Sunday, July 31, 2016

మన తెనుగుసీమ


మన తెనుగుసీమ


సాహితీమిత్రులారా!

రాష్ట్ర భక్తిభరితమైన హృదయంతో
ఆదిభట్ల నారాయణదాసుగారు
చెప్పిన పద్యం చూడండి.

పాడిపంటలనెల్ల నాడులన్ మించిన దనయము మన మంచి తెనుగుసీమ
కలిమికి నలువనెచ్చెలి కున్కిపట్టు నిచ్చలు మన పుట్టిన  తెలుగు సీమ
వేయేండ్లెదురు లేక రాయలు మొదలు రేండ్లలరిన మన మేటి తెలుగుసీమ
తిక్కన పోతన్న తిమ్మన్న వెలసిన మన గొప్ప తెలుగు సీమ
చెలగు నన్నియిమ్ముల మన తెలుగుసీమ
చెలగు పెద్ద యేరుల మన తెలుగుసీమ
తనరు పొడవు గుడుల మన తెనుగుసీమ
పొనరు వేల్పు కొండల మన తెనుగుసీమ

వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!


వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!


సాహితీమిత్రులారా!

కొందరి నోటివాక్కు అమోఘం.
శాపానుగ్రహదక్షులైన కవిపుంగవులు అనేకులు ఉన్నారు
వారిలో గోగుపాటి కూర్మనాథకవి ఒకరు.
ఒకమారు సింహాచల క్షేత్రం మీదకు మహమ్మదీయ సేనలు రాగా
గోగుపాటి కూర్మనాథకవి ఆక్రోశం చెందగా అప్రయత్నంగా
"వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!" అనే మకుటంతో
సీసాలు దొర్లుకుంటూ  కవిగారి నోటి వెంట ధారాపాతంగా వచ్చాయట.
ఆ భావతీవ్రతలో స్వామిని ఆయన బ్రతిమలాడాడు,
ఆక్షేపించాడు, ఎద్దేవా చేశాడు.
వాటిలో ఒకటి ........

పాశ్చత్యుల నమాజుపై బుద్ధి పుట్టెనో మౌనుల జపముపై మనము రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో విప్ర యజ్ఞములపై విసుగు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో దేవతా ప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో భక్తి నిత్యోత్సవ పరతమాని
వాండ్రు దుర్మార్గులయ్యయో వ్రతము చెడ్డ 
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరగద్రోలు
పారసీకాధిపుల పటాపంచలుగను
వైరి హరరంహ!  సింహాద్రి నారసింహ!

అభీర గృహముల అర కాగిన పామీగడల్ వడి దిగమ్రింగగలవు.
కాని యవనులపై వడి పారలేవు. కబళమున నోరు తెరతువు,
కళ్ళెమన్న మోము త్రిప్పు హయగ్రీవమూర్తి వహహ! - అని ఆక్షేపించాడు

పాలియ్యవచ్చిన భామిని ప్రాణాలు అపహరించినట్లు కాదయ్యా చేతనైతే
ఈ తురకలను నాశనం చేయమని వేడుకొన్నాడు.

మేము నిన్ను అగ్రహారాలను ఇవ్వమని అడగడంలేదు.
కరిహయాదుల మేము కాంక్షించలేదు.
జనులను దోచుకోకుండా చూడమనే మా ప్రార్థన - అని అంటూ
67 పద్యాలు పూర్తి చేసేసరికి కొన్ని లక్షల, కోట్ల గండుతుమ్మెదలు
కొండలోనుండి బయలుదేరి ప్రళయకాలంలో కారుమేఘాల్లా
కమ్ముకుని తురకల దండుపైకి మూగి, కండలు ఊడేట్లుగా కరచి,
నెత్తురు పీల్చి వారిని విశాఖపట్టణం దాకా బ్రతుకుజీవుడా! -  అని పారిపోయేలా
చేశాయట.
ఆ దృశ్యాన్ని చూచిన కూర్మనాథుడు ఇలా వర్ణించాడు.

కారుణ్య దృష్టిచే కని మమ్ము రక్షింప నీరజేక్షణ నీవు నేడు పంప
పారసీకుల దండుపై కొండలోనుండి గండుతుమ్మెదలు నుద్దండ లీల
కల్పాంతమున మిన్ను గప్పి భీరకమైన కారుమేఘంబులు గవిసినట్లు
తాకి బోరున రక్తధారలు దొరగగా కరచి నెత్తురు పీల్చి కండలెల్ల
నూడిపడ నుక్కు మూతులవాడి మెరసి
చించి చెండాడి వధియించె చిత్రముగను
నొక్కొకని చుట్టుముట్టి బల్మిక్కుటముగ
వైరి హరరంహ!  సింహాద్రి నారసింహ!

ఈవిధంగా
అనేకవిధాల నరసింహస్వామిని స్తుతిస్తూ ..................
మిగిలిన పద్యాలను పూర్తి చేశాడట.

Saturday, July 30, 2016

ఆశ చేసిన పని ఇది


ఆశ చేసిన పని ఇది


సాహితీమిత్రులారా!

ఒకానొక కవి రాజసన్మానము పొంది తృప్తిపడక
దొడ్డిసంభావనకు(సంతర్పణలాంటిది) వెళ్ళాడట
అక్కడి తొక్కిసలాటలో అక్కడివారు త్రోయగా
సంతర్పణ గంజిబురదలో జారి పడ్డాడట.
బట్టలన్నీ బురదైపోయాయి.
అది చూచి రాజు "కవివర్యా! ఇదియేమి?" అని ప్రశ్నించాడట.
దానికి కవి చెప్పిన శ్లోకం ఇది-

క్షుత్ - తృట్ - ఆశా కుటుంబిన్య: మయిజీవతి నాన్యగా:
తా సా మంత్యా ప్రియతమా తస్యా: శృంగార చేష్టితమ్

రాజా! నాకు ఆకలి - దాహం- ఆశ -  అనే
ముగ్గురు భార్యలు ఉన్నారు.
వారు నేను బ్రతికి ఉండగా విడిచిపోరు.
వారిలో చివరి ఆమె నాకు చాలా ప్రియమైనది.
ఆమె చేసిన శృంగార చేష్టయిది - అన్నాడు కవి.

కవి క్రింద పడినా వాస్తవాన్ని 
ఎంత చమత్కారంగా! చెప్పాడు.

ముక్తింగతా: రామ పదానుషంగాత్


ముక్తింగతా: రామ పదానుషంగాత్


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.
తెలిసి అనుకొన్నా! తెలియక అనుకొన్నా!
శివా! శివా! అని తలచుకొంటే మోక్షం(కైలాసం)
ప్రాప్తిస్తుందంటారు - పెద్దలు.
అలాంటిదే ఈ శ్లోకం.

వనే చరామ: వనితాన్ హరామ:
నదీన్ తరామ: నభయం స్మరామ:
ఇతీరయన్త సతతం కిరాతా:
ముక్తిం గతా: రామ పదానుషంగాత్

వనంలో సంచరింతము(వనే చరామ: )
వనితలను హరింతము(వనితాన్ హరామ:)
నదుల దాటుదము(నదీన్ తరామ:)
భయమును స్మరింపవద్దు(నభయం స్మరామ:)
- అని తమలో తాము ఎల్లప్పుడు పలకటంతో అప్రయత్నంగా
రామ - పదసంబంధం తో కిరాతులు మోక్షం పొందారు - అని భావం.

Friday, July 29, 2016

సాహితీ నందనం: వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత

సాహితీ నందనం: వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత: వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత సాహితీమిత్రులారా! ఒకమారు శ్రీకృష్ణదేవరాయలు, పట్టపురాణి తిరుమలాదేవి కంచివరదరాజస్వామిని సేవించటానిక...

చిత్రకవితా ప్రపంచం: క: పరత్రైతి పూజ్యతామ్

చిత్రకవితా ప్రపంచం: క: పరత్రైతి పూజ్యతామ్: క: పరత్రైతి పూజ్యతామ్ సాహితీమిత్రులారా! ఈ శ్లోకం గమనించండి. దీనిలోనే ప్రశ్న - ఉత్తరం రెండూ ఉన్నాయి కావున దీన్ని ప్రశ్నోత్తర చిత్...

ద్వాభ్యాం విహీనో బధిరస్సఏవ!


ద్వాభ్యాం విహీనో బధిరస్సఏవ!


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.

సంగీత సాహిత్య రసానుభూత్యై
కర్ణద్వయం కల్పితవాన్ విధాతా
ఏకేన హీన: పునరేక కర్ణో
ద్వాభ్యాం విహీనో బధిరస్సఏవ

సంగీత - సాహిత్యముల అనుభూతికే బ్రహ్మదేవుడు రెండు చెవులు పెట్టినాడు.
సంగీతానుభవ శక్తిలేనివాడు ఒక చెవిని కోల్పోయినట్లే.
సాహిత్యానుభూతి తెలియనివాడు ఆ రెండవ చెవినీ కోల్పోయినట్లే.
రెండిటియందు ఆసక్తి లేనివాడే నిజమైన బధిరుడు(చెవిటివాడు)!

వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత


వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత


సాహితీమిత్రులారా!

