విధవ అంటే ఎవరు?
సాహితీమిత్రులారా!
భర్త పోయిన స్త్రీని విధవ అనటం పరిపాటి
కాని కాలాంతరంలో అది నిందార్థంగా తిట్టుగా
మారిపోయింది. పనికిరానివాడు అనే అర్థంలో
వాడుకలోకొచ్చింది. వాడు వట్టి వెధవండి అంటూ
ఎందుకూ పనికిరానివాడు అనే అర్థంలో వాడడం సరే
ఇంకా ఎవరెవరు వెధవలో ఏకంగా ఒక కవిగారు
సీసపద్యమే చెప్పారు చూడండి-
పోకలు నములుచు నాకులు చేబూని
సున్నమడుగువాడు శుద్ధ విధవ
ఇద్దరు నొకచోట నేకాంత మాడంగ
వద్ద చేరెడు వాడు వట్టి విధవ
ఆలితో కలహించి యాకలి కాదని
పస్తు పంచెచివాడు పంద విధవ
దారిద్ర్యమున నుండి తన పూర్వ సంపద
లూరక తలచు వాడుత్త విధవ
ఇట్టి విధవల గడద్రోచి యెసకమెసగ
కావు మీ వేడ్క విబుధుల కమలనాభ
పాహి శ్రీపార్థసారధి పరమపురుష
తిరుమలద్దంకి మల్లికేశ్వర గిరీశ!
ఆకులు, పోకలు తాను తెచ్చుకొని
సున్నం ప్రక్కవారిని అడిగేవాడు ఒక విధవ.
ఎవరు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకునేప్పుడు
వారి దగ్గర చేరేవాడు మరొక విధవ.
పెండ్లముతో పోట్లాడి ఆకలిగా లేదని
ఉపవాసం ఉండేవాడు ఒక విధవ.
ఇప్పుడు పేదవాడుగా ఉంటూ గతంలోని
తన సంపదలను మాటిమాటికి తలచేవాడొక విధవ
ఓ కమలనాభా! పార్థసారధీ! అద్దంకి తిరుమల గిరి స్వామీ!
ఇటువంటి విధవలందరిని నిర్మూలించి పండితులైన
సత్పురుషులను కాపాడు - అని కవి ప్రార్థించాడు.
No comments:
Post a Comment