Showing posts with label ఒకసారి చదవండి. Show all posts
Showing posts with label ఒకసారి చదవండి. Show all posts

Friday, May 25, 2018

ఈ పద్యం ఒకసారి చదవండి - 2


ఈ పద్యం ఒకసారి చదవండి - 2




సాహితీమిత్రులారా!



చరిగొండ ధర్మన కృత చిత్రభారతంలోని ఈ పద్యం ఒకసారి
చదవండి- ఇది సహదేవుడు భీష్ముని ప్రతాపం గూర్చి కృష్ణుని
సభలో వర్ణిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం

చతురంబోధిపరీత భూవలయ రక్షాదక్ష బాహా బలో
ద్ధత రాజన్య సమూహ శుష్క గహనోద్యద్దావవహ్నిచ్ఛటా
యిత శాతోగ్ర కుఠార భార్గవ మదాహిస్తంభనోదగ్ర మం
త్రిత మౌర్వీ రవ భీష్ము భీష్ము నని వారింపంగ మీ శక్యమే


చదివారా చదివితే ఎలా వుందో
మధ్యలో ఆపడానికి వీలుకావడం లేదా
ఇంకేమైనా వుందా గమనించండి


Thursday, May 3, 2018

ఈ పద్యాలను ఒకసారి చదవండి - 1


ఈ పద్యాలను ఒకసారి చదవండి - 1



సాహితీమిత్రులారా!



మనుచరిత్రలోని ఈ పద్యాలను చదవండి
వీలైతే మీ పిల్లలకు నేర్పండి
అర్థంతో పనిలేదు నోరు తిరగటానికి
అభ్యాసం  చేయించండి

ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళినపుడు
హిమాలయ వర్ణన చేసిన పద్యం-

అటఁజని కాంచె భూమిసురుఁడంబరచుంబిశిరస్సరజ్ఝరీ
పటలముహుర్ముహుర్లుఠదభంగతరంగమృదంగనిస్స్వన
స్పుటనటనానుకూలపరిపుల్లకలాపకలాపిజాలమున్
గటకచరత్కరేణుకరకంపితసాలము శీతశైలమున్
                                                           (మనుచరిత్ర - 2 - 3)

ఇందీవరాక్షుడు గురువును మోసగించి విద్యను నేర్చుకొన్న
తరువాత గురువుతో గర్వంతో నేర్చుకున్న సంగతి చెప్పడంతో
కోపంతో గురువు ఎలావున్నాడో చెప్పే పద్యం-

అనినం గన్నులు జేవురింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్యద్భ్రుకుటీభజంగయుగళీపూత్కారఘోరానిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్
చినుకం గంతుదిదృక్షరూక్షనయనక్ష్వేళాకరాళధ్వనిన్
                                                                 (మనుచరిత్ర - 5 - 18)

మరోమారు మరో కావ్యంలోని పద్యాలను చూద్దాం