పరోపకారుల స్వభావము ఎలాంటిది?
సాహితీమిత్రులారా!
పరోపకారం మిదం శరీరమ్ అన్నది ఆర్యోక్తి.
మరి పరోపకారులకు సంబంధిచి
వారి సహజగుణం లేక స్వభావం
ఎలాంటిదో తెలియాలంటే కాళిదాసు చెప్పిన
ఈ శ్లోకం చూడాల్సిందే.
భవన్తి నమ్రా స్తరవ: ఫలోద్గమై
ర్నవాంబుధి ర్దూరవిులంబినో ఘనా:
అనుద్ధతా స్సత్పురుషా స్సమృద్ధిభి:
స్వభావ ఏవైష పరోపకారిణామ్
(అభిజ్ఞాన శాకుంతలం -5-13)
ఫలాలు ఎక్కువైనకొలది వంగుతాయి చెట్లు.
నీటిని ఎక్కువగా ఉన్న మేఘాలు
విశేషంగా క్రిందికి వంగి ఉంటాయి.
సత్పురుషులకు ఐశ్వర్యం కలిగే కొలది
వినయం కలిగి ఉంటారు.
పరోపకారులకిది స్వభావము కదా - అని భావం
పరోపకారం చేసేవారు వినయంతో
వంగి ఉంటారని గ్రహించాలి.
అదే వారి సహజగుణం లేదా స్వభావం.
No comments:
Post a Comment