Sunday, October 9, 2016

గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం


గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం


సాహితీమిత్రులారా!




ప్రపంచంలో అత్యంత వింతైనది
పుట్టుమూగకు మాటలురావడం
వచ్చీరాగానే ఏకంగా 500ల శ్లోకాలు
చెప్పడం వింతే కదా!
 అలాంటిదేం లేదు అంటారు చాలమంది
ఉండొచ్చేమో అంటారు కొందరు
ఏది ఏమైనా అందుకు ఋజువు
మూకపంచశతీ ఇందులో
ఆర్యా శతకమ్,
పాదారవింద శతకమ్,
స్తుతి శతకమ్,
కటాక్ష ఖతకమ్,
మందస్మిత శతకమ్
అనే పేర్లతో 500ల శ్లోకాలు చెప్పిన
శ్రీమూకశంకరేంద్ర సరస్వతి
కంచి కామకోటి పీఠానికి 20వ పీఠాధిపతి.

ఆయన రచించిన మూకపంచశతీలోని
పాదారవింద శతకమ్ లోని 44వ శ్లోకం ఇది చూడండి-


గిరాం దూరౌ చూరౌ జడిమతిమిరాణాం కృతజగ
త్పరిత్రాణౌ శోణౌ మునిహృదయలీలైకనిపుణౌ
నఖైస్మ్సేరౌ సారౌ నిగమవచసాం ఖండితభవ
గ్రహోన్మాదౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే

వాక్కులకు దూరమైన జాడ్యమును చీకటిని హరించునది,
లోకమును రక్షించునది ఎర్రనైన, ముని హృదయములలో
విహరించుటలో నైపుణ్యంగల, గోళ్ళతో నవ్వునట్టి వేదవాక్కుల
సారమైనట్టి సంసారమునుదయ్యం వల్ల కలుగు పిచ్చిని తొలగించునట్టి
నీ పాదములను అమ్మా కామాక్షీ! ధ్యానించెదను - అని భావం.


No comments:

Post a Comment