Showing posts with label శ్రీమద్రామాయణం. Show all posts
Showing posts with label శ్రీమద్రామాయణం. Show all posts

Wednesday, January 24, 2018

ఇద్దరు కవులు దర్శించిన సముద్రలంఘనం


ఇద్దరు కవులు దర్శించిన సముద్రలంఘనం




సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రకవి 
రామాభ్యుదయంలో
సముద్రాన్ని లంఘించే సమయంలో
హనుమంతుని వర్ణించిన తీరు-

తనచూపంబుధి మీఁదఁ జాఁచి శ్రవణద్వంద్వంబు రిక్కిం చి వం
చిన చంచత్భుజముల్ సముత్కట కటీసీమంబులన్ బూన్చి తోఁ
క నభోవీధికిఁ బెంచి యంఘ్రులిరియంగాఁ బెట్టి బిట్టూఁది గ్ర
క్కున నక్కొండ యడంగఁద్రొక్కి పయికిన్ గుప్పించి లంఘించుచోన్
                     (రామాభ్యుదయము - 6 - 93)

ఈ పద్యం భావాన్ని గమనించిన తరువాత
ఈ పద్యం చూడండి -
ఇది తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి కృత
శ్రీరామకథా2మృతము అనే గ్రంధంలోని
సీసపద్యం -
మొలదట్టిపై బాహువులు మోపి పాదము
       లించుక గుదియించి యెరువు సేసి
యిలఁద్రొక్కి యిమ్మున నిలిచి కంఠమ్మును
       మూఁపులుఁగర్ణముల్మొనయఁదిగిచి
యెడఁబ్రాణధారణంబొదవించి నెక్కొని
       నింగిపై దృష్టులు నెలవు కొలిపి
పులకలు నెమ్మేనఁ బొదల నూష్మలభావ
       ముననొప్పి శరవేగమునఁ దనర్చి
యెగసెఁ గుప్పింపఁ గ్రుంగితో నెగసి యమ్మ
హెంద్రధర మనుయాయిత్వమెఱుక సేయ
నెదిరి భంగంబు స్వీయసమృద్ధి నోటఁ
దెలుపకయ తెల్పుచును వాయుదేవసుతుఁడు
                              (శ్రీరామకథా2మృతము - సుందరకాండ - 27)

వీరిద్దరి హనుమద్దర్శనము ఆ సమయంలో ఎలావున్నదో
మనం గమనించ వచ్చు.
చేతులు నడుంమీద పెట్టుకోవడం దగ్గరనుంచి
అన్ని దాదాపుగా ఒకలాగే కనిపిస్తున్నవికదా

Thursday, October 12, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 8


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 8




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.............




106. గౌతముడు అహల్యను శిల కమ్మని శపించాడని 
         చెబుతున్న వారు-?
       - వ్యాసుడు, కాళిదాసు, తెలుగులో భాస్కర రామాయణ 
       కర్తలు మొదలైనవారు.
       (అంటే ఇది వాల్మీకి వ్రాయలేదు)

107. విశ్వామిత్రుని యాగం మొదలైన ఎన్ని రోజులకు ఆకాశం
        చిల్లులు పడేంత మాయ మబ్బులూ, చూస్తుండగా ప్రవాహంలా  
        నెత్తురూ - ఒక్కసారిగా పడసాగాయి?
        - 11వ పగలు రాగానే

108. రామాయణం మొత్తంలో లక్ష్మణుడు ఎంత మందిస్త్రీలకు
       ముక్కు చెవులు కోశాడు?
       - ముగ్గురు (తాటక, శూర్పణఖ, అయోముఖి)
     
109.  రామాయణం ప్రతి కాండలోని 18 సర్గకు ప్రత్యేక విశేషం
        ఉంది అంటారు వాటి వివరాలేవి?
        - బాలకాండ 18వ సర్గలో - 
        రామలక్ష్మణభరతశత్రుఘ్నుల జననం

        అయోధ్యకాండ 18వ సర్గలో-
        కైక దశరథుని వరాలడగటం

        అరణ్యకాండ 18వ సర్గలో-
        శూర్పణఖ రావడం

        కిష్కింధాకాండ 18వ సర్గలో-
        వాలిసమాధానం

        సుందరకాండ 18వ సర్గలో-
        సీతమ్మను చూడటానికి రావణుడు రావడాన్ని 
        హనుమంతుడు స్వయంగా చూడడం.

