Sunday, October 30, 2022

చాణక్యుని అర్థశాస్త్రంలో ఏముంది?

 చాణక్యుని అర్థశాస్త్రంలో ఏముంది?




సాహితీమిత్రులారా!

మనం చదివే పుస్తకాల్లోనూ,  చాలామంది ప్రముఖుల ప్రసంగాల్లోనూ కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అసలీ అర్థశాస్త్రంలో ఏముంది? ఇది కేవలం ధనానికి సంబంధించిన శాస్త్రమేనా? లేక మరేమన్నా విషయాలు ఇందులో ఉన్నాయా? అసలిది ఎంత పెద్ద గ్రంథం. ఈ గ్రంథాన్ని తెలుగులో చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతుందా? ఇంతకీ ఈ చాణక్యుడు ఏ కాలం వాడు? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈనాటి మన  కార్యక్రమం “కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఏముంది?”

Rajan PTSKగారికి ధన్యవాదాలు

Friday, October 28, 2022

భేతాళ కథలు - 1వ భాగం - వజ్రముకుటుని కథ

 భేతాళ కథలు - 1వ భాగం - వజ్రముకుటుని కథ




సాహితీమిత్రులారా!

ఈ భేతాళ కథలు గుణాఢ్యుడనే కవి రచించిన బృహత్కథలోనివి. ఈ బృహత్కథ సుమారు 2000 సంవత్సరాల క్రితం పైశాచీ ప్రాకృత భాషలో రాయబడింది. ఆ తరువాత 1000 సంవత్సరాలకు సోమదేవసూరి అనే కవి బృహత్కథలో కొంతభాగాన్ని కథాసరిత్సాగరం అన్న పేరుతో సంస్కృతంలో రాశాడు. అటుపై ఎంతోమంది రచయితలు వీటిని తెలుగులోకి అనువదించారు. మనకు చందమామ పత్రిలో కూడా భేతాళ కథలు ధారావాహికగా వచ్చేవి. కాకపోతే అవన్నీ కల్పిత కథలే. అంటే గుణాఢ్యుని కథలు కాదన్న మాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి మాత్రం 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన అసలైన భేతాళ కథలు. భేతాళ కథల్లో కనబడే రాజని మనం విక్రమార్కుడిగా చాలా చోట్ల చదువుకున్నాం కానీ.. నిజానికి మూలం ప్రకారం ఆ రాజు పేరు త్రివిక్రమసేనుడు. ఇక మనం “భేతాళపంచవింశతి”గా పిలవబడే భేతాళ కథల్లోకి ప్రవేశిద్దాం. 

 Rajan PTSK గారికి ధన్యవాదాలు


Wednesday, October 26, 2022

ద్రౌపదీ, పాండవుల జన్మరహస్యం ఏమిటి?

 ద్రౌపదీ, పాండవుల జన్మరహస్యం ఏమిటి?




సాహితీమిత్రులారా!

మన ఇతిహాసాల మీద, పురాణాల మీద ఎంతో గౌరవభావం ఉన్నవారిని కూడా కొన్ని ధర్మసందేహాలు ఇబ్బందిపెడుతుంటాయి. అటువాంటి వాటిలో ఒకటి ద్రౌపదీదేవి పంచపాండవులకు భార్యకావడం. ఒక స్త్రీకి అయిదుగురు భర్తలు ఉండటం సమంజసమేనా? అన్నది మనలో కొంతమందికి ఉన్న సందేహం. ఈ సందేహం మనబోటివారికే కాదు.. ద్రౌపదీదేవి తండ్రి అయిన ద్రుపదమహారాజుకి కూడా వచ్చింది. ఈ కథలో కాస్తంత వెనక్కు వెళితే..  ఇక వీడియో ద్వారా వినండి-


రాజన్ పి.టి.యస్ .కె గారికి ధన్యవాదాలు

Monday, October 24, 2022

బలి చక్రవర్తి భవనంలో రావణబ్రహ్మ

 బలి చక్రవర్తి భవనంలో రావణబ్రహ్మ




సాహితీమిత్రులారా!

శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తి తల మీద పాదం ఉంచి, అతడిని రసాతలానికి పంపించివేశాడు. బలి సత్యసంధతకు మెచ్చి, రాబోయే మన్వంతరంలో అతనికి ఇంద్రత్వం కూడా ప్రసాదించాడు. అలా రసాతలంలో ఉండిపోయిన బలిచక్రవర్తిని, అనుకోకుండా కలుస్తాడు రావణుడు. అప్పుడు ఏం జరిగింది. రావణుడు ఎలా భంగపాటు చెందాడు, అన్న విషయాలకు సంబంధించిన కథ ఒకటి మనకు రామాయణం ఉత్తరకాండలో వస్తుంది.  ఇక కథ వినండి-


రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు

Saturday, October 22, 2022

కాశీమజిలీ కథలు 4 - శూరసేన మహారాజు కథ - కృష్ణదేవరాయల జనన కథ

 కాశీమజిలీ కథలు 4 - శూరసేన మహారాజు కథ - కృష్ణదేవరాయల జనన కథ




సాహితీమిత్రులారా!

క్రిందటి భాగంలో మణిసిద్ధుడు కోటప్పకు కాశీమహిమ కోసం చెబుతూ, అందులో అంతర కథగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రకు చెప్పిన శివశర్మ కథను చెప్పడం, ఆ తరువాత కోటప్ప మణిసిద్ధునితో కాశీప్రయాణానికి సిద్ధపడటం, కానీ తనకు కాశీవెళ్ళే దారిలో ఏ విషయం మీద సందేహం వచ్చినా ఆ వివరం చెప్పాలని షరతు విధించడం, ఆ తరువాత వాళ్ళు మొదటి మజిలీకి చేరుకోవడం, వంటకు కట్టెలు తేవడానికి  వెళ్ళిన కోటప్ప ఆకాశంలో వెళుతున్న కీలురథాన్ని చూసి, దాని కథ చెప్పమని మణిసిద్ధుడిని అడగటం, సిద్ధుడు ఇచ్చిన మణి ప్రభావం వల్ల మణిసిద్ధుడికి ఆ కీలు రథం చరిత్రంతా తెలిసి, అది కోటప్పకు చెప్పడానికి సిద్ధపడటం వరకూ కథను చెప్పుకున్నాం. ఇప్పుడు మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన శూరసేన మహారాజు కథను చెప్పుకుందాం. 

RajanPTSK గారికి ధన్యవాదాలు

Tuesday, October 18, 2022

కాశీమజిలీ కథలు 3 - అగస్త్యుడు చెప్పిన శివశర్మ కథ

 కాశీమజిలీ కథలు 3 - అగస్త్యుడు చెప్పిన శివశర్మ కథ




సాహితీమిత్రులారా!

క్రితం భాగంలో మనం వింధ్యపర్వత గర్వాన్ని అణచి, లోకాలను కాపాడిన అగస్త్యులవారి కథను చెప్పుకున్నాం. ఆ తరువాత అగస్త్యులవారు భార్యా సమేతంగా దక్షిణదేశ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ శ్రీశైలం వెళ్ళడం, అక్కడ లోపాముద్రాదేవి… శిఖర దర్శనమాత్రం చేత ముక్తినిచ్చే శ్రీశైలం కన్నా,  మరణిస్తేనే ముక్తినిచ్చే కాశీ ఏవిధంగా గొప్పదని అడగడం. అందుకు అగస్త్యులవారు కాశీ గొప్పతనాన్ని తెలియజేసే శివశర్మ కథ చెప్పడానికి సిద్ధమవడం వరకూ కథ చెప్పుకున్నాం. ఇప్పుడు అగస్త్యుల వారు చెప్పిన శివశర్మ కథలోకి ప్రవేశిద్దాం.


రాజన్ పి.టి.యస్.కె గారికి ధన్యవాదాలు

Sunday, October 16, 2022

మనుస్మృతిలో ఏముంది?

 మనుస్మృతిలో ఏముంది? హిందూమతంలో అస్పృశ్యత, సతీసహగమనం ఉన్నాయా?



సాహితీమిత్రులారా!