ఒకమారు శ్రీకృష్ణదేవరాయలు, పట్టపురాణి తిరుమలాదేవి
కంచివరదరాజస్వామిని సేవించటానికి వెళ్ళారట.
తిరుమలాదేవి వరదరాజస్వామికి నమస్కరిస్తోంది.
ఆ గుడి లో ఆచార్య నరసింహదీక్షితన్ అనే గొప్ప
పండిత పూజారి తిరుమలదేవిని చూచి ఆశువుగా
ఈ క్రింది శ్లోకం చెప్పారట.
చూడండి.

కాంచిత్ కాంచన గౌరాంగీం వీక్ష్య సాక్షాదివ శ్రియం
వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత

బంగారం వంటి పసుపుపచ్చని శరీరంతో సాక్షాత్తూ
లక్ష్మిదేవిలా ఉన్న తిరిమలదేవిని చూచి,
వరదరాజ స్వామికి అనుమానం వచ్చి,
తన గుండెలను తడిమి చూసుకున్నాడట.
(తన గుండెలమీద ఉండవలసిన లక్ష్మిదేవి దూరంగా అక్కడ
నిలబడిందేమిటని అనుమానం వచ్చింది స్వామికి)

ఎంత చక్కగా
చమత్కారంగా ఉంది ఈ శ్లోకం.

Thursday, July 28, 2016

కావ్యేన హన్యతే శాస్త్రం


కావ్యేన హన్యతే శాస్త్రం


సాహితీమిత్రులారా!


ప్రపంచంలో అన్నిటి కంటె మిన్న అయిన ఆనందం ఏదో !
ఈ శ్లోకం వివరిస్తుంది
చూడండి.


కావ్యేన హన్యతే శాస్త్రం, కావ్యం గీతేన హన్యతే
గీతం భోగవిలాసేన క్షుధయా సో2పి హన్యతే

శాస్త్రానందం ప్రియమైనది. దానికంటే ప్రియమైనది కావ్యానందం.
సంగీతానందం దానికంటే కూడా శ్రేష్ఠమైనది.
దానికంటే ప్రబలమైనది విషయానందం.
శాస్త్రాన్ని, కావ్యాన్ని, సంగీతాన్ని, అన్నిటిని వెనక్కు నెట్టేస్తుంది -
కామిని.
కాని,
వీటన్నిటిని కూడా ఓడించేది మరొకటుంది
అదే క్షుధ.
కావున భోజనానందం అన్నిటికంటే
 ప్రబలమైనదిగా తేల్చింది ఈ శ్లోకం.
ఈ శ్లోకమేకాదు మీరు చెప్పండి.

ఆర్యా భార్యా వశీకురుతే!


ఆర్యా భార్యా వశీకురుతే!


సాహితీమిత్రులారా!

 కవిత - కామినుల గురించిన
ఈ చమత్కార శ్లోకం చూడండి.

సరసా సాలంకారా సుపదన్యాసా సువర్ణమయమూర్తి:
యమకశ్లేషానందై: ఆర్యా భార్యా వశీకురుతే

(కవితకాని, కామినికాని, రసమయి, అలంకృత,
కోమలపద విన్యాసం కలది, సుందర వర్ణ యుక్తమైనది
(కవిత్వం విషయంలో మంచి అక్షరాలు కలిగినది.
కామిని విషయంలో మంచి మేని ఛాయకలది.)
యమక - శ్లేషల ద్వారా(కవిత్వం విషయంలో
యమక, శ్లేష లాంటి కావ్యాలంకారాల ద్వారా,
కామిని విషయంలో జంటగా ఉండటంద్వారా,
తన గాఢాలింగనాల ద్వారా)ఆనందం కలిగించేది
అయినపుడే వశపరచుకోగలుగుతుంది.)

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము


సాహితీమిత్రులారా!


పంతాలేలను నీకునాకు నిక - నే పట్టింపులున్ వద్దు - యీ
చింతాసాగరమీదు దారి యెదియో చెప్పంగనే విందు - నీ 
పొంతన్నే వసింపగా యెటులనే పొల్పారు కార్యంబు - నే
నెంతల్ సేయగనౌనొ చెప్పుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!                  - 16

ఏవ్యాపారము నందు లోబడక - నీవే నాకునౌనంచు, యే
దివ్యానందముగోరి చేరితినొ! నీధీశక్తిం జూపించి, నా
కవ్యక్తంబగు నట్టి దేదొ యిడు - కాంక్షల్దీరు లేకున్న - యే
లీ వ్యాపార మిదంత యింతగను షిర్దీ సాయినాథ ప్రభూ!               - 17

కాదన్నన్ విడు వాడనా! యెవరు - నీ కారీతి వాక్రుచ్చిరో
యోదంబందున బడ్డ యేన్గుగతిగా నందున్ గాదె నీకేమి - నా
బాధల్ యెక్కవు చూచుచుంటతగునా?  పల్మారు పిల్వంగ, నీ
కేదేదో యయినట్లు నుంటివిటు షిర్దీ సాయినాథ ప్రభూ!                - 18

ఆయెంబోయెను మంతనాలు సతమున్ వ్యాయావమమున్ జేయ, యీ
నాయందంతటి శక్తిలేదు - రుజలా నన్నాక్రమించెన్ - వృధా
నే యాచించుట నిన్ను యెన్నగను - నిన్ నిందింపగానేల - యా
ధ్యేయంబెద్దియొ! చెప్పు మా యిపుడె? షిర్దీ సాయినాథ ప్రభూ!     - 19

పారావారము నీదుచుంటిని - ప్రభావంబింత జూపించి - యే
తీరంబో! యొకదాని జేర్చుము - కృపాబ్ధీ! నన్ను కావంగ, నీ
వే, రారమ్మిక, యాలసింప తగునా? వేదార్థ! విన్నావు కా
దే రుచ్యంబగునే? సహింపగను షిర్దీ సాయినాథ ప్రభూ!               - 20

Wednesday, July 27, 2016

సంకోచితం వదన మంబురుహై రతీవ!


సంకోచితం వదన మంబురుహై రతీవ!


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.

లక్ష్మా: నివాస ఇతి వారిరుహాం ప్రసిద్ధి:
అన్వేషితా: కతిపయా విరళాస్తు సన్తి
రాజ్ఞి ప్రసారిత కరే కిమహం దదామి
సంకోచితం వదన మంబురుహై రతీవ!

పద్మాలు లక్ష్మీనివాసాలని ప్రసిద్ధి.
ఈ విషయాన్ని విమర్శించినవారు తక్కువ.
రాజంతటివాడు (చంద్రుడంతటివాడు) కరములు(కిరణాలు)
చాచగా మేము ఏమియ్యగలం? -  అని
పద్మములు ముఖం ముడుచుకొన్నవి.
(చంద్రకిరణాలు పడటంతో పద్మాలు ముడుచుకొంటాయికదా!)

తస్మాద్భావోహి కారణమ్


తస్మాద్భావోహి కారణమ్


సాహితీమిత్రులారా!

మనసును గురించి మనపూర్వులు
చెప్పిన కొన్ని శ్లోకాలు చూడండి.


న దేవో విద్యతే కాష్ఠే, నపాషాణే, నమృణ్మయే
భావేషు విద్యతే దేవ, తస్మాదభావోహి కారణమ్

(దైవం కర్రలోనూ, రాతిలోనూ,
 మట్టిలోనూ లేదు.
మనసులోనే ఉంది. అందుచే
మనసే అన్నిటికి కారణం)

మనసైవ కృతం పాపం, న శరీర కృత కృతమ్
యేనై వాలింగితా కాంతా, తానై వాలింగితా సుతా!

(మనసు చేత చేసేదే పాపంగాని, శరీరం చేత చేసేది కాదు.
భార్యను ఆలింగనం చేసుకునే శరీరమే కుమార్తెను ఆలింగనం
చేసుకుంటుంది కదా!)


దధి మధురం, మధుమధురం, ద్రాక్షామధురా, సుధాపి మధురైవ
తస్య తదేవహి మధురం యస్య మనోయత్ర సంలగ్నమ్

(పెరుగు తీపి, తేనె తీపి, ద్రాక్ష తీపి, అమృతం తీపి,
ఎవడి మనసు దేనిమీద లగ్నమై ఉంటుందో వానికి అదే తీపి.)

Tuesday, July 26, 2016

అడుగుదమ్ము లనం గని మ్రొక్క వచ్చునో


అడుగుదమ్ము లనం గని మ్రొక్క వచ్చునో


సాహితీమిత్రులారా!


శ్రీపాద పృష్ణమూర్తి గారు తన నైషధీయచరిత్రలో
దమయంతి సౌందర్యాన్ని వర్ణించే
సందర్భములోని ఈ పద్యం చూడండి.

తలఁకక మమ్ము రే ల్చెఱచుదాయను గెల్చియ వానిచుట్టలన్
మెలపితి మంటి కొల్చి మన, మీరును దొల్లిటిబామునందు మా
తలఁబడి నా రటం చడుగుఁదమ్ము లనం గని మ్రొక్క వచ్చునో
వెలయఁగఁ దేం ట్లనం దగియె విప్పినయాసకిసోఁగ పెన్నెఱుల్
                                                  (నైషధీయచరిత్రము - ద్వితీయతరంగము - 68)


ఈ పద్యంలో పాదపద్మాలు చెబుతుంటే
తుమ్మెదలు వింటున్నాయి.
మేము బలాఢ్యులము.
రాత్రులలో మమ్ములను చెఱచెడి శత్రువు చంద్రుడు.
వాని గెల్చి వాని చుట్టాల(నక్షత్రాల) మమ్ము కొలిచి సేవించేట్లు చేశాము.
నఖరూపంలో ఈ జన్మలో మమ్మంటి సేవిస్తున్నాయి.
మేమింతవారము.
తుమ్మెదలారా!
మీరు ఇంతకుముందు మా నెత్తిపై పడి త్రొక్కి తప్పుచేసి ఉన్నారు.
మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పగా భయపడి తుమ్మెదలు
పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాయా అన్నట్లు ఉన్నాయట.
అంటే  దమయంతి శిరోజాలు పాదాలపై పడుతున్నవని - తాత్పర్యం.
అంత పొడవాటి వెంట్రుకలు దమయంతివి అని.