        యుద్ధకాండ 18వ సర్గలో-
        విభీషణునికి రాముడు శరణునీయడం

        ఉత్తరకాండ 18వ సర్గలో-
        వేదవతి రావణుని శపించడం

110. తెలుగులో మొదటి రామాయణం-?
      - గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం

111. గౌతముని ఆశ్రమం దగ్గర ఇంద్రుడు కోడై కూసిన
        దాన్ని వ్రాసిన కవి-?
       గోన బుద్ధారెడ్డి
     (ఇదీ వాల్మీకి రామాయణంలో లేదు)

112. వశిష్ఠుని వద్ద ఉన్న గోవుపేరు?
        - శబల

113. విశ్వామిత్ర వశిష్ఠులకు మధ్య వివాదానికి కారణం-?
      -  శబలను విశ్వామిత్రునికి ఇవ్వకపోవటం

114. శబల విశ్వామిత్రుని నుండి ఎలా రక్షించుకొంది?
        - శబల  హూంకారం నుండి కాంభోజులు,
             పొదుగు నుండి పహ్లవులు,
             రోమాల నుండి మ్లేచ్ఛులు, 
             గోమయం నుండి శకులు,
             యోని నుండి యవనులు
          పుట్టి విశ్వామిత్రుని సేనల నుండి కాపాడాయి.

115. అహల్యాగౌతముల పెద్దకుమారుడు-?
       - శతానందుడు


Sunday, October 8, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



96. గుఱ్ఱాన్ని వెదకడానికి వెళ్ళిన వారెవరు?
     - 60వేల మంది సగరపుత్రులు

97. 60వేలమంది సగరపుత్రులు ఎవరి ఆగ్రహానికి బలైనారు?
     - కపిల మహర్షి తపశ్శక్తి ఆహుతైపోయారు

98. అరవైవేల మందికి ఉత్తమగతులు కలగాలంటే దేవలోకపు 
      గంగను తీసుకురావాలని చెప్పింది ఎవరు?
      - గరుత్మంతుడు

99. యాగాశ్వాన్ని కపిలుని వద్ద నుండి తెచ్చింది ఎవరు?
      - అంశుమంతుడు

100. దివిజగంగను భువికి తేవడానికై ప్రయత్నించినవారు?
       - సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు

101. దేవగంగను భువికి తెచ్చినవాడు?
       - భగీరథుడు

102. భగీరథుడు గంగకై మొదట ఎవరిని గురించి తపస్సు చేశాడు?
      - బ్రహ్మదేవుని గూర్చి

103. భగీరథునికి శంకరుని ప్రార్థించమని చెప్పింది ఎవరు?
      - బ్రహ్మదేవుడు

104. శివుని జటాజూటం నుండి బిందు సరేవరంలోకి చేరిన గంగ
         7 పాయలుగా ఏ పేర్లతో ప్రహించినది?
        - హ్రాదిని, నలినీ, పావనీ(ఈ 3 తూర్పునకు),
           సుచక్షు, సీత, సింధు (ఈ 3 పడమరకు)
          భాగీరథి(భగీరథుని వెంట) ప్రవహించాయి.

105. పాతాళానికి చేరిన  దేవలోకంలోను, భూలోకంలోనూ,
         పాతాళలోకంలోనూ ప్రవహించే ఈ గంగను పిలిచే పేరు?
         - త్రిపథగ

Saturday, October 7, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 6


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 6




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



81. కౌశికీ నదిగా మారినది ఎవరు?
      - కౌశికి(సత్యవతి)

82. కౌశికీ నదిని ఇప్పుడేమంటున్నారు?
      - కూసినది

83. మిథిల ప్రయాణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుకు
      చెప్పిన కథలు-?
     - విశ్వామిత్రుని పూర్వులకథ, కుమారస్వామి జననం,
       గంగావతరణం, క్షీరసాగరమథనం, అహల్య కథ, 
       ఇలాంటి కథలెన్నో చెప్పాడు.

