Friday, April 28, 2023

సోక్రటీస్ చెప్పిన 3 వడపోతల పరీక్ష

 సోక్రటీస్ చెప్పిన 3 వడపోతల పరీక్ష 




సాహితీమిత్రులారా!

సోక్రటీస్ చెప్పిన ఈ మూడు వడపోతల పరీక్ష ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా వర్తించేదే.

ఒకసారి సోక్రటీస్ దగ్గరకు అతని పరిచయస్థుడు ఒకడు వచ్చాడు. అతను వచ్చీ రావడంతోటే "ఇదిగో  సోక్రటీస్ నీకు ఈ విషయం తెలుసా! నీ స్నేహితుడి గురించి నేను ఒక మాట విన్నాను.." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. అప్పుడు సోక్రటీస్ అతడిని వారిస్తూ, "ఆగు ఆగు, ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. అంటూ 3 ప్రశ్నలు అడిగాడు. 

రాజన్ పి టి యస్ గారికి ధన్యవాదాలు

Sunday, April 23, 2023

కఠోపనిషత్తులో ఏముంది? యముడు - నచికేతుడు కథ

 కఠోపనిషత్తులో ఏముంది? 

యముడు - నచికేతుడు కథ 




సాహితీమిత్రులారా!

యమధర్మరాజుకీ, నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమవుతుందన్న విషయమైన జరిగిన సంవాదమే ఈ కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు రెండు భాగాలుగా, ఆరు అధ్యాయాలుగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులో మొత్తం 119 మంత్రాలున్నాయి. శరీరమే రథం. ఆత్మే ఆ రథాన్ని అధిరోహించే రథికుడు. బుద్ధి సారథి. మనస్సు కళ్ళెం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాసక్తులే ఆ గుర్రాలు పరుగు తీసే మార్గాలు.. ఇలా జీవుని గురించి చెబుతుంది ఈ ఉపనిషత్తు. అలానే పరమాత్మ అంగుష్ఠమాత్రుడై ప్రతీ జీవి హృదయంలోనూ ఉంటాడంటుంది. రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, నోరు, నాభి, మలమూత్ర ద్వారాలు, బ్రహ్మరంధ్రము ఇలా 11 ద్వారాలు గల కోట ఈ దేహమనీ, మరణసమయంలో ఈ ద్వారాలలో దేనినుండైన ఆత్మ నిష్క్రమించవచ్చనీ, అయితే ఆత్మ బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమించినప్పుడే ముక్తి లభిస్తుందనీ చెబుతుంది.   “లేవండి, మేల్కొనండి” అన్న వివేకానందుని ప్రబోధం ఈ కఠోపనిషత్తునుండే తీసుకొనబడింది. ఇక భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు ఈ కఠోపనిషత్తులోని మంత్రాలే ఆధారాలు.

ఇక ఈ ఉపనిషత్తులోని నచికేతుని కథలోకి వెళితే.. 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


Thursday, April 20, 2023

రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక

 రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక




సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణదేవరాయలుచే పెద్దనగారికి స్వయంగా గండపెండేరము తొడిగించిన ఉత్పలమాలిక

ఒకసారి రాయలవారు తన సభ అయిన భువనవిజయానికి వస్తూ వస్తూ..  తనతో పాటూ ఒక బంగారపళ్ళెంలో పెట్టి ఉన్న గండపెండేరాన్ని కూడా తీసుకు వచ్చారు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమంగా కవిత్వం చెప్పగలిగిన కవిదిగ్గజానికి ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తానన్నారట. అష్టదిగ్గజ కవులంతా తర్జనభర్జన పడుతున్నారు. అప్పుడు రాయలవారు 

“ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగ

నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకో?” అన్నారట. 

అంటే.. నేను గండపెండేరాన్ని బహూకరిస్తున్నాను, తీసుకోండి అంటుంటే.. ఒక్కరూ తీసుకోరేమిటి అని అన్నమాట. రాయలవారు అన్న మాటలు ఉత్పలమాల వృత్తంలో 2 పాదాలలో ఉన్నాయి. అప్పుడు ఆంధ్రకవితాపితామహుడైన అల్లసాని పెద్దనగారు లేచి 

“పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని  నీ వెరుంగవే?

పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్రుపా!” అంటూ మిగిలిన రెండు పాదాలనూ పూరించారు. 

