Tuesday, October 31, 2017

సముద్రంలో కనుగొన్న ద్వారక


సముద్రంలో కనుగొన్న ద్వారక
సాహితీమిత్రులారా!

మన శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక
ఆయన నిర్యాణం తరువాత సముద్రంలో
మునిగిందని మనవారు చెబుతారు
ఆ ద్వారక ఇప్పుడు సముద్రంలో కనుగొనబడింది
దానిగురించిన డాక్యుమెంటరీ ఇక్కడ చూడగలరు-


Monday, October 30, 2017

ది లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా


ది లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా
సాహితీమిత్రులారా!

భారతదేశంలోని దేవాలయాల గురించి
కొంత ఆసక్తి కరమైన సమాచారాన్ని
నేషనల్ జాగ్రఫి ఛానల్ వారు రూపొందించిన
ది లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే
ఈ డాక్యుమెంటరీ చూడండి.
ఇందులో తంజావూరు బృహదీశ్వరాలయంపైకి
అంతబరువైన రాతిగోపురాలను ఎలా ఎక్కించారో
హంపిలోని సమాచారం ఖజురహో దేవాలయాన్ని
గురించి తాజ్ మహల్ గురించిన విషయాన్ని
మనం గమనించవచ్చు చూడండి-


Sunday, October 29, 2017

ప్రత్యేక డాక్యుమెంటరీ తిరుమలపై

 ప్రత్యేక డాక్యుమెంటరీ తిరుమలపై
సాహితీమిత్రులారా!

మన శ్రీవేంకటేశ్వరులవారిని ప్రపంచప్రజలకు
పరిచయం చేసేందుకు నేషనల్ జాగ్రఫిక్ వారు
"ఇన్ సైడ్ తిరుమల తిరుపతి" అనే పేరున
డాక్యుమెంటరీ చేశారు. అందులో
మన తిరుమలను గురించి వారు ఏమి చెబుతున్నారో
చూడగలరు. ఇక్కడ మనం ఆ డాక్యుమెంటరీ
చూసి తెలుసుకుందాం-


జైనంలో కర్మ సిద్ధాంతం


జైనంలో కర్మ సిద్ధాంతం
సాహితీమిత్రులారా!


కర్మసిద్ధాంతం మన హిందూధర్మంలోనే 
కాక జైనమత సాంప్రదాయంలోనూ ఉంది. 
ఇది వారికి చాల ముఖ్యమైనది.
చేసిన కర్మలను బట్టి శుభాశుభ కర్మ ఫలాలను 
అనుభవించవలసి వస్తుంది. అదే జన్మలో కాకపోతే 
తరువాత జన్మలో అనుభవించాల్సి వస్తుంది. 
సత్కర్మలకు సత్ఫలం, దుష్కర్మలకు దుష్ఫలం తప్పదు.
సర్వజ్ఞులైన తీర్థంకరులకు ముందుగానే అన్నీ తెలియవచ్చు. 
కర్మలు -
ఘాటీయ కర్మలు(ఆత్మగుణాలను కలుషితం చేసే దుష్టకర్మలు), 
అఘాటీయకర్మలు అని రెండు విధాలు. 
ఆత్మకు సహజంగా సర్వజ్ఞత్వం, సర్వదర్శన శక్తి, పరమానందాన్ని 
అనుభవించే అవకాశం, సర్వశక్తిమంతత్వం ఉంటాయి. అయితే
ఘాటీయ కర్మలు ఆత్మకు అవి లేకుండా చేస్తాయి. 
అవి

1. జ్ఞానా వరణీయ కర్మ 
   ఆత్మకు సహజం ఉండే సర్వజ్ఞత్వ శక్తికి అడ్డువస్తుంది.

2. దర్శనావరణీయ కర్మ 
   దేనినైనా చూడగల శక్తికి ఇది ప్రతి బంధకం కలిగిస్తుంది.

3. మోహనీయ కర్మ 
   పరమానందాన్ని అనుభవించే 
   శక్తికి ఈ కర్మలు గుదిబండలు అవుతాయి.

4. అంత్రాయ కర్మ 
   ఇది ఆత్మ సర్వశక్తిమంతం కావడానికి ప్రతిబంధకం


అఘాటియ కర్మలు - 4

1. వేదనీయ కర్మ-
   కష్టసుఖాలనే భావనలను కలిగిస్తుంది

2. నామకర్మ -
   జన్మించినపుడు ఏ విధమైన శరీరాన్ని ధరించాలో నిర్ణయిస్తుంది.

3. ఆయుకర్మ-
   ఆత్మ ఏ దేహధారణ చేస్తుందో ఆ దేహ ఆయుర్దాయాన్ని   
   నిర్ణయిస్తుంది

4. గోత్ర కర్మ -
   ఏ అంతస్తు కుటుంబంలో జన్మించాలో నిర్ణయించే కర్మ


Saturday, October 28, 2017

మదం అంటే ఏమిటి? - దాని విశేషాలు


మదం అంటే ఏమిటి? - దాని విశేషాలు
సాహితీమిత్రులారా!మదం అనే మాట తరచు వింటుంటాం
అంటే ఏమిటో?
 "ధనమెచ్చిన మదమెచ్చును
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చున్ "
అంటుంటారు కదా!

మదం అంటే కొవ్వు, పొగరు అని చెప్పవచ్చు.
"శబ్దరత్నాకరం"(నిఘంటువు) ప్రకారం-
మదము - క్రొవ్వు, ఏనుగు క్రొవ్వు, రేతస్సు,
ఏనుగు రేతస్సు, కస్తూరి, గర్వము, సంతోషం
అనే అర్థాలున్నాయి.

ఇక్కడ మదం అనేది మూడు రకాలని త్రిమదములు
అవి - 1. అన్నమదం, 2. ధనమదం, 3. కులమదం

మరో రకంగా మదం 8 రకాలు అంటే అష్టమదములు
అవి - 1. అన్నమదం, 2. అర్థమదం, 3. స్త్రీ మదం
4. విద్యామదం, 5. కులమదం, 6. రూపమదం,
7. ఉద్యోగమదం, 8. యౌవన మదం.

ఇవి ఇలా ఉంటే

గజమదం అనేది ఏనుగుకు శరీరంలో ఎనిమిది 
చోట్ల మదం(క్రొవ్వు/రేతస్సు) పుడుతుంది.
1. కన్నులలో పుట్టే మదం పేరు "సీధువు"
2. చెక్కిళ్ళలో పుట్టే మదం పేరు "దానం"
3. చెవులలో పుట్టే మదం పేరు "సాగరం"
4. తొండం చివరల పుట్టే మదం "శీకరం"
5. చనుమొనల వద్ద పుట్టే మదం పేరు "శిక్యం"
6. జననాంగాల వద్ద పుట్టే మదం పేరు "మదం"
7. గుండె సమీపంలో పుట్టే మదం పేరు "ఘర్మం"
8. కాళ్ళ వద్ద పుట్టే మదం పేరు "మేఘం"
ఏనుగుకు ఇన్నిరకాల మదాలున్నాయి.

