Wednesday, September 30, 2020

కాలాతీత వ్యక్తులు

 కాలాతీత వ్యక్తులుసాహితీమిత్రులారా!

భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

కాలాతీత వ్యక్తులు

ఇక్కడ వీక్షించండి-Monday, September 28, 2020

సాలార్ జంగ్ మ్యూజియమ్

 సాలార్ జంగ్ మ్యూజియమ్

సాహితీమిత్రులారా!

హైదరాబాదు దూరదర్శన్ వారు 

సాలార్ జంగ్ మ్యూజియమ్ 

గురించి కొన్ని వీడియోలు ప్రసారం చేశారు 

వాటిని వరుసగా ఇక్కడ చూద్దాం-

Saturday, September 26, 2020

అపోహ (కథ)

 అపోహ (కథ)
సాహితీమిత్రులారా!


మునిమాణిక్యం నరసింహారావు గారి 

కాంతం కథలు దూరదర్శన్ వారు 

ప్రసారం చేశారు వాటిలో

అపోహ కథ

ఆస్వాదించండి-Thursday, September 24, 2020

రాకా - అనుమతీ - సినీవాలి - కుహూ

 రాకా - అనుమతీ - సినీవాలి - కుహూ
సాహితీమిత్రులారా!మనం అనేక పదాలను వాటి అర్థాలను

పోగొట్టుకుంటున్నాము

అలాంటి పదాలలో  

రాకా - అనుమతీ - సినీవాలి - కుహూ 

పదాలు కొన్ని

వీటిని గురించి తెలుసుకుందాం

పౌర్ణమి తిథి రెండు విధాలు

1. రాకా - రాత్రీ పగలూ మొత్తం అంతా పౌర్ణమి ఉంటే అది రాకా

2. అనుమతీ -పగటికాలం వరకే పౌర్ణమీతిథి ఉంటే అది అనుమతీ


అలాగే

అమావాస్య  తిథి రెండు విధాలు

1. సినీవాలి- అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు     

                 సూర్యోదయం  వరకు ఉంటే అది సినీవాలి

2. కుహూ -  అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు 

                 సూర్యోదయం కన్న ఎక్కువ ఉంటే అది కుహూ


మనం మనభాషనే మరచిపోతున్న రోజులివి పదాలొక లెక్కా అంటే

నేను చెప్పలేను కానీ వీలైనంతైనా పదాలను గుర్తుంచుకుందామని నా అభిప్రాయం.

Wednesday, September 23, 2020

ఏకాంతంగా మాట్లాడే దెట్లా?

 ఏకాంతంగా మాట్లాడే దెట్లా?
సాహితీమిత్రులారా!ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు

"శివుడు పార్వతితో ఏకాంతంగా మాట్లాడే వీలులేదని" చెప్పే

ఈ పద్యం చూడండి.

ఎంత

చమత్కారంగా ఉందో!


జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొని యుందు రక్కునన్

కట్టడి పాపరేడు, అలికంబున నగ్ని శివుండు పార్వతీ

పట్టపుదేవితో సరస భాషణ కేనియు నోచుకోడటే!

గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే


(శివుడు, పార్వతి ఏకాంతంగా రహస్యంగా

మాట్లాడుకోవటానికి నోచుకోలేదట

ఎందుకంటే .........

తలమీద గంగ, చంద్రుడు, మెడలో పాము, నొసట అగ్ని

- ఇన్ని విడవనివి ఉంటే

ఇక ఇక ఏకాంతం ఎక్కడ)

Sunday, September 20, 2020

వంటావిడ - ఇంటావిడ

 వంటావిడ - ఇంటావిడ
సాహితీమిత్రులారా!


భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

వంటావిడ - ఇంటావిడ

ఇక్కడ వీక్షించండి-Saturday, September 19, 2020

నామకరణం (కాంతం కథలు)

 నామకరణం (కాంతం కథలు)
సాహితీమిత్రులారా!మునిమాణిక్యం నరసింహారావు గారి 

కాంతం కథలు దూరదర్శన్ వారు 

ప్రసారం చేశారు వాటిలో

నామకరణం కథ

ఆస్వాదించండి-
Friday, September 18, 2020

తృప్తి (కథ)

 తృప్తి (కథ)

సాహితీమిత్రులారా!


సత్యం శంకరమంచి గారి

అమరావతి కథలు నుంచి

తృప్తి కథ వీక్షించండి-Thursday, September 17, 2020

కాయల్గాచె వధూనఖాగ్రంబులచే

కాయల్గాచె వధూనఖాగ్రంబులచే
సాహితీమిత్రులారా!ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మాహత్మ్యంలో

అనేక నగ్నసత్యాలను వాక్రుచ్చారు

అందులోనివి కొన్ని-

వీడెం బబ్బినప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో

గూడున్నప్పు, శ్రీ విలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ 

పాడంగా వినునప్పుడుం చెలగు దంభప్రాయ విశ్రాణనా

క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!


ఓ కాళహస్తీశ్వరా! నిన్ను నీ ధ్యానాన్ని మరచి,  తమకు తాంబూలము దొరికినప్పుడు( భోగములు కలిగి ఆరురుచులతో కూడిన అన్నం భుజించిన తరువాత), తనను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్య వైభవవిలాసాలు ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు, తమ గొప్పతనాన్ని చూపడానికి ఆడంబరంగా దానధర్మాలు చేస్తూ విర్రవీగువారిని ఏమనాలో తెలియడంలేదు.


కాయల్గాచె వధూనఖాగ్రంబులచేఁ గాయంబు, వక్షోజముల్

రాయన్రాపడె ఱొమ్ము, మన్మథవిహారక్లేశ విభ్రాంతిచే

ప్రాయంబాయను, బట్టగట్టెఁదల, చెప్పన్ రోత సంసారమేఁ

జేయంజాల విరక్తుఁ జేయఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా


ఓ కాళహస్తీశ్వరా! స్త్రీల నఖక్షతాలతో శరీరం కాయలు గాచింది, వారి ఉరోజాల రాపిడితో నారొమ్ము స్పర్శలేకుండా గట్టిపడి రాయైపోయింది, మన్మథక్రీడాసక్తితో వయసంతా పోయి వయసైంది, తల వెండ్రుకలూడిపోయి బట్టతలైంది ఇలా ఎన్ని చెప్పను ఇప్పుడు సంసారం మీద అసహ్యం కలుగుతోంది. ఇక నాకు సంపూర్ణ వైరాగ్యాన్నిచ్చి భవబంధవిముక్తిని కలిగించు. 

Monday, September 14, 2020

ఆకృతి రామచంద్రు విరహాకృతి

 ఆకృతి రామచంద్రు విరహాకృతి

సాహితీమిత్రులారా!

కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగారి

రామాయణకల్పవృక్షం లో

సుందరకాండలో సీతమ్మవారి వర్ణనను

చెప్పెడి పద్యం దీనికి గరికపాటివారి

వ్యాఖ్య ఆస్వాదించండి-
Saturday, September 12, 2020

ఉగ్రతాంబూలం(కథ)

 ఉగ్రతాంబూలం(కథ)సాహితీమిత్రులారా!

భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

ఉగ్రతాంబూలం

ఇక్కడ వీక్షించండి-Thursday, September 10, 2020

ఆణిముత్యాలు - జేబురుమాలు(కథ)

 ఆణిముత్యాలు - జేబురుమాలు(కథ)
సాహితీమిత్రులారా!


దూరదర్శన్ లో ప్రసారమైన కథ

బుర్రా వెంకటసుబ్రమణ్యం గారి 

జేబురుమాలు కథ

ఆస్వాదించండి-Tuesday, September 8, 2020

చిల్లర దేవుళ్ళు, చిన్న చిన్నరాళ్ళు(కథ)

 చిల్లర దేవుళ్ళు, చిన్న చిన్నరాళ్ళు(కథ)

సాహితీమిత్రులారా!

భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

చిల్లర దేవుళ్ళు, చిన్న చిన్న రాళ్ళు

ఇక్కడ వీక్షించండి-Sunday, September 6, 2020

గున్నయ్య గడ్డం(కథ)

 గున్నయ్య గడ్డం(కథ)సాహితీమిత్రులారా!

న్యాయపతి రాఘరావుగారు వ్రాసిన కథలు 

దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి

వాటిలో ఇక్కడ గున్నయ్య గడ్డం

వీక్షించగలరు-Thursday, September 3, 2020

మానవకంప్యూటర్ శకుంతలాదేవి

 మానవకంప్యూటర్ శకుంతలాదేవి

సాహితీమిత్రులారా!


మానవకంప్యూటర్ శకుంతలాదేవిగారిని

గురించిన వీడియో

మార్గదర్శిపేర ఈటీవీ-2లో ప్రసారమైనది

మీరు ఇక్కడ వీక్షించండి ఆమెను స్ఫూర్తిగా

తీసుకొని మీ పిల్లలకు గణితంలో ఆసక్తిని కలిగించండి-
Tuesday, September 1, 2020

''సాని'' అంటే ఏమిటి?

 ''సాని'' అంటే ఏమిటి?

సాహితీమిత్రులారా!సాని అనే పదం మనకు సుపరిచితమే కానీ దాని అర్థం మాత్రం

మనకు వేరుగా వ్యవహారంలో గమనిస్తాం. 

సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం కలది అని.

- నుండి ని - వరకు పరిపూర్ణ సంగీత పాండిత్యాన్ని సంపాదించుకొన్న

గంధర్వాంగనకు సాని అని బిరుదునిచ్చేవారు. 

ఈ బిరుదుపొందిన ప్రథమ సంగీత విద్వాంసురాలు రంభయే అయి ఉండాలి.

తరువాత కాలంలో సాని అనేది ఒకబిరుదుగా ఉండేది. 

ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సివచ్చేది.  

కొందరు రాణులకు గౌరవప్రదంగా ఈ బిరుదు ఉండేది. 

పిల్లలమర్రిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన 

బేతరాజు భార్యపేరు ఎర్రక్కసాని

ఎరుకలసాని, మంత్రసాని, దొరసాని అనే పదాలు

 గౌరవప్రదమైనవే కాని నీచమైనవికావు. 

రానురాను ఈ పదం విశిష్టత అంతరించి కళంకాన్ని ఆపాదించే 

నీచమైన  అర్థంగా మారిపోయింది.

                                                                                     (ఈ సమాచారం డా. నటరాజు రామకృష్ణ గారి రుద్రగణిక నుండి.)