Tuesday, May 23, 2023

వాత్స్యాయన కామసూత్ర

 వాత్స్యాయన కామసూత్ర



సాహితీమిత్రులారా!

“దృష్టం కిమపి లోకేఽస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్” అన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ ప్రపంచంలో ఇది పూర్తిగా మంచిదీ అని గానీ ఇది పూర్తిగా చెడ్డదీ అనిగానీ ఏదీ లేదు. మంచితో పాటూ చెడూ, చెడుతో పాటూ మంచీ ఉంటూనే ఉంటాయి..  కత్తితో మనం ఎంత చెడు చెయ్యొచ్చో అంత మంచీ చెయ్యొచ్చు. కత్తి అమాయకుల్నీ చంపుతుంది, దుర్మార్గుల్నీ చంపుతుంది. అలానే  ప్రాణం తీసే విషం కూడా వైద్యంలో ప్రాణాలు నిబెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏ వస్తువైనా, పదార్థమైనా ఉపయోగించే విధానాన్ని బట్టే ఫలితాన్నిస్తుంది. అంతేకానీ ఒక వస్తువు చెడు కూడా చేస్తుందన్న భావనతో, దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తే.. ఆ వస్తువు వల్ల పొందాల్సిన మంచిని కూడా మనం పొందలేం. ఈ భావాన్ని మనసులో ఉంచుుని మనం వాత్స్యాయన కామసూత్రాలలోకి ప్రవేశిద్దాం.


 భార్యాభర్తల దాంపత్య జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోవడానికి,  మనిషిలో ఉండే చెడు కామాన్ని తొలగించి, దాన్ని ధర్మబద్ధమైన పురుషార్థంగా వినియోగించుకోవడానికీ.. వాత్స్యాయన మహర్షి ఈ గ్రంథం రచించారు. ఇందులో ఆయన చెప్పదలుచుకున్న విషయాలను సుమారు 1700 సూత్రాలుగా వ్రాశారు. అందుకే ఈ గ్రంథానికి వాత్స్యాయన కామసూత్రాలనే పేరొచ్చింది. మహాకవి కాళిదాసు, మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు మొదలైనవారంతా వాత్స్యాయనుణ్ణి కీర్తించినవారే. వాత్స్యాయనుడికి పూర్వం కూడా దత్తకుడు, చారాయణుడు, కుచుమారుడు, సువర్ణనాభుడు మొదలైన కొంతమంది  కామశాస్త్ర గ్రంథాలు వ్రాశారు కానీ.. అవేవీ సమగ్రమైనవి కావు. అందుకే వాత్స్యాయనుడు ఏ కాలం స్త్రీ పురుషులకైనా ఉపయోగపడే విధంగా, చాలా క్లుప్తంగా ఉండే సూత్రాలతో, పరిపూర్ణత్వం ఉట్టిపడేలా ఈ కామశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.


 సంభోగానికి మొదటి మెట్టయిన కౌగిళ్లలో ఉన్న నాలుగు రకాల గురించి, ఎనిమిది రకాల నఖ క్షతాల గురించి, అనేక రకాల దంత క్షతాల గురించి, 21 రకాల బంధనాల గురించి, కామోద్రేకం కలిగించే విధానాల గురించి, చుంబన రహస్యాల గురించి, భారతదేశంలో ఏ ప్రదేశానికి చెందిన స్త్రీ పురుషులు ఎటువంటి కోరికలను కలిగి ఉంటారో, వారిని రతి సమయాలలో ఆహ్లాదపరచడం ఎలానో మొదలైన విషయాల గురించి, సంభోగానికి ముందు చేయవలసిన పనులు, సంభోగానికి తరువాత చేయవలసిన పనుల గురించి, వశీకరణ రహస్యాలు, రతి విశేషాలు, గర్భనిరోధక విధానాలు ఇలా ఈ వాత్స్యాయన కామశాస్త్రంలో కామ సంబంధమైన ప్రతీ విషయం గురించీ సూత్రాలున్నాయి. వివాహమైన స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా ఈ శాస్త్రాన్ని కచ్చితంగా నేర్చుకునే తీరాలన్నాడు వాత్స్యాయనుడు. కామశాస్త్రం తెలియని దంపతులు ఔషధం ఎలా ఉపయోగించాలో తెలియని వైద్యులవంటి వారని కూడా అన్నాడు.



రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


Friday, May 12, 2023

పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు

 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు




సాహితీమిత్రులారా!

పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు

ఆస్వాదించండి


రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Tuesday, May 9, 2023

హాయిగా నవ్వించే ఇంకొన్ని చమక్కులు

 హాయిగా నవ్వించే ఇంకొన్ని చమక్కులు




సాహితీమిత్రులారా!

ప్రముఖుల చమత్కార విషయాలను

ఆస్వాదించండి-



Wednesday, May 3, 2023

క్రీడాభిరామం కథ

క్రీడాభిరామం కథ




సాహితీమిత్రులారా!

కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో విమర్శలను తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడిన కావ్యం క్రీడాభిరామం.

ఈ క్రీడాభిరామం 295 పద్య గద్యాలతో ఒకే ఒక్క ఆశ్వాసంలో రచించబడిన ఓ వీథి నాటకం. దీనిని రచించింది వినుకొండ వల్లభరాయుడని కొందరు పండితులంటే, కాదు అతని పేరుతో శ్రీనాథుడే ఈ రచన చేశాడని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు. పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారైతే.. ఈ కావ్యకర్త శ్రీనాథుడేనంటూ అందుకు ఎన్నో కారణాలు కూడా చూపించారు. 

ఇక ఈ క్రీడాభిరామం సుమారు 600 సంవత్సరాల క్రితం రచించబడిన కావ్యం. అప్పట్లో ఓరుగల్లు పట్టణం ఎలా ఉండేదో? అక్కడ ప్రజల ఆచార వ్యవహారాలు ఎటువంటివో? ఆ కాలంనాటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, వినోదాలు ఇలా ఎన్నో విషయాలు ఈ కావ్యం మన కళ్లకు కట్టిస్తుంది. కాకపోతే.. ఇందులో శృంగారం పాళ్లు చాలా ఎక్కువ. అందుకే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తమ స్థాయి పండితులకు, పాఠకులకు, విమర్శకులకు తప్ప మిగిలిన వారికి ఇది అందుబాటులో ఉండటం అంత మంచిది కాదన్నారు. అయితే వాళ్ళకు మాత్రం ఈ కావ్యం అవసరం ఏముంది? అన్నవారికోసం ఆయనో మాట చెప్పారు. నాభి, ఉల్లిపాషాణం వంటి విష పదార్థాలు తెలిసి తీసుకున్నా, తెలియకుండా తీసుకున్నా ప్రాణాలు తీసేస్తాయి. కానీ అవే విషపదార్థాలను వైద్యంలో సరైన మోతాదులో వాడితే, దీర్ఘరోగాలను, ప్రాణాంతక రోగాలను తగ్గిస్తాయి. ఈ ప్రపంచంలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు. కాకపోతే ఆ వస్తువును వినియోగించే మనిషిని బట్టి దాని ప్రభావం, ఫలితం మారిపోతాయి. ఈ క్రీడాభిరామం కావ్యం కూడా అటువంటిదేనన్నది ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం. మనం కూడా శాస్త్రిగారి మాటను శిరసావహిస్తూ ఈ కావ్యంలోని వర్ణనల్ని విడిచిపెట్టి కేవలం కథను మాత్రమే చెప్పుకుందాం. మొత్తం క్రీడాభిరామం చదవాలనన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ కావ్య ప్రతి ఎలానూ ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండనే ఉంది.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు 

Monday, May 1, 2023

"రాజశేఖర చరిత్ర" నవలలో కథ ఏమిటి?

 "రాజశేఖర చరిత్ర" నవలలో కథ ఏమిటి? 




సాహితీమిత్రులారా!

కందుకూరి వీరేశలింగం పంతులు గారి "రాజశేఖర చరిత్ర" నవల!

ఈ రాజశేఖర చరిత్రము అనే నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారి రాసిన “శ్రీ రంగరాజ చరిత్రము”ను చాలామంది పేర్కొంటుంటారు కానీ, ఆధునిక నవలా లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అన్నది చాలామంది భావన. నిజానికి ఆ తరువాత కాలంలో వచ్చిన నవలలు అన్నింటికీ ఈ రాజశేఖర చరిత్రే మార్గదర్శకంగా నిలిచింది. ఇక మనం కథలోకి వెళదాం..

Rajan PTSK గారికి ధన్యవాదాలు