ఈ విషయాలు యతులను గజారోహణం చేయించేవారికీ,
ఏనుగులపై విగ్రహాలను ఊరేగించేవారికీ తెలిసివుండాలి
అంటారు పెద్దలు.

Friday, October 27, 2017

తైత్తిరీయం - వాజసనేయశాఖ


తైత్తిరీయం - వాజసనేయశాఖ
సాహితీమిత్రులారా!కృష్ణయజుర్వేదానికి తైత్తిరీయమనే పేరు ఉంది.
తిత్తిరి అంటే తీతువు పిట్ట. దీనికి సంబంధించిన ఒక కథ
పూర్వులు చెప్పినది ఇక్కడ గమనిద్దాం.
యాజ్ఞవల్క్యుడు బ్రహ్మరాతుడు అనే మునికుమారుడు.
యాజ్ఞవల్క్యుడు యజుర్వేదంలో దిట్ట అయిన వైశంపాయనుడు
అనే ఋషి శిష్యుడు. ఒక సందర్భంలో అహంకారంతో మాట్లాడిన
యాజ్ఞవల్క్యుని గురువుగారు కోపించి తనవద్ద నేర్చుకొన్న 
యజుర్వేదాన్ని కక్కమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. 
ఆ కక్కిన యజుర్గణం రక్తసిక్తమై ఉండగా తిత్తిరి పక్షులరూపంలో
యజుర్గణ దేవతలు వచ్చి వాటిని తిన్నారు. అందుకని 
యజుర్వేదానికి అప్పటి నుండి  తైత్తిరీయమనే పేరు వచ్చింది. 

వేదాలన్నీ పోగొట్టుకున్న తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యుని
అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. అప్పుడు సూర్యుడు 
వాజి(గుఱ్ఱం)రూపంలో వచ్చి యాజ్ఞవల్క్యునికి యజుర్గణాన్ని 
ఉపదేశించాడు. అప్పటి నుండి యజుర్వేద శాఖకు
వాజసనేయ శాఖ అనే పేరు వచ్చింది అని ఐతిహ్యం.

Thursday, October 26, 2017

సన్యాసము - మరిన్ని విశేషాలు


సన్యాసము - మరిన్ని విశేషాలు
సాహితీమిత్రులారా!మన హిందూసమాజంలో సన్యాసి అనే పదం సుపరిచితమైనదే.
దీన్ని గురించి ఇంకెందుకు తెలుకోవడం అనే అనుమానం రావచ్చు.
కానీ మనకు తెలిసిన విషయం స్వల్పం. అందుకే మరికొంత 
తెలుసుకుందాని ఇక్కడ చర్చించడం జరుగుతోంది.

ఆశ్రమ ధర్మాల్లో సన్యాసం నాలుగవది. మొదటిది బ్రహ్మచర్యం,
రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం.
సన్యాస మనే ఈ పదాన్ని ఇంతకుపూర్వం సన్న్యాసం అని,
సంన్యాసం అని వాడేవాళ్ళు.
సన్యాసం అంటే వైరాగ్య భావనతోనో, అదే లక్ష్యంగానో 
సంసారిక జీవితాన్ని త్యజించివేయడం. వైరాగ్య తీవ్రతను బట్టి మంద వైరాగ్యం,
తీవ్ర వైరాగ్యం, తీవ్రతర వైరాగ్యం అని మూడు విధాలుగా చెబుతారు.
1. గృహసంబంధమైన సమస్యలను తట్టుకోలేక 
    సన్యసించటాన్ని మందవైరాగ్యం అంటారు. 
2. దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణత్రయాన్ని వదలిన
    సన్యాసాన్ని తీవ్రవైరాగ్యం అంటారు.
3. కర్మకాండలలో చెప్పిన విధివిధానాలు ప్రయోజనరహితమని
    విడిచి పెట్టిన సన్యాసాన్ని తీవ్రతర వైరాగ్యమని అంటారు.

ఈ విభజన కాకుండా సన్యాస తీవ్రతను బట్టి మరి 
రెండు రకాల విభజన వుంది. అందులో నాలుగు విధాలని,
ఆరు విధాలని చెప్పబడుతున్నవి.
మొదట నాలుగు విధాలైన వాటిని గమనిస్తే-
1. కుటీచకం, 2. బహూదకం, 
3. హంస సన్యాసం, 4. పరమహంస సన్యాసం

తీవ్ర వైరాగ్యం వల్ల తీసుకునే సన్యాసాలు మొదటి రెండు సన్యాసాలు.
వాటిలో మొదటిది 1. కుటీచకం- 2. బహూదకం. 
తీవ్రతర వైరాగ్యం కలిగిన సన్యాసులు హంసలు, పరమహంసలు

సంచారం చేసే శక్తిలేని సన్యాసి ఊరివెలుపలో, ఏదైనా ఒక నదీతీరంలోనో మఠం ఏర్పరచుకొని, కాషాయవస్త్రాలు దండ కమండలలాలు ధరించి స్వయంగా ఆహారాన్ని సంపాదించుకునే
సన్యాసి కుటీచకుడు.

పుణ్యతీర్థాలను, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ ఎక్కడా ఆరు రోజులకు
ఎక్కువ కాకుండా గడుపుతూ సంచారం చేస్తుండే సన్యాసి బహూదకుడు.

హంసలు ఆచార విహితమైన మార్గంలో సన్యాస వ్రతం కొనసాగిస్తారు.
పరమహంసలు బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాసతో తీవ్ర సాధన చేస్తుంటారు. ఒక జీవిత కాలం సాధనలో కృతకృత్యులు కాలేని
పరమహంసలు తిరిగి జన్మలు ఎత్తి సాధన కొనసాగించి గమ్యం చేరుతుంటారని ప్రతీతి.
రెండవ విధానంలో పైన చెప్పిన నాలుగు విధాలే కాకుండా మరో రెండు విధాలున్నాయి. తురీయాతీత, అవధూత అనే వ్యవస్థలు.

మరో విభజనప్రకారం 6 విధాలు ఇవే-
1. కర్మఫల సన్యాసం / కర్మసన్యాసం
2. వైరాగ్య సన్యాసం / జ్ఞాన సన్యాసం
3. ఆతుర సన్యాసం / క్రమ సన్యాసం
4. వివిదిషా సన్యాసం / విద్వత్సన్యాసం
5. కర్మైక దేశ సన్యాసం / పరమార్థ సన్యాసం
6. గౌణ సన్యాసం 
గౌణ సన్యాసంలో బ్రహ్మణేతరులు స్త్రీలు కూడ 
సన్యాసం తీసుకోవచ్చు. పురాణ కాలంలో 
బ్రహ్మణేతరులు సన్యాసం తీసుకోవడం ఉంది.
ఉదాహరణకు విదురుడు ఇలా సన్యాసం తీసుకొన్నవాడే.