84. కుమారస్వామి పేర్లు?
    - శరవణభవ(ఱెల్లులో పుట్టినవాడు)
      షణ్ముఖుడు(ఆరు ముఖాలుగలవాడు)
      కార్తికేయుడు(కృత్తికలచే పెంచబడినవాడు)
      సుబ్రహ్మణ్యుడు(అతిపవిత్రుడైనవాడు)
      అగ్నిపుత్రుడు(తేజస్సునుండి పుట్టినవాడు)
      గాంగేయుడు (గంగాదేవికి పుట్టినవాడు)
      స్కందుడు(జారిపడినవాడు)
      దేవసేనాపతి(దేవతల సేనకు సేనాపతి)
      గుహుడు(చీకటిని హరించేవాడు)

85. కుమారస్వామి ముందుజన్మలో ఎవరు?
      సనత్కుమారులవారు(బ్రహ్మమానసపుత్రుడు)

86. సనకత్కుమారులవారిని పుత్రునిగా పుట్టమని 
     వరం అడిగింది ఎవరు?
    - శంకరుడు(శివుడు)

87. సగరుని భార్యలు-?
      - విదర్భరాజ పుత్రిక కేశిని, 
        అరిష్టనేమి పుత్రిక గరుత్మంతుని సోదరి సుమతి

88. ఎవరి వరం వల్ల సగరునికి సంతానం కలిగింది?
     - భృగువు

89. కేశిని సంతానం -?
     - అసమంజసుడు

90. సుమతి సంతానం-?
    - 69 వేలమంది

91. సగరునిచే వెళ్లగొట్టబడిన సగరకుమారుడి పేరు?
     - అసమంజసుడు

92. సగరుని అశ్వమేధ యాగాశ్వరక్షకునిగా వెళ్ళినది-?
     - అంశుమంతుడు(సగరుని మనుమడు)

93. సగరుని అశ్వమేధ యజ్ఞాశ్వాన్ని అపహరించినవా?రు
     - దేవేంద్రుడు

94. గుఱ్ఱము ఎప్పుడు దేవేంద్రుడు అపహరించాడు?
    - యజ్ఞారంభంలో(రాక్షస వేషంలో)

95. యగాశ్వాన్ని ఇంద్రుడు ఎక్కడ ఉంచాడు?
    - కపిలమహర్షి తపస్సు చేసే ప్రాంతంలో

Friday, October 6, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 5


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 5




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........



66. మిథిలా నగరానికి వెళుతూ విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు
      ఏ నది తీరంలో రాత్రికి నిద్రించారు?
     - శోణానది

67. శోణనదిని ఇప్పుడు ఏమంటున్నాము?
    - సోన్ నది

68. శోణనదికి మరోపేరు-?
     -మాగధి

69. మాగధి పేరు మీద ఏర్పడినదేశం-?
     - మగధ దేశం

70. మగధదేశ రాజధాని?
     - గిరివ్రజ పురం

71. కుశుడు - ఎవరి కుమారుడు?
    - బ్రహ్మమానస పుత్రుడు

72. కుశునికి విదర్భరాజకన్యకు పుట్టినవారు?
     - కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు

73. కుశనాభుడు, ఘృతాచి అనే అప్సరసకు పుట్టిని నూరుగురు
      ఆడపిల్లలు తమను మోహించిన వాయుదేవునితో ఏమన్నారు?
      - మేము స్వతంత్రలంకాదు, మేము మానాన్న కూతుళ్లం.

74. కుశనాభుని కుమార్తెలను వాయుదేవుడు ఏమని శపించాడు?
      - మఱుగుజ్జులై పొమ్మని శపించాడు.

75. కుశనాభుని కుమార్తెలు మఱుగుజ్జులైన ప్రదేశానికి పేరు?
     - కన్యాకుబ్జము(కనౌజ్)

75. కుశనాభుని కుమార్తె కుబ్జత్వం ఎలా పోయింది?
      - వీరిని పెండ్లాడదలచి బ్రహ్మదత్తుడనే కాంపిల్య నగరరాజు
         వారి చేయిని పట్టుకోగానే వారి కుబ్జత్వం పోయింది.

76. కుశనాభుని కుమారుడెవరు?
     - గాధిరాజు

77. గాధిరాజు కుమార్తె ఎవరు?
     - సత్యవతి

78. సత్యవతి భర్త -?
     - ఋచీక మహర్షి

79. సత్యవతికి మరోపేరు ?
     - కౌశికి

80. కౌశికి తమ్ముడు-?
     - విశ్వామిత్రుడు

Wednesday, October 4, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 4


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 4




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి....




51. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో పాటు చేరిన జనపదాలు?
    - మలద, కరూశ

52. మలద, కరూశ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినది ఎవరు?
    - తాటక, మారీచ, సుబాహులు

53. తాటక ఎవరి భార్య?
    - ఝుర్జపుత్రుడైన సుందుడు

54. సుందుని చంపంది ఎవరు?
    - అగస్త్యుడు శపించగా మరణించాడు.

55. తాటక బలం ఎంత ?
    - వేయి ఏనుగుల బలం

56. తాటక చేతులు ఖండించినది ఎవరు?
    ముక్కు చెవులు కోసింది ఎవరు?
    - చేతులు ఖండించినది రాముడు
      ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు

57. రాముడు తాటకను ఏ విధంగా వధించాడు?
    - శబ్దభేది విద్యద్వారా బాణం ప్రయోగించి వధంచాడు

58. రాముడు మారీచుని కొట్టిన బాణం పేరు?
    - శీతేషువు అనే మానవాస్త్రం

59. ఆగ్నేయాస్త్రంతో రాముడు ఎవరిని సంహరించాడు?
    - సుబాహుని

60. వాయవ్యాస్త్రాన్నిరాముడు ఎవరిపై ప్రయోగించాడు?
    - మారీచసుబాహులతో వచ్చిన మిగిలిన రాక్షసులపై

61. వాల్మీకి రామాయణం లేని అంశం-?
    - సీతా స్వయంవరం

62. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగానంతరం 
     తీసువెళుతున్న ప్రదేశం?
   - విదేహ రాజ్యంలోని మిథిలా నగరానికి

63. మిథిలకు రాజు-?
    - జనకమహారాజు (సీరధ్వజుడు)

64. జనకమహారాజు తండ్రి-?
    - హ్రస్వరోముడు

65. జనకుని తమ్ముని పేరు?
    - కుశధ్వజుడు

Tuesday, October 3, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 3


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 3




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


36. దశరథకుమారులకు గురువెవరు?
    - వశిష్ఠుడు

37. రామాయాణానికి గల పేర్లు?
    - రామాయణం, సీతాయాశ్చరితమం మహత్,
      పౌలస్యవధ

38. రామోవిగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమహః - 
      అని చెప్పింది ఎవరు?
    - మారీచుడు

39. రామాయణంలో ఎన్ని శ్లోకాలున్నాయి?
    - 24 వేలు

40. రావణుని తండ్రి ఎవరు?
    - విశ్రవసుడు

41. రావణునికి కుబేరుడు ఏమౌతాడు?
    - తమ్ముడు

42. కౌసల్యా సుప్రజా రామా - అనే శ్లోకాన్ని చెప్పింది ఎవరు?
    - విశ్వామిత్రుడు

43. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు ఎందుకు వచ్చాడు?
    - యాగరక్షణార్థం రాముని పంపమని అడగటానికి

44. విశ్వామిత్రుని మాటలు విన్న దశరథుడు ఏమన్నాడు?
   - రాముడు చిన్నవాడు విద్యపూర్తికాలేదు కావాలంటే
     నేనే నీవెంట వస్తాను అన్నాడు.

45. చివరకు రాముని విశ్వామిత్రుని వెంట ఎందుకు పంపాడు?
    - వశిష్ఠుని మాటల వలన రాముని 
      విశ్వామిత్రుని వెంట పంపాడు

46. దారిలో రామునికి లక్ష్మణునికి విశ్వామిత్రుడు ఏమి నేర్పాడు?
    - బల, అతిబల అనే విద్యలతోబాటు అనే విద్యలు నేర్పాడు

47. బల విద్య అంటే ఏమిటి?
    - ఉత్సాహాన్ని, బలాన్ని వృద్ధి పొందించేది, ఇతరులు వేసే 
      ఆయుధాలని తట్టుకొనే శక్తినిచ్చేది, ఆకలి దప్పుల బాధను 
      లేకుండా చేసేది

48. అతిబల విద్య అంటే?
    - చూపు, మనసు, శరీరం, పని, అనే నాలిగింటి చేత శత్రువును
      పొరపాటుపడేలా చేసేది, ఈ మంత్రాన్ని మననం చేసేవాడు 
      ప్రయోగించే ఆయుధానికి, తిరుగులేని తనాన్ని ఇచ్చేది

49. తాటకను రాక్షసివి కమ్మని శపించినవాడు?
    - అగస్త్యుడు

50. తాటక రాక్షసి కాకమునుపు ఎవరు?
    - సుకేతుడను యక్షుని కుమార్తె.


