Friday, October 30, 2020

ఆణిముత్యాలు - ఔనౌను

ఆణిముత్యాలు - ఔనౌను




సాహితీమిత్రులారా!


మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కథ

దూరదర్శన్ వారు ప్రసారం చేసినది

కథ - ఔనౌను

వీక్షించండి- 



Wednesday, October 28, 2020

ఆణిముత్యాలు- రంగ(కథ)

 ఆణిముత్యాలు- రంగ(కథ)





సాహితీమిత్రులారా!

దూరదర్శన్ లో ప్రసారమైన కథ - రంగ

రచన- కొమ్మూరి పద్మావతీదేవి

ఆస్వాదించండి-




Monday, October 26, 2020

ఎటువంటి స్త్రీని కలువకూడదు

 ఎటువంటి స్త్రీని కలువకూడదు






సాహితీమిత్రులారా!



మన పూర్వులు చెప్పిన మంచిమాటలలో

చాల గొప్ప విషయాలున్నాయి.

చారుచర్య అనే నీతిశాస్త్రంలో

చెప్పిన ఈ నీతి అంశాన్ని గమనించగలరు.

నేటి సమాజంలో స్త్రీకి ఎంత విలువ ఉందో

మనం రోజువారి జరిగే సంఘటనలను బట్టి

తెలుస్తూంది. ఎలాంటి స్త్రీలతో కలువకూడదో

కామపు చూపు చూడకూడదో 

చెప్పే పద్యం ఇది గమనించగలరు-


వనితలు సంభోగమున వర్జనీయలు

            తగఁదన్ను నేలు నాతని పురంధ్రి

బంధువు నిల్లాలు బ్రాహ్మణోత్తము భార్య

            చెలికాని పడఁతి వీరలఁ దలంప

మాతృసమానలు మనువు దప్పిన యింతి

            కన్నియ ముదిసిన కాంత రూప

శీలగుణమ్ములచేత నిందితయైన 

            ముదితయుఁ దనజాతి మాత్రకంటె

నతిశయంబగు  వర్ణంబు నతివ బొగ్గు

చాయ మేనిది కడుఁబల్ల చాయ పడఁతి

పెద్దవళులది కడురోగి తద్ద బడుగు

గేడి గుజ్జనఁబడు వీరిఁ గూడఁ జనదు

                                                                        (చారుచర్య-57)

ఎవితో కలువకూడదో చారుచర్య కారుడు ఈ విధంగా

చెబుతున్నాడు-

1. యజమాని భార్య, 2. బంధువు భార్య, 3. ఉత్తమ బ్రాహ్మణుని భార్య,

4. స్నేహితిని భార్య వీరంతా తల్లితో సమానులు. ఇంకా 

ఎవరితో కలువకూడదంటే వివాహము చెడిపోయిన స్త్రీని, 

రజస్వలకాని స్త్రీ అంటే కన్నియను, ముసలి స్త్రీని, 

రూపము శీలము గుణములేని స్త్రీని, 

తనకంటే పైజాతికి చెందిన స్త్రీని, 

నల్లని బొగ్గలాంటి స్త్రీని, పల్లపు(ఎర్రనిరంగు)స్త్రీని, 

పొట్టపైన పెద్దపెద్ద ముడుతలు పడిన స్త్రీని,

జబ్బుపడిన స్త్రీని, బాగా ఓపికలేని స్త్రీని, 

పొట్టిపొట్టి కాళ్ళుచేతులు గల స్త్రీ -

ఇలాంటి స్త్రీలతో సంభోగించరాదని భావం.


Sunday, October 25, 2020

విజయ దశమి శుభాకాంక్షలు

 విజయ దశమి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు 

విజయ దశమి శుభాకాంక్షలు

Saturday, October 24, 2020

దుర్గాష్టమి శుభాకాంక్షలు

 దుర్గాష్టమి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

దుర్గాష్టమి శుభాకాంక్షలు

Thursday, October 22, 2020

ఎవరు దురద్రుష్టవంతులు?

ఎవరు దురదృష్టవంతులు?


 సాహితీమిత్రులారా!





ఈ చమత్కార శ్లోకం చూడండి-

హసంతీం చ హసంతీం చ
హసంతీం వామలోచనామ్
హేమంతే యే న సేవన్తే
తే నరా దైవవంచితాః

దీనిలో హసంతీ శబ్దం
మూడుమార్లు ప్రయోగించబడింది.
ఒకదానికి కుంపటి,
మరొకటి కంబళి,
మూడవదానికి నవ్వుతున్న
అనే విశేషణార్థం.

