Showing posts with label భావానుకరణ. Show all posts
Showing posts with label భావానుకరణ. Show all posts

Wednesday, February 15, 2017

హేమంబు కూడబెట్టిన


హేమంబు కూడబెట్టిన




సాహితీమిత్రులారా!



వెన్నెకంటి జన్నమంత్రి
దేవకీనందన శతకంలోని
ఈ పద్యం చూడండి-

చీమల్ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించినన్
పాముల్ జేరినరీతి లోభిజన సంపన్నార్థరాసుల్ వృథా
భూమీపాలుల పాలుగాక చనునా పుణ్యంబులేలొల్లరో
సామాన్యంబు ధనాధినాధులకు కృష్ణా! దేవకీనందనా!
                                                                              (దేవకీనందన శతకము - 72ప.)

ఈ పద్యం మనం ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందికదా
అదేనయ్యా సుమతి శతకంలో చూడండి ఈ పద్యానికి
పై పద్యానికీ తేడా-

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేయు భువిలో సుమతీ (43ప.)

ఇది కందపద్యం కావున చిన్నదిగాను క్లుప్తంగాను ఉంది
అలాగే మొదటిపద్యం శార్దూలవృత్తంలో ఉందికావున
కొంచెం విపులంగా పెద్దగా ఉంది భావం అంతా ఒకటేకదా


Thursday, January 12, 2017

కొడుకా! యెక్కడికేగితే (భావానుకరణ)


కొడుకా! యెక్కడికేగితే (భావానుకరణ)



సాహితీమిత్రులారా!


శేషధర్మములపేరుతో చాల మంది కృతులు కూర్చారు.
వారిలో తామరపల్లి తిమ్మయాభిధానులు ఒకరు.
వీరి శేషధర్మము తృతీయాశ్వాసంలోని ఈ పద్యం చూడండి-

తనయా! నీనగుమోముఁజూపి మదిలో దైన్యంబు వోఁబెట్టి చ
క్కని నెయ్యంబున ముద్దు బల్కులు వినంగాఁ బల్కవే నిన్నుఁబా
సిన రత్నాభరణాంబరార్థ గజవాజిస్యందనాందోళికా 
ద్యనవద్య స్థితులేల? మందిరములేలా? నూఱువేలుండినన్?


దీనికి అల్లంరాజు సుబ్రమణ్యకవి
చెప్పిన పద్యం చూడండి-

కొడుకా!యెక్కడకేగితే! మొగమునాకుంజూపి డెందంబులో 
నడలుం బాపుమ! నిన్ను బాసిన మణుల్ హర్మ్యంబులున్ దోఁటలున్
గుడుముల్ శర్కరముల్ ధనంబులు నగల్ కోటానుకోట్లున్న నీ
నొడువుల్ వోలె మనోరథార్థవితతుల్ నూల్కొల్పలే వెవ్వియున్

చూచారుకదా పై పద్యానికి
దీనికి భావంలో తేడా ఏమైనా ఉందా!


Saturday, January 7, 2017

నుతజల పూరితంబులగు నూతులు.......


నుతజల పూరితంబులగు నూతులు.......



సాహితీమిత్రులారా!



నన్నయ శ్రీమదాంధ్రమహాభారతము
ఆదిపర్వంలోని ఈ పద్యం చూడండి-

శకుంతల దుష్యంతునితో అన్న పద్యం ఇది-

నుతజలపూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావిమేలు మరి బావులు నూరిటికంటె నొక్క స
త్క్రతువది మేలు తత్క్రతుశతంబుకంటె సుతుండు మేలు త
త్సుతు శతకంబుకంటె నొక సూనృతవాక్యముమేలు చూడగన్
           (శ్రీమదాంధ్రమహాభారతము - ఆది - 4- 96)

సత్యవ్రతముకల ఓ రాజా!
మంచినీటితో నిండిన చేదుడు బావులనూరిటికంటె
ఒక దిగుడు బావి మేలు కాగా అలాంటి బావులు నూరిటికంటె
ఒక మంచి యజ్ఞము మేలు, అటువంటి నూరు యజ్ఞాలకంటె
ఒక కొడుకు మేలు, అలాంటి నూరుగురు కొడుకుల కంటె
ఒక సత్యవాక్యం మంచిది - అని భావం.

