Wednesday, December 30, 2020

బోన్సాయ్ మనుషులు(కథ)

 బోన్సాయ్ మనుషులు(కథ)

సాహితీమిత్రులారా!


సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్ 

                     నుండి

బోన్సాయ్ మనుషులు కథ ఆస్వాదించండి-Monday, December 28, 2020

సత్యజిత్ రే - 1

 సత్యజిత్ రే - 1
సాహితీమిత్రులారా!

స్పూర్తినిచ్చే మహనీయుల

చరిత్రలలో సత్యజిత్ రే ఒకరు

వారిని గురించి కిరణ్ ప్రభ గారి

టాక్ షో నుండి ఈ మొదటి భాగం

ఆస్వాదించండి-Saturday, December 26, 2020

ఒక బృందావనం (ఆడియో నవల)

 ఒక బృందావనం (ఆడియో నవల)

సాహితీమిత్రులారా!


బలభద్రపాత్రుని రమణి గారి

నవల ఒక బృందావనం 

ఇది ఆడియో నవల 

గాత్రం రచయితగారిది

ఆస్వాదించండి -Friday, December 25, 2020

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

 ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు


ఈ సందర్భంగా నృసింహావతార(పోతనగారి) వర్ణన

ఆస్వాదించండి -  Tuesday, December 22, 2020

భలే మంచి చౌక బేరము(కథ)

 భలే మంచి చౌక బేరము(కథ)

సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్ 

                     నుండి

భలే మంచి చౌక బేరము కథ ఆస్వాదించండి- Monday, December 21, 2020

వలపించు నేర్పెరుగరో!

 వలపించు నేర్పెరుగరో!
సాహితీమిత్రులారా!

తంజావూరును పాలించిన విజయరాఘవుని

ఆస్థానంలో మన్నారుదాసవిలాసం(యక్షగానము) అనే

శృంగార కావ్యరచయిత్రి రంగాజీ (రంగాజమ్మ)

ఆస్థాన కవయిత్రిగా ఉండేది. చక్కని కవిత్వం చెప్పగలదిట్ట.

విజయరాఘవునిచేత కనకాభిషేక గౌరవాన్ని పొందినది.

ఆమె అంటే ఎక్కువ ప్రేమతో రాజుగారు ఎక్కువగా

ఆమెతోటి కాలం గడిపేవాడు. ఒకరోజు విజరాఘవుని భార్య

రంగాజమ్మ దగ్గరికి ఒక దూతికతో నిందా పూర్వకంగా

తన భర్త సాంగత్యము వదలుకొమ్మని సందేశం పంపినది.

దానికి రంగాజమ్మ ఈ పద్యంతో సమాధానం చెప్పింది.

చూడండి ఆ పద్యం -

ఏ వనితల్మముం దలపనేమి పనో! తమరాడువారు గా

రో వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా

రావది యేమిరా! విజయరామ! యటం చిలుదూరి బల్మిచే

దీవరకత్తెనైపెనగి తీసుకువచ్చితినా? తలోదరీ!

ఎవరైనా స్త్రీలు మావిషయం

స్మరించవలసిన అవసరంమేమి?

వారు స్త్రీలు కారా తమ భర్తను అనురాగంతో

వశపరచుకునే తెలివి వారికి లేదా?

నేను విజయరాఘవుడు ఆమె కౌగిలిలో ఉండగా

తీసుకొని వచ్చినానా? నన్ను నిందించటం ఎందుకు - అని భావం.


రాయలు తనంత తానే నా దగ్గరికి వస్తున్నాడు

రాణి తన ప్రేమతో ఆయనను బంధించలేనప్పుడు

నా దోషం ఏమున్నది అది ఆమె లోపమే

అని యుక్తిగా సమాధానమిచ్చింది.

Saturday, December 19, 2020

ప్రియనేస్తమా(కథ)

  ప్రియనేస్తమా(కథ)

సాహితీమిత్రులారా!

