Wednesday, November 30, 2016

కస్తూరీ తిలకం లలాటఫలకే-2


కస్తూరీ తిలకం లలాటఫలకే - 2




సాహితీమిత్రులారా!


లీలాశుకుడను నామాంతరముగల
బిల్వమంగళుడు శ్రీకృష్ణకర్ణామృతము అనే
పేరుతో వ్రాయబడిన శ్రీకృష్ణుని లీలామృతమును
మూలభావం చెడకుండా అలాగే ఆంధ్రీకరించిన
వెలగపూడి వెంగన ఆంధ్రీకరణం
ఉదాహరణ చూడండి-


కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి

                                                                   (శ్రీకృష్ణలీలామృతము - 2- 109)

దీనికి వెలగపూడి వెంగనగారి ఆంధ్రీకరణ-

నుదుటం గస్తురి బొట్టు, నాసికతుద న్ముత్తెంబు, శ్రీగంధసం
పద నెమ్మేన, గరంబులం గటకముల్, వంశంబు హస్తాగ్రమం
దెదపై నిస్తుల కౌస్తుభంబు, నఱుతన్ శృంగారహారంబు నిం
పొదవం గృష్ణడు గోపికావృతుడు సర్వోత్కృష్ణుడై వర్ధిలున్


వెలగపూడి వెంగన్న ఆంధ్రీకరణ సుప్రసిద్ధమైన వృత్తాలలో సాగినది.
కానీ మరోఆంధ్రీకరణకర్త పురుషోత్తమకవి  300 శ్లోకాలపై నున్న
వాటిని కేవలం కందపద్యాలలో కూర్చాడు.

ఈ పద్యానికి ఆంధ్రీకరణ చూడండి-

కర,వక్షో,ముఖ, తను, గళ,
వర, నాసల, వేణు, మణి, మృగమదశ్రీగం
ధ, రుచిరహార, వలయ, భా

స్వర మౌక్తికము లెనయు సతి సహితుడు భ్రోచున్


ఏది ప్రయోజన శూన్యం?


ఏది ప్రయోజన శూన్యం?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఇది నీతిశాస్త్రంలోనిది.

న కాష్టే విద్య తే దోవో
న పాషాణే న మృణ్మయే,
భానే హి విద్యతే దేవ
స్తస్మాద్భావో హికారణమ్


దేవుడనేవాడి ఉనికిని
కొయ్యలోనో-
రాళ్ళు రప్పల్లోనో-
మట్టిబొమ్మల్లోనో
వెతకనక్కరలేదు.
అతని నివాసం-
మన హృదయం.
ఆ భావన పెపొందించుకోవాలి.
మనలోనే దేవుడున్నాడనే
స్పృహ లేకుండా
గుళ్ళు - గోపురాలు దర్శించుకోవడం,
విగ్రహాన్ని పూజించడం
ప్రయోజన శూన్యమే
అని గ్రహించాలి.

Tuesday, November 29, 2016

ఎల్లవేళలా హాని చేసేవి?


ఎల్లవేళలా హాని చేసేవి?



సాహితీమిత్రులారా!


ఈ శ్లోకాన్ని చూడండి-
ఇది నీతిశాస్త్రంలోనిది.

నాస్తిక్యం వేద నిందాచ
దేవతానాం చ కుత్సనమ్,
ద్వేషం దంభంచ మౌనంచ
క్రోధం తైక్ష్వంచ వర్జయేత్


భగవంతుడు లేడనీ,
వేదాలు - దేవతలు ఇవన్నీ
కల్పనలని నిందించడం
ఎంతమాత్రం తగనివి

అలాగే కోపం, దంభం(కపటం), ద్వేషం
మొదలైన అవగుణాలను కూడ
తప్పక విడిచి పెట్టాలి.

ఇవి ఎల్లవేళలా హాని చేస్తాయని
అంతరార్థం.

నీరు కొలది తామరసుమ్మీ!


నీరు కొలది తామరసుమ్మీ!




సాహితీమిత్రులారా!


ఎదుటివారు ఎంత గ్రహించగలరో అంతే
ఇవ్వటం పరిపాటి ఈ విషయాన్ని తెలిపే
పద్యం కళాపూర్ణోదయంలో కనబడుతుంది-
తుంబురునికి వైకుంఠంలో సంగీత ప్రదర్శన
అవకాశం కలిగినపుడు నారదుడు ఆశ్చర్యపోతాడు
తుంబురునికి అంత పరిజ్ఞానం ఉందాయని
ఆ సందర్భంలోని పద్యం ఇది-

తమ విద్య నెవ్వ రే మా
త్రము గనఁజాలుదురు వారి దండను దన్మా
త్రమ ప్రకటింతురు బుధు లు
త్తముల మహిమ నీరు కొలది తామరసుమ్మీ!

విద్యాసాగరులైన పండితోత్తములు ఎదుటివారు
ఎంత గ్రహించగలరో, అంత మాత్రమే తమ విద్యను
ప్రకటించటం కద్దు. ఆ ఉత్తముల
మహిమ నీరు కొలది తామర సుమ్మీ
 చెరువులో నీరు అధికమైనకొలది
తామర పెరుగట సహజం. పండితులును
ఎదుటివారి లోతు తెలిసి తమ విద్యను ప్రదర్శిస్తారు - అని భావం.

సామాన్య విషయాన్ని విశేషవిషయంతోగాని,
విశేష విషయాన్ని సామాన్యవిషయంతోగాని సమర్థిస్తే
అది  అర్థాంతరన్యాసాలంకారము అవుతుంది.

విద్యాసాగరులైన పండితోత్తములు ఎదుటివారు
ఎంత గ్రహించగలరో, అంత మాత్రమే తమ విద్యను
ప్రకటించటం కద్దు.(ఇది సామాన్య విషయం)
ఆ ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ
(ఇది విశేషవిషయం)
ఈ పద్యంలో జరిగింది కావున
ఇది అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణవుతుంది.

Monday, November 28, 2016

తారుణ్యాతిగ చూతనూత్న ఫలము


తారుణ్యాతిగ చూతనూత్న ఫలము




సాహితీమిత్రులారా!



ఆముక్తమాల్యదలో వేసవికాలంలో విష్ణుచిత్తుడు
అతిథులకు ఎలాంటి భోజనం వడ్డిచాడో చూచాం.
అదే తరుణంలో మాంసాహారుల వేసవి భోజనం
ఎలా ఉండేదో కూడ శ్రీకృష్ణదేవరాయలవారు
వర్ణించారు ఆ పద్యం చూడండి-

తారుణ్యాతిగ చూతనూత్న ఫలము క్తైలాభిఘార స్వన
ద్ధారా ధూపిత శుష్కదంబుహృత మాత్స్యచ్ఛేద పాకోద్గతో
ద్గారపుంగన రార్చు భోగులకు  సంధ్యావేళలం గేళికాం
తారాభ్యంతర వాలుకా స్థి హిమాంత ర్నారికే ళాంబువుల్
                                                                        (ఆముక్తమాల్యద - 2- 68)


ఆ వేసవి యందు సంపన్నమైనవారు (భోగులు) మధ్యాహ్నమున
దోరమామిడి ముక్కలతో చుయ్యని శబ్దం వస్తూండగా నూనెపోత
తాలింపు వేసి నీటితడి ఇగురగానే తీసిన చేప బద్దలయిగురుతో
తింటారు. ఆ చేపల కూర తిన్నాక సాయంకాలమున తిన్న
భోజనము జీర్ణమయేప్పుడు ఆ చేపల కసరుతో త్రేన్పులు
వస్తూండేవి. వాటిని  తగ్గించటానికి ఇసుకలో పూడ్చి పెట్టిన
కొబ్బరికాయలను అప్పుడే తీసి వాటిని పగులగొట్టి వాటినీరు
త్రాగితే అవి(ఆ త్రేనుపులు) శాంతించేవి - అని భావం.

మధురమకరన్దం కరుణయా


మధురమకరన్దం కరుణయా



సాహితామిత్రులారా!



హరస్తుతిలోని ఈ శ్లోకం చూడండి-

అత శ్చేతో భృఙ్గో మమ విషయధుత్తూరకుసుమమ్
పరిత్యజ్యా2శ్రాన్తం తవచరణపఙ్కేరుహయుగే
ఉషిత్వా తత్రత్యం మధురమకరన్దం కరుణయా
తవాస్వాద్యానన్దం హర నిరుపమానం హి లభతామ్ 
                                                                               (హరస్తుతి - 15)

ఓ ఈశ్వరా! ఇతరులను ఆశ్రయించుట శ్రేయోదాయకం కాదు
కావున నా మనస్సు అనెడు తుమ్మెద విషయజాతమను
ఉమ్మెత్తపూవును వదలి ఎప్పుడునూ నీ పాదపద్మముల
జంటయందలి తీయతేనియను గ్రోలుచూ నీ దయచేత సాటిలేని
ఆనందమును పొందుగాక - అని భావం.