దీన్ని నన్నయగారు చంపకమాలలో వ్రాయగా
అనంతామాత్యులుగారు ఇదే భావంగల పద్యం
కందంలో ఎంత చక్కగా ఇమిడ్చారో చూడండి -

శతకూపాధికదీర్ఘిక
శతవాప్యధికంబు గ్రతువు శతయజ్ఞ సము
న్నతు డొక్క సుతుడు దత్సుత
శతకంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా!
                                                                    (భోజరాజీయము - 6-84)



Wednesday, December 28, 2016

తనకోపమె తనశత్రువు (భావానుకరణ)


తనకోపమె తనశత్రువు (భావానుకరణ)




సాహితీమిత్రులారా!



మనకు సుమతీ శతకంలోని ఈ పద్యం
సుపరిచితమే దీనికంటే ముందే నన్నయ
భారతంలో ఇదే భావంతో పద్యం ఉండటం విశేషం.
ఆ పద్యం -
పరీక్షిన్మహారాజు వేటకు వెళ్ళినపుడు
వేటలో బాణపుదెబ్బతగిలిన లేడిని వెదుకుతూ
శమీక ముని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న
మునిని ఆ లేడిని గురించి అడిగాడు
తపస్సమాధిలో ఉన్న ముని ఎంతకూ పలుకకపోగా
కోపించి అక్కడే దూరంగా చచ్చిపడిఉన్న పాముని తెచ్చి
ముని మెడలో వేసి వెళ్ళాడు. అతడు వెళ్ళిన తరువాత
ఆమునికిమారుడైన శృంగి వచ్చి తన తండ్రి మెడలో
పాముని చూచి కుపితుడై శపించాడు.
తండ్రి సమాధినుండి లేచిన తరువాత
శాపమిచ్చిన సంగతి తెలిపాడు.
అప్పుడా ముని కుమారునితో
తొందరపడ్డావునాయనా అని బాధపడి,
కొడుకుతో పలికిన మాటల్లోని ఈ పద్యం చూడండి-

క్రోధమ తపముం జెరచును
క్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధ యగుం, గ్రోధిగా దపస్వికి జన్నే

కోపము తపస్సును చెడగొడుతుంది.
కోపమే అణి, గరిమ, లఘిమాది అష్టసిద్ధులను
పోగొడుతుంది. కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు
బాధ కలిగిస్తుంది. కావిన తపస్సుచేసే మునికి
కోపము తగునా - అని భావం.

క్షమలేని తపసి తనమును
బ్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురా
జ్యము భిన్నకుంభమున తో
యములట్టుల యధ్రువంబు లగు విని యెల్లన్
(శ్రీమదాంధ్రమహాభారతము -1-2-172,173)

ఓర్పులేని ముని తపస్సూ,
ప్రమాదపడేవాని ధనమూ,
ధర్మంనుండి తొలగిన రాజు రాజ్యమునూ,
ఇవన్నీ బద్దలయిన కుండలోని వలె
అస్థిరములవుతాయి - అని భావం


వినిలోని భావాన్ని తరువాతి కాలంలో
సుమతీశతకకారుడైన బద్దెనకు క్రింది పద్యానికి
ఒరవడి దిద్దనదని పండితుల అభిప్రాయం-



తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

Thursday, December 8, 2016

మందార మకరంద మాధుర్యమున (భావానుకరణ)


మందార మకరంద మాధుర్యమున (భావానుకరణ)




సాహితీమిత్రులారా!


