Monday, March 29, 2021

వజ్జాలగ్గం(వ్రజ్యాలగ్నం)

వజ్జాలగ్గం(వ్రజ్యాలగ్నం)

సాహితీమిత్రులారా!హాలుని గాథాసప్తశతి వలెనే ప్రాకృతగాథల సంకంలనగ్రంథం 

వజ్జాలగ్గం(వ్రజ్యాలగ్నం) దీన్ని శ్వేతంబరముని జయవల్లభుడు సంగ్రహపరిచాడు.

వజ్జా లేక వ్రజ్యా అంటే మార్గం లేక పద్ధతి. దీనిలో ధర్మ-అర్థ-కామాల నిరూపణం చేయబడింది.

 ప్రస్తుతం దీనిలో 795 గాథలున్నాయి.

అందులోని కొన్ని ఉదాహరణలు ఇక్కడ గమనిద్దాం.

1. అప్పహియం కాయవ్వం జఇ సక్కఇ పరహియం చ కాయవ్వం,

    అప్పహియపరహియాణం అప్పహియం చేవ కాయవ్వం

తనకేది హితమో అది చేసుకోవాలి. వీలయితే పరహితం చెయ్యాలి. తన హితమా పరహితమా అన్నపుడు తన హితమే ముఖ్యమైనది.


2. కో ఇత్థ సయా సుహిఓ కస్స వ లచ్ఛీ థిరాఇ పేమ్మాఇం

    కస్సవ న హోఇ ఖలణం భణ కో హు న ఖండిఓ విహిణా


ఎల్లప్పుడూ ఎవడు సుఖంగా ఉంటాడు?  లక్ష్మి ఎవరివద్ద స్థిరంగా ఉంటుంది?

ఎవరి ప్రేమ స్థిరం? తప్పు పని చేయనివాడెవడు? దైవంచేత బాధింపబడనివాడెవడు?


3. తిణతూలం పి హు లహుయం దేణం దఇవేణ నిమ్మియం భువణే

    వాఏణ కిం న నీయం అప్పాణం పత్థణభయేణ

దేవుడు దీనుణ్ణి తృణంకంటే దూదికంటే కూడ తేలికగా ఉండేటట్లు సృష్టించాడు

అయితే వానిని గాలి ఎందుకు ఎగరకొట్టంలేదు తనను కూడ ఏమైనా యాచిస్తాడేమో అనే భయంచేత


4. భుంజఇ భుంజియసేనం సుప్పఇ సుప్పమ్మి పరియణే సయలే,

    పఢమం చేయ విబుజ్జఇ ఘరస్స లచ్ఛీ న మా ఘరిణీ

ఏ ఇల్లాలు అందరూ తినగా మిగిలింది తింటుందో, అందరూ నిద్రపోయిన తరువాత నిద్రపోతుందో, అందరికంటే ముందు లేస్తుందో ఆమె ఇల్లాలు కాదు, లక్ష్మి


5. వహణమ్మిససీ మహణమ్మి సురతరూ మహణసంభవా లచ్ఛీ,

    సుయణో ఉణ కహసు మహం న యాణిమో కత్థ సంభూఓ

పాలసముద్రం మథించగా చంద్రుడు పుట్టాడు, కల్పవృక్షం పుట్టింది, లక్ష్మి పుట్టింది. అయితే సుజనుడు ఎక్కడ పుట్టాడో చెప్పు.


వజ్జాలగ్గానికి క్రీ.శ.1335లో రత్నదేవగణి సంస్కృతంలో ఒక వ్యాఖ్య కూర్చారు.


                                                                                                            -ప్రాకృతభాషావాఙ్మయచరిత్ర నుండి

 

Saturday, March 27, 2021

చ్యవన మహర్షి చరిత్ర

 చ్యవన మహర్షి చరిత్ర

సాహితీమిత్రులారా!


డా. శివానంద మూర్తి గారి గళములో

చ్యవన మహర్షి చరిత్ర

ఆకర్ణింపుడు-Thursday, March 25, 2021

కశ్యప మహర్షి చరిత్ర

 కశ్యప మహర్షి చరిత్ర

సాహితీమిత్రులారా!

డా. శివానంద మూర్తిగారి గళంనుండి

కశ్యప మహర్షి చరిత్ర ఆకర్ణించండి-

Tuesday, March 23, 2021

అగస్త్యమహర్షి చరిత్ర

అగస్త్యమహర్షి చరిత్ర

సాహితీమిత్రులారా!

డా. శివానంద మూర్తిగారి గళంనుండి

అగస్త్యమహర్షి చరిత్ర ఆకర్ణించండి- Friday, March 19, 2021

గోదానం(కథ)

 గోదానం(కథ)
సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

గోదానం (కథ) ఆస్వాదించండి-Wednesday, March 17, 2021

చమత్కార పద్యం

చమత్కార పద్యం సాహితీమిత్రులారా!శ్రీనాథుని హరవిలాసంలో హిమవంతుడు
శివుని ఆకారాన్ని వెక్కిరిస్తూ పార్వతికి
చెప్పిన చమత్కార పద్యం -

తలమీద చదలేటి దరిమీల దినజేరు 
        కొంగలు చెలగి కొంకొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
        బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
        బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱుమనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
        భూతి మై జిలికిన బుస్సురనగ
దమ్మిపూజూలి పునుక కంచమ్ము సాచి
దిట్ట తనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు


శివుడు బిక్షకు వెళ్ళే సమయంలో ఎంత గోలగోలగా
ఉంటుందో వర్ణించిన పద్యం ఇది-


తలమీద చదలేటి దరిమీల దినజేరు 
        కొంగలు చెలగి కొంకొంగురనగ

తలమీది ఆకాశగంగలో ఉన్న దరిమీనులనే
చేపలను తినడానికి  కొంగుకొంగుమనే శబ్దం చేస్తూ
కొంగలు మూగి ఉన్నాయి.

మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
        బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ


మెడలోని పుఱ్ఱెలమాల, శివుడు కదులుతూంటే
ఒకదానికొకటి తగులుకొని
బొణుగూ బొణుగూ అనే శబ్దం చేస్తున్నాయి.

గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
        బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱుమనగ

కట్టుకున్న పులితోలుకొంగు చివర, శివుడు ఎక్కిన
నందిని తాకుతూ ఉంటే అది చిఱ్ఱుబుఱ్ఱు లాడుతూంది.

గడియంపు బాములు కకపాలలో నున్న
        భూతి మై జిలికిన బుస్సురనగ

చేతికి కడియాల్లా కట్టుకున్నపాములు
చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలోని విభూది
తుళ్ళి పడినపుడల్లా బుస్సుబుస్సు మంటున్నాయి.

దమ్మిపూజూలి పునుక కంచమ్ము సాచి
దిట్ట తనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని


బ్రహ్మకపాలం చేత పట్టుకొని
వీధివీధి తిరిగి  బిచ్చమెత్తుకుంటాడు

యిట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు
అటువంటి శివుడికి ముష్టెత్తుకున్నకూడు తప్ప
మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా - అని భావం.


ఈ పద్యం లో ఎక్కువపాలు
తెలుగు పదాలే వాడాడు శ్రీనాథుడు
అదేకాక ధ్వన్యనుకరణ
నాలుగుపాదాల్లో కనిపిస్తుంది
ఎంత చమత్కారంగా
ఎంత వ్యంగ్యంగా వర్ణించాడో కదా!

Monday, March 15, 2021

సత్యపాలన(కథ)

 సత్యపాలన(కథ)
సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

సత్యపాలన (కథ) ఆస్వాదించండి-Saturday, March 13, 2021

నా ఇల్లు(కథ)

 నా ఇల్లు(కథ)
సాహితీమిత్రులారా!


సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

నా ఇల్లు (కథ) ఆస్వాదించండి-Thursday, March 11, 2021

నమకమ్ - చమకమ్

 నమకమ్ - చమకమ్

సాహితీమిత్రులారా!

ఈ పర్వదినాన నమక-చమకాలను

భక్తితో వినండి-Tuesday, March 9, 2021

ముద్ర(కథ)

 ముద్ర(కథ)
సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

ముద్ర (కథ) ఆస్వాదించండి-Sunday, March 7, 2021

మహాకవి శ్రీశ్రీ - 2

 మహాకవి శ్రీశ్రీ - 2
సాహితీమిత్రులారా!

మహాకవి శ్రీశ్రీ ని గురించి

కిరణ్ ప్రభ టాక్ షో నుండి 

ఆస్వాదించండి-Friday, March 5, 2021

మహాకవి శ్రీశ్రీ - 1

 మహాకవి శ్రీశ్రీ - 1
సాహితీమిత్రులారా!


మహాకవి శ్రీశ్రీ ని గురించి

కిరణ్ ప్రభ టాక్ షో నుండి 

ఆస్వాదించండి-
Wednesday, March 3, 2021

మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్ - ఏడా లవ్ లేస్

 మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్ 
         ఏడా లవ్ లేస్

సాహితీమిత్రులారా!


మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్ 

ఏడా లవ్ లేస్ ను గురించి

కిరణ్ ప్రభ టాక్ షో నుండి

ఆస్వాదించండి-