Sunday, November 27, 2016

కలిమిలేముల్ని లెక్కచేయనివారు


కలిమిలేముల్ని లెక్కచేయనివారు




సాహితీమిత్రులారా!


ఒక అజ్ఞాతకవి చెప్పిన చాటువు ఇది-

వెలయాలు, శిశువు, అల్లుడు,
ఇల ఏలిక, యాచకుండు ఏగురు ధరలో
కలిమియు లేమియు దలపరు
కలియుగమున కీర్తి కామ కాటయవేమా!

కలియుగంలో కీర్తికాముకుడవైన
ఓ కాటయవేమా!
వేశ్య, శిశువు(చిన్నబిడ్డ), అల్లుడు,
రాజు, యాచకుడు - ఈ ఐదుగురు
కలిమి లేమి అనే వాటిని పట్టిచుకోరు
- అని భావం.

వేసవి చందన చర్చ మున్నుగన్


వేసవి చందన చర్చ మున్నుగన్



సాహితీమిత్రులారా!


ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలవారు
విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరునందు
అతిథులకు వేసవిలో వండించి
పెట్టిన భోజన వివరం
ఈ పద్యంలో చూడండి-

తెలి నులివెచ్చ యోగిరము తియ్యని చారులు తిమ్మనంబులున్
బలుచని యంబళు ల్చెఱుకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధి శీతజలము ల్వడపిందెలు నీరు చల్లయు
న్వెలయగ పెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్
                                                                       (ఆముక్తమాల్యద -1-81)

వేసవికాలం కాబట్టి అతిథులకు
ముందుగా తాపం చల్లార్చే
గంధపు పూతపెట్టి తరువాత
ఆహారపదార్థాలను వడ్డించేవారు
అవన్నీ వేడిని పోగొట్టే పదార్థాలే. అవి-

కొంచెం వేడిగా ఉండే తెల్లని అన్నము,
బెల్లము వేసిన చారు,
తిమ్మనంబులు అనే తీపి పదార్థాలు,
 పల్చని అంబళులు(పులుసులు)
చెఱకురసం, కొబ్బరినీళ్ళు,
తీపి భక్ష్యములు(రసావళులు, అతిరసలు)
పండ్లు, సువాసనగల చల్లని నీరు,
వేసవి తాపాన్ని పోగొట్టటానికి ఊరవేసిన
మామిడి పిందెలు, నీరు ఎక్కువగా కలిగిన
మజ్జిగ, తృప్తిగా భోజనము పెట్టేవాడు.
- అని భావం.

Saturday, November 26, 2016

దేన్ని తప్పక విడిచి పెట్టాలి?


దేన్ని తప్పక విడిచి పెట్టాలి?




సాహితీమిత్రులారా!



నీతిశాస్త్రంలోని ఈ  శ్లోకం చూడండి-

పరిత్యజే దర్ధ కామౌ
యౌ స్యాతాం ధర్మ వర్జితౌ,
ధర్మం చాప్య శుభోదత్కరం
లోక నికృష్ట మేవచ

ధర్మానికి విరుద్ధంగా ధనాన్ని సంపాదించకూడదు.
అలాగే ధర్మానికి విరుద్ధంగా ఏదీ కోరుకోరాదు.
మొదట అది సుఖంగానే ఉన్నట్లు అనిపించినా
తర్వాత దు:ఖదాయకంగా -
లోకులచేత నిందింపబడేదిగా ఉండవచ్చు
కావున అధర్మాన్ని తప్పక విడిచి పెట్టాలి - అని శ్లోక భావం.

ప్రాప్తములేక దొరకవేవీ


ప్రాప్తములేక దొరకవేవీ




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి నీతిశాస్త్రంలోని-


చాతకేన తృషి తేన య దంభో
బిన్దు మాత్ర మమలం పరిలబ్దమ్
దైవతస్తదపి వాత నిపాతాత్
అన్యత: పతిత మాస్య మపాస్య


కేవలం దైవదత్తమైన వర్షపు చుక్కలచే
ఆధారంగా జీవించే చాతకపక్షి,
నోరు తెరచుకొని నిరీక్షస్తుంటే
ఎట్టకేలకు పడిన వర్షపు బొట్టు
గాలికి కొట్టుకుపోయింది.
దైవయోగం ఇలాగే ఉంటుంది
ఒక్కొక్కసారి అన్నీ సిద్ధంగా అమర్చుకున్నా
తినే వేళకు ప్రాప్తం లేకపోతే అంతే - అని భావం

Friday, November 25, 2016

పునుగుందావి నౌదనంబు మిరియంపు బొళ్లతో


పునుగుందావి నౌదనంబు మిరియంపు బొళ్లతో




సాహితీమిత్రులారా!


శీతాకాలంలో విష్ణుచిత్తుడు అతిథులకు
ఎలాంటి భోజనం వడ్డిచేవాడో
శ్రీకృష్ణదేవరాయలు
ఆముక్తమాల్యదలో ఇలావివరించాడు-

పునుగుదావి నౌదనంబు మిరియంపు బొళ్లతో జట్టి చు
య్యను నాదాఱని కూరగుంపు, ముకుమందై యేర్చునావం జిగు
ర్కొను పచ్చళ్లును, బాయసాన్నములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారంబిడు న్సీతునన్
                                                                             (ఆముక్తమాల్యద-1-82)

పుగనుగుతావుల వరి అన్నం,
మిరియపు పొడితోపాటు
చుయ్యిమనే తిరుగమోత చప్పుడు
చల్లారని శాకాలు, ముక్కుజబ్బును
మాన్పగలిగే ఆవపిండితో కూరిన
పచ్చళ్ళు, ఊరగాయలు, చేయి
చురుక్కుమనే నేయి, సగమిగురకాచిన
పాలు చలికాలంలోని ఆహారపదార్థాలుగా
వడ్డించేవాడు విష్ణుచిత్తుడు - అని భావం.

అన్నిటికి మనసేకదా మూలం


అన్నిటికి మనసేకదా మూలం



సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి-
భర్తృహరి శృంగారశతకంలోనిది-

విరహే పి సఙ్గమ ఖలు పరస్పరం సఙ్గతం మనో యేషామ్,
హృదయ మపి విఘటితం చేత్ సఙ్గో విరహం విశేషయతి

ఒకరిపట్ల ఒకరికి అనురాగం అనేది హృదయగతంగా
ప్రవర్థమానం అవుతూన్నంతకాలం, ఒకరినొకరు దైహికంగా
విడిచి ఉన్నాగానీ వైరాగ్యం సిద్ధించదు.

ఒకచోట కలిసి జీవిస్తున్నా -
స్త్రీ సౌందర్యంపట్ల ఎంతగా వర్ణించినా
ఆమె మేని హొయలు లయల విన్యాసం
పట్ల కొంచమైనా మోహం ప్రదర్శించక వైరాగ్య వహించి
ఉన్న పురుషుడు కేవలం ఇంద్రియ నిగ్రహం చేతనే
మనస్సు అదుపులోకి వస్తుంది.

దీన్నిబట్టి చూస్తే రాగజనకమైనా
వైరాగ్యకారకమైనా దానికి మనస్సే
ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తున్నది కదా
అలాంటి మనోనిగ్రం చేతనే స్త్రీలను దూరంగా
జరపవచ్చు - అని భావం.


Thursday, November 24, 2016

కాలాన్ని బట్టి సనాతనధర్మం మార్చుకోవచ్చా?


కాలాన్ని బట్టి సనాతనధర్మం మార్చుకోవచ్చా?



సాహితీమిత్రులారా!

నేడు ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు ఉన్నారా?
ఎవరి ధర్మం వారిదైంది సనాతన ధర్మంతో పనేమి
మార్చుకోడానికి వీలులేనిదే కదా సనాతనమంటే
ఎప్పటినుంచో ఆచరిస్తున్నదనికదా అది ఎలామారుతుంది
మారదుగాక మారదు
ధర్మం మారకపోతేనేం
మేం మారతామంటున్నారు కొందరు
ఏంచేస్తాం
ధర్మం గురించి చెప్పడమేగాని
ఆచరించేది లేనిది వారి ఇష్టం.

ఈ నీతిశాస్త్రశ్లోకం చూడండి-

వృద్ధౌచ మాతా పితరౌ
సాధ్వీ భార్యా సుత: శిశు:
భరణీయా ప్రయత్నేన
ఏషధర్మ: సనాతన:

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, పసివారిని,
భార్యాపుత్రులను, సాధ్విఅయిన భార్యను
ఎంత కష్టాలకు ఓర్చి అయినా సరే -
భరించాలంటున్నది సనాతనధర్మం - అని భావం.