భగవతి - భగవంతుడు


భగవతి - భగవంతుడు


సాహితీమిత్రులారా!

భగవతి అంటే ఎవరు?
భగవంతుడు అంటే ఎవరు?
ఇది బ్రహ్మవైవర్తపురాణంలో చెప్పబడింది
ఒకపరి పరికించండి.

సమృద్ధి బుద్ధి సంపత్తి యశసాం వచనో భగ:
తేన శక్తిర్భగవతీ భగరూపా చ సా సదా
తయా యుక్త: సదాత్మా చ భగవాంస్తేన కథ్యతే

సమృద్ధి, బుద్ధి, సంపత్తి, యశస్సు - వీటినే భగం అంటారు.
ఇవి కలిగిన స్త్రీని భగవతి అని,
పురుషుని భగవంతుడు అంటారు.

Monday, July 25, 2016

కవితాకన్యా వృణేతి స్వయమ్


కవితాకన్యా వృణేతి స్వయమ్


సాహితీమిత్రులారా!

ఈ చమత్కారశ్లోకం చూడండి.
కవితాకన్య ఎవరిని వరిస్తుందో తెలుస్తుంది.

నైవ వ్యాకరణజ్ఞమేతి పితరం నభ్రాతరం తార్కికమ్
దూరాత్ సంకుచతీవ గచ్ఛతి వపు: చండాలవత్ ఛాందసాత్
మీమాంసా నిపుణం నపుంసకమితి జ్ఞాత్వా నిరస్యాదరాత్
కావ్యాలంకారణజ్ఞమేవ కవితాకన్యా వృణేతే స్వయమ్

కవితాకన్య వ్యాకరణపండితుని తండ్రిగా భావిస్తుంది.
తార్కికుని సోదరునిగా తలుస్తుంది.
ఛాందసుని(ఛందశ్శాస్త్ర పండితుని) చండాలునిగా
భావించి దూరంగా తొలగుతుంది.
మీమాంసాపండితుని నపుంసకునిగా భావించి నిరసిస్తుంది.
కావ్యాలంకార పద్ధతుల తెలిసిన రసజ్ఞుని మాత్రమే
కవితాకన్య వరిస్తుంది
- అని భావం.

నా భార్యే మహోత్తమురాలు!


నా భార్యే మహోత్తమురాలు!


సాహితీమిత్రులారా!

ఒక గురువుగారు శిష్యుని పిలుపు మేరకు వారి ఇంటికి వెళ్ళాడు.
 అక్కడ శిష్యుని భార్యకు కోపం వచ్చి కుండతో శిష్యుని కొట్టింది.
కుండ పగిలిపోయింది. కుండ మూల్యం ఇవ్వమని గద్దించింది.
అది చూచిన గురువుగారు అనుభవవేత్త
ఈ శ్లోకంలో తన అనుభవం వివరించాడు చూడండి.

అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే!
అహో!  భాగ్యవతీ నారీ!  భాండమూల్యం నయాచతే!

నాతలపై నా భార్య ఎన్నో వంగల కుండలు పగులగొట్టింది
(కోపం వచ్చినపుడు కుండనెత్తి తలపై కొట్టేది).
కాని ఎన్నడూ కుండ వెలను అడుగలేదు
నా భార్యే మహోత్తమురాలు-
అని భావం.

Sunday, July 24, 2016

చతురధిక కరాశ: పాతు నశ్చక్రపాణి:


చతురధిక కరాశ: పాతు నశ్చక్రపాణి:


సాహితీమిత్రులారా!

ఇంతకు మునుపు మనం
చమత్కార ప్రార్థనలు కొన్ని తెలుసుకొని ఉన్నాము.
ఇప్పుడు మరొకటి.

కచకుచ చిబుకాగ్రే పాణిషు వ్యాపితేషు
ప్రథమ జలధి - పుత్రీ - సంగమే2నంగ ధామ్ని
గ్రథిత నివిడనీవీ - గ్రంథినిర్మోచనార్థమ్
చతురధిక కరాశ: పాతు నశ్చక్రపాణి:!

లక్ష్మితో చతుర్భుజ భగవానుని ప్రథమ సమాగమం జరుగుతూంది.
ఆయన నాలుగు చేతులూ నాలుగు చోట్ల -
లక్ష్మి స్తనాలపైన,
వెంట్రుకల పైన,
ఆమె గడ్డంపైన
వ్యాపించి ఉన్నాయి.
ఇక బిగిసిన నీవీ బంధ విమోచనం ఎలాగు?
ఈ అక్కర కోసం అదనంగా మరో చెయ్యి కోరుకునే
విష్ణు భగవానుడు మమ్ములను రక్షించుగాక!
- అని భావం

నిర్జీవం దహతే చితా!


నిర్జీవం దహతే చితా!


సాహితీమిత్రులారా!

మన పూర్వులు అనేక విషయాలను
వారు అనుభవించి చెప్పినవే
సూక్తులుగా మనం చెప్పుకుంటున్నాము.
ఈ శ్లోకం చూడండి.

చితా చింతా సమాహ్యుక్తా బిందుమాత్ర విశేషత:
సజీవం దహతే చింతా! నిర్జీవం దహతే చితా!

చితా(చితి)-  చింతా అనే రెండు  సమానాలే
సున్నమాత్రమే తేడా.
తగులబెట్టటంలో కూడా ఎక్కువ తేడాలేదు
చింత సజీవంగా తగులబెడుతుంది.
చితా(చితి) నిర్జీవుని  తగులబెడుతుంది.

Saturday, July 23, 2016

తెల్పగరాదె! నిజంబు నీశ్వరా?


తెల్పగరాదె! నిజంబు నీశ్వరా?


సాహితీమిత్రులారా!

వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడీ - అని
స్వాతంత్ర్యసమరంలో గంధం పట్టుక తిరిగిన
మన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి
సూతపురాణంలోని పద్యం చూడండి.

ఒకరుడు "వేదమే భగవదుక్త" మటంచు నుపన్యసించు, నిం
కొకరుడు "బైబిలే భగవదుక్త" మటంచును వక్కణించు, వే
రొక్కురుడుమా "ఖొరాన్ భగవదుక్త" మటంచును వాదులాడు, నీ
తికమక లేల బెట్టెదవు? తెల్పగరాదె! నిజంబు నీశ్వరా!
                                                                (సూతపురాణము -3-1)

ఈశ్వరా! ఒక ఛాందసుడు వేదాలనే భగవంతుడు అన్ని ధర్మాలను
భవ్యంగా వివరించాడు కావున వాటినే సదా సేవించాలంటాడు.
మరొకడు బైబిలు గ్రంథమే భవ్యమైనది అదే భగవత్ కైంకర్యంగా
కర్తవ్యమని కంకణం కట్టుకొని బోధిస్తాడు.
వేరొకడు అవేవీకావు మా ఖురాన్ గ్రంథమే ఖుద్దున(స్వయంగా)
ఖుల్లను(వివరంగా), ఖుషీగా ఖుల్లమము(రాచబాట)ను చూపిస్తుందంటాడు,
ఇలా ఇంతమంది ఇన్ని విధాల మా చెవులు గింగిరులెత్తించి, గిజగిజలాడించి,
గింజుకొనేట్లు చేస్తుంటే, హే భగవాన్! దేవా! అల్లాహో అక్బర్! ఎంగుకిలా ?
మమ్ములను తికమక పెట్టి చంపుకుతింటావు.
ఓ కరుణామయా! కనికరించి, అసలు నిజమేదో నిగ్గుతేల్చి చెప్పి,
మా సందేహాలను పటాపంచలు చేయరాదా? -
అని కరుణాక్రందన చేస్తున్నాడు కవిగారు.

ద్రవిడదేశాన్నసత్రముల నిడరె?


ద్రవిడదేశాన్నసత్రముల నిడరె?సాహితీమిత్రులారా!

అనంతపంతుల రామలింగస్వామి అనే కవి
1932 వ సంవత్సరంలో శుక్లపక్షము అనే
హాస్యకావ్యాన్ని వ్రాసి ముద్రింపంచారు.
అందులోని కుకవి నింద చేస్తూ వ్రాసిన
పద్యం ఇది
చూడండి.

రసము నే నెఱుగనా?  ప్రారబ్దమిదియేమి?
        ద్రవిడదేశాన్నసత్రము నిడరె?
సముచితాలంకారసమితి నే నెఱుగనా?
       మగువలు ధరియించు నగలు కావె?
యతిని నే నెఱుగనా? క్షితిలోన 
       కాషాయవస్త్రధారుండైనవాడు కాడె?
గురువు నే నెఱుగనా? సరి సరి! అక్షరా
        భ్యసనంహు సల్పిన యతడు కాడె?
శబ్దమన నే నెఱుంగనా?  చప్పుడు గదె?
అనుచు వచియించు అజ్ఞాన జనములోన
అగ్రగణ్యుండవగు నీ వహా! కవిత్వ
మును రచించుట భాషకు ముప్పు గాదె?