అంటే ఓ రాజా! పెద్దన పోలిన పండితులు ఈ భూప్రపంచంలో లేరని నీకు తెలియనిదా. కనుక ఆ గండపెండేరం నాకే బహూకరించు అన్నారట. మరి అంటే సరిపోతుందా.. రాయలవారు అడిగినట్లుగా సంస్కృతాంధ్రాలలో కవిత్వాన్ని గుప్పించాలి కదా. అప్పుడు పెద్దన గారు అందుకున్నదే ఈ ఉత్పలమాలిక. ఉత్పలమాల ఛందస్సులో, పద్యంలా కేవలం నాలుగు పాదాలతో ఆపకుండా అంతకు మించి మాలికలా అల్లుకుంటూ పోయేదే ఉత్పలమాలిక. పెద్దన గారు చెప్పిన ఉత్పలమాలికేమిటో చూద్దాం.

 Rajan PTSK గారికి ధన్యవాదములు


Tuesday, April 18, 2023

కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ

 కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ




సాహితీమిత్రులారా!

కవులందరిలోకీ కాళిదాసు గొప్పవాడైతే.. కాళిదాసు రచనల్లోకెల్లా రఘువంశం గొప్పది. ఈ రఘువంశం 19 సర్గలున్న కావ్యం. ఇందులో మొత్తం 29మంది రఘవంశానికి చెందిన రాజుల చరిత్ర ఉంది. అయితే  22 చరిత్రలు విపులంగాను, ఏడుగురు రాజుల కథలు సంక్షిప్తంగానూ చెప్పాడు కాళిదాసు. 

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ"

అన్న ప్రార్థనా శ్లోకంతో రఘవంశ కావ్యాన్ని ప్రారంభించాడు కాళిదాసు. శబ్దము, అర్థము ఎలా అయితే ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఉండలేవో అలా విడదీయరాని సంబంధం కలిగినటువంటివారును, ఈ జగత్తుకు తల్లిదండ్రులును అయినటువంటి పార్వతీపరమేశ్వరులను శబ్దార్థాల జ్ఞానం కొరకు ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇక కథలోకి వెళితే..

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Saturday, April 15, 2023

షేక్స్‌పియర్ 'రోమియో జూలియట్ '

 షేక్స్‌పియర్ 'రోమియో జూలియట్ '




సాహితీమిత్రులారా!

షేక్స్‌పియర్ విషాదాంత నాటకాలలోకెల్లా అత్యంత ప్రసిద్ధి చెందిన నాటకం రోమియో జూలియట్. ఈ రోమియో, జూలియట్‌ల పేర్లు విననివారుండరు. అంతగా ఈ రెండు పేర్లూ జనం మనసులలో మరీ ముఖ్యంగా ప్రేమికుల మనస్సులలో నాటుకుపోయాయి. అసలు ఈ నాటకంలో కథేమిటి. చివరికది విషాదాంతం ఎలా అయ్యింది.. మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం.

 Rajan PTSK గారికి ధన్యవాదాలు


Wednesday, April 12, 2023

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యగారి జీవనరేఖలు

  ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యగారి జీవనరేఖలు




సాహితీమిత్రులారా!

Allu Ramalingaiah (1 October 1922 – 31 July 2004) was an Indian character actor, comedian, and producer known for his works in Telugu cinema. Ramalingaiah appeared in over 1000 films in a variety of roles. He is well known for his variety of comedy punches. The famous production house Geeta Arts is his brain child. He left a legacy in the Telugu Film Industry. His son Allu Aravind is carrying his legacy. In this, extensive research based, talk show -  KiranPrabha narrated many interested anecdotes in Allu Ramalingaiah Gari 82 years of victorious life.





Sunday, April 9, 2023

ధర్మం - చట్టం - న్యాయం మధ్య తేడా ఏమిటి?

 ధర్మం - చట్టం - న్యాయం మధ్య తేడా ఏమిటి?




సాహితీమిత్రులారా!

ధర్మం, చట్టం, న్యాయం ఈ మాటల్ని మనం ఎక్కువగా వింటూనే ఉంటాం. అసలు ఈ మూడింటి మధ్యా ఉన్న సంబంధం ఏమిటి? వాటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ విషయాలను మరీ పెద్ద పెద్ద నిర్వచనాల జోలికి పోకుండా తేలికగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. గమనించండి వీడియోలో..............


రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Friday, April 7, 2023

Freda Bedi, British woman fought for India Independence ఫ్రెడా బేడి

 Freda Bedi, British woman fought for India Independence  ఫ్రెడా బేడి



సాహితీమిత్రులారా!