    

Monday, October 2, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 2


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........




21. దశరధుని పెంపుడు కుమార్తె ?-
    - శాంత

22. శాంత ఎవరెవరి వద్ద పెరిగింది?
    - దశరథుడు, రోమపాదుడు(అంగదేశాధిపతి)

23. శాంత ఎవరి కుమార్తె
    - సురభి అనే కామథేనువు అనుగ్రహం వల్ల
      దశరథునికి, రోమపాదునికి పెంపుడు కుమార్తె అయింది.

24. శాంత ఎవరి భార్య ?
    - ఋష్యశృంగుని భార్య

25. కౌసల్య తండ్రిపేరు?
      - భానుమంతుడు

26. సుమిత్ర తండ్రి ఎవరు?
      - మగధాధీశుడు

26. కైకేయి తండ్రి పేరు?
    - కేకయరాజు

27. వాల్మీకి నారదుని అడిగిన ప్రశ్నఏమిటి
     - ఓమహర్షీ! విష్ణులోకం నుండి సర్వలోకాలూ సంచరించే
      బ్రహ్మమానసపుత్రుడివికదా నువ్వు సద్గుణాలూ, పరాక్రమమూ, 
      సత్యవ్రతమూ, సమర్థతా, ధైర్యమూ, సచ్చరిత్రమూ,
      పట్టుదలా, అన్ని భూతముల యందు ఇష్టమూ, 
      పాండిత్యమూ, కృతజ్ఞతాభావమూ, ధర్మబుద్ధీ, క్రోధాన్ని 
      జయించిన తనమూ, కాంతీ, అసూయలేని తనం కలవాడూ,
      కోపం వస్తే దేవతలనైనా భయపెట్టగలవాడూ, అందరికీ 
      ఇష్టుడూ ఎవరైనా ఉన్నారా (16 గుణాలు కలిగినవాడు)

28. వాల్మీకి ప్రశ్నకు నారదుని సమాధానం
     - ఈ 16 గుణాలున్నవాడు శ్రీరామచంద్రుడు

29. ఈ 16 గుణాలూ పరశురాముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, 
     భరద్వాజులలో ఉన్నాయికదా - అనే ప్రశ్నకు నారదుని    
     సమాధానం-
    - తెలుసుకొని చెబుతాన్నాడు.
     (పరశురాముడు - కోపం జయించలేదు
     విశ్వామిత్రుడు - తపస్సులలో భ్రష్టుడై, ఆత్మవిమర్శ 
     చేసుకొన్నవాడు
     వశిష్ఠుడు - యుద్ధంలో పరాక్రమాన్ని చూపలేడు.
     భరద్వాజుడు - దేవతలని భయపెట్టలేడు)

30. అశ్వమేధయాగంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి- ల పేర్లు?
    - (క్రమంగా)పట్టమహిషి, పరివృత్త, వావాత

31. అశ్వమేధంతో పాటు జరిగిన క్రతువులు-
    - అగ్నిష్టోమం, 2 అతిరాత్రాలు, అభిజిత్, 
      విశ్వజిత్, 2ఆప్తోర్యామాలు

32. యాగం చేయించే పురోహితులు ఎన్ని విధాలు?
    - హోత, అధ్వరు, బ్రహ్మ, ఉద్గాత 
      అని నాలుగువిధాలు

33. హవిస్సు అంటే?-
    - మంత్రపూర్వకంగా అగ్నిలోవేసే నేయి.

34. యజ్ఞపురుడు ఇచ్చిన పాయసాన్ని దశరథున్ భార్యలు
      తీసుకున్న విధానం?-
    - కౌసల్య సగభాగం, 
      సుమిత్ర  ఒక నాలుగవభాగం, 
               ఒక ఎనిమిదవ భాగం, 
      కైకేయి ఎనిమిదవ భాగం.