     

Friday, July 22, 2016

సంధ్యా జహాతి స్వయమంబరమ్!


సంధ్యా జహాతి స్వయమంబరమ్!సాహితీమిత్రులారా!
ఆదికవి వాల్మీకి
రామాయణంలోని
ఈ వర్ణన శ్లోకం చూడండి.

చంచచ్చంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారకా
అహో! రాగవతీ సంధ్యా జహాతి స్వయవంబరమ్!

ఈ సంధ్య అనే యువతి
చంద్రకర(కిరణ) స్పర్శచే
ఆనందముతో తారక(కంటిలోని నల్లగ్రుడ్డు)లు
ప్రకాశింపగా - అనురాగముతో స్వయముగా
అంబరము(చీర)ను తీసివేయుచున్నది.

రాభణో నతు రావణ:!


రాభణో నతు రావణ:!


సాహితీమిత్రులారా!

నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే
మూర్ఖులు చాలామందే ఉన్నారు.
అలాంటిదే  ఇదీనూ చూడండి.
ఒక మూర్ఖుడు రావణడుని రాభణుడు అన్నాడట
దానికి ఒక పండితుడు సమర్థిస్తూ
చెప్పిన శ్లోకం ఇది.


కుంకరణే భకారోస్తి భకారోస్తి విభీషణే
రాక్షసానాం కులశ్రేష్ఠ:  "రాభణో" నతు రావణ:!


రావణ - కుంభకర్ణ - విభీషణులు అన్నదమ్ములు.
కుంభకర్ణునికి - కారం ఉంది.
అలాగే విభీషణునికి - కారం ఉంది.
కాబట్టి రాక్షసకులంలో పెద్దవానిని రాణుడు అనటమే
సమంజసం సముచితము రావణుడు కాదు.

Thursday, July 21, 2016

కురు తావ దిగంబరమ్!


కురు తావ దిగంబరమ్!


సాహితీమిత్రులారా!


ఒక పురుషుడు తన స్త్రీతో చమత్కారంగా అన్న
ఈ చమత్కార శృంగార శ్లోకం చూడండి.

ఉగ్రరూపం కుచద్వంద్వం హార గంగాధరం తవ
చంద్రచూడం కరిష్యామి కురు తావ దిగంబరమ్!

నీ కుచద్వంద్వము శివాకృతిగా(లింగంగా) ఉన్నది.
ధరించిన హారాలు గంగానదిని పోలి ఉన్నాయి.
ఇక ఈ కుచములను చంద్రచూడములు(నఖక్షతములు)గా చేస్తాను
దిగంబరుని (వస్త్రము తొలగించు) చేయి - అని భావము.

దేవేంద్ర పదవి తిరముగ జగతిన్!


దేవేంద్ర పదవి తిరముగ జగతిన్!


సాహితీమిత్రులారా!


ఈ హాస్యపూరిత పద్యం తిలకించండి.

తీటగల భాగ్యశాలికి
నీటుగలుగు గోళ్ళు - వేడినీళ్ళు లభింపన్
తాటించి బఱుకసాగిన
తీటయె దేవేంద్ర పదవి తిరముగ జగతిన్!

తీట అంటే తెలియనివారు ఉండరు అది
ఒక దురద పుట్టించు చర్మవ్యాధి.
దురద ఎక్కువైన ఎవరున్నా ఎటువంటి భావనలేకుండా
గోళ్ళతో రక్తం వచ్చినా! వదలకుండా బరుకుతారు.
వేడినీళ్ళు దురద పట్టేచోట పోస్తే అదోక సుఖంగా ఉంటుంది
అందుకే కవి ఈ తీటను దేవేంద్ర పదవి అంతటిదిగా
హాస్యపూరితంగా చమత్కరించాడు.

Wednesday, July 20, 2016

కుచయుగం చక్రే ముదా నర్తనమ్


కుచయుగం చక్రే ముదా నర్తనమ్


సాహితీమిత్రులారా!

పూర్వం మన తెలుగుయువతులు నదుల్లోనూ చెరువుల్లోనూ
స్నానంచేసి వస్తూవస్తూ బిందెతో ఇంటికి నీళ్ళు తెచ్చేవారు.
నదిలో లేదా చెరువులో స్నానం చేసేముందు కొంగు కప్పుకొని
రవిక విప్పి - దాన్ని నీళ్ళలో ముంచి - వంగి
ఱాతిపై ఉతికి తరువాతగాని స్నానం చేసేవారుకాదు.
ఒకానొక కవికి ఈ దృశ్యం కంటపడగా
చమత్కారమైన ఈ శ్లోకం చెప్పాడట.
చూడండి.

ఆంధ్రీ కాచన మన్మథాశుగ నిభా కౌశేయకం కంచుకమ్
కక్షాత్ బాహుయుగేన కోమల తరేణాదాయ - తూర్ణం జలే
మగ్నీకృత్య కుచద్వయస్య కృశదం త్వాం మర్దయామీతి సా
పాషాణే తదపీడయత్ కుచయుగం చక్రే ముదా నర్తనమ్

ఒక ఆంధ్ర సుందరి స్నానికై నదిరేవులోకి వెళ్ళింది.
రవికను, కొంగుముసునుండి తీసినది -
నీటిలో ముంచినది. (కుచాలను పీడించే నిన్ను ఱాతిమీద
కొడతాను చూడు అన్నట్లుగా) ఱాతిపై ఉతకడం మొదలు పెట్టింది.
వంగి ఆమె ఉతుకుతుంటే కుచాలు(తమ శత్రువుకు ఱాతి దెబ్బలు
తగులుతున్నాయికదా - అని) సంతోషంతో నాట్యం ఆడినవి -
అని భావం.

ఎంతటి ఊహ!
ఎంత చమత్కారం!

మేరు మందర సమాన మధ్యమా


మేరు మందర సమాన మధ్యమా


సాహితీమిత్రులారా!

మల్లినాథసూరి అను నామాంతరముగల
పెద్దిభట్టు అనే ప్రముఖ పండితుడు
అనేక కావ్యాలకు వ్యాఖ్య వ్రాసినవాడు.
ఒకానొకరోజు ఆయన భార్య ఆయన్ను
"అందరను వర్ణిస్తున్నావు 
నన్ను వర్ణింపవేమి?"
అని అడిగిందయట.
దానికి ఆయన ఆమె ముచ్చటెందుకాదనాలని
ఈ శ్లోకం చెప్పారట.
చూడండది.

మేరు మందర సమాన మధ్యమా, తింత్రిణీ దళ విశాల లోచనా
అర్క శుష్కఫల కోమల స్తనీ, పెద్దిభట్ట గృహిణీ విరాజతే!

మేరు పర్వతము వంటి నడుముతో -
చింతాకులవలె విశాలములైన నేత్రములతో -
ఎండి జిల్లోడు వంటి కుచములతో
పెద్దిభట్టు భార్య ప్రకాశించుచున్నది -
అని భావం.
కాదనకుండా ఎంత చమత్కారంగా
భార్యముచ్చట తీర్చాడు కవిగారు

Tuesday, July 19, 2016

ఎంత కుమిలితివో క్షమియించు వాణి


ఎంత కుమిలితివో క్షమియించు వాణి


సాహితీమిత్రులారా!

ఒక అవధాని పృచ్ఛకుని
కోరికమేరకు
దిగజారిన కవిత్వపు పోకడలపై
వాణీహృదయవేదనను
ఈ క్రింది పద్యంలో
వివరించారు చూడండి.

అధివాస్త కవిత్వమని బుకాయించుచు వెర్రి గీతలు గీకి వేయువారు
గణయతి ప్రాస లక్షణ శృంఖలమ్ముల త్రెంచినామని యికిలించువారు
సంధి సమాస దోసముల పాటింపక విప్లవమని రంకె వేయువారు
ఒకటి రెండు మార్లూపి యూపి చదివి చప్పట్లకై సైగ సలుపువారు
పొట్టి పంక్తిని అటుమీద పొడుగు పంక్తి
పెంచి భావాలకై దేబెరించువారు
గేయమని వీరు చేసెడి గాయములకు
ఎంత కుమిలితివో క్షమియించు వాణి

- అని వాణీహృదయవేదనను వాకృచ్చెను.
ఇది నిజమేకదా!
 ఇందులో కొంచెం వ్యంగ్యంగా అనిపించినా వాస్తమే.

కోపం ఎంతసేపుండాలి?


కోపం ఎంతసేపుండాలి?


సాహితీమిత్రులారా!

అరిషడ్వర్గాలలో కోపం ఒకటి.
కోపం వల్లకూడా ప్రయోజనం ఉంటుందని నానమ్మకం.
లేకుంటే భగవంతుని సృష్టిలో అది ఉండదు.
కాని దాన్ని జయించడంకోసం అనేక మంది మహర్షులు
అహోరాత్రాలు వేలాది సంవత్సరాలు పోరాడారు
ఉదాహరణకు విశ్వామిత్రుని చెప్పవచ్చు.
మానవ మాత్రులంకదా! మనం
మరి కనీసం అది ఎంతసేపుండాలో అనేదన్నా తెలుసుకుంటే
మంచిదికదా!
మన పెద్దలమాటల్లో విందాం.
చూడండి ఈ శ్లోకం.

