Sunday, August 30, 2020

సప్తర్షిమండలం మారుతూవుంటుందా?

 సప్తర్షిమండలం మారుతూవుంటుందా?




సాహితీమిత్రులారా!

What are the Saptarishi? - Quora

మన హిందూసమాజంలో వివాహానంతరం

నూతన వధూవరులను అరుంధతీ దర్శనంకోసం

సప్తర్షిమండలంలోని అరుంధతీనక్షత్రం చూపడం

ఆచారం. అది కనిపిస్తుందా లేదా అన్నది వేరే అంశం.

అది ఉత్తరం వైపునకు చూపించి చెబుతుంటారు.

కాని అది దిశమారుతుందా. కాదు. మరి ఎలామారుతుంది

అంటే అది మన చంద్రుడు ప్రతిరోజు ఒక నక్ష్తత్రం దగ్గర 

వుంటాడు కదా అలాగట.

ప్రతివందసంవత్సరాలకు ఒక నక్షత్రం మారుతూవుంటుందట.

ఈ విషయం తిరుమల శ్రీనివాసశర్మగారు రచించిన వేదవాఙ్మయము

12 పుటలో వివరించడం జరిగింది. పరీక్షిత్తు పుట్టినపుడు మఘ నక్షత్రం

ఉన్నదని, నందుని రాజ్యాభిషేకసమయానికి పూర్వాషాఢ నక్షత్రం లో

సప్తర్షిమండలం ఉన్నట్లు ప్రాచీన విద్వాంసులు వివరించినట్లు చెప్పాడు.

ప్రతివంద సంవత్సరాలకు నక్షత్రం మారుతుందని వివరించం జరిగింది.

దీన్నిబట్టి సప్తర్షిమండలం మారుతూవుంటుందని అర్థమౌతున్నదికదా


Friday, August 28, 2020

గృహిణీపదమ్

 గృహిణీపదమ్




సాహితీమిత్రులారా!


దూరదర్శన్ వారు  మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలను 

ప్రసారం చేశారు వాటిని మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 

మీ ముందుంచుతాను వాటిలో 

ఇప్పుడు గృహిణీపదమ్ అనే కథ వీక్షించండి-




Tuesday, August 25, 2020

ఎవరెవరు కొడుకులు?

 ఎవరెవరు కొడుకులు?




సాహితీమిత్రులారా!


కొడుకులు స్వభావాన్ని బట్టి కాకుండా

పుట్టుకను బట్టి 12 (ద్వాదశ పుత్రులు) విధాలు.


1. ఔరసుడు - తనభార్య యందు తనకు పుట్టినవాడు.

2. క్షేత్రజుడు - పెద్దల అనుజ్ఞచేత భర్త అన్న, తమ్ముడు మొదలైన

                      వారికి పుట్టినవాడు (దీన్నే దేవరన్యాయము వలన అని కూడ అనవచ్చు.)

3. దత్తుడు - దత్తత తీసుకోబడినవాడు.

4. కృత్రిముడు - అభిమానించి పెంచుకోబడినవాడు

5. గూఢోత్పన్నుడు - తనకు తెలియకుండా ఱంకు మగనికి పుట్టినవాడు

6. అపవిద్ధుడు - తండ్రిచేతగాని తల్లిచేతగాని విడువబడగా, తెచ్చి పెంచుకోబడినవాడు.

7. కానీనుడు - తన భార్య యందు కన్యాత్వదశలో రహస్యముగా ఇతరునికి పుట్టినవాడు.

8. సహోఢజుడు - గర్భిణిగా ఉండగా, తెలిసిగాని తెలియకగాని

                              వివాహము చేసికొన్న భార్యకు పుట్టినవాడు.

9. క్రీతుడు - తల్లిదండ్రులకు ధనాన్నిచ్చి కొనుక్కోబడినవాడు

10. పౌనర్భవుడు - మారుమనువు చేసికొన్న స్త్రీకి పుట్టినవాడు

11. జ్ఞాతిరేతుడు - దాయాది కొడుకు (కొందరు పుత్రిక పుత్రుడు అని అంటారు.)

12. స్వయందత్తుడు - తల్లిదండ్రులు లేక గాని వారిచేత అకారణంగా విడువబడిగాని ,

                                   తనంతట తాను నీకు పుత్రుడనౌతానని వచ్చిన కొడుకు.


కొడుకులు ఇన్నిరకాలుగా ఉన్నారు.

వీరికి ఇతిహాసంలోగాని చరిత్రలోగాని

ఉదాహరణలు గుర్తించండి.

Sunday, August 23, 2020

కురుక్షేత్రయుద్ధంలో ఇరువైపు సేనానులు

 కురుక్షేత్రయుద్ధంలో ఇరువైపు సేనానులు




సాహితీమిత్రులారా!

