Thursday, October 6, 2016

సవతులను కూడ తీసుకెళతాయి


సవతులను కూడ తీసుకెళతాయి


సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం చూడండి
ఎంత చక్కటి సూక్తిని చెబుతున్నదో
మంచివారి సహవాసం ఎలాంటిదో
చెప్పెడి శ్లోకం ఇది.

మహాత్మానోనుగృహ్ణంతి భజమానాన్ రిపూనపి
సపత్నీ: ప్రపయన్త్యబ్ధిం సింధవో నగనిమ్మగా:

మహాత్ములు తమను ఆశ్రయించిన
శత్రువులను కూడ అనుగ్రహిస్తారు.
పర్యతాలలో పుట్టి సాగరంవైపు ప్రవహించే
నదులు తమకు సవతులైన ఉపనదులను
సైతం సముద్రానికి చేరుస్తున్నాయి కదా.

No comments:

Post a Comment