Monday, October 10, 2016

పుణ్యపరంపరాపశుపతే రాకారిణీరాజతే


పుణ్యపరంపరాపశుపతే రాకారిణీరాజతే



సాహి్తీమిత్రులారా!


మూకపంచశతిలోని ఈ శ్లోకం చూడండి-

రాకాచంద్రసమానకాంతివదనా నాకాధిరాజస్తుతా
మూకానామపికుర్వతీసురధునీనీకరాశవాగ్వైభవం
శ్రీకాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సతా
మేకా పుణ్యపరంపరాపశుపతే రాకారిణీరాజతే
                                                                     (స్తుతిశతకమ్-12)

పున్నమినాటి చంద్రునితో సమానమైన
కాంతిగల మోముగలది.
నాకాధిపుడైన ఇంద్రునిచే కీర్తింపబడినది.
మూకశంకరులవారికి ఆకాశగంగవంటి
వాక్పటిమను కలిగించినది.
 సత్పురుషులలో శోకమును పోగొట్టేది
అయిన ఆ జగదంబ కాంచీపురము
నందు మిక్కిలి మక్కువతో
శివుని పుణ్యవనంలో విరాజిల్లుతున్నది - అని భావం.

No comments:

Post a Comment