 1967), known by his pen name Butchi Babu, was an Indian short story writer, novelist and painter known for his works in Telugu literature.

"పాపం..మురళి ఎక్కడున్నాడో..? " అంది సీతాదేవి.

ఆ మురళికోసం అన్వేషించిన కథకుడికి చివరికి దొరికిన సమాధానం అతడ్ని దిగ్భ్రమకు గురిచేసింది,  దిమ్మతిరిగిపోయింది, కళ్ళు బైర్లు కమ్మాయి..! అద్భుతమైన సస్పెన్స్ తో సాగే బుచ్చిబాబుగారి కలంనుంచీ వెలువడిన విభిన్న తరహా కథ..!!



Friday, January 27, 2023

నూట పదహార్లు (116) అనే మాట ఎలా వచ్చింది?

 నూట పదహార్లు (116) 

అనే మాట ఎలా వచ్చింది?




సాహితీమిత్రులారా!

మనకు సాహిత్యంలో గానీ, వ్యవహారంలో గానీ 100, 108, 1000 ఈ సంఖ్యలకు ప్రాధాన్యత ఎక్కువ. మన పెద్దవాళ్ళు ఎవరినైనా దీవించేటప్పుడు శతాయుష్మాన్ భవ అనో, వందేళ్లు చల్లగా బతుకనో దీవిస్తుంటారు. అలానే పూజలు, జపాలు, వ్రతాలు, ప్రదక్షిణలు మొదలైన చోట్ల 108కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక లలితా సహస్రనామం, విష్ణసహస్రనామం ఇలా 1000కి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఏ పూజారిగారికో దక్షిణో, సంభావనో ఇచ్చినప్పుడు, పెళ్లిలో చదివింపులప్పుడు మాత్రం ఈ 100, 108, 1000 ఇలా కాకుండా 116లు ఎక్కువగా ఇస్తుంటాం. కొంచెం పెద్దమొత్తంలో ఇవ్వాల్సివస్తే, 1,116లో, 10,116లో ఇలా 116 అన్నది వచ్చేలా చూసుకుంటూ ఉంటాం.  అసలీ ఈ నూట పదహార్లు ఇవ్వడం అన్నది ఎక్కడనుండి వచ్చింది? ఈ సంప్రదాయం మనకు పూర్వకాలం నుంచీ ఉందా? లేక మధ్యలో వచ్చిందా? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే మనం కాలంలో కాస్తంత వెనక్కు వెళ్లాలి. గమనించండి-



                                                                                                             Rajan PTSKగారికి ధన్యవాదాలు



Wednesday, January 25, 2023

కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రారంభ పద్యం

 కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రారంభ పద్యం 




సాహితీమిత్రులారా!



కవిరాజచంద్రుడైన కృష్ణరాయల వారు తన ఆముక్తమాల్యదను---

" శ్రీకమనీయహారమణి- చెన్నుగదానును కౌస్తుభంబునన్"

అనిఉత్పలమాలతోప్రారంభించినాడు.

(రాజ)చంద్రుని దర్శనంతో ఆనందంగ వికసిస్తుంది ఉత్పలం. 

      ఆముక్తమాల్యదను అంటే గోదాదేవిని తమిళంలో "కోదై" అంటారు. 

కోదై అంటే మాల,పూలమాల అని అర్థం. పూలబాల(గోదాదేవి)ప్రణయచరితం

పూలమాలతో- అంటే ఉత్పలమాలతో ప్రారంభించడం రాయలవారి సందర్భో

చిత పద్యప్రయోగ నైపుణ్యం కావ్యా రంభంలోనె  కనపడుతోంది.

        పూలబాల(కోదై) వరించింది నల్లనయ్యను. కనుక నీలోత్పల స్మరణం

కూడా కావ్యారంభపద్యం ఉత్పలంలో ఉంది.నీలోత్పలం మదనుని పంచ

బాణాలలో చివరిదికూడ కావడ స్మర ణీయం.

    తన ప్రియురాలును ఎదలో ప్రతిష్టించుకొన్న వేంకటభర్తను కావ్యారంభంలో

స్మరించి,వేంకటభర్తకే కావ్యాన్ని అంకిత మీయడం విశేషం.

   గోదాదేవి వేంకటభర్తకు రాసిన ప్రేమ లేఖలే ఆమె రచించిన  "నాచ్చియార్

తిరుమొళి"ఆమెప్రేమలేఖలనఫలితమన్నట్లు రాయలవారుకూడ"కోదై" కి కావ్యంలో పెళ్లిచేసి

ఆనందభరితుడైనాడు.ఆఆనందభరిత ఆముక్తమాల్యదకావ్యాన్ని ఆంధ్రులకు

అందించిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవ రాయల వారు.

                    

వైద్యంవేంకటేశ్వరాచార్యులు

Monday, January 23, 2023

అక్కినేనికి మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే?

 అక్కినేనికి మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే?




సాహితీమిత్రులారా!

అక్కినేని నాగేశ్వరరావుగారికి 

మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే?

అనే అంశంపై కిరణ్ ప్రభ గారి టాక్ షో ఆస్వాదించండి-



Saturday, January 21, 2023

అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

 అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు




సాహితీమిత్రులారా!

అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

గురించిన వీడియో కిరణ్ ప్రభ గారి

టాక్ షో ఆస్వాదించండి-



Thursday, January 19, 2023

పంచ ప్రాణములు అంటే ఏమిటి? - సప్త స్వరాలు ఎలా పుట్టాయి?