కుంపటినిగాని, కంబళినిగాని
నవ్వుతూన్న అందమైన కన్నులున్న
యువతినిగాని చలికాలంలో ఎవరు ఆశ్రయించరో,
వారు దురద్రుష్టవంతులు - అని చెబుతున్నాడు కవి.

చలిబాధ తప్పుకోవటానికి కొందరు
కుంపటి ముందు కూర్చుంటారు
మరి కొందరు కంబళి కప్పుకుని
వెచ్చదనాన్ని పొందుతారు,
నవ్వుతున్న ప్రియురాలి గాఢాలింగనంతో
చలినుండి తప్పించుకుంటారు.
ఈ మూడింటిలో ఏదీ లభించనివారు
నిజంగా విధివంచితులని
కవి చమత్కారంగా చెప్పాడు.

Tuesday, October 20, 2020

గంజాయి మీద పద్యం

 గంజాయి మీద పద్యం



సాహితీమిత్రులారా!



కాశీ కృష్ణమాచార్యులవారు చెప్పిన 

గంజాయి మీది పద్యం

ఆస్వాదించండి-

తన్నుఁబట్టిన వారిఁదాఁబట్టి నవ్వించు

             పచ్చి బోగము లంజ పాడు గంజ

తనుఁద్రావు నందరి నటేశులఁజేసి

             యాడింపఁగల లంజ పాడు గంజ

తుదిమొదల్లేని యున్మదపు పల్కుల పంట

             పండబారిన గింజ సాడు గంజ

పలుతావుంకుఁబారు బైరాగులను మంద

             పసులగట్టెడు గుంజ పాడు గంజ

త్రావువారికి గుడగుడధ్వనులఁదనదు

జాడసూచింప గల రుంజ పాడు గంజ

తప్పద్రావినవారల తలల మిత్తి

పాదుకొల్పిన కుడియంజ పాడు గంజ

Sunday, October 18, 2020

ప్రాతఃకాలం (కవిత)

 ప్రాతఃకాలం (కవిత)




సాహితీమిత్రులారా!



దేవరకొండ బాలగంగాధరతిలక్ గారి

అమృతం కురిసిన రాత్రి  - నుండి

ప్రాతఃకాలం కవిత

ఆస్వాదించండి-


చీకటి నవ్విన 

చిన్ని వెలుతురా!

వాకిట వెసిన

వేకువ తులసివా!


ఆ శాకుంతల ధ్వాంతములో

నవసి యిలపై వ్రాలిన

అలరువా!  - అప్స

రాంగనా సఖీ చిరవిరహ 

నిద్రా పరిష్వంగము విడ

ఉడు పథమున జారిన 

మంచు కలవా!


ఆకలి మాడుచు 

వాకిట వాకిట 

దిరిగే పేదల

సురిగా దీనుల

సుఖ సుప్తిని చెరచే

సుందర రాక్షసివా!


యుద్ధాగ్ని పొగవో - వి

రుద్ధ జీవుల రుద్ధ కంఠాల

రొదలో కదిలెడి యెదవో!

అబద్ధపు బ్రతుకుల వ్యవ

హారాల కిక మొదలో?


కవికుమారుని శుంభ

త్కరుణా గీతమవా!

శ్రీ శాంభవి కూర్చిన

శివఫాల విలసితమౌ

వెలుగుల బూదివా!


దేశభక్తులూ, ధర్మపురుషులూ

చిట్టితల్లులూ, సీమంతినులూ

ముద్దుబాలురూ, ముత్తైదువలూ

కూడియాడుచు కోకిల గళముల

పాడిన  శుభాభినవ ప్రభాత

గీత ధవళిమవా!



Friday, October 16, 2020

ఒక రాత్రి (శ్రీశ్రీ కవిత)

 ఒక రాత్రి (శ్రీశ్రీ కవిత)




సాహితీమిత్రులారా!



శ్రీశ్రీగారి మహాప్రస్థానం నుండి

ఒక రాత్రి కవిత ఆస్వాదించండి-


గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి -

బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!


ఆకాశపు టెడారి నంతటా, అకట!

ఈ రేయి రేగింది ఇసుకతుఫాను!


గాలిలో కనరాని గడుసు దయ్యాలు

భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి!


నోరెత్త, హోరెత్తి నొగులు సాగరము!

కరి కళేబరములా కదలదు కొండ!


ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన 

ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి!


విశ్వమంతా నిండి, వెలిబూది వోలె

బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!


Thursday, October 15, 2020

ఆలోచనా లోచనాలు

 ఆలోచనా లోచనాలు




సాహితీమిత్రులారా!



దాశరథి గారి ఈ కవిత వీక్షించండి-

ఇది ఆలోచనా లోచనాలు సంకలనంలోనిది.