ఇంక నెట్లు దీర్చెడు శ్రీపాద కృష్ణమూర్తి


ఇంక నెట్లు దీర్చెడు శ్రీపాద కృష్ణమూర్తి



సాహితీమిత్రులారా!


కొన్ని చరిత్రలో పునరావృతమౌతుంటాయనడానికి
శ్రీనాథుని జీవితం - శ్రీపాద కృష్ణమూర్తిగారి జీవితాలే
ఉదాహరణలు. వారి జీవితాలకు సరిపోల్చే పద్యాలను
చూడండి-

ఋణబాధలతో పరితపంచిన ఈ పద్యాలు-

శ్రీనాథుడు అవసానదశలో చెప్పినదీ పద్యం-
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా!
          పురవీధి నెదు రెండ బొగడదండ
సార్వభౌముని భుజాస్కంద మెక్కెను గదా!
          నగరి వాకిట నుండు నల్లగుండు
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేయి 
          వియ్యమందెను గదా! వెదురుగొడియ
ఆంధ్రనైషధ కర్త అంఘ్రి యుగ్మంబున 
          తగిలి యుండెను గదా! నిగళ యుగము
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము 
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
ఎట్లు చెల్లింతు టంకంబు లేడు నూర్లు?

ఇటువంటి ధోరణిలోనే శ్రీపాదవారు వాపోయారు చూడండి-

గౌతమీమాహత్మ్యకర్త కంఠము చుట్టు 
         కొనియుండెనేగదా! ఋణము చిలువ
కవిమిత్రు మేనెల్ల చివికించెనే గదా!
         అప్పులవారి వాక్యాయుధములు
శ్రౌతిమాన్య క్షేత్రసమితి కుదువబెట్ట 
         బడెగదా! వృషల సంభవుని యొద్ద
అష్టశతావధానాఢ్యున కిప్పుడు 
         చేరియున్నది గదా! నీరసంబు
పేటలంకల పాట నీపాటు దెచ్చె 
మాల పురుపుల పాలయ్యె మరి పొగాకు
అప్పు ముప్పది వేల రూప్యంబు లింక
నెట్లు దీర్చెడు? శ్రీపాద కృష్ణమూర్తి

Wednesday, November 23, 2016

ఈ కళానిధివల్లనే కదా!


ఈ కళానిధివల్లనే కదా!



సాహితీమిత్రులారా!

బిల్హణుడకవి యామినీపూర్ణతిలకకు విద్యనేర్పే
సమయంలో పౌర్ణమినాటిరాత్రి
చంద్రుని వర్ణిస్తున్న పద్యాలలోని తరువాతి పద్యాలు---

ఈ కళానిధివల్లనే కదా! దిక్కు ది
           క్కులవారెల్లను దెలివిఁ గనుట,
యీ వసుఖని వల్లనే కదా! విబుధులు
        కోరికల్ దీఱంగఁ గుడుపుఁ గనుట,
యీ మహా విధువల్లనే కదా! సభ్యు లె
         న్నఁగ నిశాచరు లెల్ల దిగులు గనుట,
యీ సత్ప్రభునివల్లనే కదా! మోదించి
        కువలయం బెచ్చుగాఁ గూర్మి గనుట,
యవుర యీ రాజ మహిమ యే మనఁగ వచ్చుటఁ
దమము వారించి, యరుల సంతతి నడంచి,
యన్య రతి డించి, హరి పద మాశ్రయించి,
యుదయ గిరి దుర్గముననుండి యొప్పుచుండె.  - 58

ఈ యుదయాద్రి రాజత గిరీశ్వ, మీ సితభానుఁడెన్నదా
క్షాయణి నేలు శంకరుఁడు, కప్పు గళ చ్థవి, దాపు చుక్క వై
నాయకమూర్తి, యా ప్రమథ నాథులు తక్కిన చుక్కలున్, మహా
శ్రేయ మొసంగు స్వ ప్రరుచిఁ జెంది భజించు వియోగి పాళికిన్   - 59

ద్విజరాజటంచు భావించిచుటయేకాని
       రూఢిగా దోషాకరుండు వీఁడు,
సన్మార్గ గతుడంచు జనులు పల్కులె కాని,
         దండి మీఱిన నిశాటుండు వీఁడు,
నమృత కరుండంచు నాఖ్య మాత్రమె కాని,
        చర్చింపఁగా విష జనుఁడు వీఁడు,
కువలయ ప్రియుఁడంచుఁ గోరి సెప్పుటె కాని,
       పాడి తప్పిన తక్రవైరి వీఁడు,
తమము వారించు రాజను క్రమమె కాని
యేపు మీఱంగ నారుల నేఁచు వీఁడు,
ననుచుఁ గులటలు దూషింతు రనుచు, జనుల
త్రోవ రా వెఱచితొ నీవు తోయజారి!    -60

సురల తెరువు వో సాగితి,
వరయఁగ సత్పతి  వదే నిశాటుఁడవా నీ
కిర వొందఁగ విధు నామము
హరిహరి తలఁపంగఁ జెల్లునా కమలారీ?  - 61

కమలంబున జననం బయి,
కమలాసనుఁ డనఁగఁ బరగి, ఖర కర మతిచే
దమియింతురే వియేగులఁ?
గ్రమమున వా విడిచి మలిన గర్భుం డందున్ - 62

హరి కబళించుటల్, హరున కంబక మౌటఁ, దమిస్రయందుఁ దే
జరిలుట, నీటఁ బుట్టుటయు, ఛాయలు గాంచుట, మేను పెంచుటల్,

ధరణిధరంబు లెక్కుటయుఁ దగ్గుట, మిన్నులు ముట్టి వచ్చుటల్,
గరకరిఁ బాంథ కోటులను గాల్చుట, యగ్నికి సిద్ధమే శశీ!  -63

'పోర! మా యుసు రేల పోసికొనేవురా?
    తోరంపు నీ మేను దొండివోను,
జెలఁగి రా పేల చేసేవురా? ఖేచర
      పాళి నీ కండలు పంచుక తిన,
యీ లీల మము గాసి యేల పట్టేవురా?
       పర్వంబులను నిన్నుఁ బాము గఱవఁ,
గ్రోధించి మ మ్మింత వేధించ నేలరా?
       కాలారి విసరి ని న్నేలఁ గొట్ట'
ననుచుఁ బాంథులు నిందింప ననుదినంబు
లలిఁ బ్రవేశించెనో యీ కళంక మొకటి?
యటుల గాకున్న శుచిమూర్తి వైన నీకు
మలినతా వృత్తి గలుగునే జలజ వైరి!

'పొంచి యెంతయుఁ దోడఁ బుట్టిన దానిల్లు
        కంపవెట్టిన మహాఖలుంఁడు వీఁడు,
చలపట్టి వెస నిశాచర వృత్తిని స దాళి
       తేజంబు లడఁచు నిందితుఁడు వీఁడు,
కలఁగి ఘోషింపఁగాఁ గన్న తండ్రిని బట్టి
       భంగపెట్టిన ఘోర పాపి వీఁడు,
మెఱసి యాపయి నున్న మిత్రుని విభవంబుఁ
       జూడఁ జాలని నికృష్టండు వీఁ'డ
టంచు భువిలోన విరహిణు లాడుకొనఁగ,
సిగ్గు దోఁపక, మిన్నంది, చెలువు మీఱఁ
దిరుగుచున్నావు మీఁ దింత తెలియ లేక
తాళు వెన్నెల చీఁకట్లు ధవళకిరణ!     - 65

మేర తప్పనివాఁడు మేదిని నీతండ్రి,
        నిత్య జీవన వృత్తి నీదు తల్లి,
యిష్ట సంపద లెల్ల నిచ్చు నీ తోఁబుట్టు,
        నెమ్మి శ్రీ గలవాఁడు నీదు బావ,
వర సుమనో ధర్మ పరుఁడు నీ యల్లుండు,
      నిర్మల చిత్త నీ ధర్మపత్ని,
చక్ర పాలన కళా శాలి నీ మిత్రుండు,
       విబుధుల పాలు నీ వితరణంబు,
తమము వారించు నీదు సందర్శనంబు,
నిఖిల జనులకు మోదంబు నీదు మూర్తి,
యిట్టి సంపద గలుగు నీయట్టి రాజు
కోరి చూచినఁ గలఁడె యో కువలయేశ!  -66

అవసరం ఏరంగైనా మార్పిస్తుంది


అవసరం ఏరంగైనా మార్పిస్తుంది



సాహితీమిత్రులారా!