అనుకరణ అనేది మన మనుగడకు మూలం.
అలాగే మంచి విషయాలు ఎక్కడఉన్నా
అవి స్వీకరించాల్సిందే
అలాంటి పనే మనకవులు చేశారు.
అలాంటి వాటిలో ఇది చూడండి-


పాల్కురికి సోమనాథుని బసవపురాణం
తృతీయాశ్వాసంలోని ఈ పద్యాలు(ద్విపద)
చూడండి -

క్షీరాబ్దిలోపల గ్రీడించు హంస 
గోరునే పడియల నీరు ద్రావంగ
జూతఫలంబుల జుంబించు చిలుక
జాతిబూరుగుమ్రానిపండ్లు గన్గొనునె
రాకామలజ్యోత్స్న ద్రావుచకోర
మాకాంక్షసేయునే చీకటిద్రావ
విరిదమ్మివాసన విహరించుతేటి
పరిగొని సుడియునే ప్రబ్బలి విరుల

ఈ ద్విపదపాదాలలోని భావాన్ని
బమ్మెర పోతన ఎంత మధురంగా కర్ణపేయంగా
మందార మకరందాన మత్తెక్కించారో
తెలియనివారు లేరనవచ్చు అది-

మందార మకరంద మాధుర్యమునఁ దేలు                           మధుపంబు బోవినే మదనములకు?నిర్మల మందాకినీ వీచికలఁదూఁగు                           రాయంచ సనునే తరంగిణులకు?లలితరసాల పల్లవఖాదియై చొక్కు                          కోయిల సేరునే కుటజములకుఁ?బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం                          బరుగునే సాంద్ర నీహారములకు?అంబుజోదర దివ్యపాదారవిందచింతనామృతపానవిశేష మత్తచిత్తమేరీతి నితరంబు చేర నేర్చు?వినుత గుణశీల మాటలు వేయునేల?


భక్తి పారవశ్యంలో ఎంత
హాయిగా ఓలలాడించాడోగదా

దీన్నే నందికొటుకూరి సిద్ధయోగి
తన యోగీశ్వర విలాసంలో ఇలా అనుకరించారు-

నిగమాంతశాస్త్రముల్ నేర్చి ధైర్యమున
దగబ్రహ్మవిద్యా పదార్థంబు గూర్చి
కనికరంబెప్పుడు గలిగిన జియ్య
యెనయంగ నీవుగా కెశ్వరు గలరు
మానితభక్తి క్రమంబున ముక్తి
నేనేల వేడెద నితరుల జేరి
పదపడి తన తల్లి పాలు ద్రావంగ
మదినిచ్చయించెడు మాతంగపోత
మేలీలనైనను స్పృహనూరబంది
పాలకు బోవునే భక్తైకలోల
అంభోజ బృందాంత రాయుతైకాంత
బంభరంబులు చన్నె బర్బరంబులకు
సంపూర్ణ పూర్ణిమా చంద్రచంద్రికల
గుంపున నుండు చకోర సంచయము
చేరునే దట్టపు చీకట్ల కడకు
క్షీరపాధోధి వీచీనిత్యయుత సు
ధార సానంద మత్తమరాళచయము
కూరిమి జేర్చునే కుంటలకడకు
సహకార ఫలసార సౌఖ్యసత్కీర
బహుళౌఘ మేగునే బదరిశాఖలకు
నూతన ముదిర బంధుర తోయపాన
చాతకం బాసించి చనునెనూతులకు
లీల నీభంగి మేలిమి గృపావాల
శీల వాగ్జాల ప్రసిద్ధచే మున్ను
పుడమి బోధించి శంభుడవైన నిన్ను
విడిచి హృత్పద్మంబు వేరొక్కదారి
జనదయ్యజియ్య శిష్యస్వాంత శయ్య
(యోగీశ్వరవిలాసము -1- 289-315)

గమనించారా !
సోమన నుండి పోతన
పోతన నుండి సిద్ధయోగి అనుకరణ.