Sunday, February 28, 2021

యాత్ర(కథ)

 యాత్ర(కథ)
సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

యాత్ర (కథ) ఆస్వాదించండి-Saturday, February 27, 2021

బుర్రకథ సామ్రాట్ షేక్ నాజర్

 బుర్రకథ సామ్రాట్ షేక్ నాజర్

సాహితీమిత్రులారా!


బుర్రకథ పితామహుడుగా పిలువబడే

షేక్ నాజర్ గురించిన 

వీడియో కిరణ్ ప్రభ టాక్ షో నుండి-

ఆస్వాదించండి-Thursday, February 25, 2021

దేవరకొండ బాలగంగాధర్ తిలక్

 దేవరకొండ బాలగంగాధర్ తిలక్
సాహితీమిత్రులారా!


దేవరకొండ బాలగంగాధర్ తిలక్

అమృతంకురిసిన రాత్రి గురించిన

కిరణ్ ప్రభ టాక్ షో

మొదటి వీడియో ఆస్వాదించండి-
Tuesday, February 23, 2021

చిలకమర్తి లక్ష్మీనరసింహం

 చిలకమర్తి లక్ష్మీనరసింహం

సాహితీమిత్రులారా!

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి గురించి

కిరణ్ ప్రభ టాక్ షోలో విందాంSunday, February 21, 2021

ముళ్ళపూడి వెంకటరమణ

ముళ్ళపూడి వెంకటరమణ

సాహితీమిత్రులారా!


సినీకథారచయితలలో ముళ్ళపూడి వెంకటరమణ

పేరు విననివారు ఉండరు ఆయన జీవిత విశేషాలు

మొదటి భాగం కిరణ్ ప్రభ టాక్ షో ద్వారా విందాం-

ఆస్వాదించండి-Friday, February 19, 2021

నల్లనివాడ నేనో గొల్లపిల్లనోయ్(లలితగీతం)

 నల్లనివాడ నేనో గొల్లపిల్లనోయ్(లలితగీతం)
సాహితీమిత్రులారా!

వింజమూరి శివరామరావు గారి రచన

నల్లనివాడ నేనో గొల్లపిల్లనోయ్(లలితగీతం)

రావుబాలసరస్వతీదేవీ గారి గానం

ఆస్వాదించండి-
Wednesday, February 17, 2021

ఉనికి(కథ)

 ఉనికి(కథ)సాహితీమిత్రులారా!


సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

ఉనికి (కథ) ఆస్వాదించండి-

Monday, February 15, 2021

నీలాల నీ కళ్ళు నా వలపు వాకిళ్ళు(పాట)

 నీలాల నీ కళ్ళు నా వలపు వాకిళ్ళు(పాట)సాహితీమిత్రులారా!

నీలాల నీ కళ్ళు నా వలపు వాకిళ్ళు(పాట) 

రచన – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు

సంగీతం – కృష్ణ ప్రసాద్ గారు

గానం – కె. జె. యేసుదాస్ గారు  

          వాణిజయరాం గారు  

ఆకాశవాణి – విజయవాడ

ఆస్వాదించండి-Wednesday, February 10, 2021

'నూతి బైట కప్పలు'

 'నూతి బైట కప్పలు' 
సాహితీమిత్రులారా!


H.M. T.V.లో 

వందేళ్ళకథ కు వందనాలులో

యండమూరి వీరేంధ్రనాథ్ గారి కథ

'నూతి బైట కప్పలు'  

వీరేంధ్రనాథ్ గారితో 

గొల్లపూడి మారుతీరావు గారి చర్చ

ఆస్వాదించండి-
Monday, February 8, 2021

ఆసారం, ఇరమ్మదం, పరివేషం

 ఆసారం, ఇరమ్మదం, పరివేషం
సాహితీమిత్రులారా!ఈ క్రింది పదాలను గమనించండి-

ఇంద్రధనుస్సు -

ఇది హరివిల్లు, సింగిణి అనే పదాలతో పిలుస్తాం.

దీనికే ఆంగ్లంలో రైన్ బౌ అని అంటారు. 

ఆకాశంలో నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పడి

ఏడురంగుల విల్లు ఆకారంలో సూర్యునికి వ్యతిరేక దిశలో

ఏర్పడుతుంది. (అది ఉదయ సాయం సమయాల్లోనే).

దీనికే ఇంద్రధనుస్సు అంటాం.


దుర్దినం - అంటే దుష్టమైన రోజు, చెడ్డదినం అని అర్థం

కానీ మనం దీన్ని ఆకాశంలో మేఘాలు కప్పి సూర్యదర్శనంలేని

మబ్బు పట్టిన రోజుకు వాడతారు.


ఇరమ్మదం -

మేఘాల్లో పుట్టే నిప్పు, వజ్రాగ్ని, విద్యుదగ్ని


ఇరింగణం - వడిగాలి


ఆసారం - జడివాన అంటే కుండ పోతగా కురిసే వర్షం


ముసురు -

విడవకుండా  మబ్బులతో కూడి సన్నగా పడుతుండే వాన


సంవర్తం -

ప్రళయకాలం - ఈ కాలంలో సర్వలోకాల నాశనం జరుగుతుంది.

దీనికే యుగాంతం, కల్పాంతం, క్షయకల్పం అని పేర్లు.


పరివేషం -

కాంతి వలయం - అంతటా వ్యాపించేది. 

సాధారణంగా దేవతా విగ్రహాల చుట్టూ అంటే

ముఖంపైన తల వెనుకల భాగంలో గుండ్రంగా కాంతి చక్రాన్ని 

చూస్తుంటాం దానికే పరివేషం అని పేరు.

Thursday, February 4, 2021

ఆత్మపదార్థం(కథ)

 ఆత్మపదార్థం(కథ)సాహితీమిత్రులారా!


సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

ఆత్మపదార్థం (కథ) ఆస్వాదించండి-Tuesday, February 2, 2021

నాతిగల బ్రహ్మచర్యము నా తరమా

 నాతిగల బ్రహ్మచర్యము నా తరమాసాహితీమిత్రులారా!నూజివీడు సంస్థానాధిపతి నారయప్పారావుతో

ఒక కరణముకవి ఈ పద్యం మొరపెట్టుకున్నాడట.

జమాబందీ సమయంలో కరణాలు చాలామంది

వచ్చి నూజివీడులో చాలా రోజులుండాల్సివచ్చేదట.

భూములకు సంబంధించిన రెవిన్యూ లెక్కల వివరాలు

అన్నీ జమాబందీలో తేల్చేవారు. అందుకు చాలకాలం పట్టేది.

 అప్పుడు పరస్థలనివాసంవలన తనకు కలిగిన ఇబ్బందిని

కవి ఈ చాటుపద్యంలో చెప్పాడు

శీతల స్నానంబును

భూతల శయనంబు నొంటిపూటశనంబున్

నాతిగల బ్రహ్మచర్యము

నా తరమా పూటగడప నారయభూపా!

ప్రతిరోజూ చన్నీళ్ళస్నానం,

నేలమీద నిద్రించటం,

ఒకపూట భోజనం,

భార్య ఉండికూడ బ్రహ్మచర్యాన్ని గడపటం

- ఈ పద్ధతితో రోజులు గడపటం

 నా వశంఅవుతుందా నారయప్రభూ! - అని భావం