మనుస్మృతి మీద జరిగినన్ని వాదోపవాదాలు మరే గ్రంథం మీదా జరగలేదు. ఇంతటి వివాదాస్పదమైన గ్రంథం ఇంకొకటి లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ గ్రంథం గురించిన చర్చ నడుస్తూనే ఉంటుంది. అసలు ఈ మనుస్మృతికి ఈ కాలపు సమాజానికీ సంబంధం ఉందా? మనువు స్త్రీల గురించి, శూద్రుల గురించి ఏం చెప్పాడు? అలానే మన హిందూ మతంలో అస్పృశ్యత, సతీసహగమనం లాంటివి ఉన్నాయా? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.


Rajan PTSK గారికి ధన్యవాదాలు


Friday, October 14, 2022

కాశీమజిలీ కథలు 2- అగస్త్యుడు - వింధ్యపర్వతం

 కాశీమజిలీ కథలు 2- అగస్త్యుడు - వింధ్యపర్వతం




సాహితీమిత్రులారా!

క్రితంభాగంలో మనం మణిసిద్ధుడి వృత్తాంతం, ఒక సిద్ధుడి ఉపదేశానుసారం అతను కాశీప్రయాణానికి సిద్ధమవడం. తనతో కాశీకి రావలసినదిగా ఒక పశువుల కాపరిని అడగటం. అందుకు అతగాడు కాశీ గొప్పతనం గురించి తనకు చెప్పమనీ, అది తనకు నచ్చితేనే వస్తాననడం. సరేనన్న మణిసిద్ధుడు కథ చెప్పడానికి ఉద్యుక్తుడవడం, వరకూ కథ చెప్పుకున్నాం. ఈరోజు మణిసిద్ధుడు ఆ గొల్లవానితో చెప్పిన కాశీ మహిమను గురించిన కథ చెప్పుకుందాం.


RajanPTSK గారికి ధన్యవాదాలు

Wednesday, October 12, 2022

కాశీమజిలీ కథలు 1 - మణిసిద్ధుని కథ

 కాశీమజిలీ కథలు 1 - మణిసిద్ధుని కథ 




సాహితీమిత్రులారా!

కథల్లో కాశీమజిలీ కథల అందం వేరు. ఈ కథల రచయిత మధిర సుబ్బన్న దీక్షిత కవి గారు. నిజానికి  వివిధ ప్రాంతలలో జానపదులు చెప్పుకునే కాశీమజిలీ కథలను పోగేసి, వాటికి మరిన్ని కల్పనలు జోడించి, వాటన్నింటినీ కలిపి 12 సంపుటాలుగా తీసుకు వచ్చారు సుబ్బన్న దీక్షితులు గారు. ఈ విషయాన్ని క్రీ.శ. 1900లో అచ్చయిన తమ “కాశీమజిలీ కథలు” మొదటి సంపుటి పీఠికలో ఆయనే చెప్పుకొచ్చారు. అంటే మొదటి సంపుటి అచ్చయ్యి ఇప్పటికి 120 సంవత్సరాల పైమాటే అన్నమాట. అప్పటి పుస్తక భాష గ్రాంథికం కనుక, అది ఇప్పటి తరంలో అందరికీ అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ కనుక, సరళమైన భాషలో, కథలో ఎటువంటి మార్పులూ చెయ్యకుండా, కుదిరినప్పుడల్లా, ఒక్కో కథా చెప్పుకుంటూ వెళతాను. 

గుణనిధి అనే బ్రాహ్మణుడు మణిసిద్ధునిగా మారి, కోటప్ప అనే ఒక గొల్లపిల్లవాడిని వెంటబెట్టుకుని 360 మజిలీలతో కాశీ పట్టణాన్ని చేరుకుంటాడు. ఆ మజిలీలలో మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన కథలే ఈ కాశీమజిలీ కథలు. అద్భుతమైన కల్పనలు, మోతాదు మించని శృంగారం, కడపుబ్బా నవ్వించే హాస్యం, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే నాయికానాయకుల బుద్ధిచాతుర్యం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఇలా ఒకటేమిటి, నవరసాలూ మేళవించబడిన కథలివి.  ఇంతమంచి కథలను మనకు అందించిన మధిర సుబ్బన్న దీక్షిత కవి గారికి నమస్కరించుకుంటూ… మనం కూడా కాశీమజిలీయాత్ర మొదలు పెడదాం.

రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు

Monday, October 10, 2022

కాఫీ దండకం

 కాఫీ దండకం




సాహితీమిత్రులారా!

వందేళ్ళ క్రితం చెప్పిన ‘కాఫీ’ దండకం

ఈరోజు మనం చెప్పుకోబోతున్న కాఫీ దండకాన్ని రచించినది సంస్కృతాంధ్రాలలో మహా పండితుడైన శ్రీ పోకూరి కాశీపతి గారు. గద్వాల సంస్థానాధీసుడు ఈయనకు కవిసింహుడనే బిరుదునిచ్చి తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. వీరికి నిఘంటువులన్నీ కంఠోపాఠంగా ఉండేవట. వీరు పండితుడే కాదు మంచి కవికూడా. కాశీపతిగారు సారంగధరీయమనే త్ర్యర్థి కావ్యాన్ని రచించారు. అంటే కావ్యంలో ఉన్న పద్యాలన్నీ మూడేసి అర్థాలను కలిగి ఉంటాయి. ఒకలా అర్థం చెప్పుకుంటే పార్వతీకళ్యాణం, ఇంకొకలా అర్థం చెప్పుకుంటే తారాశశాంకం, మరొకలా చూస్తే సారంగధరుని కథ వస్తుంది. ఈ కాశీపత్యావధానులు గారు గొప్ప శతావధాని కూడా. 1920 ప్రాంతంలో, అంటే ఇప్పటికి వందేళ్ళ క్రితం, ఆయన అప్పటి మద్రాసులో నగరంలో అష్టావధానం చేస్తున్నారట. అప్పుడు పృచ్ఛకులలో ఒకరైన తాపీధర్మారావుగారు పోకూరి కాశీపతి గారిని కాఫీపై దండకమొకటి ఆశువుగా చెప్పమన్నారట. అలా కాశీపతిగారు అప్పటికప్పుడు చెప్పిన ఆ కాఫీ దండకాన్నే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.


Rajan PTSK గారికి ధన్యవాదాలు

Saturday, October 8, 2022

రామాయణం ప్రకారం రావణాసురుడు ఎలా ఉంటాడు?

 రామాయణం ప్రకారం రావణాసురుడు ఎలా ఉంటాడు?




సాహితీమిత్రులారా!

లంకాధిపతి అయిన రావణాసురుడు ఎలా ఉండేవాడు? ఎలాంటి దుస్తులు ధరించేవాడు. అతని వాహనం ఏమిటి? అతడిని మొదటిసారి చూసినప్పుడు హనుమంతుడు ఏమనుకున్నాడు? రావణుని చూడగానే రామచంద్రమూర్తికి ఎటువంటి భావన కలిగింది? మొదలైన విషయాల గురించి పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడి ఉందో ఈరోజు చెప్పుకుందాం. 


Rajan PTSK గారికి ధన్యవాదాలు

Thursday, October 6, 2022

భాస మహాకవి "స్వప్న వాసవదత్త" నాటకంలోని కథ

 భాస మహాకవి "స్వప్న వాసవదత్త" నాటకంలోని కథ




సాహితీమిత్రులారా!

భాసో హాసః అంటూ కవితా కన్యకకు భాసమహాకవి దరహాసం వంటివాడని కీర్తించాడు జయదేవుడు. కాళిదాసభవభూతులకంటే పూర్వుడైన ఈ భాసుడు 24 రూపకాలు రచించినట్లుగా తెలుస్తోంది. కానీ అందులో 13 నాటకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటన్నింటిలోకీ ప్రతిమా నాటకం, చారుదత్తం, స్వప్న వాసవదత్తమనే నాటకాలు మరింత ప్రఖ్యాతి పొందాయి. ఈరోజు మనం స్వప్న వాసవదత్త నాటకం గురించి చెప్పుకుందాం. ఈ నాటకం గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా ప్రతితిజ్ఞాయోగంధరాయణమనే మరో భాసనాటకం గురించి కూజా కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వప్నవాసవదత్త నాటకం ఆ ప్రతిజ్ఞాయౌగంధిరాయణ నాటకానికి కొనసాగింపువంటిది.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Tuesday, October 4, 2022

నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?