Wednesday, October 25, 2017

పంచభూత లింగాలు


పంచభూత లింగాలు
సాహితీమిత్రులారా!

పృథివి, అప్(నీరు), అగ్ని, వాయు, ఆకాశములనేవి
పంచభూతములు. ఈ తత్వాలకు ప్రతీకలుగా ఐదు 
లింగాలున్నాయి. వీటినే పంచభూత లింగాలంటాము.
ఇవన్నీ మన దక్షిణ భారతదేశంలో ఉన్నాయి.

1. పృథివీలింగము-
   దీన్ని కొందరు రామేశ్వరంలోని రామలింగేశ్వరునిగా చెబుతున్నారు.
   మరికొందరు కాంచీపురంలోని ఏకాంబరేశ్వరునిగా చెబుతున్నారు.
   ఇక్కడ రెండింటిని తీసుకోవీలుంది. ఎందుకంటే రామాయణ  
   కాలంలో సీతారాములు మట్టితో(ఇసుకతో) ప్రతిష్ఠించినది
   ఈ లింగం. అలాగే కాంచీపురంలోని లింగాన్ని కామాక్షి 
   అమ్మవారు ఇసుకను లింగం చేసి ప్రతిష్ఠించినదని కథనం.


2. అపోలింగం -
   తమిళనాడులో శ్రీరంగానికి సమీపంలో జంబుకేశ్వరం అనే చోట
   అపో(జల)లింగం వుంది. జంబుకేశ్వరలింగం ఎప్పుడూ నీటిలో
   కనిపిస్తుంది. కనుక దీన్ని అపోలింగం అంటున్నారు.ఆపస్ 
   అంటే నీరు.


3. తేజోలింగం(అగ్నిలింగం)-
   తమిళనాడులోని అరుణాచలం(తిరువణ్ణామలై)అనే చోట 
   అరుణాచలేశ్వరలింగం ఉంది. ఇక్కడ కార్తీకమాసంలో
   కొండమీద వెలిగించే దీపం చాలా దూరం కనిపిస్తుంది.
   ఇది అరుణాచలేశ్వరునికి తేజస్సుకు సంకేతంగా భావిస్తారు.4. వాయులింగం-
   ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగం.
   శ్రీకాళహస్తీశ్వరునిగా పిలుస్తున్నాము. ఈ దేవాలయంలో
   శివలింగం ఎదురుగా ఉన్న దీపాలలో ఒకటి కొద్దిపాటి
   గాలికి కదులుతూ కనిపిస్తుంది.. అది శివుని ఉచ్ఛ్వాస
   నిశ్వాసల వల్ల జరుగుతూ ఉంటుందని అదేవాయు
   లింగానికి ఆధారమని అంటారు.

5. ఆకాశలింగం-
   తమిళనాడులోని చిదంబరంలో ఉంది ఈ ఆకాశలింగం.
   చిదంబరం నటరాజస్వామి ఆలయానికి కూడ ఆకాశలింగమని 
   ప్రసిద్ధి ఉంది. ఇక్కడ నటరాజస్వామి విగ్రహం పక్కన చీకటిలో
   శూన్యప్రదేశం కనిపిస్తుంది. ఈ శూన్యమే ఆకాశానికి ప్రతీక   
    

ఇవి పంచభూత లింగాలు. వీనిలో ఒక్క వాయులింగం తప్ప అన్నీ
తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి.

Tuesday, October 24, 2017

శూన్య తిథులు


శూన్య తిథులు సాహితీమిత్రులారా!శూన్య తిథులు-

1. చైత్రమాసంలో వచ్చే శుక్ల అష్టమీ, నవమీ తిథులు, 
   అలాగే కృష్ణ అష్టమీ, నవమీ తిథులు శూన్యతిథులు

2. వైశాఖంలో వచ్చే రెండు ద్వాదశి తిథులు

3. జ్యేష్టమాసంలో వచ్చే శుద్ధ త్రయోదశి, 
   బహుళ చతుర్దశి తిథులు

4. ఆషాఢ మాసంలో శుద్ధ సప్తమి, బహుళ షష్ఠి

5. శ్రావణ మాసంలో రెండు విదియలు, రెండు తదియలు

6. భద్రపదంలో పాడ్యమి, విదియలు

7. ఆశ్వయుజ మాసంలో రెండు దశములు, రెండు ఏకాదశులు

8. కార్తికంలో శుద్ధ చతుర్దశి, బహుళ పంచమి

9. మార్గశిరంలోని రెండు సప్తములు, రెండు అష్టములు

10. పుష్యంలోని రెండు చవితులు, రెండు పంచమీ తిథులు

11. మాఘమాసంలో శుద్ధ షష్ఠి, బహుళ పంచమి

12. ఫాల్గుణ మాసంలో రెండు తదియలు, రెండు చవితులు

మొత్తం 12 మాసాలలో 24 శూన్యతిథులు

Monday, October 23, 2017

లింగం - విశేష విషయాలు


లింగం - విశేష విషయాలు
సాహితీమిత్రులారా! 

లింగం అంటే ఏమిటి అంటే దీనికి విభిన్నమైన 
అర్థాలున్నాయి. అవి-
1. పరమశివుని అర్చామూర్తి - శివునికి జటాజూటంతో
   ఫాలనేత్రంతో డమరుకం, కపాలం, త్రిశూలం మొదలైనవి 
   ధరించి రూపాన్ని ఎక్కడా పూజించరు. దీనిగల కారణం
   భృగువు శివునికిచ్చిన శాపమంటారు. అందువల్ల లింగాన్ని 
   శివునికి ప్రతిరూపంగా పూజిస్తారు.
2. లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం - అని అమరకోశం 
   చెబుతున్నది. అంటే చిహ్నం అని అర్థం.
3. శిశ్నము అని సాధారణార్థం
4. బసవేశ్వరగీతామృతం - ప్రకారం 
   లీయతే గమ్యతే యత్రయేన సర్వచరాచరం తదేతత్ 
   లింగతత్వ పరాయణైః - అంటున్నది అంటే ప్రళయ
   కాలంలో సకల చరాచర ప్రపంచం ఎక్కడి ఉండి, 
   సృష్టికాలంలో ఎక్కడి నుంచి తిరిగి వస్తుందో అది లింగం.
5. భూమి పీఠంగా, వేదాలే ఆలయంగా, 
   కలిగిన ఆకాశమే లింగం.
ఇలా అనేక నిర్వచనాలున్నాయి.
 ఏది ఏమైనా శైవులు అంటే హిందువులు 
శివునిగా లింగాన్ని పూజిస్తారు.