35. దశరథ తనయులు పుట్టిన రోజులు-
    - కౌసల్య పుత్రుడు 
      రాముడు - చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, 
                గురువారం మధ్యాహ్నం
      కైకేయి పుత్రుడు
      భరతుడు - పుష్యమీ నక్షత్రం, దశమి తిథి
     
      సుమిత్రా పుత్రులు
      శత్రుఘ్న, లక్ష్మణులు - ఆశ్లేష నక్షత్రం, దశమి తిథి

      

Sunday, October 1, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో -1


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో -1




సాహితీమిత్రులారా!


రామాయణం తెలియని భారతీయులు ఉండరు వారికి రామాయణం మళ్లీ
తెలియాలా అనే సందేహం రావచ్చు కానీ ఎంత తెలుసుకున్నా ఏవోకొన్ని మిగిలి ఉండేంత విస్తారమైనది రామాయణం. ఎంత మందికవులు తమకలాలను రామకథకోసం కదిలించలేదు. అలాగే దేశంలోని అన్ని రామాయణాలను అందరూ చదవలేదు కదా
నాకు తెలిసినంత మన పాఠకమిత్రులు సాహితీమిత్రులకు అందించాలనే తపనతో నా చిరుప్రయత్నం-

1. రామాయణం మొదటిగా వ్రాసింది-
   - సంస్కృతంలో వాల్మీకి

2. అందులో ఎన్ని కాండలున్నాయి
   - ఏడు

3. కాండలు అంటే - 
   - రామాయణంలోని విభాగాలు

4. కాండము అంటే- నానార్థాలు
   - దీనికి అనే అర్థాలున్నాయి
     1. కావ్యవిభాగము లేక సమూహము
     2. బాణము, 3. జలము, 
     4. ఆకు మొదలైన వాటి ఈనె
     5. తామర మొదలైన వాటి తూడు(కాఁడ)
     6. వరి మొదలైన వాటి పోఁచ
     7. ముండ్లు మొదలైన వాని దుబ్బు
     8. మోదుగు మొదలైన వాని కఱ్ఱ
     9. చెట్టు బోదె
     10. గుఱ్ఱము, (కుత్సితము)
     11. ఏకాంతము, 12. సమయము

5. రామాయణంలోని కాండల పేర్లు -
   1. బాలకాండ, 2. అయోధ్యకాండ, 3. అరణ్యకాండ,
   4. కిష్కిందకాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ,
   7. ఉత్తరకాండ.

6. వాల్మీకి ఏనది ఒడ్డున తపస్సు చేసేవాడు
   - తమసానది

7. శ్లోకం దేన్నిండి పుట్టింది
   - శోకం

8. సంస్కృత కావ్య చరిత్రలో మొదటి శ్లోకం-
   మానిషాద ప్రతిష్ఠాంత్వ
   మగమః శాశ్వతీః సమాః
   యత్ క్రౌంచమిథునాదేకమ్
   అవధీః కామమోహితమ్

9. మానిషాద - అనే శ్లోకం ఏ ఛందస్సులో ఉంది
   - అనుష్టుప్

10. రామాయణం వాల్మీకి ఎవరి ఆదేశానుసారం వ్రాశాడు
    - బ్రహ్మ

11. ఏ పక్షుల జంటలోని పక్షిని వేటగాడు ఒక పక్షిని కూల్చాడు
    - క్రౌంచ పక్షుల జంట

12. ఏ పక్షిని వేటగాడు కొట్టాడు
    - మగ పక్షిని

13. కోసల దేశం ఏ నది ఒడ్డున ఉంది
    - సరయూనది

14. కోసల దేశానికి రాజధాని ఏది
    - అయోధ్యా నగరం

15. అయోధ్య అంటే -
    - యోధులు జయించ శక్యంకానిది.

16. అయోధ్యను పాలించే దశరథుడు ఏ వంశం వాడు
   - సూర్యవంశం వాడు

17. దశరథుని తల్లిదండ్రులు ఎవరు
    - తండ్రి అజుడు, తల్లి ఇందుమతి

18. దశరథుని భార్యలెందరు వారి పేర్లు
    - ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి

19. దశరథునితో పుత్రకామేష్ఠి యాగం చేయించినది
    - ఋష్యశృంగుడు

20. ఋష్యశృంగుని తండ్రిపేరు-
    - విభాండకుడు అనే ఋషి