ఉత్తమే క్షణకోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయమ్
అధమస్యాత్ అహోరాత్రం పాపిష్ఠే మరణాంతకమ్


ఉత్తముని కోపం క్ణణకాలం అంటే 4 నిముషాలు,
మధ్యముని కోపం రెండు ఘడియలు అంటే 48 నిమిషాలు,
అధముని కోపం అహోరాత్రము అంటే ఒక రాత్రి ఒక పగలు,
పాపాత్ముని కోపం మరణపర్యంతం
అంటే చచ్చేదాకా ఉంటుందని శ్లోక భావం.

దీనిలో మనం ఏ విభాగంలో చేరతామో?
గమనించండి.

Monday, July 18, 2016

పంచ-షావా మహాకవయ ఇతి గణ్యంతే


పంచ-షావా మహాకవయ ఇతి గణ్యంతే


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలోని సత్యం గ్రహించండి.

నరత్వం దుర్లభం లోకే విద్యాతత్ర సుదుర్లభా
కవిత్వం దుర్లభంతత్ర శక్తిస్తత్ర సుదుర్లభా
అస్మిన్నతి విచిత్ర కవిపరంపరా వాహిని సంసారే ద్వి - త్రా: -
పంచ - షావా మహాకవయ ఇతి గణ్యంతే

ఈలోకంలో మానవజన్మ మానవత్వం చాలా దుర్లభమైనవి. విద్య అంతకంటే దుర్లభమైనది. కవిత్వం - రసపుష్టి మరింత దుర్లభమైనది. కవిపరంపరలో ఇద్దరో ముగ్గురో లేదా ఐదారుగురో మహాకవులుగా గణింపబడతారు - అని శ్లోకభావం.
నిజం కాదంటారా మన సాహిత్యంలో ఏంతమంది కవులున్నారు వారిలో మహాకవులెందరు

రామ! మోక్షరామాధ్యక్షా!


రామ! మోక్షరామాధ్యక్షా!


సాహితీమిత్రులారా!

వేంటగిరి సంస్థానంలో యాచభూపతి కోరికమేరకు
మోచర్ల వెంకనకవి చెప్పిన
"" -కారము మొదట, "క్ష" - కారము అంతములో
ఉండే కందపద్యాలు శ్రీరామస్తవంగా
చెప్పమనగా ఆశువుగా చెప్పబడినవి.
ఇవి చూడండి.

షాక్షరమాదిగఁ జెప్పెద
నీక్షణమునఁ గందనివహము వరుసన్
వీక్షింపర దయతో నిటు
రాక్షసహర రామ! మోక్షరామాధ్యక్షా!

షడ్రాజన్యాంబరయుత
రాడ్రతవర్గస్తుతామరస్సరసీజా
తేడ్రు డ్యాగారపరి
వ్రాడ్రీవర రామ! మోక్షరామాధ్యక్షా!


షణ్మిధునాంభస్సంభవ
రాణ్మానితనూత్నరత్న రాజన్యకుటో
ద్యన్మండితాంతరీక్ష వి
రాణ్మూర్తీ రామ! మోక్షరామాధ్యక్షా!

షట్పదలసితోద్యస్మిన్
త్రిట్పదలాంగప్రకాశధీరాజితగ్రా
జట్పదజటిపటనానా
రాట్పూజిత రామ! మోక్షరామాధ్యక్షా!

అని చెప్పారట.
ఏమి ఆశుధార!
ఏమి పద్యాలు!

Sunday, July 17, 2016

ఖగవాహనుతోడ కాలకంఠుడు పల్కెన్


ఖగవాహనుతోడ కాలకంఠుడు పల్కెన్


సాహితీమిత్రులారా!

పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టున్ - అనడమేకాదు.
ఏకంగా గిరీశం కన్యాశుల్కంలో
శివునితో విష్ణువుకు
ఈ విధంగా చెప్పించాడు
చూడండి.
శిష్యుని  ఎంగిలి చుట్టకోసం
ఈ పద్యం చెప్పినమ్మిస్తాడు
పురాణ ప్రమాణాలుగా.

పొగచుట్టకు సతిమోవికి
అగణితముగ మద్యమునకు, అమృతంబునకున్
తగ నుచ్ఛిష్టము లేదని
ఖగవాహనుతోడ కాలకంఠుడు పల్కెన్

ఇది మరో చిత్రం చూడండి.
త్రిలోక సంచారి నారదుడు వైకుంఠానికి వెళ్ళినాడు.
ఆ సమయంలో త్రిమూర్తులు చుట్టకాలుస్తూ
ఆనంద పారవశ్యంలో ఉన్నారు.
నారదుడు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.
దానికి వారి సమాధానం చూడండి.

నారదుడు - మీరుం బొగ త్రావుదురా
                  వారిజభవ! వామదేవ!  వైకుంఠహరీ?
త్రిమూర్తులు - ఓరీ! నారద వినరా!
                     ఈరేడు జగంబులందు ఇది ముఖ్యమురా!

అన్నారట.
తప్పు చేస్తూ సమర్థించుకొనేవారి వాలకం ఇంతేకదా!

కమ్మని క్రొత్త చెంగల్వ విరిలుకమ్మని క్రొత్త చెంగల్వ విరిలు


సాహితీమిత్రులారా!

శ్రీనాథమహాకవి
కాలంలోని గోదావరీ ప్రాంతం ఎలా వున్నదో?
ఈ పద్యంతో తెలుస్తుంది. చూడండి.

ధరియింప నేర్చిరి దర్భ బెట్టెడి వ్రేళ్ళ లీలమాణిక్యాంగుళీయకములు
సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల తారహారములు ముత్యాల సరులు
కల్పింప నేర్చిరి గంగ మట్టియమీద కస్తూరి కాపుండ్రకములు నొసల
చేర్చంగ నేర్చిరి శిఖల నెన్నడుమల కమ్మని క్రొత్త చెంగల్వ విరులు
ధామముల వెండి పైడియు తడబడంగ 
బ్రాహ్మణోత్తములగ్రహారములయందు

వేదవేదాంగవేత్తలై ఐహిక భోగాలకు దూరంగా ఉండే
విప్రులే దర్భముడులకు బదులుగా మణులు పొదిగిన
ఉంగరాలు, జంధ్యాలతో పాటు తారహారాలు,
నొసటి విభూతిరేఖలతోపాటు కస్తూరి,
శిఖలమధ్య కలువపూలు, అవీ ఎర్రకలువలు -
ఇళ్ళలో వెండి బంగారాలు - ఇటువంటి స్థితిలో అలరారుతూ
ఉంటే ఇతరుల పని చెప్పవలసిన దేముంది.
అంత సస్యశ్యామలమైనది గోదావరీ ప్రాంతం.

Saturday, July 16, 2016

ద్వితీయాస్యాత్ ద్వితీయాస్యామహం కథమ్?


ద్వితీయాస్యాత్ ద్వితీయాస్యామహం కథమ్?


సాహితీమిత్రులారా!

సంస్కృతంలో "విహస్య"(=నవ్వి) అనేది
ప్రాథమికునికి షష్ఠీవిభక్తిగా అనిపిస్తుంది.
ప్రాథమికునకు "విహాయ" (=విడచి)
చతుర్థిగా అనిపిస్తుంది. అట్లాగే అహం(=నేను),
కథం(=ఎట్లు) ఈ రెండునూ రామశబ్ద మాత్ర జ్ఞానం
ఉన్నవానికి ద్వితీయా విభక్తిగా తోస్తుంది.
ఈవిధంగా అనిపించడం భాషాజ్ఞానశూన్యలక్షణము.
అలాంటివానికి నేను భార్యను కాలేను అంటూంది
ఒక యువతి.
ఆ శ్లోకం చూడండి.

యస్య షష్ఠీ చతుర్థీస్యాత్ 'విహస్య' చ 'విహాయ' చ
'అహం' 'కఛం' ద్వితీయాస్యాత్ ద్వితీయాస్యామహం కథమ్?

ఎవనికి "విహస్య" - "విహాయ" అను ధాతువులు
షష్ఠీ - చతుర్థీ విభక్తులుగా గోచరిస్తాయో,
'అహం'- అను సర్వనామము 'కథం' - అను అను అవ్యయము
ద్వితీయా విభక్తులనిపించునో అలాంటి అజ్ఞానికి నేను ఎట్లు?
ద్వితీయ(భార్య)ను కాగలను?
(రామ వంటి శబ్దాలకు మాత్రమే విభక్తులుంటాయి
విహస్య - విహాయ అనే ధాతువులకు,
అహం అనే సర్వనామానికి, కథం అనే అవ్యయానికి
విభక్తులుండవని
రామ శబ్దం మాత్రమే  చదువుకున్నవాడు
వీటిని విభక్తులుగా భ్రమిస్తాడు.)

ఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్


ఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్


సాహితీమిత్రులారా!

లోకంలోని వారంతా ఎలాంటి వారంటే
ముందువారు ఏంచేశారో వెనుకవారు దాన్ని
అలాగే అనుసరించడం అలవాటైపోయింది.
ఏమన్నా మాట్లాడితే ఇది అనాదిగా వస్తూన్నదే అంటారు.
ఒక విధంగా చెప్పాలంటే గొర్రెదాటు పద్ధతే.

ఈ శ్లోకం అదే చెబుతూన్నది చూడండి.

