జామాతా దశమో గ్రహ:
సాహితీమిత్రులారా!మనకు గ్రహాలు తొమ్మదని తెలుసు.
పదోగ్రహంకూడా ఉందట దానిపేరే అల్లుడు.
దాని ప్రత్యేకతను చెప్పడి శ్లోకం చూడండి-
సదా వక్ర స్సదాక్రూర: సదా పూజా మపేక్షతే
కన్యారాశి స్థితో నిత్యం జామాతా దశమో గ్రహ:
నవగ్రహాలకు ఈ గ్రహానికి తేడాలున్నాయి.
ఆ గ్రహాలు ఎప్పడో ఒకసారి వక్రీకరిస్తాయి.
సూర్యచంద్రులకు అసలు వక్రగతిలేదు.
రాహుకేతువులు ఎప్పుడూ వక్రంగానే చరిస్తాయి.
మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు వక్రిస్తాయి.
కాని జామాత(అల్లుడు) ఎప్పుడూ వక్రంగా ఉంటాడు.
శని మొదలైన వారు కొన్ని సమయాల్లోనే క్రూరులు,
కొన్నిసార్లు శుభులుగా ఉంటారు. కాని అల్లుడు
ఎల్లపుడూ క్రూరుడే. నవగ్రహాలు నియమిత కాలంలోనే
పూజను జరుపుతారు.కాని జామాత ఎప్పుడూ పూజ కోరతాడు.
ఇతరగ్రహాలు రాశులుమారుతుంటాయి. కాని జామాత ఎప్పుడూ
కన్యారాశిలోనే ఉంటాడు.
అందువల్ల ఈ దశమగ్రహం మిగిలినవాటికంటె
విలక్షణమైనది - అని భావం.
No comments:
Post a Comment