చీకటి చీర కట్టుకొని

ఆకలి రైక తొడుక్కొని

శోకంతో కుమిలిపోతున్న లోక కన్యను

చెరపడుతున్నాడు కాల రాక్షసుడు


చుక్కలు చూస్తున్నాయి

నక్కలు కూస్తున్నాయి

ఆదుకోలేక అమాయక జీవులు

అడుగు వెనక్కు వేస్తున్నాయి


నిరాశలు నిప్పుమంటలై రేగుతున్నాయి

దురాశలు దుందుభులై మోగుత్తన్నాయి

ఆశకు ఆయువు తీరిపోయిందా?

అవని అశాంతి యవనికలో  దాగిపోయిందా?


ఇది కథకాదు, కాలుతున్న సొద

ఇది యెదలో సాగుతున్న రొద

దీన్ని కలకాలం భరించలేం కద?

అందుకే సమరం సాగింతాం,  పద!


చూపుల సెర్చిలైట్లకు అడ్డంగా

దాపురించిన ఈ అంధకార గంగ

ఆలోచనా లోచన కాంతిపథంలో 

అదృశ్యమైపోతుంది ఒక్క క్షణంలో


ఈ భయంకర బాధామయ ధాత్రి

ఇక ప్రియంకరమౌతుంది ఈ  రాత్రి;

వ్యాపిస్తున్నై నవకాంతి జ్వాలలు

అవి మానవతా మందార మాలలు!!

Tuesday, October 13, 2020

వడగళ్ళు (టెలిఫిల్మ్)

 వడగళ్ళు (టెలిఫిల్మ్)





సాహితీమిత్రులారా!

అడవి బాపిరాజు గారి

కథను దూరదర్శన్ వారు

వడగళ్ళు టెలిఫిల్మ్ గా ప్రసారం చేశారు

అది ఇక్కడ వీక్షించండి-



Saturday, October 10, 2020

కట్నాలు వద్దు కానుకలు కూడా వొద్దు

 కట్నాలు వద్దు కానుకలు కూడా వొద్దు





సాహితీమిత్రులారా!

భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

కట్నాలు వద్దు కానుకలు కూడా వొద్దు

ఇక్కడ వీక్షించండి-



Friday, October 9, 2020

ఘంటసాల ఇంటర్వూ (స్మరణీయం)

 ఘంటసాల ఇంటర్వూ (స్మరణీయం)




సాహితీమిత్రులారా!

ఆలిండియా రేడియో హైదరబాదు వారు ప్రసారం చేసిన

ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఇంటర్వూ

వినండి-




Wednesday, October 7, 2020

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా 





సాహితీమిత్రులారా!


త్రిపురనేని గోపీచంద్ గారి నవల

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

టెలిఫిల్మ్ గా దూరదర్శన్ నందు

ప్రసారితమైంది ఆ టెలిఫిల్మ్

ఇక్కడ వీక్షించండి-




Monday, October 5, 2020

సకల కలా కోవిదుడు

 సకల కలా కోవిదుడు




సాహితీమిత్రులారా!


భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

సకల కలా కోవిదుడు

ఇక్కడ వీక్షించండి-



Sunday, October 4, 2020

కర్పూర వసంతరాయలు

 కర్పూర వసంతరాయలు




సాహితీమిత్రులారా!


కర్పూరవసంతరాయలు 

రచన --డా; సి, నారాయణ రెడ్డి-- ప్రచురణ-- 1957 

ఇది ఒక కథాత్మక గేయకావ్యం. క్లుప్తంగా కథాశరీరం. 'కుమారగిరి', 'లకుమ' నాట్యానికి, ఆమె తనూ లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమ ను అర్థిస్తుంది. లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. రెడ్డీ రాజులచరిత్రకు ప్రాణం పోసిన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిచ్చారు నారాయణ రెడ్డి గారు. ఈ కావ్యాన్ని టెలిఫిల్మ్ గా తీశారు దాన్ని వీక్షించండి-



Friday, October 2, 2020

కోరీ భుజింతును - గోంగూర పచ్చడి

 కోరీ భుజింతును - గోంగూర పచ్చడి





సాహితీమిత్రులారా!


భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

కోరీ భుజింతును - గోంగూర పచ్చడి

ఇక్కడ వీక్షించండి-



Thursday, October 1, 2020

సినారె వైభవం

 సినారె వైభవం




సాహితీమిత్రులారా!


దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారు

ఈ మధ్యే ప్రసారం చేసిన 

సినారె వైభవం

మొదటి ఎపిసోడ్ వీక్షించండి