వావిలాల సోమయాజులవారు తన విన్నపమనే ఖండికలో
ధూర్జటితో ఇలా అనిపించాడు అది చూడండి-
పెద్దన, రామలింగడు మొదలైనవారు సహజంగా శివభక్తులు.
రాజాదరణ కోసం వైష్ణవులై రాజ్యంలో, సమాజంలో గొప్పవారుగా
చలామణి కావటాన్ని చూచి ధూర్జటి ఇలా అనుకొన్నారట-

అళిక నేత్రాగ్ని హాసానంత రోచిస్సు
        కనలేక శిఖిపింఛ కాంతి వలచి
హారవాతాశన మారు తౌద్ధత్యమ్ము 
        లడయింప కౌస్తుభహారు జేరి
సందీప్త శితికంఠు సప్తార్చి వర్చస్సు
        భయపెట్ట వైకుంఠు పజ్జనిలిచి
నందీశ హుంకార నాద జర్జరి తోర్వి
        మనలేక వాంశిక స్వనము గ్రోలి
పెద్ది రాజయ్యె నంతటి పెద్దవాడు
ముక్కుతిమ్మన సంస్తుతి కెక్కినాడు
అబ్బినది రామలింగన్న కంత చొరవ
అయ్యె కవిపితామహుడు పెద్దన్న మొన్న

Tuesday, November 22, 2016

కాశి గదా! పలనాటి సీమకున్


కాశి గదా! పలనాటి సీమకున్



సాహితీమిత్రులారా!

కాశీకి వెళ్ళి గంగాస్నానం చేసి విశ్వనాథుని దర్శించి
వైభవప్రాభవాలతో తిరిగిన శ్రీనాథునికి పలనాడు చూచినపుడు
కలిగిన భావన-

వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుడు కళ్ళిపోతురా
జారయ కాలభైరవుడు - అంకమ శక్తియె అన్నపూర్ణగా
గేరెడు గంగధార మడుగే మణికర్ణికగా జెలంగు మా
కారెమపూడి పట్టణము కాశిగదా! పలనాటి సీమకున్

పలనాటివారికి వీరులే దివ్యలింగాలు, చెన్నకేశవుడే
విష్ణువు, కళ్ళిపోతురాజే కాలభైరవుడు, అంకమ్మ శక్తే
అన్నపూర్ణ, గంగాధర మడుగే మణికర్ణికా మహాతీర్థము
కారెమపూడే పలనాటివారికి కాశి- అని అన్నాడు
నిజానికిది మెచ్చుకున్నట్లుగా ఉంది, మేళం చేస్తూన్న
ట్లున్నది. ఇలా చెప్పగలగడం ఒక్క శ్రీనాథునికే చెల్లు.

ఆ ఒక్కటి లేకపోతే జగత్తంతా చీకట్లు క్రమ్మినట్లే


ఆ ఒక్కటి లేకపోతే జగత్తంతా చీకట్లు క్రమ్మినట్లే




సాహితీమిత్రులారా!


స్త్రీల పట్ల వ్యామోహం చేత, వారియందు
అనురాగం కామం కలగిన పురుషులు స్రీలను
ఎలా ప్రశంసిస్తారో చెప్పెడి  ఈ శ్లోకం
భర్తృహరి శృంగారశతకంలోనిది చూడండి-

సతి ప్రదీపే, సత్యర్కౌ, సత్సు తారా రవిన్దుషు,
వినా మే మృగశాబాక్ష్యా తమోభూత మిదం జగత్


వెలుగివ్వడానికి పగటిపూట సూర్యుడు, రాత్రులలో చంద్రుడు,
నక్షత్రాలు, అన్నివేళలా అగ్నిహోత్రుడు, దీపాలు ఉన్నప్పటికీ
లేడిపిల్ల కన్నులను పోలిన స్త్రీ ఒక్కటి లేకపోవడం జరిగితే
జగత్తు అంతా చీకట్లు కమ్మినట్లే ఉంటుంది. ఓసి స్త్రీ దీపమా
నీవు కానరాక నేను జడుడినైతిని. నాకంటికి వెలుగునిచ్చే
నా ప్రేయసి లేని బ్రతుకేల - అని ఒక ప్రియుడు
తన ప్రియమిత్రునితో చెప్పుకొని వాపోతున్నాడు.
ఎన్ని వెలుగిచ్చేవున్నా స్త్రీ లేనపుడే మోహాంధత్వము
సంప్రాప్తము అని అంతరార్థం.

Monday, November 21, 2016

గగనము నీరుబుగ్గ కెనగా


గగనము నీరుబుగ్గ కెనగా




సాహితీమిత్రులారా!




మానవజీవితానికి ఋతుచక్రానికి ఉన్న
 అవినాభావ సంబంధం శ్రీకృష్ణదేవరాయలు
దర్శించినంతగా మరేకవీ వీక్షించలేదు.
వర్షాకాలంలో విష్ణుచిత్తుడు తన భార్య భోజనము వండగా
తీర్థయాత్రికులకు వడ్డించిన తీరు
ఈ పద్యంలో రాయలవారు
వర్ణించారు చూడండి-

గగనము నీటిబుగ్గ కెనగా జడిపట్టిననాళ్ళు భార్య కన్
పొగ సొరకుండ వారికెడపుంబొఱియ ల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్లొగసినకూరలు న్వడియము ల్వరుగు ల్పెరుఁగు న్ఘృతప్లుతిన్
                                                                 (ఆముక్తమాల్యద - 1- 80)


ఇది వర్షాకాల భోజనవిషయం-

వానాకాలంలో వంట చేసేప్పుడు
తనభార్య కళ్ళలో పొగ చొరకుండా
ఉండటానికి విష్ణుచిత్తుడు నీరు తీసివేసి
ఎండించిన టెంకాయ బోండాలను పొయ్యిలో
పెట్టించి వంట చేయించి ఇంటికి వచ్చిన
అతిథులకు ఆ టెంకాయ చిప్పలనే వరి అన్నము,
పప్పు, కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యితో
కూడిన భోజనం వడ్డించేవాడు- అని భావం.


ఒక యేట జిక్కె మీనము


ఒక యేట జిక్కె మీనము




సాహితీమిత్రులారా!


శ్రీకృష్ణునికి 8మంది  భార్యలు
వారిలో భద్రాదేవి ఒకరు.
ఈమె పేరున భద్రాపరిణము అని ఒకరు.
ముకుందవిలాసము అని ఒకరు కావ్యాలను వ్రాశారు.
ముకుందవిలాసమును గద్వాల ఆస్థానకవులలో
ప్రసిద్ధులైన కాణాదం పెద్దన సోమయాజిగారు వ్రాశారు.
అందులో భద్రాదేవిని గురించిన ఈ పద్యం చూడండి-

ఒక యేట జిక్కె మీనము
నొక నెలచే జిక్కె బద్మమొక పగటింటన్
వికలత జిక్కెం గుముదము
సకియ నయన సమంబు లగునె జడగతు లెపుడున్

                                                                            (ముకుందవిలాసము-1-129)

ఇది భద్రాదేవి కన్నులను వర్ణించిన పద్యం-

చేపలు, పద్మాలు, కలువలు ఆమె కనులకు సరికావట.
ఎంచేతనంటే చేపలు ఏటిలో చిక్కేవి(ఏడాదికే కృశిస్తాయి
అని వ్యంగ్యం), పద్మాలు నెలచేత(చంద్రునికి, ఒక నెలకు)
వాడిపోతాయి. కలువలు పగలు (ఒక్కరోజుకే) నశిస్తాయి.
కారణం అవి జడగతులు(జలచరాలు)
భద్రకన్నలు చలనంతో కూడినవి.

ఎంత మనోహర వర్ణన.

Sunday, November 20, 2016

చందమామరావే! జాబిల్లి రావే!


చందమామరావే! జాబిల్లి రావే!




సాహితీమిత్రులారా!




చందమామరావే జాబిల్లిరావే
- అనే పాటవిని
ఆనందించని తెలుగు పిల్లలు -
పాడని తల్లి లేదనే చెప్పవచ్చు.
దీన్ని అనుకరిస్తూ ఏనుగు లక్ష్మణకవిగారు
వ్రాసిన ఈ పద్యం చూడండి-

రావే పొందుగ చందమామ యిటకున్ రామయ్యతో నాడవే
పోవే కొండకు మంచి తియ్యని ఫలంబుల్ దేనెలున్ గోటివే
ల్దేవే రాఘవు పొత్తునం గుడువవే తేజంబుతో నంచు నీ
ఠేవ న్వెన్నెలలోన నొక్క చెలి యాడించున్ రఘూత్తంసునిన్

                                                                       (రామ విలాసము)

తుద కొక్కని కీయకున్న దొరకువు కీర్తుల్


తుద కొక్కని కీయకున్న దొరకువు కీర్తుల్




సాహితీమిత్రులారా!