గతానుగతికో లోకో నలోక: పారమార్థిక:
ఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్

ఈ లోకంలో ప్రజలు ముందువారిని - వెనుకవారు గుడ్డిగా అనుసరిస్తారు.
అంతేకాని, అందులోని పరమార్థం గుర్తించరు, ఆలోచించరు.
ఏలానది ఒడ్డున నేను ఇసుక లింగం చేసి నా రాగి చెంబు పోగొట్టుకున్నాను.
(గ్రహణం వేళ చెంబుకు గుర్తుగా ఇసుకను ప్రోగుపెట్టి స్నానానికి వెళ్ళాడు
ఒక బ్రాహ్మణుడు స్నానంచేసి వచ్చేసరికి
అదే ఆకృతిలో లోకులు ఇసుక లింగాలను పెట్టారట.
తన చెంబు పెట్టుకొన్న ఇసుక కుప్ప ఏదో?  తెలుసుకోలేక
రాగిచెంబు వదిలేసుకొని ఇంటి వెళ్ళాడట. ఇది శ్లోకంలోని విషయం.)

Friday, July 15, 2016

గణింపరు జాణలు జాఱుపాటులన్


గణింపరు జాణలు జాఱుపాటులన్


సాహితీమిత్రులారా!


చేమకూర వేంకటకవి కృత విజయవిలాసములో
అర్ఝునుడు ఉలూచిని వివాహమాడిన తొలిరేయినాటి
విశేషాల్లోనిది ఈ పద్యం

శయ్యకుఁదార్పఁగా దుఱుము జాఱె; న దంతటఁ జక్కదిద్దఁబోఁ
బయ్యెద జాఱె; నయ్యదిరిపాటున గ్రక్కున నీవి జాఱె; రా
జయ్యెడ నవ్విలాసిని యొయారముఁ జూచి కవుంగిలించె; నౌ!
నెయ్యడ మేలె చూతురు, గణింపరు జాలు జాఱుపాటులన్.
                                                              (విజయవిలాసము -1-172)

పక్కమీదికి చేరుతుండగా కొప్పు జారిపోయింది.
అది సరిదిద్దబోయేలోగా పైటజారింది.
అది సవరించుకొనే టప్పటికి చీరముడి సడలిపోయింది.
ఇన్ని జారుపాటులున్నా అర్జునుడు ఉలూచి ఒయ్యారాన్ని
చూచే కౌగిలించుకున్నాడు.
తెలిసినవారు దేనిలోనైనా మంచే చూస్తారు కాని
జారుపాటులనూ, లోపాలనూ ఎంచరని భావము.

ఇందులో మరో విశేషంకూడ ఉంది
అదేమిటంటే
కావ్యాలలో ఉండే వ్యాకరణ విరుద్ధాలవంటి స్వల్పలోపాలను
గణింపక, రసభావాది సుగుణాలనే ఎంచాలని
పండిత విమర్శకులకు
చేమకూరివారు
మనవి చేశారు.

బిల్లానదనెంతె కీసువం!


బిల్లానదనెంతె కీసువం!


సాహితీమిత్రులారా!

క్రీ.శ. 10వ శతాబ్దం నాటి
ఒక కన్నడ శాసనంలోని పద్యం ఇది
చూడండి
ఎంత చమత్కారంగావుందో!

ఎనిత్తెనిత్తంబుజపత్ర నేత్రయా
ఘనస్తనంగళ్ బళెగుం కిరాతెయా
అనిత్తనిత్తం వనదొళ్ వనచరం
బిల్లానదనెంతె కీసువం!

(ఇంటివద్ద) పద్మపత్రములవంటి నేత్రములుగలిగిన
కిరాత యువతి యొక్క ఘనస్తనములు పెరుగుతున్నకొలదీ,
అడవిలో వేటనిమిత్తం చరిస్తున్న (ఆమె భర్తయైన)
కిరాత యువకుడు విల్లును ఎక్కుపెట్టే శక్తి
తగ్గిపోతూ వస్తోంది! - అని భావం.

పాపం అతనికి ఆ శక్తి ఎందుకు తగ్గుతోందో?
అందులోని ధ్వని ఏమిటో?
వేరు చెప్పక్కరలేదనుకుంటాను.

Thursday, July 14, 2016

మెరుగు పాలిండ్ల నడిగెనో మెలతనతడు


మెరుగు పాలిండ్ల నడిగెనో మెలతనతడు


సాహితీమిత్రులారా!

ఈ కమనీయ చమత్కార పద్యం చూడండి.
ఒక భోజనపంక్తిలో ఒక ఉన్నతస్తని అన్నం వడ్డిస్తుంటే
పంక్తిలో తింటూఉన్న వాళ్ళలో ఒక యువకుడు
వడ్డించే  ఆవిడను ఈ విధంగా అడిగాడు
ఆ పద్యం.......

పద్మ కోశాభినయ హస్త వల్లపంబు
చూపె నావేళ రమణికి సాబగు డొక్క
డంత యోగిర మడిగెనో యంతలేసి
మెరుగు పాలిండ్ల నడిగెనో మెలతనతడు

వడ్డించే యువతికి భోజనంచేసే యువకుడు
చేతిని తామర మొగ్గలా చూపాడట అంత అన్నమే అడిగాడో,
ఆమె పాలిండ్లనే అడిగాడో - అంటున్నాడు కవి.

పొగ త్రాగనివాడు దున్నపోతైపుట్టున్


పొగ త్రాగనివాడు దున్నపోతైపుట్టున్


సాహితీమిత్రులారా!

ఇది అందరు అంటూంటారు
మరీ పొగత్రాగేవాళ్ళంతానూ.
ఇదేమిటి అంటే దీనికి
మన కవులు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో!
ఈ క్రింది పద్యాలవల్ల తెలుస్తుంది చూడండి.

ఇది ఎంత చమత్కృతో చూడండి.....
పొగాకు పుట్టుకకు సంబంధించిన పద్యం.

ఖగపతి అమృతము తేగా
భుగభుగమని పొంగి పొరలి భూస్థలి పడి తా
పొగ చెట్టయి జన్మించెను
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

(గరుత్మంతుడు అమృతం తెస్తుంటే పాత్రలో
నుంచి పొంగి నేలపై పడిన చుక్కే పొగ చెట్టైందట.)

పొగత్రాగడమంటే, చుట్ట తాగడం లాంటి దన్నమాట.

మరీ చిత్రం పొగత్రాగడం వల్లే భీముడు దుర్యోధనుణ్ని ఓడించాడట.
దుర్యోధనుడు అది త్రాగనందుకే ఓడాడట.
చూడండి ఆ పద్యం..

పొగ త్రగ నేర్చి భీముడు
పగఱన్ పొగరడచె నాజి బాహాశక్తిన్
పొగ త్రావని దుర్యోధను
డిగిలించెను రణములోన నిహిహీ అనుచున్


ఈ పద్యం చూడండి ఇదెంత చమత్కారమో!

రావణ యుద్ధంబందున
బావనుడగు లక్ష్మణుండు పడి మూర్ఛిలినన్
ఆవల బొగ చెట్టుండిన
బావని సంజీవని కేల పరుగెత్తు నృపా!

(రామరావణ యుద్ధంలో పొగచేట్టే ఉంటే,
లక్ష్మణుని మూర్ఛ తేర్చటానికి హనుమంతుడు
సంజీవని కోసం ఎందుకు పరుగెడతాడు - అని భావం.)

మరి ఇప్పుడేమో పొగత్రానే కూడదని వచ్చి పడింది
దానికి అలవాటు పడ్డవాళ్ళు
ఇప్పుడేమంటారో!

Wednesday, July 13, 2016

సన్న్యాసి యనగ, మహినొప్పు శివా!


సన్న్యాసి యనగ, మహినొప్పు శివా!


సాహితీమిత్రులారా!

ఈ రోజుల్లో సన్యాసి అంటే ఏమిటో ?
కవి చమత్కరించిన తీరు చూడండి.

దినమెల్ల బిచ్చమెత్తుట - యును,
నిశలం దెల్ల చౌర్యమొనరించుటయున్
పనిగల హిందూదేశపు - మనుజుడు
"సన్న్యాసి" యనగ, మహినొప్పు శివా!

ఓ పరమేశ్వరా! పగలంతా అడుక్కొంటూ, రాత్రులంతా
దొంగతనమే పనిగా భావించే భారతీయుడు,
ఈ లోకం దృష్టిలో సన్న్యాసి(సన్నాసి)గా కనబడుతున్నాడని
- కవి భావన.
సన్న్యాసి - అంటే అన్నిటిని త్యజించి నిర్మోహంగా జీవించువాడు - అనేది అసలైన అర్థం.

Tuesday, July 12, 2016

చూతే జగతి ఫలరాజే ప్రసరతి


చూతే జగతి ఫలరాజే ప్రసరతి


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలో కవి ఎంత సహజంగా
చమత్కరించాడో!
చూడండి.

అభూచ్ఛామా జంబూ: దళితహృదయం దాడిమఫలం
సశూలం సంధత్తే హృదయ మవమానేన పనస
భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలిఫలం
సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి!

మామిడిపండు ఫలరాజంగా ప్రపంచంలో
ప్రఖ్యాతి పొందుతూంటే
నేరేడుపండు మొగం మాడ్చుకున్నది.
దానిమ్మపండుకు గుండె బ్రద్దలైంది.
పనసపండు గుండెలో గసిక(మొనదేలి
త్రవ్వటానికి అనువైన కొయ్య) గ్రుచ్చుకొంది.
కొబ్బరి ఫలము గుండె నీరైంది - అని భావం.
అన్ని పండ్లకు వాటి సహజ గుణాలతోనే
కవి ఎంతగా చమత్కరించాడో కదా!

