Thursday, March 30, 2023

క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు

 క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు




సాహితీమిత్రులారా!

సింగీతం శ్రీనివాసరావు గారు…

ఈ పేరు వినగానే కొందరికి ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు గుర్తుకువస్తాయి. ఇంకొందరికి పుష్పక విమానం, విచిత్ర సోదరులు, అమావస్య చంద్రుడు, మైఖేల్ మదన కామరాజు గుర్తుకువస్తే, మరికొందరికి మయూరి, పంతులమ్మలు గుర్తుకువస్తాయి. మొత్తంగా చూస్తే భారతీయ సినిమాని వైవిద్యభరితమైన మార్గాలలో కొత్తపుంతలు తొక్కించి ఘన విజయాలు అందుకున్న దిగ్దర్శకుడాయన. సింగీతం గారి సినిమాలలో గీతం, సంగీతం కూడా ఉత్తమ స్థాయిలోనే ఉంటాయి. వరుస విజయాల దర్శకుడు క్రిష్, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి ఎందరో దర్శకులకు స్ఫూర్తి మూర్తీ ‘సింగీతం’గారే. ఇప్పుడున్న పాత, కొత్తతరం దర్శకులలో సింగీతంగారితో సరిపోలే స్థాయి ఉన్నవారిని చూపించడం కొంచెం కష్టమేనేమో!

తొంభై ఏళ్ళ వయస్సు అన్నది ఆయనకు అస్సలు పట్టని విషయం. బహుశా అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ-టీవి ‘పుష్పక విమానం’ కార్యక్రమంలో ఆయన తన సినిమా సంగతులు చెప్పే విధానం చాలా ఆహ్లాదభరితంగా ఉండేది. ఆయా సినిమాలకు తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్‌ని తలచుకుంటూ, వారు తన సినిమాల విజయాలకు ఎలా భాగస్వాములయ్యారో వివరించే తీరు ఆయన వినమ్రతకు, స్వచ్ఛమైన హృదయానికి అద్దం పడుతుంది.

“మీ సినిమాలకు మీరే మాటలు రాస్తే బావుంటుంది” అని జంధ్యాల గారు నాతో చాలాసార్లు చెప్పారు. ఆయన మాటల్ని కాదనలేక “పుష్పక విమానం” తీశాను. అన్న చతురత సింగీతం గారిది. ఇటువంటి హాస్య చతురుడు కథా రచనకు పూనుకుంటే మరి ఆ కథలకు హాస్యం అంటకుండా ఎలా ఉంటుంది? ఒకలా చెప్పాలంటే ఇప్పటి సమాజం పోకడల మీద సింగీతం గారు సంధించిన సెటైరాస్త్రం ఈ ‘క రాజు’ కథలు. ఇందులో 21 కథలున్నాయి. ఒక్కో కథా ఒక్కో తీరుగా చిరుమందహాసాల, మందహాసాల మార్గాలలో సాగుతుంది. ప్రతీ కథ చివరా ‘క రాజు’ తన మంత్రికి చెప్పే విషయాలన్నీ మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థ చేసుకోవడానికి ఉపయోగపడే ధర్మసూక్ష్మాలే.

జీవిత సత్యాలని తేలిక మాటల్లో చెక్కి, వాటిని హాస్యపు తొడుగులలో చుట్టి కథలుగా అచ్చేసిన పుస్తకమిది. ఈ పుస్తకం నాకు నచ్చడానికైనా, మీకూ నచ్చతుంది అనడానికైనా ఇంతకుమించి కారణమేముంటుంది!! 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Tuesday, March 28, 2023

వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?

వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?




సాహితీమిత్రులారా!