ప్రతిరోజూ  బిక్షం పెట్టించుకొంటూ
ఒకరోజు పెట్టకపోతే నానాబూతులు తిడతారుకదా!
అలానే కవులూ దానమివ్వని వారిని ఎలా పద్యాలలో
ఈ సడించుకున్నారో కొన్ని పద్యాలను చూద్దాం-

ఎంత వేడినా, ఏమన్నా ఇవ్వని వారిని
చూసి ఒక కవి ఇలా అంటున్నాడు-

ఇల లోభి నెంత వేడిన
వలవని వెతలంతె కాని వా డిచ్చెడినే
జలమును వెస గిల కొట్టిన
కలుగునె నవనీతమాశగాక ----


పెద్దగా లేక పోయినా ఇచ్చేవాళ్ళున్నారు
ఉండీ ఇవ్వని వాళ్ళున్నారు
అటువంటి వారిని గురించి చెప్పిన పద్యం -

కలుగక యిచ్చెడు మనుజులు
తలవెండ్రుకలంతమంది తర్కింపంగా
కలిగియు నీయని యధములు
మొలవెండ్రుకలంతమంది మోహనరంగా!


చాలా మంది ఇస్తున్నపుడు
ఒక లోభి ఇవ్వకపోతేనేమి
గోష్ఠంలో పెక్కావులు పాలిస్తుండగా
ఒక బక్కావు ఇవ్వకపోతే ఏమిలే అంటున్నాడో కవి-

పెక్కావు లిచ్చుచో నొక
బక్కా వీకుండెనేని పాడికి కరవా
పెక్కు దొర లిచ్చుచో నొక
కుక్కల కొడు కీయకున్న కూటికి కొరవా!

దీనిలో ఇవ్వని వాని శునకపుత్రునితో పోల్చాడు
మరి అతని బాధ అలాంటిది.

ఒక కవి అంటాడు - దానమనేది పుట్టుకతోచేతిలో పుట్టే గుణం.
దాన్ని బలవంతాన చేతికి - అటూ - ఇటూ నులిమి
ఎక్కించటానికేమన్నా గాజువంటిదా?

పుట్టుక తో డుత కరమున
పుట్టవలెన్ - దానగుణము - పుట్టకపోతే
యిట్టట్టు నులిమి బలిమిని
బట్టింపను గాజ తాళ్ళపలి కొండ్రాజా!


ఇక్కడ మరో కవి అంటున్నాడు పదిమందికిచ్చి
పదకొండవవానికివ్వకపోతే వాడూరుకోడు
తిట్టి పోస్తాడు అంటున్నాడు చూడండి-

పదివేలమంది కిచ్చియు
తుది నొక్కని కీయకున్న దొరకువు కీర్తుల్
పదివేల నోము నోచిన
వదలదె యొక రంకు వంక వన్నియసుంకా!


పదివేల నోములు నోస్తే వచ్చిన పేరు,
ఒక రంకుతనపు అపకీర్తి వస్తే నిలువదు.
అలాగే దాత అన్నవాడు పేరుండాలంటే ఇస్తూనే ఉండాలి.


ఇలా ఎన్నెన్ని పద్యాలున్నాయో చెప్పలేము.
వీలైనపు చూస్తూ ఉందాం.

Saturday, November 19, 2016

ఏకయా ద్వౌ వినిశ్చిత్య



ఏకయా ద్వౌ వినిశ్చిత్య




సాహితీమిత్రులారా!


మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం కాక 
మరికొందరు ఆంధ్రీకరించారు. 
గద్వాలసంస్థానంనాధీశుడు సోమనాద్రి ఆస్థానంలో
ఉన్న వారు యథాశ్లోకానువాదము వ్రాశారు.
ఒక్కొక్కరు కొన్ని పర్వాలుగా తీసుకొని అనువదించారు. 
వారిలో కొటికెలపూడి వీరరాఘవకవి ఉద్యోగ, భీష్మ,ద్రోణ 
పర్వాలను ఆంధ్రీకరించారు. వీరు అనువదించిన 
విదురనీతిలోని ఒక పద్యాన్ని ఇక్కడ చూద్దాం-


మూలం-

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం చతుర్భి ర్వశే కురు,
సఞ్చ జిత్వా విదిత్వా షట్ సప్త హిత్వా సుఖీభవ
   
                                                             (సంస్కృత మహాభారతము - 5-33-43)

తిక్కన ఆంధ్రీకరణ-

ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి జేర్చి
మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిగి యేడు
విడిచి వర్తించువాడు వివేకధనుడు


కొటికెలపూడి వీరరాఘవకవిగారి ఆంధ్రీకరణ-

బుద్ధి యొక్కటి చేత బుడమి ధర్మాధర్మ
           ములు రెండు నిశ్చయస్ఫూర్తి దెలిసి
తన మిత్ర శాత్ర వోదాసీనులను మువ్వు
           రం దుపాయములు నాల్గందగించి
వారి నందర నాత్మవశుల గావించిన
           యట్లనె యైదింద్రియములు గెల్చి
ప్రఖ్యాతి సంధి విగ్రహములు మొదలుగా
           గల్గిన షడ్గుణంబుల నెఱింగి
వేట జూదంబు వెలదుల కూటమి మధు
పానము నయుక్త దానంబు పరుషదండ
పరుష వచనము లనెడి సప్త వ్యసనము
వెడలి సమధిక సుఖమొందు మీ వధీశ
                                   
                                                       (ఉద్యోగపర్వము 3వ ఆశ్వాసం)


మూలంలోని దానికి తిక్కన వ్రాసినదానికి
ఈ కవిగారు  తాత్పర్య విశదంగా(వ్యాఖ్య)
వ్రాసిన విధంగానే
ఆంధ్రీకరించాడు.

మనసు రూపును మాపు


మనసు రూపును మాపు




సాహితీమిత్రులారా!




గణపతి ముని రమణమహర్షులవారి
ఉపదేశసారాన్ని సంస్కృతంలోనూ,
తెలుగులోనూ రచించారు.
వారి తెలుగు ద్విపదలను
ఇక్కడ కొన్నిటిని చూద్దాం-


మనసు రూపును మాపు మహనీయ యోగి
తన రూప మందిన పని లేనివాడు

భావ భేదము కంటె పరుడు నేన నెడు
భావనా భేదమే పరమోత్తమ మగు

భావ బలంబుచే భావనాతీత
భావస్థితి మునులు పరభక్తియనిరి

నే నడంగిన చోటు నేను నే ననుచు
తానుగా దోచును తాను పూర్ణంబు

తా నుపాధి వదలి తన్నెరుంగుటయె
తానుగా వెలుగీశ తత్వ దర్శనము

తానుగా నునికియే తన్నెరుంగుటర
తానురెండెక్కడ తన్మయ నిష్ఠ

బంధ ముక్తులు లేని పరసుఖసిద్ధి
పొందును దైనిక పుణ్యచరితుడు

అహము లేనిది స్వయమను భూత నిష్ఠ
మహదుగ్రతపమనె మహి రమణ ఋషి

Friday, November 18, 2016

ఇది కూడ అలాగే ఉంటే బాగుండేది


ఇది కూడ అలాగే ఉంటే బాగుండేది



సాహితీమిత్రులారా!


ఒక ప్రియుడు
ప్రేయసితో
ఇలా అంటున్నాడు-

అనధిగత మనోరథస్య పూర్వం
శతగుణితేవ గతా మమ త్రియామా!
యదితు తవ సమాగమే తథైవ
ప్రసరతి సుభ్రు! తత: కృతీ భవేయమ్

ఓ సుందరీ! మన వియోగములో రాత్రులు
వందతో హేచ్చించినంతగా గడచెడివి కావు
మన సంయోగంలో కూడ అట్లే ఉన్నట్లితే
నేను అదృష్టవంతుని కాగలను
(కాని సంయోగంలో రాత్రులు
క్షణాలుగా గడచి పోతాయి)
 - అని భావం

ఎంత ధర్మాత్ముడు ధర్మరాజు


ఎంత ధర్మాత్ముడు ధర్మరాజు




సాహితీమిత్రులారా!