 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?




సాహితీమిత్రులారా!

కాళిదాసు భోజరాజు ఆస్థానంలో మొదటిసారి ప్రవేశించే సమయంలో కొందరు పండితులు అడ్డుపడతారు. వారికి బుద్ధి చెప్పడానికన్నట్టుగా నోరుతిరగడం కష్టమైన అయిదు పద్యాలను చెప్పి, వాటిని తిరిగి చెప్పమంటాడు కాళిదాసు. చదువుతుంటే మధ్యమధ్యలో నాలుక మడతపడేలా ఉండే ఆ పద్యాలు చెప్పలేక చేతులెత్తేస్తారు ఆ పండితులు. అలా కాళిదాసు ప్రతిభకు తార్కాణం నిలచిపోయాయా పద్యాలు. ఆ పద్యాల అర్థాల గురించి ఇంత వరకూ ఏ పుస్తకాలలోనూ రాలేదు కానీ, పిల్లలకు నోరు తిరగడానికి వాటిని భట్టీయం వేయించడం మాత్రం పూర్వపురోజుల్లో ఉండేదట. అలాంటి క్లిష్టమైన పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం. అంతేకాక అటువంటి కష్టమైన పద్యాన్ని చాలా సులువుగా ఎలా భట్టీయం వేసి అప్పచెప్పవచ్చో కూడా చెప్పుకుందాం. ముందుగా ఆ పద్యం.

షడ్జామడ్జఖరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చమడ్ఖా ఖరే

జడ్జట్కిట్కి ధరాడ్ధరేడ్ఫునఘనః ఖడ్జోతవీడ్యడ్భ్రమా

వీడ్యాలుడ్భ్రమలుట్ప్రయట్ట్రయ పదాడడ్గ్రడ్గ్రడడ్గ్రడ్గ్రహా

పాదౌటేట్ప్రటటట్ప్రటట్ప్రటరసత్ప్రఖ్యాత సఖ్యోదయః

ఇదీ ఆ పద్యం. మొదటి రెండు పాదాలూ కష్టం మీద పలకొచ్చుకానీ, మూడూ నాలుగు పాదాలను చూస్తే మాత్రం భయం వేస్తుంది. అయితే ఇటువంటి పద్యాలలో పలకడానికి కష్టంగా ఉన్న పదాలను విడదీసి వ్రాసుకుని చదివితే.. అప్పుడు మనకు సులభంగా నోరుతిరుగుతుంది. అటుపై ఆ పదాలనే వేగంగా పలకడం సాధన చేస్తే సరిపోతుంది. మనకు లెక్కల్లో కూడా చూడండి.. పదహారుని ఇరవైమూడుతో గుణిస్తే ఎంత అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి. మనం అప్పుడు ముందు మూడుతో పదహారుని గుణించి, ఆ తరువాత రెండుతో దుణించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో వ్రాసి కూడతాం. కానీ అంతకన్నా సులువైన పద్ధతి ఒకటుంది. 23ని ఇరవైగా మూడుగా విడదీస్తే.. పదహారు ఇరవైలు 320, పదహారు మూళ్ళు 48. ఈ రెండూ కలిపితే 368. ఇలా చెయ్యాలన్నా కొంత సాధన చెయ్యాలి. కానీ ఈ విధానం అంతకు ముందు విధానం కన్నా సులభమైనది. అలానే పద్యం విషయంలో కూడా. ఈ పద్యాన్ని మనం ఇలా విడదీసి వ్రాసుకుందాం.


Rajan PTSKగారికి ధన్యవాదాలు

Sunday, October 2, 2022

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము

 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము



సాహితీమిత్రులారా!

ఈరోజు మనం ఆధునిక కవులలో మహాకవులు అనదగ్గవారి చేతనే కైమోడ్పులు అందుకున్న మహోన్నత కవి, భావకవితా ప్రపంచపు రవి అయిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వం గురించి మాట్లాడుకుందాం.


Rajan PTSKగారికి ధన్యవాదాలు