Friday, October 7, 2016

చీనా చాటువులు


చీనా చాటువులు


సాహితీమిత్రులారా!



నండూరి కృష్ణమాచార్యులువారు
చీనా చాటువులను పద్యాలుగా అనువదించెనవి
(భారతి మాసపత్రికలోనివి పద్యాలు) చూడండి
చైనాదేశ సారసత్వంలో గేయకవిత్వం, ఖండకావ్యాలు,
ప్రాచీన కాలంనుండి విశిష్టాలు.

చీనాకవితలోని విరహవేదనలు విషాదచ్ఛాయలు
విశ్వజనీనములు వాటిలోని కొన్ని
ఉదాహరణకు అనువాదాలు ఇవి.

తోడు - నీడ
కవి హసియాంగ్ క్రీస్తుశకము 1100 సంవత్సరములో
చీనాభాషలో గేయాలు చాటువులు అల్లినారు.
ఒకచాటువుకు అనువాదం ఈ పద్యం -

కూడి గవాక్షకాంతులను కూర్చొనినారము రాత్రి నేను నా
నీడయు, దీపమార్పితిని నిద్రకువేళయతిక్రమింప, నా
నీడయె నన్ను వీడె గది నింపుచు చీకటి గ్రమ్మునంత, ఏ
తోడును నీడగాని దరి దోచునె దన్యతమోనిమగ్నునకున్ 

పుష్పబాణ విలాసము 

కవి వూపో. కాలము నిర్థారించుకు వీలుకాదు.

చెలువ యొకర్తు నాథుదరిజేరి విలోల విలాసయై ఉష
స్సుల వికసించి మించి సొగసుల్ విరజిమ్ము తుషారబిందు తుం
దిలమగు లేతగులాబి, పసినిగ్గులు చిందెడి బుగ్గ జేర్చి, ఏ 
చెలువము నీకు ఎక్కువ రుచించునటం చడిగెన్ హసించుచున్ 

కాంత నుడికింప దలపోసి కాంతుడపుడు
మెచ్చుకొనియె గులాబీయే మేలటంచు 
అంత భ్రుకుటీవిభంగయై అతివ కనలి
విభుని రివ్వున  పువ్వుతో విసరి కొట్టె

No comments:

Post a Comment