పాండవులు అరణ్యవాసం పూర్తి కాబోయే సమయంలో
పాండవులలో ధర్మరాజు తప్పమిగిలినవారు అందరూ
ఒక సరస్సులో నీరు త్రాగవద్దని చెప్పినా ఆ నీరు త్రాగి
మరణిస్తారు. ధర్మరాజు వారిని వెతుక్కుంటూ వచ్చి
విగతజీవులైన తమ్ములను చూచి విచారిస్తాడు.
ఆ సమయంలో ఆ సరస్సు నీరు త్రాగటానికి
ధర్మరాజు ప్రయత్నించగా తన తమ్ములకు చెప్పిన
విధంగానే ఒక అశరీరవాణి నీరు త్రాగవద్దని, నామాట
వినకుండా మీతమ్ములు త్రాగి మరణించారని చెబుతూ
తన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే నీరు త్రాగవచ్చు
నీ తమ్ములలో  ఒకరిని బ్రతికించుకోవచ్చని చెబుతుంది.
ధర్మరాజు సరేనని అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానాలిచ్చి
తృప్తి పరుస్తాడు. అప్పుడు నీతమ్ములలో
ఎవరిని బ్రతికించాలని అడగ్గా
నకులుని బ్రతికించమంటాడు.
అది అలా ఎందుకు కోరుకున్నావు
భీమార్జునులు ఉండగా
నకులుని ఎందుకు కోరుకున్నావు అని అడిగితే
ఈ విధంగా చెప్పాడు-

కుంతీ చైవతు మాద్రీచ
ద్వే భార్యేతు పితుర్మమ
ఉభే సపుత్రే స్యాతాంవై
ఇతి మే ధీయతే మతి:
                                         (మహాభారతం - యక్షప్రశ్నలు)

నాతండ్రికి "కుంతి", "మాద్రి" ఇద్దరు భార్యలు.
ఇద్దరికి సమానంగా కొడుకులు మిగులుగాక.
కుంతీపుత్రుడను నేను బ్రతికి ఉన్నట్లే
మాద్రి పెద్దకుమారుడు నకులుడు జీవించుగాక
- అని సమాధానమిచ్చాడు.

ఎంతటి ధర్మం.
ఇలాంటి అన్నలు ఈ కాలంలో ఉన్నారా?
ఏమో మరి.

Thursday, November 17, 2016

తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు


తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు




సాహితీమిత్రులారా!


ఆముక్తమాల్యదలో విష్ణుభక్తే కాక రాయల
వర్ణనా వైదగ్ధ్యానికి, లోకోత్తరమైన ఊహాశక్తి,
లోకజ్ఞతకూ నిలువెత్తు నిదర్శనంగా
నిలుస్తున్నదీ పద్యం తిలకింపుడు-


తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుషస్నాత ప్రయాత ద్విజా
వలి పండీకృత శాటు లన్సవి తదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గి న్వస బారువాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్
                 
                                                                                     (ఆముక్తమాల్యద - 1- 65)

విల్లిపుత్తూరు చుట్టూ మాగాణి పొలాలున్నాయి.
ఆ పొలాల్లో వరి ఏపుగా పెరింది.
ఆ వరిమళ్ళకు కాలువలు తీయబడ్డాయి.
ఆ పంటకాలువల ఒడ్డుపై రెక్కల్లో తలముడుచుకొని
ఉన్న బాతులను చూచి అవి ప్రొద్దున్నే స్నానం చేసి
మరిచి వెళ్ళిన బ్రాహ్మల ధోవతులనుకొంటూ
ఆ ఊరి కాపలావాళ్ళు వాటిని ఆ యజమానులకు
అప్పగిద్దామని కాలువలోకి దిగగా ఆ బాతులు
లేచి పారిపోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూచి
పొలాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు నవ్వుకొంటున్నారట
- అని పద్యభావం. 

కస్తూరీ తిలకం లలాటఫలకే


కస్తూరీ తిలకం లలాటఫలకే




సాహితీమిత్రులారా!


లీలాశుకుడను నామాంతరముగల
బిల్వమంగళుడు శ్రీకృష్ణకర్ణామృతము అనే
పేరుతో వ్రాయబడిన శ్రీకృష్ణుని లీలామృతమును
మూలభావం చెడకుండా అలాగే ఆంధ్రీకరించిన
వెలగపూడి వెంగన ఆంధ్రీకరణం
ఉదాహరణ చూడండి-


కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి

                                                                   (శ్రీకృష్ణలీలామృతము - 2- 109)

దీనికి వెలగపూడి వెంగనగారి ఆంధ్రీకరణ-

నుదుటం గస్తురి బొట్టు, నాసికతుద న్ముత్తెంబు, శ్రీగంధసం
పద నెమ్మేన, గరంబులం గటకముల్, వంశంబు హస్తాగ్రమం
దెదపై నిస్తుల కౌస్తుభంబు, నఱుతన్ శృంగారహారంబు నిం
పొదవం గృష్ణడు గోపికావృతుడు సర్వోత్కృష్ణుడై వర్ధిలున్


చూడండి పైశ్లోకానికీ
ఈ పద్యానికి తేడా
ఏమైనా గమనించగరేమో!

అది సంస్కృతం
ఇది తెలుగు అని మాత్రం అనకండీ.....

Wednesday, November 16, 2016

కలువల నిద్రలేపి, రతికాంతుని మాంద్యము వాపి


కలువల నిద్రలేపి, రతికాంతుని మాంద్యము వాపి




సాహితీమిత్రులారా!


బిల్హణీయమనే పేరుతో తెలుగులో 
పిండిపెద్ది కృష్ణస్వామి రచించారు. 
కానీ దీన్ని సింరాచార్యులవారు వ్రాసినట్లు 
పరిశోధకులు చెబుతున్నారు.
ఇది ఎవరువ్రాసినా ఇందులోని 
విషయం గురించి రెండు ముక్కలు-

బిల్హణుడు అనే సంస్కృతకవి ఉన్నాడు. 
అతని చరిత్ర అని కొందరి అభిప్రాయం. 
దీన్నే తెలుగులో యామినీపూర్ణతిలక అనే 
పేరుతో చెళ్ళపిళ్ళ నరసకవి రచించారు.


పాంచాలదేశానికి మదనాభిరాముడనే రాజు ఉండేవాడు. 
ఆయన కుమార్తె యామినీపూర్ణతిలక బహురూపవతి. 
ఆమెకు చిన్నతనంలోనే సంగీతం చెప్పించాడు.
తరువాత అలంకార సాహిత్యవిద్యలు నేర్పాలనుకున్నాడు.
అందుకుతగిన గురువును ఎంపిక చేశారు ఆయనే బిల్హణుడు 
ఈయనా అసాధారణరూపవంతుడు. వీరిద్దరినీ ఒక చోట చేరిస్తే 
ప్రమాదమని గుర్తించి రాజకుమార్తెకు గురువు గ్రుడ్డివాడని
(ఆమె గ్రుడ్డివారిని చూడదు) గురువుగారికి ఆమె కుష్టురోగని
(ఈయన కుష్టువారిని చూడడు) చెప్పి ఒక భవనంలో వారి మధ్య 
ఒకతెర ఏర్పాటుచేసి బోధనప్రారంభింపచేశాడు రాజు. 
రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పౌర్ణమి ఆరోజు కవిగారు 
భోజనానంతరం చంద్రుని చూచి ఆనందంతో వర్ణించ 
మొదలు పెట్టాడు అందులోని కొన్ని పద్యాలను చూద్దాం-


ఇవి బిల్హణీయములోని ద్వితీయాశ్వాసంలోనివి-

కలువల నిద్రలేపి, రతి కాంతుని మాంద్యము వాపి, పుష్కర
స్థలిఁ దిమిరంబుఁ జోపి, రతిఁ జాలని బాలల నూపి, దేవతా
వళి కమృతంబుఁజేపి, వర వాసవ దిక్పతి కుండలంబునై,
కలువల ఱేని మండలము కాంతిలుచున్నది తూర్పు కొండపై   -52


ఇది గగనంబు గాదు, నుతియింప సుధా వనరాశి గాని, మేల్
వదలని తారకా నిచయ పంక్తులు గా, వివి ఫేన ఖండముల్,
గుదురుగఁ జుట్టుకొన్న వరకుండలిగా, కిది చంద్ర బింబమా?
యిదియును జిహ్వ గాదు, పవళించిన విష్ణుఁడు గాని చూడఁగన్  -53


అరయ నభ స్తలం బనెడి యందపు గంధపు సానపై, రుచిన్
బరఁగిన చంద్ర బింబ మను బాగగు చందన రాశి పై పయిన్,
వెఱయఁగ వాసనార్థమయి నించిన కస్తురిఁ బోలి యొప్పె, శ్రీ
కరముగ నీ కళంక మనఁగా ననువై విలసిల్లు నెంతయున్     -54


అరయఁగ జంద్ర నీ యుదర మందలి నల్పు పటం బటంచుఁ, జా
మర మృగ మంచుఁ బల్కుదురు మానుగఁ గొందఱు, నే వచించెదన్
గరి గమ నాధర స్థలులఁ గమ్మదనంబు ఘటింప దాత, ని
న్నొరసి సుధా రసంబుఁ గొనెనొ! యది జాలము నాఁటనుండియున్   -55


జలధి పంకమంచు మహి చాయముఁ, దిహ్నము లేడిపిల్ల, కం
దళిత సురేంద్ర నీల మణి ధామ, మటంచు వచింతు రంద, ఱీ
కలువల ఱేనియందుఁగల కిందును నే ననుకొందు, రాత్రియం
దలవడ మ్రింగినట్టి తమలోక సంస్థ మటంచు నెంతయున్   -56


చందురుఁడన్ మృగాధిపతి శౌర్య విజృంభణ వృత్తిఁ బూని, పౌ
రందర ది గ్ధరేంద్ర కుహరంబునుండి రుచుల్ సెలంగఁగా
మందల కేఁగుదెంచుచుఁ, దమ: కరి కుంభము సాంశు రేఖికా
బృంద నఖంబులం జిదుమ, వీడిన ముత్యము లయ్యెఁ దారకల్   -57

ఇలాంటివి చేయకూడదు-2


ఇలాంటివి చేయకూడదు-2




సాహితీమిత్రులారా!