వాల్మీకి రామాయణాన్ని భక్తి ప్రపత్తులు కలిగిన ఎందరో పండితులు తెలుగులోకి అనువదించారు. శ్రీరామచంద్రమూర్తిని హృదయం నిండా నింపుకుని ఉండటం చేతనూ, రామకథ మీద ఉన్న అపారమైన ఆపేక్ష చేతనూ, నేను ఆ అనువాదాలలో ఎన్నింటినో చదివాను. అలా నేను చదివిన వచన అనువాదాలలో ఉత్తమస్థాయివని భావించిన వాటి వివరాలను మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్!

రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు


 

Saturday, March 25, 2023

మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?

 మద్యం అలవాటు లేనివారు

ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?




సాహితీమిత్రులారా!

మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ముందుగా మీరు యండమూరి, మధుబాబు బ్రాండ్లతో మొదలు పెట్టండి. ఆ రెండు బ్రాండ్లూ ముప్పై, నలభై యేళ్ళుగా చాలా రిలయబుల్ బ్రాండ్లుగా పేరుమోసినవి. చాలామంది వాటితోనే మత్తులో జోగడం మొదలు పెట్టారు. ఆ మత్తు మహత్తు తెలిశాక, ఇంకా ఎక్కువ మత్తిచ్చే వాటికోసం వెతుక్కుని మరీ వెళ్ళేవారు. అలానే కాసేపు హాయిగా ఊహాలోకాల్లో విహరించాలంటే యద్దనపూడి బ్రాండు వాడండి. అక్కడనుండి మళ్ళా ఈలోకంలో దభీమని పడాలంటే రంగనాయకమ్మ బ్రాండు పుచ్చుకోండి. కిక్కుతో పాటూ భాష కూడా రావాలంటే మల్లాది, శ్రీపాద బ్రాండ్లు వాడండి. ఇవి ఏమాత్రం కల్తీలేని అచ్చతెలుగు బ్రాండ్లు. ఇక పాతబడే కొద్దీ ఎక్కువ కిక్ ఇవ్వడానికి గురజాడ బ్రాండ్, తాగేకొద్దీ మీ రక్తం ఎరుపెక్కి పోవాలంటే శ్రీశ్రీ బ్రాండ్‌ వాడండి. ఒకవేళ ఎరుపుతో పాటూ కాసింత లాలిత్యం కూడా కావాలంటే దాశరథీ బ్రాండ్‌ వాడండి. మీరు మొదట్లోనే విశ్వనాథ, చలం వంటి బ్రాండ్ల జోలికి పోకండి. అవి చాలా కాస్ట్‌లీ బ్రాండ్లు. వాటిని ఒకసారి టేస్ట్ చూస్తే ఇక వదిలి పెట్టడం కష్టం. అంతే కాక ఆ రెండింటి టేస్ట్‌లూ పూర్తిగా డిఫరెంట్ కూడా. వాటిలో విశ్వనాథ బ్రాండ్‌కు బ్రాండ్ సమ్రాట్ అనే టాగ్ లైన్ కూడా ఉంది.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Thursday, March 23, 2023

పసుపులేటి కన్నాంబ (ప్రముఖ నటి)

 పసుపులేటి కన్నాంబ (ప్రముఖ నటి)




సాహితీమిత్రులారా!

పసుపులేటి కన్నాంబ(ప్రముఖ నటి)

గురించిన కిరణ్ ప్రభ గారి వీడియో

ఆస్వాదించండి-



Monday, March 20, 2023

ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ - షేక్స్‌పియర్

 ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ -  షేక్స్‌పియర్ 




సాహితీమిత్రులారా!

కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే ఈ నాటకం షేక్స్‌పియర్ వ్రాసిన కామెడీ నాటకాలలో మొదటిది. అచ్చం ఒకేలా ఉండే కవలలతో తికమక పుట్టించి బోలెడంత హాస్యం పండించాడు షేక్స్‌పియర్. ఆ తరువాత కాలంలో ఈ నాటకన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. హిందీలో ప్రముఖ రచయిత గుల్జార్ దర్శకత్వం వహించిన అంగూర్ చిత్రం కూడా ఈ నాటకం ఆధారంగా తీయబడిందే. ఇక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథలోకి వెళితే.. సైరాక్యూజ్ నగరంలో ఈగియన్ అనే వర్తకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎమిలియా. వాళ్లకు కవల పిల్లలు పుట్టారు. కొడుకులిద్దరికీ ఆంటిఫోలస్ అనే పేరు పెట్టాడు ఈగియన్. అంతేకాదు వాళ్లకు సేవకులుగా ఉండడానికి మరో కవలల జంటను తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములకు కూడా డ్రోమియో అంటూ ఒక పేరే పెట్టాడు. ఇదిలా ఉండగా ఒకసారి ఈగియన్ తన కుటుంబంతో కలిసి సముద్ర ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను వచ్చింది. దానితో ఓడ కకావికలం అయిపోయింది. ఈగియన్, పెద్ద ఆంటిఫోలస్, పెద్ద డ్రోమియో ఒక దుంగ మీద, ఎమిలియా, చిన్న ఆంటిఫోలస్, చిన్న డ్రోమియో ఇంకొక దుంగ మీదా ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ అలల ఉధృతికి వాళ్ళ దారులు వేరైపోయాయి. ఈగియన్ అనేక ప్రయాసలకోర్చి తమ నగరమైన సైరాక్యూజ్ చేరుకున్నాడు. పెద్ద ఆంటిఫోలస్, అతని అనుచరుడు పెద్ద డ్రోమియో అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. ఒకనాడు చిన్న ఆంటిఫోలస్ తండ్రి అనుమతి తీసుకుని చిన్న డ్రోమియోతో కలిసి తన తల్లిని, అన్నను వెతకడానికి దేశాంతరం బయలుదేరాడు. అలావాళ్లు అనేక నగరాలు తిరుగుతూ తమ సోదరులను వెతకసాగారు.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Friday, March 17, 2023

ఎ.ఆర్. రహెమాన్ మొదటి సినిమా

 ఎ.ఆర్. రహెమాన్ మొదటి సినిమా




సాహితీమిత్రులారా!

కిరణ్ ప్రభ గారి

టాక్ షో

ఎ.ఆర్. రహెమాన్ మొదటి సినిమా

ఆస్వాదించండి- 



Wednesday, March 15, 2023

వేటూరి - కొమ్మ కొమ్మకో సన్నాయి

 వేటూరి - కొమ్మ కొమ్మకో సన్నాయి 




సాహితీమిత్రులారా!

మహదేవన్, ఇళయరాజా, రమేశ్ నాయుడు, ఎ.ఆర్.రహమాన్ మొదలైన సంగీత సరస్వతుల గురించి, విశ్వనాథ్, జంధ్యాల, బాపు, మణిరత్నం వంటి దర్శకశ్రేష్ఠుల గురించి, ఎన్టీయార్, నాగయ్య, జగ్గయ్య, రేలంగి వంటి నటరత్నాల గురించి, సముద్రాల, మల్లాది, ఆత్రేయ, దాశరథి వంటి దిగ్గజ రచయితల గురించి, ఇలా ఎందరో సినీశిఖరాలతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తనకున్న అనుభవాలను అక్షరాలుగా మార్చి, అందమైన పదాలుగా పొదిగి, ముద్దొచ్చే వ్యాసాలుగా మనకందించారు వేటూరి. వీటిలో అందమైన పదబంధాలున్నాయి. పాటల వెనుక సంగతులున్నాయి. “ఆహా” అనిపించే విశేషాలున్నాయి. మహామహుల జీవిత చిత్రణలున్నాయి. ఇలా ఎన్నో విశేషాలతో రాయంచ నడకల వంటి మాటల పోకడలున్న పుస్తకమే ఈ “కొమ్మకొమ్మకో సన్నాయి”.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Sunday, March 12, 2023

ఎల్.విజయలక్ష్మి ప్రముఖ నర్తకి

 ఎల్.విజయలక్ష్మి ప్రముఖ నర్తకి




సాహితీమిత్రులారా!