వనిత టీ.వీ. లో ప్రసారమైన

యద్దనపూడి సులోచనారాణి కథ

 ప్రియనేస్తమా

ఆస్వాదించండి-Thursday, December 17, 2020

ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో

 ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందోసాహితీమిత్రులారా!లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో

ఈ శ్లోకం చూడండి-


క్షీరసాగరా త్పారిజాత పల్ల లేభ్యో, రాగమిందు

శకలా దేశాంతవక్రతా, ముచ్ఛైశ్రవైశ్చంచలతాం

కాల కూటన్మోహనశక్తిం, మదిరయా మదం,

కౌస్తుభమణి రతి నైష్ఠుర్యం, ఇత్యే తాని సహవాస

పరిచయవశా ద్విరహ వినోద చిహ్నాని గృహీత్యేవోద్గతా


పూర్వం అమృతమధనం కోసం దేవతలూ - దానవులూ

కలిసి పాలసముద్రం చిలికినపుడు, దాన్నుండి

కల్పవృక్షం - కామధేనువు - పాంచజన్యం - పారిజాతం-

ఉచ్ఛైశ్రవం - ఐరావతం - కౌస్తుభమణి - కాలకూటం -

చంద్రుడు - లక్ష్మీదేవి - ఇవన్నీ కూడ ఉద్భవించాయి.


ఈ ప్రకారంగా ఇవ్నీ లక్ష్మీదేవికి సోదరసోదరీమణులు కదా

వీటి పోలికలు కొన్నయినా ఉంటాయికదా

ముఖ్యంగా లక్ష్మీదేవికి వారి పోలికలు కొన్ని వచ్చాయి-

అవి చంద్రుని నుంచి వక్రత్వం

ఉచ్ఛైశ్రవం నుంచి చాంచల్యం

విషం నుంచి మైకం,

అమృతం నుండి మదం,

కౌస్తుభం నుండి కాఠిన్యం

వచ్చాయి అందువల్ల లక్ష్మీదేవి

స్వభావం ఎప్పుడు ఎలా ప్రదర్శించబడుతుందో

మానవులకు అంతు చిక్కకుండా పోయింది.

Tuesday, December 15, 2020

హార్ట్ 'ఎట్' టాక్(కథ)

 హార్ట్ 'ఎట్' టాక్(కథ)
సాహితీమిత్రులారా!


వనిత టీ.వీ. లో ప్రసారమైన

యద్దనపూడి సులోచనారాణి కథ

హార్ట్ 'ఎట్' టాక్ 

ఆస్వాదించండి-Sunday, December 13, 2020

అర్ధరూపాయి అప్పు(కథ)

 అర్ధరూపాయి అప్పు(కథ)సాహితీమిత్రులారా!

వనిత టీ.వి.లో ప్రసారమైన

యద్దనపూడి సులోచనరాణి గారి

కథల నుండి తీసుకున్న కథ

అర్ధరూపాయి అప్పు

ఆస్వాదించండి-Friday, December 11, 2020

రాతిహృదయం(కథ)

 రాతిహృదయం(కథ)

సాహితీమిత్రులారా!


వనిత టీ.వి.లో ప్రసారమైన

యద్దనపూడి సులోచనరాణి గారి

కథల నుండి తీసుకున్న కథ

రాతిహృదయం

ఆస్వాదించండి-Wednesday, December 9, 2020

గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!

 గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!

సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి-

ఎవరిమీదైనా కోపం వచ్చినపుడు

గాడిదకొడకా -అని తిట్టడం

ఒక అలవాటు కదా!

దీన్నే ఒక కవి ఈ పద్యంలో

ఎలా చమత్కరించాడో చూడండి-


ఆడిన మాటలు దప్పిన

గాడిద కొడుకంచు దిట్టగా విని యయ్యో

వీడా నాకొక కొడుకని

గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!


ఆడిన మాట తప్పినవాణ్ని,

అబద్దాలు చెప్పేవాణ్ని,

గాడిద కొడుకా  - అని తిట్టినపుడు

ఆ తిట్టును గాడిద విని,

అయ్యో !ఛీ! ఇటు ఆడితప్పేవాడు

నా కొడుకా? ఎంత అవమానం - అని సిగ్గుతో

బాధపడిందట.

అంటే ఆడినమాట తప్పేవాడు గాడిదకంటే

అధముడని చెప్పడం కవి భావన.


Monday, December 7, 2020

చెప్పులు దానం(కథ)

 చెప్పులు దానం(కథ)
సాహితీమిత్రులారా!


కొప్పర్తి సాహితీ వాహిని నుండి-

మునిపల్లెరాజు గారి కథ

చెప్పులు దానం

వినిపించినవారు

కొప్పర్తి రాంబాబు

ఆస్వాదించండి-
Saturday, December 5, 2020

కవి చమత్కారం

 కవి చమత్కారం

సాహితీమిత్రులారా!