ఇలాంటివి చేయకూడదని
గతంలో కొన్ని చూశాం
ఇప్పుడు మరికొన్ని-
నీతిశాస్త్ర శ్లోకాలు చూడండి-

నాగ్ని ముఖే నో పథమ్
న్న గ్నాం నే కేతచస్త్రియమ్,
నామేధ్యం ప్రక్షిప్తే దగ్నే
నచపాదవు  ప్రతాపయేత్

నోటితో నిప్పును ఆర్పాలని ప్రత్నించరాదు.
వంటిమీద ఒక్క నూలుపోగైనా లేకుండా
సంపూర్ణంగా నగ్నంగా ఉన్న స్త్రీని చూడరాదు.
అపరిశుభ్రమైన వస్తువులు అగ్నిలో వేయకూడదు.
ఆ హోమ ధూమం చెడుపుచేస్తుంది.
పాదాల చలిని కాచుకోడానికి నిప్పును
ఉపయోగించరాదు - అని భావం.


నాశ్నీయాద్భార్యయా సార్థం
నైనా మక్షేత చాశ్నతీమ్,
క్షుదతీం జృంభమాణాంవా
న చాసీనాం యథాసుఖమ్

తన భార్య అయినప్పటికి -
ఆమెతో కలిసి ఒకే పాత్ర లేదా
ఒకే పళ్లెంలో భోజనం చేయకూడదు.
అంతేకాదు భార్య భోజనం చేసేటపుడు,
సుఖంగా కూర్చొని ఉన్నపుడు,
ఆవులిస్తూన్నపుడు, తుమ్ముతూన్నపుడు,
కాళ్ళు బారజాపి కూర్చున్నపుడు కూడా
భర్త ఆమె వంక చూడరాదు - అని భావం.

Tuesday, November 15, 2016

ఎండ నన దిఙ్ముఖములు రాఁజె


ఎండ నన దిఙ్ముఖములు రాఁజె




సాహితీమిత్రులారా!



శ్రీకృష్ణదేవరాయలవారు తన ఆముక్తమాల్యదలో 
ద్వితీయాశ్వాసంలో 48 పద్యం నుండి 70వ పద్యం 
వరకు మొత్తం 22 పద్యాలు వేసవి కాలవర్ణ తో సాగింగాయి. 
అందులోని ఒక పద్యం చూడండి-


నీర్ఝర ప్రబలవేణిక లింక జట్రాలఁ
         బేరినప్రాచి పెన్పేటు లెగసె
నెఱుకులు పడియనీ రివుర  గువ్వలఁ బట్టఁ
         బోయునీ రాడడఁ బొలము నెఱసె
సురగాలి దవదగ్ధ తరుపర్ణతతి రేఁపఁ
         బావురా లని డేగపదుపు దూఱె
నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
         బడిన యధ్వగ పంక్తి పొరలువెట్టె
క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవులగములయ్యె సకలదిషలుఁ
దెలుపులుగఁ దోఁచె నెండమావుల బయళ్ళు
గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె
                                                                                                      (2-46)


నీర్ఝర ప్రబలవేణిక లింక జట్రాలఁ
         బేరినప్రాచి పెన్పేటు లెగసె

కొండలపైనుండి దూకే సెయేళ్ళపాయలు ఎండిపోగా
వాటి మధ్యలో ఉన్న చట్టుబండలపై నీరు ఉన్నపుడు
పేరుకొని పోయిన పాకుడు(ప్రాచి) బిళ్ళలు బిళ్ళలుగా
పగిలిపోయింది.

నెఱుకులు పడియనీ రివుర  గువ్వలఁ బట్టఁ
         బోయునీ రాడడఁ బొలము నెఱసె
అడవిలో పల్వల సమూహాల్లోని నీరు (చిన్న గుంటలలోని నీరు)
ఆవిరై పోయాయి.(ఎరుకల వాళ్ళు గువ్వల కోసం అక్కడక్కడా
గుంటలు త్రవ్వి నీరు పోసి ఉంచుతారు గువ్వలు అక్కడ
వాలినపుడు పట్టుకోవడానికి అనుకూలంగా) ఆగుంటల్లోని
నీరు పొలాలలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి కాని చెరువుల్లోను
గుంటల్లోను నీరు ఎక్కడా ఒక్కబొట్టుకూడ లేదు.


సురగాలి దవదగ్ధ తరుపర్ణతతి రేఁపఁ
         బావురా లని డేగపదుపు దూఱె
కార్చిచ్చులో పడి చెట్లు కాలిపోగా కాలిన అస్థిపంజరాల్లా
ఆకులు సుడిగాలిలో అల్లాడుతున్నాయి. వాటిని చూచి గద్దలు
పావురాలనుకొని ఆ మాడిన ఆకుల గుంపుల్లోకి ప్రవేసిస్తున్నాయి.

నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
         బడిన యధ్వగ పంక్తి పొరలువెట్టె
చెట్లనీడల్లో మధ్యాహ్నవేళ ప్రయాణం చేస్తూ అలసిపోయిన
బాటసారులు ప్రక్కనే ఉన్న బావులలో ఇంతనీరు త్రాగి
సేదతీరి నిద్రపోయారు. ఆ నీడలు సూర్యగమనంతో
చలిస్తూంటే నిద్రలో ఉన్న బాటసారులు తెలియకుండానే
నీడతోపాటు దొర్లుతున్నారు.


క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవులగములయ్యె సకలదిషలుఁ
దెలుపులుగఁ దోఁచె నెండమావుల బయళ్ళు

అన్ని దిక్కులు తెల్లగా మెరిసిపోతున్నందున
అవి క్షేత్రపాలకుడు(కాలభైరవుడు) ఉతికి ఆరవేసిన
వస్త్రాల్లా ఉన్నాయి


గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె

సుకుమారువ ముఖాలు ఎండలో కంది పోవడం
సహజం కనుక దిక్కులనబడే స్త్రీలముఖాలు
కందిపోయినవో అన్నట్లుగా రాజుకున్నాయి
దిగంతాలలో కార్చిచ్చు క్రమ్ముకొన్నది.

రాయలసీమలో ఎండలు ఎంతగా ఉంటాయో
దీనిలో వర్ణించిన సహజరీతి తెలుపుతున్నది

తృప్తిం జెందని మనుజుడు


తృప్తిం జెందని మనుజుడు




సాహితీమిత్రులారా!


తృప్తిం జెందని మనుజుడు
సప్తద్వీపంబుల చొక్కంబడునే
- అని భాగవతసూక్తి.
తృప్తిలేని వానికి సప్తద్వీపాలిచ్చినా
వానికి తృప్తి కలగదట.
అలాంటిదే ఈ శ్లోకం చూడండి-
భర్తృహరి వైరాగ్యశతకంలోనిది-

ఉత్ఖాతం నిధిశఙ్కయా క్షితితలం, ధ్మాతా గిరేర్ధాతవో,
నిస్తీర్ణస్సరితాంపతి, ర్నృపతయో యత్నేన సంతోషితా:,
మన్త్రారాధనతత్పరేణ మనసా నీతా: శ్మశానే నిశా:
ప్రాప్త: కాణవ రాటకోపి న మయా తృష్ణే సకామా భవ


నిధి నిక్షేపాలను పూర్వీకులెవరో దాచి
ఉంచుతారని విని ఆశగా నేల చెడత్రవ్వాను.
బంగారం మీది వ్యామోహంతో కొండలమీద
లభ్యమయ్యే మణిశిల వంటి ధాతువుల్ని కరిగించాను.
ఎక్కడో దూరదేశాల్లో సంపదలున్నాయంటే ఆత్రంగా
సముద్రాల మీదికి ప్రయాసతో ప్రయాణించి,
రాజుల కొలువుచేసి వార్నికనిపెట్టి
సదా ఇష్టుడిగా మెలిగాను.
మంత్రాలతో ఎక్కడెక్కడి
ఐశ్వర్యాలూ వశమౌతాయని
ఆశించి రాత్రులెన్నో
శ్మశానాల్లో గడిపాను.
ఏది గుడ్డిగవ్వయినా
దొరికిందా?
ఈ తపన ఇంకా చాల్లే - అని భావం.