Freda Bedi (1911 –  1977), also known as Sister Palmo  , was a British woman who was jailed in India as a supporter of Indian nationalism and was the first Western woman to take full ordination in Tibetan Buddhism. BPL Bedi and Freda Bedi gave birth to 4 kids. Famous Bollywood and international actor Kabir Bedi is one among them.  From Oxford University to Buddhist Nun via India Independence struggle, Kashmir rebuilding... Freda's life journey is redefining life at any time..!  KiranPrabha narrates highly inspiring and thought provoking events in Freda's life journey. A must to watch video..!!





Tuesday, April 4, 2023

ట్వెల్‌ఫ్త్ నైట్ - షేక్స్‌పియర్

 ట్వెల్‌ఫ్త్ నైట్ - షేక్స్‌పియర్ 




సాహితీమిత్రులారా!

షేక్స్‌పియర్ రచించిన కామెడీ నాటకాలలో ఈ ట్వెల్‌ఫ్త్ నైట్ అత్యుత్తమమైనదన్నది విమర్శకుల భావన. ట్వెల్‌ఫ్త్ నైట్ అంటే క్రిస్మస్ వేడుకలలో ఆఖరిదైన పన్నెండవ రోజు నాటి రాత్రి. ఇక కథలోకి వెళితే.. సెబాస్టియన్, వయోలా అన్నాచెల్లెళ్లు. కవలలు కావడంతో వారిద్దరూ అచ్చుగుద్దినట్లు ఒక్కలానే ఉండేవారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా జీవిస్తుండేవారు. వారుండేది మెసలినా పట్టణంలో. ఒకసారి ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒక ఓడలో ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రావడంతో ఆ నౌక ధ్వంసమైపోయింది.  ఇద్దరూ వేరు వేరు తీరాలకు కొట్టుపోయారు. అలా వయోలా ఇలీరియా అనే పట్టణ తీరం చేరుకుంది. తన అన్న మరణించాడని భావించి పెద్ద పెట్టున ఏడ్చింది. ఆమెతో పాటూ ఒడ్డుకు చేరుకున్న ఆ ఓడ కెప్టెన్ ఆమెను ఓదార్చి అండగా నిలబడ్డాడు. తాను ఒంటరి స్త్రీనని తెలిస్తే ఆపదలు చుట్టుముడతాయని భావించిన వయోలా, పురుషవేషం వేసుకుని సిజారియో అనే పేరు పెట్టుకుంది. ఆ తరునాత కెప్టెన్ సహాయంతో ఆ నగరానికి ప్రభువైన ఆర్సినో అభిమానాన్ని సంపాదించుకుని, అతనికి అంగరక్షకుడయ్యింది. సిజారియో పురుషుడు కాదు స్త్రీ అన్న విషయం ఒక్క ఓడ కెప్టెన్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు...

ఇక వీడియోలోకి వెళదాం.......

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


Sunday, April 2, 2023

మణిద్వీప వర్ణన

 మణిద్వీప వర్ణన




సాహితీమిత్రులారా!

ఒకసారి పార్వతీపరమేశ్వరులు హాయిగా విహరిస్తూ సరససల్లాపాలు ఆడుకుంటూ ఉండగా అమ్మవారు  అయ్యవారితో తనకోసం ఒక అందమైన భవనం కట్టించమని గోముగా అడిగింది. జగన్మాత అడిగితే జగత్పిత కాదంటాడా! పైగా భార్యంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. దేహంలో సగభాగాన్నే భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడయిన పూర్ణపురుషుడాయన. అంతటి ప్రేమ కనుకనే, అమ్మవారు ఇలా అడిగీ అడగంగానే భవనం ఏమిటి ఒక మహా నగరమే నిర్మించి తన ప్రేమ కానుకగా ఇవ్వడానికి సంకల్పించాడు. సాక్షాత్తూ స్వామివారే రంగంలోకి దిగడంతో బ్రహ్మవిష్ణువులు, దిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, యక్ష గంధర్వ సాధ్య సిద్ధ కిన్నర కింపురుషాది సమస్త దేవతా గణాలూ బిరబిరమంటూ కదలివచ్చేశాయి. అమృత సముద్రం మధ్య భాగాన్ని నగర నిర్మాణానికి, అమ్మవారి విలాసభవనానికీ అనుకూల ప్రదేశంగా నిర్ణయించాడు పరమశివుడు. ముందుగా సుధాసముద్రం మధ్యలో ఒక విశాలమైన ద్వీపాన్ని సృష్టించాడు. అలా సదాశివ సంకల్పంతో ఉద్భవించిన మహోన్నత ద్వీపమే మణిద్వీపం. 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు