సత్సంగత్వే నిస్సంగత్వం
సాహితీమిత్రులారా!
మంచివారు సరసులు అయినవారితో స్నేహం
ఎలాంటిదో ఈ పద్యం చెబుతుంది చూడండి-
చెఱకు రసంబుకన్ననును చేెడెలకన్నను, తేనెకన్న, భా
సుర సుధకన్న, తియ్యనగు చూతఫలంబు కన్న, ఖండశ
ర్కర రుచికన్న ధాత్రి మధురంబయి తోచు వివేకి యౌ మహా
సరసుని తోడ ముచ్చటలు సారెకుసల్పుచున్న భైరవా!
ఇది భైరవా! మకుటంతో కనిపించే
సుభాషితపద్యాల్లో ఒకటి.
సరసులైన సుజనులతోటి
మాటిమాటికి మాట్లాడుతుండడం
వలన చాలా మంచిదని
ఈ పద్యం చెబుతున్నది.
చెరుకు రసం కంటె, కోమలమైన జవరాండ్ర కంటె,
తేనె కంటె, అమృతంకంటె, తీయమామిడి పండుకంటె,
కండ చక్కరలకంటె చాలా రుచిగా, తీయగా ఉంటుంది.
అంతేగాక వాటిరుచి ఆనందం తాత్కాలికం.
కాని వివేకంగల సరసునితో మాట్లాడటంవల్ల
కలిగే ఆనందం చాలాకాలం మనస్సులో నిలిచి ఉంటుంది.
ఇంకొంచెం ముందుకెళితే దీన్నే
మన శంకరులవారు
"సత్సంగత్వే నిస్సంగత్వం" అన్నారు.
No comments:
Post a Comment