లింగ భేదాలు - వైవిధ్యాలు 

లింగాలన్నీ ఒకే రూపంలో ఉండవు. సాధారణంగా శివాలయంలో
కనిపించేది నల్లరాతితో చేసిన శివలింగం. కళ్లు, ముక్కు, చెవులు,
కలిగి ముఖాలు ఉండవు. స్పటికంతో చేసిన లింగాలు, పాదరసంతో 
చేసిన లింగాలు, కూడ ఉన్నాయి. లింగప్రమాణనేదీ లేదు. 
శ్రీశైలంలోని శివలింగం చాల చిన్నది. 

అలాగే వేములవాడలోని 
శివలింగం ఎక్కువ కైవారాలను కలిగి ఉంది.

 ద్రాక్షారామంలోని 
శివలింగం రెండవ అంతస్తులోకి వెళ్ళి చూడాలి. 


ఇది ఇలా ఉంటే
తంజావూరులోని బృహదీశ్వరాలయంలోని శివలింగం ఆకారంలోను 
ఎత్తులోనూ చాల పెద్దది. 

గుడిమల్లాంలోని శివలింగం మరోవిధంగా ఉంది.


 కొన్ని లింగాలకు ఒకటి నుంచి ఐదు ముఖాలవరకు ఉంటాయి
ఖాట్మండు(నేపాల్ రాజధాని)లోని పశుపతినాథ్ ఆలయంలోని 
శివలింగానికి 5 ముఖాలున్నాయి. అందులో ఒకటి ఊర్ధ్వముఖంగా ఉంది. 

పరమ శివుడి పంచముఖాలు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతాలు. ఒకే శివలింగంలో అనేక చిన్నచిన్న లింగాకృతులు వెయ్యి వరకు ఉన్నాయి. వెయ్యిన్నొక్క ముఖాలుండే శివలింగాన్ని ఆట్యలింగం అంటారు. 108 ముఖాలుండే శివలింగాన్ని
అష్టోత్తర లింగమని, సారోడ్య లింగమని అంటారు. ఏ ముఖంలేకుండా
మనకు సాధారణంగా శివాలయాల్లో కనిపించే లింగాన్ని అకాట్య లింగం అని అంటారు.
            లింగ భేదాలను గురించి పూర్వనుంచి ఉన్న ఆచారాలు
కృతయుగంలో రత్నలింగాన్ని, త్రేతాయుగంలో స్వర్ణలింగాన్ని, ద్వాపరయుగంలో రస(పాదరస)లింగాన్ని, కలియుగంలో పార్థివ(మట్టి)లింగం పూజనీయాలని చెబుతారు. అలాగే 
క్ష్తత్రియులు బాణలింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని,
శూద్రులు శిలాలింగాన్ని, స్త్రీలు పార్థివలింగాన్ని 
పూజనీయాలుగా చెబుతారు. కొందరు స్పటిక లింగాన్ని 
పూజిస్తారు. ఇది కఠినమైన నియమంకాదు ఎవరైనా 
అందుబాటులో ఉండటాన్ని బట్టి ఏలింగాన్నైనా పూజించవచ్చని
పెద్దలు చెబుతారు. 

లింగం రూపం మీద కొన్ని అపోహలున్నాయి-
శివలింగాన్ని పురుషుని జననాంగంతోను, పానవట్టాన్ని
స్త్రీ జననాంగంతోను పోల్చడం. ఇది సరైనదికాదని
వివేకానందుడు ఖండించారు. శివలింగం యజ్ఞశాలలో
యూప స్థంభ పరిణామమేనని ఆయన వాదించారు.
బౌద్ధులు నిర్మించిన స్థూపాలు కూడా శివలింగార్చనకు
స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చని వాదించారు. 
"శివదర్శనమ్" అనే పుస్తకంలో శ్రీ చందూరి సుబ్రహ్మణ్యం గారు 
లింగార్చన బహుపురాతనమైందని, ఇతర ఖండాలలోనూ ఉన్నదని 
ఆధారసైతంగావ్రాసివున్నారు. 


Sunday, October 22, 2017

వ్యసనాలు ఎన్ని రకాలు?


వ్యసనాలు ఎన్ని రకాలు?
సాహితీమిత్రులారా!


వ్యసనాలు అనగానే గుర్తుకు వచ్చేవి 7
వీటినే సప్తవ్యసనాలు అంటారు.
ముందు ఇవేమిటో వాటిని చూద్దాం-

1. ఆపదలు, 2. కామక్రోధాలవల్ల కలిగే దోషాలు
3. అత్యాసక్తి, 4. పాపం,
5. అపాయం, 6. ఫలితం లేని పని చేయడం
7. ఆటంకాలు, అంతరాయాలవంటి దైవం 
   అనుకూలించని అనిష్ట ఫలితాలు

ఇవికాక క్రోధజ వ్యసనాలు, కామజ వ్యసనాలు అని ఉన్నాయి.

క్రోధజ వ్యసనాలు-

వేట, జూదం, పగటినిద్ర, ఇతరులలోని చెడును అదేపనిగా
వినాలనుకోవడం, అతిగా సంభోగాన్ని కోరుకోవడం, త్రాగుడు,
దానివల్ల మదమెక్కి ప్రవర్తించడం, ఆటపాటల మీద అతివ్యామోహం,
ఎప్పుడూ ఎక్కడో ఒకచోటికి తిరుగుతూ ఉండటం.

క్రోధజ వ్యసనాలు -

ఎవడో ఒకడిని ఎప్పుడూ ఆడిపోసుకోవడం,
చాడీలు చెప్పడం, మంచివాళ్లను బాధించడం,
ద్రోహం, ఇతరులు బాగుంటే ఓర్చుకోకపోవడం,
ఇతరులలోని మంచిని చెడుగా చిత్రించడం,
పరధనాన్ని ఆశించడం, ఇతరులకు ఇవ్వవలసిన 
సొమ్మును ఎగవేయడం, కటువుగా మాట్లాడడం,
తగిన కారణం లేకుండా ఎవరిమీదైనా చేయి చేసుకోవడం.

వీటిలోని కొన్నిటిని భారతంలో 
విదురుడు చెప్పిన వాటిగా గమనించ వచ్చు

Saturday, October 21, 2017

పటముపాడు గీతిక


పటముపాడు గీతిక
సాహితీమిత్రులారా!

