Tuesday, October 11, 2016

దుర్గ పేరులోని రహస్యం ఏమి?


దుర్గ పేరులోని రహస్యం ఏమి?



సాహితీమిత్రులారా!


దుర్గ అంటే మనకు అమ్మవారని మాత్రం తెలుసు.
అసలు ఆపేరులోని రహస్యం ఏమిటి అంటే
ఈ శ్లోకం చూడాల్సిందే

దైత్య నాశార్థ వచనో కార పరికీర్తిత:
కారో విఘ్న నాశశ్చ వాచకో వేదసమ్మత:
రేఫో రోగఘ్న వచనో శ్చ పాపఘ్న వాచక:
భయ శత్రుఘ్న వచనాశ్చాకార: పరికీర్తిత:
                                                          (ముండమాలా తంత్రం)

దుర్గ అనే పదంలో ఐదు అక్షరాలు ఉన్నాయి.
అవి రెండు అచ్చులు, మూడు హల్లులు.
అవి ద్ - ఉ, ర్ - గ్ - అ - అనేవి
ఇందులో ద్, ర్, గ్ అనే మూడు హల్లులు, ఉ, అ అనే రెండు  అచ్చులు. వీటివల్ల
దకారం అంటే - అనే అక్షరం వల్ల  దైత్యనాశనం జరుగుతుందట.
ఉకారం అంటే - అనే అక్షరం వల్ల విఘ్ననాశనం జరుగుతుందట.
రేఫో అంటే - అనే అక్షరం వల్ల రోగనాశనం జరుగుతుందట.
అనే అక్షరం వల్ల పాపనాశనం జరుగుతుందట.
- అనే అక్షరం వల్ల శత్రునాశనం జరుగుతుందట.


ఆ ఐదు అక్షరాలకలయికతో దుర్గ
అనే పదం ఏర్పడుతుంది కావున
ఆ పదాని అంత మహత్తుంది.
ఇది మనం చెప్పిన మాటలు కాదు
మన పెద్దలు చెప్పినవి.
అటువంటి దుర్గామాతకు నమస్కారం.


No comments:

Post a Comment