Monday, October 3, 2016

మనసులో మాట


మనసులో మాట


సాహితీమిత్రులారా!



ఈ దురాశామయ ప్రపంచంలో
ప్రతిమనిషి ఇలాగే ఆలోచిస్తే
ఎలా ఉంటుంది?
ఈ ఖండిక చదవండి.
అలంకారం కోటంరాజుగారు
"నాలో" అనే శీర్షికతో వ్రాసినది.

బన్నములెన్నియోబడితి, బాధలనెన్నియొ యోర్చినాడ, ను
త్పన్న మహోగ్రరోగ పరిపంధి గణంబుల నుక్కడించితిన్ 
అన్నిట మించినాడ, ధర, నాత్మవినాశ హేతువైన, యీ
విన్నదనంబు, యీ పొగులు, వెక్కసమాయెను నాకు దెల్పగన్

ఎంతలు జేసినన్, మనసుకింతకు నింతకునైన తృప్తి, యా
వంతయు లేదు, జూడ కడువశ్యము దప్పె మనంబు యింక యిం
కెంతకుబోవునో! నిలువరింపగలేని ధురారయోద్ధతిన్ 
చింతలుబెంచె నాకు, విన సిగ్గగు యేరికినైన దైవమా!

సంపాదించితి కోట్లు కోట్లు యిలపై సంసారముల్ గూల్చి, నా
కొంపాగోడియు, ఆస్తిపాస్తులును, న్యగ్రోధాకృతిన్ దాల్చె, నే
పెంపారన్, యిటులుంటి, యింటను. ధనాభావంబులేకుండ, యో
చింపన్, యింకొకటున్నదంచు తెలిపెన్, చిన్మూర్తికిన్ ధామమై

నా దురాశకు మితిలేదు  నాదురాశ
యంబునకు మితిలేదు జగంబు నందు
నా యసంతృప్తికిని కారణంబులేదు
నాదు సంతృప్తికెటు కారణంబు గలుగు?

No comments:

Post a Comment