మన చిత్రసీమలోని కొన్ని ప్రత్యేకాంశాలు
ఇక్కడ గమనిద్దాం-
నాయిక నాయకుని పటం  ఎదురుగా నిలుచొని
నాయకునితో కలిసి పాటపాడటం చాలా సినిమాల్లో
కనిపిస్తుంది ఇక్కడ కొన్నిటిని గమనిద్దాం.
భీష్మ సినిమాలో అంబ సాళ్యునితో పాటంమహామంత్రి తిమ్మరుసు సినిమాలో
నాయిక కృష్ణదేవరాయలతో పాడటం


అలాగే దాన వీర శూర కర్ణ సినిమాలో
దుర్యోధనునితో భానుమతి(దుర్యోధనుని భార్య) పాటపాడటం


మనం గమనించవచ్చు అవి ఇక్కడ చూడండి
ఇవి కాక అనేకం ఉన్నాయి మీరు గమనించండి

Friday, October 20, 2017

స్నానాలు - స్నానోదకాలు


స్నానాలు - స్నానోదకాలు
సాహితీమిత్రులారా!


స్నానం అంటే మనం ప్రతినిత్యం చేసేదేకదా
అవును కానీ దీనిలో రకాలున్నాయట-
తలస్నానం, కంఠస్నానం అవేకదా
అవి మనకు తెలిసినవి కాని మనకు తెలియనివి
ఉన్నాయి వాటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం

శాస్త్రాలల్లో స్నానాలు పంచ, దశ, సప్తవిధాలని 
తెలిపియున్నారు మన పెద్దలు.

స్నానాని పంచ పుణ్యాని కీర్తితాని మహర్షిభిః.......
అని అంటే స్నానం 5 రకాలని అవి-

1. ఆగ్నేయస్నానం
   విభూతిని శరీరమంతా పూసుకోవడం

2. వారుణ స్నానం
   బొడ్డులోతు నీటిలో మూడుసార్లు మునగడం వారుణ స్నానం 

3. బ్రాహ్మ్య స్నానం
   ఆపోహిష్టామ యోభువఃతాన ఊర్జే దధాతన....
       అనే మంత్రం చదువుతూ స్నానం చేయడం

4. వాయవ్య స్నానం
   గోధూళి శరీరం మీద వేసుకోవడం

5. దివ్య స్నానం
   ఎండ కాస్తున్నప్పుడు వర్షం కురిస్తే ఆ నీటిలో తడవడం

ఇవి ఆంధ్రవేద పరిభాష అనే గ్రంథంలో చెప్పబడినవి.
అలాగే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదసార రత్నావళిలో
దశవిధ, సప్తవిధ స్నానాలగురించి వివరించారు.

పై చెప్పిన 5 విధాలకు మరికొన్ని చేర్చారు ఇక్కడ
వారుణం, ఆగ్నేయం, వాయవ్యం, బ్రహ్మం, కాపిలం, మానసం,
దివ్యం అని ఏడు విధాలు

పైన చెప్పనివి కాపిలం, మానసం అనేవి రెండురకాలు

కాపిలం స్నానం -
నాభిస్థానానికి దిగువ నీటితో ప్రక్షాళన చేసికొని
శరీరం పైభాగాన్ని తడిబట్టతో తుడుచుకోవటం

మానస స్నానం
మనసులో విష్ణుస్మరణ చేసుకోవటం మానస స్నానం

పది స్నానాలు-

భస్మ గోమయ, ఘృ, ద్వారి, పంచగవ్యైస్తతః పరం
గోమూత్రం, క్షీరం, సర్పిః, మశోదకం .....
అనే శ్లోకం పదివిధాలైన స్నానాలను చెబుతున్నది.
దీనిలోని ప్రతి స్నానానికి మంత్రాలున్నాయి. అవి
మనం ఇక్కడ వివరించుకోవడం లేదు.

స్నానం చేసే విధానంలో 5 అంగాలున్నాయట
అవిసంకల్పం, మార్జనం, వరుణసూక్త పఠనం,
అఘమర్షణం, స్నానాంగ తర్పణం అనేవి
స్నానాంగ పంచకాలు.

స్నానోదకాలు-
స్నానం చేసేనీటిని కూడ మన శాస్త్రకారులు విభజించారు
అవి ఆరు విధాలు
మామూలుగా ప్రవహించే నీరు
ప్రవహించని నీరు అని రెండురకాలు
తైత్తిరీయ అరణ్యకంలో దీనికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి.
1. నదులు, సెలయేర్ల నీరు
2. బావినీరు
3. తటాకాలనీరు
4. వర్షపునీరు
5. ఎక్కడనుండైనా కడవతో తెచ్చిన నీరు
6. నీటి బోదెలు/కాలువలు/నీటి కుంటలలోని నీరు

Thursday, October 19, 2017

దగ్ధ తిథి - వార - నక్షత్రాలు- లగ్నాలు


దగ్ధ తిథి - వార - నక్షత్రాలు- లగ్నాలు
సాహితీమిత్రులారా!

మనం కొన్ని సందర్భాలలో
పనులు ప్రయాణాలు చేయకూడని
తిథి వారం నక్షత్రాలు
వింటుంటాం.
అవి ఏమిటో ఇక్కడ చూద్దాం-

దగ్ధ తిథులు-
వారం, తిథి రెండింటిని కలిపితే పదమూడు వచ్చిందంటే
అది దగ్ధతిథిగా గుర్తించాలి.
           ఆదివారం(1) - ద్వాదశి(12) - కలిస్తే 13
           సోమవారం(2) - ఏకాదశి(11) - కలిస్తే 13
           మంగళవారం(3) - దశమి(10) - కలిస్తే 13
           బుధవారం(4)  - నవమి(9)  - కలిస్తే 13
           గురువారం(5)  - అష్టమి(8)  - కలిస్తే 13
           శుక్రవారం (6) - సప్తమి(7)  - కలిస్తే 13
           శనివారం(7)  - షష్ఠి(6)    - కలిస్తే 13
ఇదేవిధంగా వీటిని మాసాలలో ఇవి 
దగ్ధతిథులు- 

మీన, ధనుర్మాసాలలో - విదియ,
వృషభ, కుంభమాసాలలో - చవితి,
మేష, కర్కాటకాలలో - అష్టమి,
వృశ్చిక, సింహ మాసాలలో - దశమి,
మకర, తులా మాసాలలో - ద్వాదశి

దగ్ధ నక్షత్రాలు-
ఆదివారం - భరణి
సోమవారం - చిత్ర,
మంగళవారం- ఉత్తరాషాఢ,
బుధవారం - ధనిష్ఠ,
గురువారం - ఉత్తర,
శుక్రవారం - జ్యేష్ఠ,
శనివారం - రేవతి.

దగ్ధ లగ్నాలు-

తదియలో - సింహ, మకరాలు
పాడ్యమిలో - తులా, మకరాలు,
పంచమిలో - కన్యా, మిథునాలు,
సప్తమిలో - కర్కాటక, ధనుస్సులు,
నవమిలో - సింహ వృశ్చికాలు,
ఏకాదశిలో - ధనుర్మీనాలు.

