ఎవరి అనుగ్రహం కూడా భయంకరము?
సాహితీమిత్రులారా!
ఈ జగత్తే క్షణం క్షణం భయం భయం
అలాటిది అనుగ్రహం కూడా భయంకరమైనదేదో
ఈ శ్లోకం చెబుతున్ని చూడండి.
క్షణే తుష్ట: క్షణే రుష్టు: వితుష్టిశ్చ క్షణేక్షణే
అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకర:
స్థిరచిత్తంలేనివాడు క్షణంలో సంతోషించును,
మరుక్షణములో కోపించును.
ప్రతిక్షణంలోను అసంతృప్తి ఉంటుంది.
అలాంటి స్థిరచిత్తంలేనివాని అనుగ్రహం కూడా
భయంకరమే.
No comments:
Post a Comment