Wednesday, October 5, 2016

శివునికి శీతబాధ


శివునికి శీతబాధ


సాహితీమిత్రులారా!



ఒకమారు శ్రీ శంకరానందగిరి అనులింగాయతి యతీశ్వరులు
తాము ఈ భావంను శ్రీశంకరాచార్యులవారి రచనలనుండియో,
శ్రీ అప్పయదీక్షితులవారి రచనలనుండియో విన్నానని,
ఆశ్లోకము మరపుదగిలినదనియు, అది మరెక్కడా దొరకలేదని
ఈ భావంతో ఒక పద్యం కావాలని మద్దుపల్లి వారిని అడిగాడట.
దానితో ఈ పద్యం 12-09-1955న ఆయన వ్రాశారు-

చలువల్ గ్రమ్మెడిగంగ, శీతకరుడౌ చంద్రుండు పైకొంటచేఁ
దలభారం బయికూడ శీతగిరిమీఁదన్ నిల్చితో దేవ శీ
తల భాధన్ భరియింపఁజాల విదిగో దాఁకొమ్ము తాపత్రయా
గ్నులు వెల్గొందెడి నాహృదంతరమునందున్ హాయిగా నుండెడిన్

(బాగా చల్లదనాన్నిచ్చెడి గంగ, విపరీతమైన
చలిని కూర్చే చంద్రుడు తలపై ఉండటంవలన
తలభారమై కూడా మంచుకొండమీద నిలిచిన
ఓ దేవా! ఆ శీతలబాధను భరించలేవుగాని
తాపత్రాగ్నులచేత వేడిగా ఉన్న నా హృదయంలో
హాయిగా ఉంటుంది ఇక్కడచేరవయ్యా ఓ శంకరా!
- అని భావం)

ఈ అర్థంతో ఉన్న మూలశ్లోకం కోసం  దాదాపు
మూడు సంవత్సరాలు వెదికారు కాని అది ఎక్కడా
లభించకపోవడంతో ఆయన అది దొరికినప్పుడే దొరకనీ
అందాకా ఈ శ్లోకం వాడుకుందామని 28-01-1958న
ఈ శ్లోకం వ్రాశారు(అదే భావంతో)
చూడండి-

శైత్యాపన్న సురాపగా హిమకరా శ్రాంతాధివాసస్థితే
శ్శంభో! శీర్షభరస్య తే హిమగిరా వావాసదోషోప్యభూత్,
ఏతచ్ఛైత్యసహో భవే: కథ? మితస్తాపత్రయాగ్నిజ్వల
జ్జ్వాలాతప్తహృదంతరే మమ సుఖంగూహస్య దేవ! స్వయమ్
                                                           (కవితావినోదంలోనిది)

No comments:

Post a Comment