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
దీపావళి శుభాకాంక్షలు

Saturday, October 14, 2017

మనమేమి తింటున్నాం ఒకసారి ఆలోచించండి


మనమేమి తింటున్నాం ఒకసారి ఆలోచించండి
సాహితీమిత్రులారా!

ప్రస్తుతం మనం తింటున్న ఆహారం
గురించిన ఒక చిన్న సమీక్ష
ఆసక్తికరమైన అంశాలతో
డా. ఖాదర్ గారి ప్రసంగం వినండి
అప్పుడు ఆలోచించండి
ఇక వినండి-


Friday, October 13, 2017

అరచేతిలోని తీర్థాలు


అరచేతిలోని తీర్థాలు
సాహితీమిత్రులారా!


అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది.
ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.

కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి,
ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం
అని అంటున్నాము. అలా నీటిని
"ఓమ్ కేశవాయస్వాహా, "
"ఓమ్ నారాయణాయస్వాహా, "
"ఓమ్ మాధవాయస్వాహా ",
అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 
ఈ సందర్భంలోని

ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.

చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే
బ్రహ్మతీర్థం అని అంటారు. 

చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ,
 ప్రజాపతి తీర్థం అని అంటారు.

అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని 
దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 

చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ
కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు ని అంటారు.

ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.

ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద 
ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము 
కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.

సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం 
కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. 
పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం 
పితృతీర్థం అనబడుతున్నది.

ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.

Thursday, October 12, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 8


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 8
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.............
106. గౌతముడు అహల్యను శిల కమ్మని శపించాడని 
         చెబుతున్న వారు-?
       - వ్యాసుడు, కాళిదాసు, తెలుగులో భాస్కర రామాయణ 
       కర్తలు మొదలైనవారు.
       (అంటే ఇది వాల్మీకి వ్రాయలేదు)

107. విశ్వామిత్రుని యాగం మొదలైన ఎన్ని రోజులకు ఆకాశం
        చిల్లులు పడేంత మాయ మబ్బులూ, చూస్తుండగా ప్రవాహంలా  
        నెత్తురూ - ఒక్కసారిగా పడసాగాయి?
        - 11వ పగలు రాగానే

108. రామాయణం మొత్తంలో లక్ష్మణుడు ఎంత మందిస్త్రీలకు
       ముక్కు చెవులు కోశాడు?
       - ముగ్గురు (తాటక, శూర్పణఖ, అయోముఖి)
     
109.  రామాయణం ప్రతి కాండలోని 18 సర్గకు ప్రత్యేక విశేషం
        ఉంది అంటారు వాటి వివరాలేవి?
        - బాలకాండ 18వ సర్గలో - 
        రామలక్ష్మణభరతశత్రుఘ్నుల జననం

        అయోధ్యకాండ 18వ సర్గలో-
        కైక దశరథుని వరాలడగటం

        అరణ్యకాండ 18వ సర్గలో-
        శూర్పణఖ రావడం

        కిష్కింధాకాండ 18వ సర్గలో-
        వాలిసమాధానం

        సుందరకాండ 18వ సర్గలో-
        సీతమ్మను చూడటానికి రావణుడు రావడాన్ని 
        హనుమంతుడు స్వయంగా చూడడం.

        యుద్ధకాండ 18వ సర్గలో-
        విభీషణునికి రాముడు శరణునీయడం

        ఉత్తరకాండ 18వ సర్గలో-
        వేదవతి రావణుని శపించడం

110. తెలుగులో మొదటి రామాయణం-?
      - గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం

111. గౌతముని ఆశ్రమం దగ్గర ఇంద్రుడు కోడై కూసిన
        దాన్ని వ్రాసిన కవి-?
       గోన బుద్ధారెడ్డి
     (ఇదీ వాల్మీకి రామాయణంలో లేదు)

112. వశిష్ఠుని వద్ద ఉన్న గోవుపేరు?
        - శబల

113. విశ్వామిత్ర వశిష్ఠులకు మధ్య వివాదానికి కారణం-?
      -  శబలను విశ్వామిత్రునికి ఇవ్వకపోవటం

114. శబల విశ్వామిత్రుని నుండి ఎలా రక్షించుకొంది?
        - శబల  హూంకారం నుండి కాంభోజులు,
             పొదుగు నుండి పహ్లవులు,
             రోమాల నుండి మ్లేచ్ఛులు, 
             గోమయం నుండి శకులు,
             యోని నుండి యవనులు
          పుట్టి విశ్వామిత్రుని సేనల నుండి కాపాడాయి.

115. అహల్యాగౌతముల పెద్దకుమారుడు-?
       - శతానందుడు


Sunday, October 8, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........96. గుఱ్ఱాన్ని వెదకడానికి వెళ్ళిన వారెవరు?
     - 60వేల మంది సగరపుత్రులు

97. 60వేలమంది సగరపుత్రులు ఎవరి ఆగ్రహానికి బలైనారు?
     - కపిల మహర్షి తపశ్శక్తి ఆహుతైపోయారు

98. అరవైవేల మందికి ఉత్తమగతులు కలగాలంటే దేవలోకపు 
      గంగను తీసుకురావాలని చెప్పింది ఎవరు?
      - గరుత్మంతుడు

99. యాగాశ్వాన్ని కపిలుని వద్ద నుండి తెచ్చింది ఎవరు?
      - అంశుమంతుడు

100. దివిజగంగను భువికి తేవడానికై ప్రయత్నించినవారు?
       - సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు

101. దేవగంగను భువికి తెచ్చినవాడు?
       - భగీరథుడు

102. భగీరథుడు గంగకై మొదట ఎవరిని గురించి తపస్సు చేశాడు?
      - బ్రహ్మదేవుని గూర్చి

103. భగీరథునికి శంకరుని ప్రార్థించమని చెప్పింది ఎవరు?
      - బ్రహ్మదేవుడు

104. శివుని జటాజూటం నుండి బిందు సరేవరంలోకి చేరిన గంగ
         7 పాయలుగా ఏ పేర్లతో ప్రహించినది?
        - హ్రాదిని, నలినీ, పావనీ(ఈ 3 తూర్పునకు),
           సుచక్షు, సీత, సింధు (ఈ 3 పడమరకు)
          భాగీరథి(భగీరథుని వెంట) ప్రవహించాయి.

105. పాతాళానికి చేరిన  దేవలోకంలోను, భూలోకంలోనూ,
         పాతాళలోకంలోనూ ప్రవహించే ఈ గంగను పిలిచే పేరు?
         - త్రిపథగ

Saturday, October 7, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 6


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 6
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........81. కౌశికీ నదిగా మారినది ఎవరు?
      - కౌశికి(సత్యవతి)

82. కౌశికీ నదిని ఇప్పుడేమంటున్నారు?
      - కూసినది

83. మిథిల ప్రయాణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుకు
      చెప్పిన కథలు-?
     - విశ్వామిత్రుని పూర్వులకథ, కుమారస్వామి జననం,
       గంగావతరణం, క్షీరసాగరమథనం, అహల్య కథ, 
       ఇలాంటి కథలెన్నో చెప్పాడు.

