Tuesday, October 4, 2016

చెడనిది పద్యం బొకటియె


చెడనిది పద్యం బొకటియె


సాహితీమిత్రులారా!



కొన్ని పద్యాలు ప్రజల నాలుకలమీద
అలానే నిలిచి ఉంటాయి అలాంటిదే
ఈ పద్యం ఏ సమయంలో చెప్పాడో కాని
ఇది మరువలేని మరపురాని సత్యం
మనవారు ప్రతిదానికి ఒక సామెతో పద్యపాదమో
ఉదహరించుకోవడం పరిపాటి అలా చెప్పెడి వాటిలో
చెడనిది పద్యం బొకటియె - అనేది ఒకటి.
ఈ పద్యం గువ్వల చెన్న శతకంలోనిది ఆ పద్యం

గుడికూలును నుయి పూడును
వడినీళ్ళం జెరువుతెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడియెడమల గీర్తిగన్న గువ్వలచెన్నా!

కుడుఎడమల కీర్తిగన్న(ముందువెనకా అంతటా
కీర్తిగన్న)ఓ గువ్వల చెన్నా!
దేవాలయం కొంతకాలానికి శిథిలం కావచ్చు
మంచినీళ్ళబావి కూజ కాలక్రమంలో పూడిపోవచ్చు
నీటి వేగం ఎక్కువై చెఱువుకూడా తెగిపోవచ్చు
అందంగా నిర్మించిన వనాలు కూడ
కొన్నాళ్ళకు శిథిలంకావచ్చు
ఎంతకాలమైనా చెడకుండా ఉండేది
పద్యం ఒకటే అంటే కవిత్వం ఒకటే
- అని భావం.

No comments:

Post a Comment