ఏకస్య సర్పస్య ఫణా అనేకా
సాహితీమిత్రులారా!
మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు
తన కవితావినోదములో
ఈ విధంగా చమత్కిస్తున్నారు
చూడండి.
ఏకస్య సర్పస్య ఫణా అనేకా
భూయాసు, రద్యాపి తు పుచ్ఛ మేకమ్
అహో! కలౌ కిం విపరీత మేత?
ద్య ద్యోషితాం నూతనవేణిబంధై:!
సృష్యి మొదలు నుండి ఇప్పటివరకు
పాముకు పడగలు అనేకంగా ఉండటం చూస్తున్నాం
కాని తోక ఇప్పటి వరకు ఒకటే ఈ సృష్టిలో మార్పులేదు.
కాని కలిప్రభావం వలన స్త్రీల తలలపైకి ఎక్కి జడలలో
ఒకటికి రెండుగా మూడుగా పెంచుకొని పోయి బ్రహ్మసృష్టినే
తలక్రిందులు చేసివేసినది. (జడ తోకఅని, తల పడగ అని స్త్రీల
వేణీబంధమునకు సర్పసాదృశ్యము కవి సమయసిద్ధము)
ఇప్పటికి ఇంతటితో నిలిచిందని సంతోషించరాదు
ఇంక ముందు ఎంతవరకు కవి ఊహను పరువళ్ళు
పుట్టించునో! కాలమున్నది. కనులున్నవి - అంటున్నాడు కవి.
No comments:
Post a Comment