తిమ్మగజపతి అనే సంస్థాధిపతి బహులోభి.

అందరు తనను అంటున్నారనికూడ తిమ్మగజపతికి తెలుసు.

అలాంటి లోభి నుండి పారితోషికము అందుకొన్నాడొక

కవి అది ఈ పద్యంతో చూడండి.


"ఇవ్వడు ఇవ్వడంచు" జనులెప్పుడు తప్పక చెప్పుచుందు 

రే
మివ్వడుఅన్యకాంత కురమివ్వడు! సంగరమందు వె
న్నివ్వడు! శత్రులన్ ప్రబలనివ్వడుబెబ్బులినైన పట్టి పో
నివ్వ డసత్యవాక్య మెపుడివ్వడు తిమ్మ జగత్పతీంద్రుడే!


కవి చమత్కారం ఎంత గొప్పదో కదా!

ఇవ్వడు ఇవ్వడు అంటారు తిమ్మగజపతిని అది వాస్తవమే

ఆయన ఏమివ్వడో చూడండి.

పరస్త్రీకి మనసివ్వడు

యద్ధములో వెన్నివ్వడు(పారిపోడు)

శత్రువులను ప్రబలనివ్వడు(ఎక్కువకానీడు)

బెబ్బలినైన పట్టి పోనివ్వడు

అసత్యవాక్యన్ని ఎప్పుడూ ఇవ్వడు

ఇన్నిరకాలుగా ఇవ్వనివాడు - అని మంచి పనులే చూపించాడు కవి

అందుకే ఇవ్వనివాడు పారితోషికమిచ్చాడు.


కవికలం

రాజు కత్తికంటె బలమైనది.

అంటారుకదా!

అది ఇదేనేమో!

Thursday, December 3, 2020

దేవునికైనా డబ్బే గురువు

దేవునికైనా డబ్బే గురువు
సాహితీమిత్రులారా!

కవి చమత్కారం ఎంత ఉంటుందో!

ఈ పద్యంలో చూపించాడు కవి

ఆ చమత్కారం చూడండి-

వాస శ్చర్మ విభూషణాని ఫణిన: భస్మాంగరాగోధునా

గౌరేక: నచ కర్షణే నకుశల: సంపత్తి రేతాదృశీ

ఇత్యాలోచ్య విముచ్య శంకర మగాత్ రత్నాకరం జాహ్నవీ

వ్యర్థం నిర్ధనికస్య జీవన మహోదారై రపిత్యజ్యతే


ధరించేది చర్మం,

ఆభరణాలు సర్పాలు,

అంగరాగము చితాభస్మము,

ఉన్నది ఒక్క ఎద్దు,

అది దున్నుటకు ఉపయోగపడదు.

ఈయన ఐశ్వర్యమిది -

అని ఆలోచించి గంగాదేవి

శంకరుని విడచి రత్నాకరుని

(సముద్రుని) చేరింది-

ఆహా! ధనహీనుని జీవితమెంత వ్యర్థము

చివరికి భార్యకూడా విడిచి పెడుతుందికదా!

Tuesday, December 1, 2020

తెనాలిరామకృష్ణుని చమత్కారం

 తెనాలిరామకృష్ణుని చమత్కారంసాహితీమిత్రులారా!తెనాలి రామకృష్ణుని పద్యంగా

ప్రచారంలో ఉన్న పద్యం ఇది చూడండి-


కవి అల్లసాని పెద్దన

కవి తిక్కన సోమయాజి గణుతింపంగా

కవి నేను రామకృష్ణుడ

కవి యను నామంబు నీటి కాకికి లేదే


తిక్కన సోమయాజి, అల్లసాని పెద్దన

ఇద్దరూ చెప్పుకోదగిన కవులు -

 రామకృష్ణుడనే పేరుగల నేను

కూడ కవిగా పేర్కొనబడుతున్నాను.

కవి అనే పదానికి నీటి కాకి

అనే అర్థం కూడ ఉన్నదికదా!

కవి అనే మాట వాడుకలో ఉన్నంత

మాత్రాన నేను వారిద్దరితో

సమానుణ్ని కాలేను.

వారికీ నాకు కవితాశక్తిలో ఎంతో

తారతమ్యం ఉంది -

అని రామకృష్ణుడు తన వినయాన్ని

చాటుకున్నాడు.

(క = నీరు, వి = పక్షి, కవి = నీటిపక్షి)