84. కుమారస్వామి పేర్లు?
    - శరవణభవ(ఱెల్లులో పుట్టినవాడు)
      షణ్ముఖుడు(ఆరు ముఖాలుగలవాడు)
      కార్తికేయుడు(కృత్తికలచే పెంచబడినవాడు)
      సుబ్రహ్మణ్యుడు(అతిపవిత్రుడైనవాడు)
      అగ్నిపుత్రుడు(తేజస్సునుండి పుట్టినవాడు)
      గాంగేయుడు (గంగాదేవికి పుట్టినవాడు)
      స్కందుడు(జారిపడినవాడు)
      దేవసేనాపతి(దేవతల సేనకు సేనాపతి)
      గుహుడు(చీకటిని హరించేవాడు)

85. కుమారస్వామి ముందుజన్మలో ఎవరు?
      సనత్కుమారులవారు(బ్రహ్మమానసపుత్రుడు)

86. సనకత్కుమారులవారిని పుత్రునిగా పుట్టమని 
     వరం అడిగింది ఎవరు?
    - శంకరుడు(శివుడు)

87. సగరుని భార్యలు-?
      - విదర్భరాజ పుత్రిక కేశిని, 
        అరిష్టనేమి పుత్రిక గరుత్మంతుని సోదరి సుమతి

88. ఎవరి వరం వల్ల సగరునికి సంతానం కలిగింది?
     - భృగువు

89. కేశిని సంతానం -?
     - అసమంజసుడు

90. సుమతి సంతానం-?
    - 69 వేలమంది

91. సగరునిచే వెళ్లగొట్టబడిన సగరకుమారుడి పేరు?
     - అసమంజసుడు

92. సగరుని అశ్వమేధ యాగాశ్వరక్షకునిగా వెళ్ళినది-?
     - అంశుమంతుడు(సగరుని మనుమడు)

93. సగరుని అశ్వమేధ యజ్ఞాశ్వాన్ని అపహరించినవా?రు
     - దేవేంద్రుడు

94. గుఱ్ఱము ఎప్పుడు దేవేంద్రుడు అపహరించాడు?
    - యజ్ఞారంభంలో(రాక్షస వేషంలో)

95. యగాశ్వాన్ని ఇంద్రుడు ఎక్కడ ఉంచాడు?
    - కపిలమహర్షి తపస్సు చేసే ప్రాంతంలో

Friday, October 6, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 5


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 5
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........66. మిథిలా నగరానికి వెళుతూ విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు
      ఏ నది తీరంలో రాత్రికి నిద్రించారు?
     - శోణానది

67. శోణనదిని ఇప్పుడు ఏమంటున్నాము?
    - సోన్ నది

68. శోణనదికి మరోపేరు-?
     -మాగధి

69. మాగధి పేరు మీద ఏర్పడినదేశం-?
     - మగధ దేశం

70. మగధదేశ రాజధాని?
     - గిరివ్రజ పురం

71. కుశుడు - ఎవరి కుమారుడు?
    - బ్రహ్మమానస పుత్రుడు

72. కుశునికి విదర్భరాజకన్యకు పుట్టినవారు?
     - కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు

73. కుశనాభుడు, ఘృతాచి అనే అప్సరసకు పుట్టిని నూరుగురు
      ఆడపిల్లలు తమను మోహించిన వాయుదేవునితో ఏమన్నారు?
      - మేము స్వతంత్రలంకాదు, మేము మానాన్న కూతుళ్లం.

74. కుశనాభుని కుమార్తెలను వాయుదేవుడు ఏమని శపించాడు?
      - మఱుగుజ్జులై పొమ్మని శపించాడు.

75. కుశనాభుని కుమార్తెలు మఱుగుజ్జులైన ప్రదేశానికి పేరు?
     - కన్యాకుబ్జము(కనౌజ్)

75. కుశనాభుని కుమార్తె కుబ్జత్వం ఎలా పోయింది?
      - వీరిని పెండ్లాడదలచి బ్రహ్మదత్తుడనే కాంపిల్య నగరరాజు
         వారి చేయిని పట్టుకోగానే వారి కుబ్జత్వం పోయింది.

76. కుశనాభుని కుమారుడెవరు?
     - గాధిరాజు

77. గాధిరాజు కుమార్తె ఎవరు?
     - సత్యవతి

78. సత్యవతి భర్త -?
     - ఋచీక మహర్షి

79. సత్యవతికి మరోపేరు ?
     - కౌశికి

80. కౌశికి తమ్ముడు-?
     - విశ్వామిత్రుడు

Wednesday, October 4, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 4


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 4
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి....
51. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో పాటు చేరిన జనపదాలు?
    - మలద, కరూశ

52. మలద, కరూశ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినది ఎవరు?
    - తాటక, మారీచ, సుబాహులు

53. తాటక ఎవరి భార్య?
    - ఝుర్జపుత్రుడైన సుందుడు

54. సుందుని చంపంది ఎవరు?
    - అగస్త్యుడు శపించగా మరణించాడు.

55. తాటక బలం ఎంత ?
    - వేయి ఏనుగుల బలం

56. తాటక చేతులు ఖండించినది ఎవరు?
    ముక్కు చెవులు కోసింది ఎవరు?
    - చేతులు ఖండించినది రాముడు
      ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు

57. రాముడు తాటకను ఏ విధంగా వధించాడు?
    - శబ్దభేది విద్యద్వారా బాణం ప్రయోగించి వధంచాడు

58. రాముడు మారీచుని కొట్టిన బాణం పేరు?
    - శీతేషువు అనే మానవాస్త్రం

59. ఆగ్నేయాస్త్రంతో రాముడు ఎవరిని సంహరించాడు?
    - సుబాహుని

60. వాయవ్యాస్త్రాన్నిరాముడు ఎవరిపై ప్రయోగించాడు?
    - మారీచసుబాహులతో వచ్చిన మిగిలిన రాక్షసులపై

61. వాల్మీకి రామాయణం లేని అంశం-?
    - సీతా స్వయంవరం

62. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగానంతరం 
     తీసువెళుతున్న ప్రదేశం?
   - విదేహ రాజ్యంలోని మిథిలా నగరానికి

63. మిథిలకు రాజు-?
    - జనకమహారాజు (సీరధ్వజుడు)

64. జనకమహారాజు తండ్రి-?
    - హ్రస్వరోముడు

65. జనకుని తమ్ముని పేరు?
    - కుశధ్వజుడు

Tuesday, October 3, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 3


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 3
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