భారత యుద్ధం

అంటే కురుక్షేత్రంలో

కౌరవుల సైన్యం  - 11 అక్షౌహిణులు

పాండవుల సైన్యం-  7 అక్షౌహిణులు

ఈ సైన్యాన్ని ఒక అక్షౌహిణి సైన్యనానికి 

ఒక సైన్యాధిపతి చొప్పున నియమించారు.

ఆ లెక్కన కౌరవులకు 11 మంది సైన్యాధిపతులు

పాండవులకు 7 మంది సైన్యాధిపతులు

వారిపై ఒక సర్వసైన్యాధ్యక్షుడుంటాడు

యుద్ధప్రారంభంలోని సైన్యధిపతులు

కౌరవుల సైన్యాధిపతులు -

1. కృపాచార్యుడు, 2. ద్రోణాచార్యుడు, 3. అశ్వత్థామ,

4. శల్యుడు, 5. జయద్రథుడు, 6. సుదక్షిణుడు,

7. కృతవర్మ, 8. కర్ణుడు, 9. భూరిశ్రవుడు,

10. శకుని, 11. బాహ్లికుడు.

వీరందరికి సర్వసైన్యాధ్యక్షుడు - 

10 రోజులు - భీష్ముడు

5రోజులు - ద్రోణుడు

2రోజులు - కర్ణుడు

1రోజు - శల్యుడు

వీరు కాక చివరిలో సైన్యమేలేకుండా

సైన్యాధిపతి అయినవాడు అశ్వత్థామ


పాండవుల సైన్యాధిపతులు -

1. ద్రుపదుడు, 2. విరాటుడు, 3. ద్రుష్టద్యుమ్నుడు 4.శిఖండి,

5. సాత్యకి, 6. చేకితానుడు, 7. భీమసేనుడు


వీరందరికి 18 రోజులు యుద్ధం ముగిసేదాక

సైన్యాధిపతి - ద్రుష్టద్యుమ్నుడు


Saturday, August 22, 2020

వినాయక చవితి శుభాకాంక్షలు

 వినాయక చవితి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

వినాయక చవితి శుభాకాంక్షలు


Thursday, August 20, 2020

శరసంధాన బల క్షమాది........

 శరసంధాన బల క్షమాది........


సాహితీమిత్రులారా!


కృష్ణదేవరాయలను అల్లసాని పెద్దన వర్ణించిన పద్యం

చూడండి-

శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు

ర్భర షండత్వ - బిలప్రవేశ - చలన - బ్రహ్మఘ్నతల్ మాని నన్

నర - సింహ - క్షితిమండ - లేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా

నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!


ఓ నరసింహరాయల కుమారుడైన కృష్ణదేవరాయా! రాజశ్రేష్ఠా!

నర - నరుడు, శరసంధాన - శరసంధానంలోను, సింహ - సింహము, బల - బలములోను, 

క్షితి - భూమి, క్షమ - ఓర్పులోను, ఈశ్వర - ఈశ్వరుడు, వివిధైశ్వర్యంబులుం- 

అనేక రకాలైన ఐశ్వర్యములోను, గొప్పవారే అయినను 

ఈనలుగురిలోను నాలుగు దోషాలున్నాయి. 

1. నరుని(అర్జునుడు)కి నపుంసకత్వం

2. సింహం గుహలో దాగి ఉండుట(బిలప్రవేశ), 

3. భూమి కంపించుట(చలన), 

4. ఈశ్వరుడు బ్రహ్మహత్య(బ్రహ్మదేవుని తలనరుకుట) 

అనే దోషాలుండుటచే ఈ నరుడు, సింహం, భూమి, ఈశ్వరులు నీతో సరిపోలరు. అని వర్ణించాడు. 

Monday, August 17, 2020

నీకెంత నొప్పి కలిగిందో

 నీకెంత నొప్పి కలిగిందో



సాహితీమిత్రులారా


ఈ చమత్కార శ్లోకం చూడండి -

దాసే కృతాగసి భవే దుచితః ప్రభూణాం

పాదప్రహార ఇతి సుందరి నాస్మిదూయే

ఉద్యత్క ఠోరపులకాంకుర కంటకాగ్రై

ర్యత్ఖిద్యతే మృదు పదం నను సా వ్యథా మే


సేవకుడు తప్పుచేసినప్పుడు యజమానులు కోపించి పాదంతో తన్నటం సరైనదే.