L. Vijayalakshmi is an Indian film actress and classical dancer whose career was in the 1960s  She appeared in Malayalam, Tamil, Kannada, Telugu and Hindi films. She quit the film industry while at the peak of her career. She got married and moved to Philippines and later settled in US.  She worked as a Director, Finance in Virginia Tech. Classical Dancer to Finance Director - L Vijalakshmi's life is a highly inspiring story. KiranPrabha explains all the details. L Vijalakshmi Gari message to the listeners is special in this talks show.





Thursday, March 9, 2023

తొలి తెలుగు సినీ గీత రచయిత - శ్రీ చందాల కేశవదాసు

 తొలి తెలుగు సినీ గీత రచయిత - 

శ్రీ చందాల కేశవదాసు




సాహితీమిత్రులారా!

ఆయన వేదవేదాంగాలు పారాయణం చెయ్యలేదు, సంస్కృతం పాఠాలు నేర్చుకోలేదు, అసలు స్కూలుకెళ్ళిన చదువే లేదు, 30  సంవత్సరాల  వరకూ రచయితే కాదు.. ఐనా స్వయంకృషితో సహజకవిగా ఎదిగారు, బహుముఖ ప్రజ్ఞత్వాన్ని ప్రదర్శించారు. ఆయనొక కవి, హరికథా భాగవతార్, నాటక రచయిత, సినీ రచయిత, నటుడు, మూడు దశబ్దాలు పైగా భాగవత సప్తాహ నిర్వాహకుడు , ఆయుర్వేద వైద్యుడు.. అన్నింటికీ మించి అసలు సిసలు మానవతావాది..! ఆయనే తొలి తెలుగు సినీ గీత రచయిత శ్రీ చందాల కేశవదాసు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆయన జీవన రేఖలు ఈ(కిరణ్ ప్రభ) టాక్ షోలో వినండి..




Tuesday, March 7, 2023

మర్చంట్ ఆఫ్ వెనిస్ - షేక్స్‌పియర్

 మర్చంట్ ఆఫ్ వెనిస్ - షేక్స్‌పియర్




సాహితీమిత్రులారా!

భారతీయ సాహిత్యంతో పాటు పాశ్చాత్య సాహిత్యం గురించి కూడా తెలుసుకుంటే, మొత్తం ప్రపంచ సాహిత్యం మీద ఒక అవగాహన వస్తుంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ప్రసిద్ధ పాశ్చాత్య రచనలను కూడా చెప్పుకుంటూ ఉందాం. అందులో భాగంగా ఈరోజు షెక్స‌పియర్ ప్రసిద్ధ నాటకం అయిన "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలోని కథను చెప్పుకుందాం. 


రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Saturday, March 4, 2023

"రెండు గంగలు" కథానిక రచన శంకరమంచి సత్యం.

 "రెండు గంగలు" కథానిక 

రచన శంకరమంచి సత్యం.



సాహితీమిత్రులారా!

సత్యం శంకరమంచి "రెండు గంగలు" కథానిక 1992 సెప్టెంబరు16-22 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితం. అమరావతి కథా సంపుటి నుండి. 


కృష్ణయ్య జి.వి. గారికి ధన్యవాదాలు

Thursday, March 2, 2023

తెలుగులో తొలి విషాదాంత ప్రేమ కథ - లైలా మజ్నూ

 తెలుగులో తొలి విషాదాంత ప్రేమ కథ - 

లైలా మజ్నూ




సాహితీమిత్రులారా!

Laila Majnu is considered to be the firs tragic love story on Telugu Screen. Released on October 1, 1949 , main actors are Bhanumathi, Akkineni Nageswara Rao. KiranPrabha narrates many interesting anecdotes behind making of this film Laila Majnu.