 పంచ ప్రాణములు అంటే ఏమిటి? - సప్త స్వరాలు ఎలా పుట్టాయి?




సాహితీమిత్రులారా!

పంచప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నా, నా పంచ ప్రాణాలు నీవే మొదలైన మాటలు వింటుంటాం. అసలు పంచప్రాణాలు అంటే ఏమిటి?

సప్తస్వరాలైన సరిగమపదని ఎలా పుట్టాయి?

మనం మాట్లాడే వాక్కు ఎక్కడ పుడుతుంది? అలా పుట్టిన వాక్కు బయటకు వచ్చేసరికి ఎన్ని విధాలుగా మారుతుంది?

Rajan PTSKగారికి ధన్యవాదాలు

Sunday, January 15, 2023

పెద్దజియ్యర్ ఎవరు?

 పెద్దజియ్యర్ ఎవరు?




సాహితీమిత్రులారా!

పెద్దజియ్యర్ ఎవరు? వారి జీవితం- సేవలు గురించిన 

వీడియో నండూరి శ్రీనివాస్ గారి మాటల్లో



Friday, January 13, 2023

తిరువన్కూరు సోదరీమణులు లలిత, పద్మిని, రాగిణి

 తిరువన్కూరు సోదరీమణులు లలిత, 

పద్మిని, రాగిణి




సాహితీమిత్రులారా

Travancore Sisters refers to the trio of Lalitha, Padmini and Ragini who were actresses, dancers and performers in Malayalam, Tamil, Telugu, Hindi movies. Their golden period is from 1950 to 1975. They started their movie career as dancers and quickly got main roles in multiple languages. They used to act in all combinations among themselves.  Two sisters in a movie, all three sisters in a movie and individually also. Tamil, Malayalam, Hindi and Telugu language audience never forget these highly talented sisters. KiranPrabha narrates interesting movie career of these sisters.



KiranPrabha గారికి ధన్యవాదాలు

Wednesday, January 11, 2023

ఆకట్టుకొనే విధంగా మాట్లాడటం ఎలా?

 ఆకట్టుకొనే విధంగా మాట్లాడటం ఎలా?




సాహితీమిత్రులారా!

ఆకట్టుకునే విధంగా మాట్లాడటానికి మనం ఆరు లక్షణాలు అలవరచుకోవాలి. 

ఈ లక్షణాల గురించి చెప్పింది సాధారణ వ్యక్తికాదు, మహావ్యాకరణ శాస్త్రవేత్త అయిన 

పాణిని మహర్షి. ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే..

మాధుర్య మక్షరవ్యక్తిః పదచ్ఛేదస్తు సుస్వరః

ధైర్యం లయ సమర్థంచ షడేతే పాఠకాగుణాః

ఆ ఆరు లక్షణాలలో ఒక్కొక్కదాని కోసం చెప్పుకుందాం.



Rajan PTSK గారికి ధన్యవాదాలు

Monday, January 9, 2023

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు? ఏం చేస్తే కనపడతాడు?

 దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు? 

ఏం చేస్తే కనపడతాడు?





సాహితీమిత్రులారా!


దేవుడు మన కళ్ళకు…ఎందుకు కనబడడు….? ఏం చేస్తే కనపడతాడు?

మన బతుకు అంతా ఐదు అంశాల మీదే ఆధారపడి వుంది.వాటిని వదిలేస్తే దేవుడిని చూడవచ్చు.....ఇంకా లోతుగా చెప్పాలంటే ఇలా వుంది ఆ వ్యవస్థ 

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం.

అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…, వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. 

ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.!

వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ!

అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

జలమునకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటిని మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే. 

ముఖపుస్తకం నుండి.....


Friday, January 6, 2023

కథా రచయిత, సినీ కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే

 కథా రచయిత, సినీ కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే




సాహితీమిత్రులారా!

మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా.గోఖలే) తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకుడు, చిత్రకారులు. 64 సంవత్సరాల జీవితంలో సగభాగం తెలుగు సినిమారంగంలోనే గడిచింది. సినిమాల్లోకి రాక ముందే గోఖలేగారు అద్భుతమైన చిత్రకారుడు, కథా రచయిత. తెలుగు కథా రంగంలో ఆయన వ్రాసిన కథలు అత్యంత విలక్షణమైనవి. Famous telugu play back singer Madhavapeddi Satyma is own brother of Maa. Gokhale.

 KiranPrabha narrated Sri Gokhale's life story and his film life in this episode.




Wednesday, January 4, 2023

పుట్టాకా ఏడవలేదు పాలు త్రాగలేదు - ప్రాణం ఉన్న బొమ్మ

 పుట్టాకా ఏడవలేదు పాలు త్రాగలేదు - 

ప్రాణం ఉన్న బొమ్మ




సాహితీమిత్రులారా!

పుట్టాకా ఏడవలేదు పాలు త్రాగలేదు - ప్రాణం ఉన్న బొమ్మ

అనే నమ్మాళ్వార్ లేక శఠారి గురించి విషయం గురించిన

నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఆస్వాదించండి-



Monday, January 2, 2023

ఈయనే లేకపోతే ధనుర్మాసమే లేదు

 ఈయనే లేకపోతే ధనుర్మాసమే లేదు




సాహితీమిత్రులారా!

ఈయనే లేకపోతే ధనుర్మాసమే లేదు

ఎవరాయన ఏమిటావిషయం

నండూరి శ్రీనివాస్ గారి మాటల్లో

ఆస్వాదించండి-