Monday, November 14, 2016

ఉపకార్ నిరాలే హోతేహై


ఉపకార్ నిరాలే హోతేహై



సాహితీమిత్రులారా!


నజీర్ రచించిన
జనమ్ కన్హయ్యాజీ(శ్రీకృష్ణజననం)
నుండి కొన్ని పద్యాలు చూడండి-

హైరీతి జనమ్ కీ యూఁ హోతీ జిన్ ఘర్మే బాలా హోతాహై
ఉస్ మండల్ మే హర్ మన్ భీతర్ సుఖ్ చైన్ దో బాలాహోతాహై
సబ్ బాత్ వ్యధాకీ భూలేహైఁ జబ్ భోలా బాలా హోతాహై
ఆనంద్ మండలీ బాజత్ హై, నిత్ భవన్ ఉజాలా హోతాహై
   యూఁ నేక్ న ఛత్తర్ లేతేహై, ఇస్ దున్యామే సంసార్ జనమ్
   పర్ ఉన్నకే ఔర్ హీ లచ్చన్ హైఁ, జబ్ లేతేహై అవతార్ జనమ్

ఏ ఇంట శిశువు జన్మిస్తుందో ఆయింటివారి
హృదయాలలో సంతోషాలు ఇనుమడిస్తాయి-
అమాయిక శిశువు జన్మించినంత మాత్రాన్నే
తమ వ్యధలను మఱచిపోతారు.
ఆనంద వాద్యాలు చెలగుతాయి.
భవనం నిత్యప్రకాశమవుతుంది.
మంచివారు మంచి నక్షత్రంలోనే జన్మిస్తారు.
కానీ అవతారపురుషుల జన్మకాల నక్షత్రమేవేరు.


శుభ్ సా అత్ సే యూఁ దునియామే అవతార్ గర్భమే ఆతేహైఁ
జో నారద్ మునిహైఁ ధ్యాన్ భలీ సబ్ ఉస్కా ఖేద్ బతాతేహైఁ
వోనేక్ ముహూర్త్ సే జిస్ దమ్ సృష్టీమే జన్మే జాతేహైఁ
జో లీలా రచ్నీ హోతీహై, వో రూప్ యే దిఖ్లా జాతేహైఁ
   యూఁ దేఖ్నే మే ఔర్ కహ్నేమే వో రూప్ తో బాలేహోతాహైఁ
   పర్ బాలేహీపన్ మే ఉన్కే ఉపకార్ నిరాలే హోతాహై

శుభ సమయంలో
అవతారపురుషులు గర్భస్థులవుతారు.
ధ్యానపరుడగు నారదముని
ఆ రహస్యం వెల్లడి చేస్తాడు.
శుభనక్షత్రంలో జన్మించి
తాము రచింపదలచిన లీల
ఆ రూపమునే రచిస్తారు.
చూడటానికి అనుకోడానికి
వారు బాలరూపులే,
కానీ ఆ రూపమునే వారు చేసే
ఉపకార కార్యాలు అపురూపాలు.

ఇలాంటివి చేయకూడదు


ఇలాంటివి చేయకూడదు




సాహితీమిత్రులారా!


ఈ నీతిశాస్త్ర శ్లోకాలను చూడండి-

న చ సత్వేషు గర్తేషు
న గచ్ఛ న్నాపిచ స్థిత:
న నదీతీర మాసాద్య
న చ పర్వత మస్తకే

జంతువులు నివసించే బొరియలలోనూ,
నడక సాగిస్తూనూ, ఏదైనా ఒక చోట నిల్చిగానీ,
నదీతీరాలలోనూ, పర్వత శిఖరాల మీదనూ
మలమూత్రాదులు విసర్జించరాదు - అని భావం.

వాయ్యగ్ని విప్రానాదిత్య
మప: వశ్యం స్తథైవ గా:
స కదాచన కుర్వీత
విణ్మూత్రస్య విసర్జనమ్

గాలికి ఎదురుగా, నిప్పుకు చేరువుగా,
నీటికి సమీపంగా, ఆవులకు - బ్రాహ్మణునికి,
సూర్యునికి అభిముఖంగా గాని,
ఇక్కడ చెప్పబడిన వాటిని చూస్తూగాని
మలమూత్రాదులు విసర్జించకూడదు.
పాపం కలగడం మాత్రమేగాక
తేజస్సు నశించి అమంగళం
కలుగుతుంది- అని భావం.

Sunday, November 13, 2016

ఎలాంటివారికైనా ఉన్నతులుగా చేసేవి?


ఎలాంటివారికైనా ఉన్నతులుగా చేసేవి?




సాహితీమిత్రులారా!


ఉన్నత స్థితిని చేరడానికి
ఏవైనా కొన్నైనా సుగుణాలుండాలికదా!
అలాంటివాటిని చెప్పే నీతిశాస్త్ర శ్లోకం చూడండి-


కుర్వాణ: కృత మమితాం మితం శయాన:
భుంజానో మిత మమితం పరం దాన:
జానానో బహు విషయాన్ మితం బ్రువాణ:
ఉత్కర్షం భువి లభతే స వర్ధమాన:


అతిగా శ్రమించడం, మితంగా నిద్రించటం,
తాను స్వల్పంగా భుజించడం, ఇతరులకు
అధికంగా తిన్పించటం, ఎనేనో విషయాలు
తెలిసినప్పటికీ, తెలియనివే అధికంగా
ఉన్నాయని గ్రహించుకోవడం- అనే సుగుణాలు
ఎంతటివారినైనా ఉన్నతులుగా తీర్చిదిద్ది,
వృద్ధిలోకి వచ్చేందుకు దోహదపడతాయి
- అని భావం.

మా తెలుగువాడు


మా  తెలుగువాడు



సాహితీమిత్రులారా!





వసంతరాయ కృష్ణారావుగారు
తెలుగువాడిని గురించి వ్రాసిన
ఈ సీసపద్యం చూడండి-


కలము ఖడ్గము పట్టగల నేర్పు రూపించి 
             వెలుగొందు వాడు మా తెలుగువాడు 
నిర్మలం బగునట్టి ధర్మము పాటించి 
             దీపించువాడు మా తెలుగువాడు
మాతృదేశ విముక్తి మహిత యజ్ఞంబున 
             విలసిల్లువాడు మాతెలుగువాడు
విహితమౌ సహనంపు సహజీవనంబును 
             వెలయించువాడు మా తెలుగువాడు
ఆంధ్రుడే కద భరత భాగ్యాధినేత 
ఆంధ్రుడే యగు విశ్వవిఖ్యాతమూర్తి
ఉజ్వ లాదర్శ రాష్ట్ర మహోత్సవమును
జరుపుచున్నాము సమధికోత్సహ గరిమ


ఇందులో చక్కని శైలి, లలిత పద ప్రయోగ నైపుణి,
సమయోచిత పదగుంభనం, రాష్ట్రభక్తి, దైవభక్తి
కృష్ణారావుగారి కవిత్వ వైఖరికి నవ్య నాద మాధురిని
కూర్చయని చెప్పవచ్చు.

Saturday, November 12, 2016

కోరిక దేన్ని హరించివేస్తుంది?


కోరిక దేన్ని హరించివేస్తుంది?


సాహితీమిత్రులారా!




ఒక్కోదానివల్ల ఒక్కొకటి నశించిపోతుంటాయి
అని చెప్పే నీతిశాస్త్రశ్లోకం చూడండి-

జరారూపం హరతి ధైర్య మాశా
మృత్యు: ప్రాణాన్ ధర్మచర్యా మసూయా
క్రోధ: శ్రియం శీల మనార్యనేవా
హ్రియం కామ: సర్వమేవాభిమాన:


లోకంలో ఒక్కొక్క చెడువల్ల ఒక్కొక్క
మంచి కనుమరుగై పోతూఉంటుంది
ఈ దేహానికున్న రూపాన్ని ముసలితనం
ఆక్రమించుకుంటుంది. ధైర్యాన్ని
లోబరుచుకుంటుంది ఆశ.
ప్రాణులను వశం చేసుకుంటుంది మృత్యువు.
ధర్మాచరణ శూన్యతకు అసూయకారణ మవుతూన్నది.
సంపదలను కోపం నాశనం చేస్తోంది. ఇలా
ఒక్కొక్కటి కొన్ని చెడుల వల్ల కనుమరుగైపోతూన్నాయి.
అయోగ్యుల వద్ద కొలువు సత్ప్రవర్తనను దెబ్బతీస్తున్నది.
కోరిక సిగ్గును హరించి వేస్తున్నది. దురభిమానం
సకల సద్గుణాలనూ సంహరించి వేస్తున్నది - అని భావం.