Monday, July 11, 2016

శ్రీ శ్రీ పద్యాలు - 3శ్రీ శ్రీ పద్యాలు - 3


సాహితీమిత్రులారా!

ఇప్పుడు మరికొన్ని
శ్రీశ్రీ పద్యాలు ఆస్వాదించండి.

అసలు సమస్యలు గ్రాసం,
వసనం, వాసం అలాంటి వాటిని చూసే
పస లేక గింజుకొని చ
చ్చి సున్నమవుతోంది ప్రభుత సిరిసిరిమువ్వా!

జగణంతో జగడం కో
రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా
నగలాగ వెలుగును గదా
చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా!

తేనెకు సీసా, బంగరు
పళ్ళెమునకు గోడచేర్పు కావాలి సరే
మధుకనక ప్రాముఖ్యం
సీసా గోడలకు లేదు సిరిసిరిమువ్వా!


కందం తిక్కనగారిది
కుందవరపువారి ముద్దుకుర్రని దంతే
అందరి తరమా కందపు
చిందుల కిటుకుల్ గ్రహింప సిరిసిరిమువ్వా!

మునుపటి వలె కాదంటా,
మన లోకం రూపమసలె మారిందంటా,
వెనుకటి గొప్పలు తలపో
సిన లాభం బండిసున్న సిరిసిరిమువ్వా!

ఇమిటేషన్ తప్ప స్వతం
త్రముగా నూహించగల మెదడులేక సమ
ర్థముగా కృతులను విరచించి
మమ్ములను పొగడుమండ్రు సిరిసిరిమువ్వా!

దృష్ట మిందీవర ద్వయమ్!


దృష్ట మిందీవ  ద్వయమ్!


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకంలోని కవి చమత్కారం చూడండి.

కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే నచ దృశ్యతే
బాలే! తవ ముఖాంభోజే దృష్ట మిందీవర ద్వయమ్!


పుష్పంలో పుష్పం పుట్టడం వినలేదు! కనలేదు!
కానీ ఓ సుందరీ! నీ ముఖ పద్మంలో రెండు
నల్లకలువలు (కళ్ళు) ఉన్నాయి.
- అని భావం

Sunday, July 10, 2016

నీవే సమర్థుడవు!


నీవే సమర్థుడవు!


సాహితీమిత్రులారా!

కొన్ని పనులకు కొందరే సమర్థులు
అన్ని పనులు అందరూ చేయలేరు.
అలాగే నీవు ఈ పనికి తగినవానివని
కవి ఒక రాజును సంబోధిస్తూ .........
చెప్పిన ఈ శ్లోకం చూడండి.

దగ్ధం ఖాండవ మర్జునేనచ వృథా దివ్యౌషధై ర్భూషితమ్
దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకాపురీ స్వర్గభూ:
దగ్ధ: సర్వసుఖాస్పదశ్చ మదనో హాహా! వృథా వృథా శంభునా
దారిద్ర్యం ఘనతాపదం భువి నృపాణాం కేనపి నో దగ్ధ్యతే

రాజా!  అర్జునుడు దివ్యౌషధ నిలయమైన
ఖాండవము వ్యర్థంగా తగులబెట్టాడు.
స్వర్గభూమియై బంగారుతో నిర్మింపబడిన
లంకాపట్టణం వాయుపుత్రుడు దగ్ధం చేశాడు.
సర్వసుఖాస్పదుడైన మన్మథునుని శంభువు
వృథాగా తగులబెట్టాడు.
భూమిలో మానవులకు ఘనతాపమును కలిగించు
దారిద్ర్యమును మాత్రం ఎవ్వరిచేతనూ
తగులబెట్టబడలేదు
అందుకు నీవే సమర్థుడవని భావం.

ఇది లోకసహజమే కదా!


ఇది లోకసహజమే కదా!


సాహితీమిత్రులారా!

పూర్వం - నదుల్లో - నీలాటి రేవుల్లో - యువతులు మంచినీళ్ళు
బిందెలతో తీసుకొని వెళ్ళే సమయంలో ఒడ్డున మురికిగా
ఉంటాయనే భావనతో లోతుకువెళ్ళి నీరు తెచ్చుకోవటం సహజమేగా
అక్కడ జరిగే వింతలు విశేషాటు సహజమే అలాంటిది తెలిపే శ్లోకమే ఇది
చూడండి కవి ఎంత చమత్కారంగా సహజంగా వర్ణంచాడో!

తిష్ఠన్తీ జానుదఘ్నే పయసి, నివసన ప్రాంత ముత్సాదయన్తీ
కిచిల్లక్ష్యోరుకాండా ముఖరిత వలయం కుంభమగ్రే ధునానా
స్నాతాన్ వారి త్రయాదప్యధిక శత తమం సమ్యగాచామయన్తీ
శిష్టాన్ స్వాలోక సక్తాన్ రమయతి హృదయం మామకం కాపి బాలా!

మోకాటిలోతువరకు చీరపైకెత్తి పట్టుకొన్నది.
తొడలు కొంచంగా కనిపిస్తున్నాయి.
నీళ్ళకుండతో నీటి పైభాగము తొలగించుచు
(తెప్పకొట్టుచు) నీటిపై వలయములు సృష్టించుచు,
మంచినీటిని ముంచుటకు ప్రయత్నము చేస్తున్నది.
మొలబంటినీటిలో బాపనయ్యలు ఆమె తొడలు చూస్తూ............
మూడుసార్లు చేయవలసిన అచమనం ముప్పయిసార్లు చేస్తున్నారు.
శిష్టవిప్రులకు - నాకు, ఈ జలాపహరణాసక్త చిత్తానందమును కలిగిస్తున్నది - అని భావం.

Saturday, July 9, 2016

వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి


వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి


సాహితీమిత్రులారా!

వేకువజామున అంటే తొలిజామున మొట్టమొదట
కూసే కోడిని తొలికోడి అంటారు. పండితారాథ్య చరిత్రలో
పాల్కురికి సోమనాథుని వర్ణన చూడండి.
ఇది ద్విపద.
ఎంత అద్భుతంగా కళ్ళకు
కట్టినట్టు వర్ణించాడో తెలుస్తుంది.

తొలుకోడి కనువిచ్చి నిలిచి మైవెంచి
జలజల ఱెక్కలు సడలించి నీల్గి

గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు జక్కొల్పి కడుపు

వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి
కుక్కురో కుఱ్ఱని కూయకమున్న

ప్రబ్బతనాథ ప్రబ్బతనాథ యనుచు
నుబ్బి నీర్కోళ్ళుకూయుడుగక మున్నె
                                                  (పండితారాధ్యచరిత్ర)

తొలికోడి కన్ను తెరిచింది.
ఒకచోట నిలబడి తన శరీరాన్ని పెంచింది.
ఱెక్కలు టపటపలాడించి ఒళ్ళు విరుచుకొని
గబుక్కున కాలాడించి కదిలింది.
ముక్కుతో ఈకలన్నీ ఒకసారి సవరించుకుని(జక్కొల్పి),
కడుపును - లోనికి బిగబట్టి(వెక్కించి),
గొంతు విప్పి, మెడను సాగదీసి,
నిటారుగా నీల్గి, ఆకాశం వైపు చూసి,
కొక్కురోకో యని కూసింది.
ఇలా తొలికోడి ఇంకా కూయకముందే
ప్రబ్బతనాథ ప్రబ్బతనాథ అనే శబ్దం వచ్చేలా  ...
పొంగి(ఉబ్బి) కూస్తున్న నీర్కోళ్ళ కూతలు
ఇంకా పూర్తికాకముందే(కూ - ఉడుగక మున్నె) ..
అని తరవాతి పాదంలోనికి అన్వయము.
(భక్తులు గమ్యస్థానాలకు చేరుకున్నారని.)

పాల్కురికి సోమనాథుడు ఎంత సహజంగా
ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు
అందుకే ఇది స్వభావోక్తి - అలంకారంగా చెప్పవచ్చు.
దీనికే ప్రతాపరుద్రయశోభూషణంలో జాతి అని అన్నారు.

మనవారి కాలవిభజన


మనవారి కాలవిభజన


సాహితీమిత్రులారా!

ప్రస్తుతం మనం వాడుతున్న కాలమానం పాశ్చాత్యులదని లెక్క.
ప్రతిదాన్ని గంటలు నిమిషాలు సెకండ్లలోనే
మార్చకోవాలి అలా అయింది మనకత.
మరి మనవారివిభజన ఎలావుందో.
ప్రస్తుతం మరచిపోయామనే అనాలి.
ఒకసారి దాన్ని చూద్దామా!


కాష్ఠ - 18 రెప్పపాటుల కాలం
కల - 30 కాష్ఠలు ( 540 రెప్పపాటుల కాలం)
క్షణము - 30 కలలు(దాదాపు 4 నిముషాలు)
ముహూర్తం - 12 క్షణాలు (48 నిమిషాలు)
దినము - 30 ముహూర్తాలు(24గం.)
కుతపము - దినములో 3వభాగము
యామము - గడియ(జాము) - 24 నిముషాలు

పాశ్చాత్యులు దినమును మార్నింగ్, మిడ్ డే, ఈవెనింగ్ అని
అర్లీ అవర్స్, లేట్ అవర్స్ అని మాత్రమే విభజించారు.