నీకు దాసుడనైన నేను నీవిషయంలో అపరాధం చేసినందుకు నన్ను నీవు

పాదప్రహారం చేసినందుకు బాధపడను.కానీ నీ పాదస్పర్శతో నా శరీరం పుకించి

నిక్కబొడిచిన కంటకాల్లాంటి రోమాల వల్ల కోమవమైన నీ పాదానికి నొప్పి కలిగిందేమో

అని బాధపడుతున్నాను - అని భావం.


తన ప్రియురాలికి తాను అప్రియమైన పని దేన్నో

చేసినందువల్ల కోపశీలి యైన ఆమె ప్రణయ కోపంతో

కాలితో పతిని తన్నింది. అతడు ఆమె పైగల

రాగాతిశయంతో అనునయిస్తూ పలికిన శ్లోకం ఇది.

Saturday, August 15, 2020

వెలది వెన్నెల

 వెలది వెన్నెల




సాహితీమిత్రులారా!

దూరదర్శన్ వారు 

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలను 

ప్రసారం చేశారు వాటిని 

మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 

మీ ముందుంచుతాను వాటిలో 

ఇప్పుడు వెలది వెన్నెల అనే కథ వీక్షించండి-


Thursday, August 13, 2020

ఎడారికోయిల(కథ)

 ఎడారికోయిల(కథ)


సాహితీమిత్రులారా!


దూరదర్శన్ వారు 

మధురాంతకం రాజారాం గారి కథలను 

ప్రసారం చేశారు వాటిని 

మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 

మీ ముందుంచుతాను వాటిలో 

ఇప్పుడు ఎడారికోయిల అనే కథ వీక్షించండి-


Tuesday, August 11, 2020

కైంకర్యం(కథ)

కైంకర్యం(కథ)




సాహితీమిత్రులారా!


దూరదర్శన్ వారు 

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలను 

ప్రసారం చేశారు వాటిని 

మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 

మీ ముందుంచుతాను వాటిలో 

ఇప్పుడు కైంకర్యం అనే కథ వీక్షించండి-


Sunday, August 9, 2020

ఆరు నంబరు గది

 ఆరు నంబరు గది





సాహితీమిత్రులారా!


H.M.T.V. నిర్వహణలో వందేళ్ళకథకు వందనం

సాహిత్య సంచిక కార్యక్రమంలో

ఇంద్రగంటి హనుమనుమత్ శాస్త్రిగారి కథ

ఆరు నంబరు గది

సంపాదకులు గొల్లపూడి మారుతీరావు నిర్వహణ

వీడియో వీక్షించండి-


Friday, August 7, 2020

వినోదప్రదర్శన(కథ)

 వినోదప్రదర్శన(కథ)




సాహితీమిత్రులారా!


దూరదర్శన్ వారు 

మధురాంతకం రాజారాం గారి కథలను 

ప్రసారం చేశారు వాటిని 

మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 

మీ ముందుంచుతాను వాటిలో 

ఇప్పుడు వినోదప్రదర్శన అనే కథ వీక్షించండి-


Wednesday, August 5, 2020

అప్పల నరసయ్య


అప్పల నరసయ్య




సాహితీమిత్రులారా!

దూరదర్శన్ వారు 
మధురాంతకం రాజారాం గారి కథలను 
ప్రసారం చేశారు వాటిని 
మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 
మీ ముందుంచుతాను వాటిలో 
ఇప్పుడు అప్పల నరసయ్య అనే కథ వీక్షించండి-

Monday, August 3, 2020

అత్తాతోడికోడలీయం

అత్తాతోడికోడలీయం




సాహితీమిత్రులారా!

మన తెలుగులో పాతతరం నటీమణులలో 
భానుమతి అందరికీ సుపరిచితురాలే. 
ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. 
ఆమె కథలను గురించిన
విషయం సాహిత్యసంచిక కార్యక్రమంలో  
సంపాదకుడు
 గొల్లపూడి మారుతీరావుగారు 
ఆమె కుమారుడు డా. భరణిగారు
చర్చించిన వీడియో H.M.T.V. వారి 
వందేళ్ళ కథకు వందనాలు శీర్షికలో
అత్తాతోడికోడలీయం వందేళ్ళనాటి కథ
ప్రసారం చేశారు. ఆవీడియో వీక్షించండి-



Saturday, August 1, 2020

మధురాంతకం రాజారాం కథలు (ప్రియబాంధవి)


మధురాంతకం రాజారాం కథలు (
ప్రియబాంధవి)





సాహితీమిత్రులారా!

దూరదర్శన్ వారు 
మధురాంతకం రాజారాం గారి కథలను 
ప్రసారం చేశారు వాటిని 
మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 
మీ ముందుంచుతాను వాటిలో 
ఇప్పుడు ప్రియబాంధవి అనే కథ వీక్షించండి-