36. దశరథకుమారులకు గురువెవరు?
    - వశిష్ఠుడు

37. రామాయాణానికి గల పేర్లు?
    - రామాయణం, సీతాయాశ్చరితమం మహత్,
      పౌలస్యవధ

38. రామోవిగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమహః - 
      అని చెప్పింది ఎవరు?
    - మారీచుడు

39. రామాయణంలో ఎన్ని శ్లోకాలున్నాయి?
    - 24 వేలు

40. రావణుని తండ్రి ఎవరు?
    - విశ్రవసుడు

41. రావణునికి కుబేరుడు ఏమౌతాడు?
    - తమ్ముడు

42. కౌసల్యా సుప్రజా రామా - అనే శ్లోకాన్ని చెప్పింది ఎవరు?
    - విశ్వామిత్రుడు

43. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు ఎందుకు వచ్చాడు?
    - యాగరక్షణార్థం రాముని పంపమని అడగటానికి

44. విశ్వామిత్రుని మాటలు విన్న దశరథుడు ఏమన్నాడు?
   - రాముడు చిన్నవాడు విద్యపూర్తికాలేదు కావాలంటే
     నేనే నీవెంట వస్తాను అన్నాడు.

45. చివరకు రాముని విశ్వామిత్రుని వెంట ఎందుకు పంపాడు?
    - వశిష్ఠుని మాటల వలన రాముని 
      విశ్వామిత్రుని వెంట పంపాడు

46. దారిలో రామునికి లక్ష్మణునికి విశ్వామిత్రుడు ఏమి నేర్పాడు?
    - బల, అతిబల అనే విద్యలతోబాటు అనే విద్యలు నేర్పాడు

47. బల విద్య అంటే ఏమిటి?
    - ఉత్సాహాన్ని, బలాన్ని వృద్ధి పొందించేది, ఇతరులు వేసే 
      ఆయుధాలని తట్టుకొనే శక్తినిచ్చేది, ఆకలి దప్పుల బాధను 
      లేకుండా చేసేది

48. అతిబల విద్య అంటే?
    - చూపు, మనసు, శరీరం, పని, అనే నాలిగింటి చేత శత్రువును
      పొరపాటుపడేలా చేసేది, ఈ మంత్రాన్ని మననం చేసేవాడు 
      ప్రయోగించే ఆయుధానికి, తిరుగులేని తనాన్ని ఇచ్చేది

49. తాటకను రాక్షసివి కమ్మని శపించినవాడు?
    - అగస్త్యుడు

50. తాటక రాక్షసి కాకమునుపు ఎవరు?
    - సుకేతుడను యక్షుని కుమార్తె.


    

Monday, October 2, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 2


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 2
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........
21. దశరధుని పెంపుడు కుమార్తె ?-
    - శాంత

22. శాంత ఎవరెవరి వద్ద పెరిగింది?
    - దశరథుడు, రోమపాదుడు(అంగదేశాధిపతి)

23. శాంత ఎవరి కుమార్తె
    - సురభి అనే కామథేనువు అనుగ్రహం వల్ల
      దశరథునికి, రోమపాదునికి పెంపుడు కుమార్తె అయింది.

24. శాంత ఎవరి భార్య ?
    - ఋష్యశృంగుని భార్య

25. కౌసల్య తండ్రిపేరు?
      - భానుమంతుడు

26. సుమిత్ర తండ్రి ఎవరు?
      - మగధాధీశుడు

26. కైకేయి తండ్రి పేరు?
    - కేకయరాజు

27. వాల్మీకి నారదుని అడిగిన ప్రశ్నఏమిటి
     - ఓమహర్షీ! విష్ణులోకం నుండి సర్వలోకాలూ సంచరించే
      బ్రహ్మమానసపుత్రుడివికదా నువ్వు సద్గుణాలూ, పరాక్రమమూ, 
      సత్యవ్రతమూ, సమర్థతా, ధైర్యమూ, సచ్చరిత్రమూ,
      పట్టుదలా, అన్ని భూతముల యందు ఇష్టమూ, 
      పాండిత్యమూ, కృతజ్ఞతాభావమూ, ధర్మబుద్ధీ, క్రోధాన్ని 
      జయించిన తనమూ, కాంతీ, అసూయలేని తనం కలవాడూ,
      కోపం వస్తే దేవతలనైనా భయపెట్టగలవాడూ, అందరికీ 
      ఇష్టుడూ ఎవరైనా ఉన్నారా (16 గుణాలు కలిగినవాడు)

28. వాల్మీకి ప్రశ్నకు నారదుని సమాధానం
     - ఈ 16 గుణాలున్నవాడు శ్రీరామచంద్రుడు

29. ఈ 16 గుణాలూ పరశురాముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, 
     భరద్వాజులలో ఉన్నాయికదా - అనే ప్రశ్నకు నారదుని    
     సమాధానం-
    - తెలుసుకొని చెబుతాన్నాడు.
     (పరశురాముడు - కోపం జయించలేదు
     విశ్వామిత్రుడు - తపస్సులలో భ్రష్టుడై, ఆత్మవిమర్శ 
     చేసుకొన్నవాడు
     వశిష్ఠుడు - యుద్ధంలో పరాక్రమాన్ని చూపలేడు.
     భరద్వాజుడు - దేవతలని భయపెట్టలేడు)

30. అశ్వమేధయాగంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి- ల పేర్లు?
    - (క్రమంగా)పట్టమహిషి, పరివృత్త, వావాత

31. అశ్వమేధంతో పాటు జరిగిన క్రతువులు-
    - అగ్నిష్టోమం, 2 అతిరాత్రాలు, అభిజిత్, 
      విశ్వజిత్, 2ఆప్తోర్యామాలు

32. యాగం చేయించే పురోహితులు ఎన్ని విధాలు?
    - హోత, అధ్వరు, బ్రహ్మ, ఉద్గాత 
      అని నాలుగువిధాలు

33. హవిస్సు అంటే?-
    - మంత్రపూర్వకంగా అగ్నిలోవేసే నేయి.

34. యజ్ఞపురుడు ఇచ్చిన పాయసాన్ని దశరథున్ భార్యలు
      తీసుకున్న విధానం?-
    - కౌసల్య సగభాగం, 
      సుమిత్ర  ఒక నాలుగవభాగం, 
               ఒక ఎనిమిదవ భాగం, 
      కైకేయి ఎనిమిదవ భాగం.

35. దశరథ తనయులు పుట్టిన రోజులు-
    - కౌసల్య పుత్రుడు 
      రాముడు - చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, 
                గురువారం మధ్యాహ్నం
      కైకేయి పుత్రుడు
      భరతుడు - పుష్యమీ నక్షత్రం, దశమి తిథి
     
      సుమిత్రా పుత్రులు
      శత్రుఘ్న, లక్ష్మణులు - ఆశ్లేష నక్షత్రం, దశమి తిథి