మనవారు పగటికాలాన్నే 15 భాగాలు చేశారు.
ప్రతి భాగానికి 48 నిముషాలు
48 x 15 = 576నిముషాలు = 12 గంటలు

విభాగాలు -
1. రౌద్రము, 2. శ్వేతము, 3. మైత్రము,
4. శారభటము, 5. సామిత్రము, 6. విజయము,
7. గాంధర్వము, 8. కుతపము, 9. రౌహిణేయము
10. విరించము, 11. సోమము, 12. నిరృతి,
13. మాహేంద్రము, 14. వరుణము, 15. భయము.


Friday, July 8, 2016

శ్రీసాయి శతకము


శ్రీసాయి శతకము

                                                                                -------శ్రీఅలంకారం కోటంరాజు

ఇటులన్ జేతువటంచు నేనెఱుగ - మున్నే నాడు నూహింప, నీ
వెటులన్ జేయగలేదు, లేదనిన నాయీ పాట్లకున్ కారణం
బెటులన్ గల్గెను నీవె చెప్పుము - దయాహీనుండవా కావె న
న్నెటులన్ దేర్తువొ నీదె భారమిక షిర్దీ సాయినాథ ప్రభూ!    - 11


నిద్రాణంబయిపోయె, సత్యమిదె - నిన్నేమందు, కన్విందుగా
క్షుద్రున్ నాదఱి జేరి యేదొ ముదమున్ గూర్పంగ యత్నింపవా
ముద్రింపించితి నాడు డెందమున - నీ పూర్వంపు రూపంబు - ని
ర్ణిద్రంజెందకు మెంత లేయనుచును షిర్దీ సాయినాథ ప్రభూ!  -12


పనులన్ మానితి పంచజేరితిని - నా పాట్లెన్ని యో యాయె - నీ
వున్ కన్దోయిని యచ్చకాంతులవియేవో మేనిపైజల్లవే
కనవా మానిసిగాగ నన్ను, యిదియే కాఠిన్యమో యేది - జా
రిన నాగుండియ చక్కదిద్దు మిక షిర్దీ సాయినాథ ప్రభూ!   - 13


పడిగాపుల్ బడినారు నిన్నుగని - సంప్రార్థించి - యర్థింప - నీ
గుడిముందే పదినాళ్ల నుండియు - దయాకూపారా వ్యాపారమె
క్కడ లేదీయవనీతలాన మదిలో కాఠిన్యమున్ బూని - వె
ల్తిడి లోకంబున నానబోకుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!   - 14


దట్టంబైయిరులెట్లు గ్రమ్మినవొ సాంద్రంబౌచు నల్దిక్కులన్
ఎట్టూహింపగరాని చీకటిది - నాకే మంచు నీవుంటి - వీ
లట్టాలన్ని పడంగ నాయె - తుద కేలా యిట్టులైనావు - నీ
వెట్టాగైనను సర్దుకోవలెను షిర్దీ సాయినాథ ప్రభూ!        - 15

సహస్ర దు:ఖాని సహన్తి ధీరా:


సహస్ర దు:ఖాని సహన్తి ధీరా:


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలోని నీతిని చూడండి.

సహస్ర ద్ఖాని సహన్తి ధీరా:
చత్వారి దు:ఖా న్యతిదుస్సహాని
కృషిశ్చ నష్టా గృహిణీచ దుష్టా
పుత్రోప్యవిద్వాన్ ఉదరే వ్యథాచ

ధీరులు వేయి దుఖాలనైనా సహించగలరు
కాని  నాలుగు దుఖాలు సహించలేనివి.
1. చేసిన కృషి కలిసిరాకపోవడం,
2. గయ్యాళి అయిన భార్య,
3. జ్ఞానశూన్యుడైన కొడుకు,
4. ఉదరమునందలి బాధ (పుత్రశోకము)
ఈ నాలుగు చాలా బాధకరమైనవి. - అని భావం.

సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది


సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకాన్ని చూడండి.

విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా:
తేపి స్త్రీ ముఖ పంకజం సులలితం సంవీక్ష్య మోహంగతా:
శాల్యన్నం సఘృతం పయో దధియుతం భుంజంతి యేమానవా:
తేషా మింద్రియనిగ్రహో యది భవేత్ వింధ్యప్లవేత్ సాగరే!

విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలైనవారు
గాలి- నీరు - ఆకులను తినినవారు.
అలాంటివారు కూడ స్త్రీని చూచి మోహాన్ని పొందారు.
సన్నన్నం,
నెయ్యి,
పాలు,
పెరుగు
తిన్నవారికి ఇంద్రియ నిగ్రహం ఉంటే !
సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది.
- అని భావం.
ఇది నిజమే కదా! కాదంటారా?

Thursday, July 7, 2016

వీనిలో కొన్నయినా చేతకావా?వీనిలో కొన్నయినా చేతకావా?


సాహితీమిత్రులారా!

సమాజంలో బ్రతకడానికి మనం అనేకం నేర్చుకుంటున్నాము.
అలాగే సంఘాన్ని ఆకర్షించాలంటే ఏవి రావాలని?
ఓ కవి ఈ శ్లోకంలో వివరించాడు చూడండి.


ఉచ్చై రధ్యయనం, చిరంతన కథా:, స్త్రీభి: సమాలాపనమ్,
తాసా మర్భక లాలనం, పతినుతి:, తత్పాక మిథ్యాస్తవమ్
మిథ్యా దాన, మభూత పూర్వ చరితం, సాముద్రికం, జ్యోతిషం
వైద్యం, గారుడ మంత్రజాల మధికం భిక్షాటనే ద్వాదశ

గట్టిగా చదవటం,
ఎక్కడెక్కడివో గాథలు చెప్పటం,
స్త్రీలతో సక్కగా మాట్లాడటం,
వారి బిడ్డలను ముద్దుచేయడం,
పై అధికారిని పొగడడం,
వండిన వంటను మెచ్చుకోవడం,
దానం చేసినట్లు కనిపించడం,
లేని కథలు అల్లి చెప్పడం,
హస్తసాముద్రికం,
జ్యోతిషం,
వైద్యం,
పాము తేలు మంత్రం
- అనేవి ఇతరులను ఆకర్షించు విద్యలు.
వీనిలో కొన్నయినా చేత కాకపోతే సంఘాన్ని ఆకర్షించలేరు
- అని భావం.
దీన్ని బట్టి మనకు వీటిలో ఎన్ని వచ్చో? చూసుకుంటే
మనం సంఘాన్ని ఆకర్షించగలమా? లేదా? అనేది తెలుస్తుంది.

ఇలాంటి వారున్నారా?


ఇలాంటి వారున్నారా?


సాహితీమిత్రులారా!


పాండురంగమహాత్మ్యంలో తెనాలి రామకృష్ణకవి
పుండరీకుని గుణగణాలు వర్ణిస్తూ
వ్రాసినది ఈ పద్యం.
చూడండి.

చలి చీమనేనియుఁ జాఁ ద్రొక్క శంకించుఁ
        బలుకఁడెన్నడు మృషాభాషణములు
కలుషవర్తనులున్న పొలము పొంతఁజనండు
         కలిమికుబ్బఁడు లేమి కలగఁడాత్మఁ
దలయెత్తి చూడఁడెవ్వలనఁ బరస్త్రీల 
        ధైర్యంబు విడఁడెట్టి దద్దఱుటుల
నొరుల సంపదకునై యుపతపింపఁడు లోన
        నిందింపఁ డెంతటి నీచునైన 
మిన్నకయ చూడఁడాఁ కలిగొన్నకడుపు
సర్వభూతదయోదయోత్సవమొనర్చు
నిగమఘంటా పథైకాధ్వనీన బుద్ధి
బ్రహ్మవిద్యానవద్యుండు బ్రాహ్మణుండు
                                         (పాండురంగ మహాత్మ్యము 2-6)

ఆ పుండరీకుడు వేదాలు అనే రాజమార్గంలోనే
అద్వితీయంగా పయనించు బుద్ధికలవాడు.
బ్రహ్మవిద్యయందు పేర్కోదగ్గవాడు.

చలిచీమను కూడా తొక్కడానికి జంకుతాడు
ఎక్కడ చస్తుందోనని.
ఏ పరిస్థితిలోను అసత్యం పలకడు.
పాపపు నడవడి గల వాళ్ళు ఉండే సమీపానికికూడ వెళ్ళడు.
ఉన్న సంపదకు సంతోషంతో పొంగడు.
దారిద్య్రానికి మనసులో శోకించడు.
ఏ పక్కనుండి గాని పరస్త్రీలను తల ఎత్తి చూడడు.
ఎటువంటి ఒడుదుడుకులలోను ధైర్యాన్ని కోల్పోడు.
ఎంత నీచుణ్ణయినా మనసులోకూడ నిందించడు.
ఆకలితో ఉన్నవాణ్ణి ఊరకే చూడడు(తిండి పెట్టి పంపుతాడు అని).
సర్వప్రాణులయందు అతనికి దయపుడుతుంది.
దానివల్ల అతడు ఆ ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తాడు -
అని భావం.
ఆకాలంలో ఏమో?గాని 
ఈ కాలంలో మచ్చు 
ఒకరైనా ఉంటాడా?
ఏమో !
అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాగైనా ఉన్నా - మంటారు కొందరు 
నిజమేనా!  అని అనుమానం రాకమానదు.