Thursday, January 31, 2019

కథలు చెప్పే అతను


కథలు చెప్పే అతను



సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..........

పాటకి
రాళ్లు కరిగి నీరైపోయిన కథ చెప్పాడు
ముప్పై ఏళ్లుగా
ఏదో ఒక కథ
ఎవరికో ఒకరికి చెప్తూనే వున్నాడు
రాత్రి రెప్పవాల్చని కాలం వరకూ
పాదాల గడబిడ అడుగుల మధ్య
కుండపై దరువేస్తూ
ఏ గుండెలను కరిగించాలనో
ఆ నిశ్శబ్ద సంగీతలయకారుని ఆరాటం
ఏమో ఏ చైతన్యం వైపో

కదిపితే రాళ్ల కథేం
నిజంగా నీళ్ల కథే చెప్తాడు
నీళ్లు అగ్నిగా మారి అడవిని అల్లుకున్న కథ
అశ్రునయనాలతో ఆలపిస్తాడు
అగ్ని కథేం
విల్లు పుష్పంగా విచ్చుకున్న కథ
గొప్ప తమకంతో చెప్తాడు
అతను చెప్పాలి గాని
కుక్కపిల్ల కూడా చెవులు రిక్కించి
వింటుంది

చిన్న గోనె పట్టా
దానిపైనే కూర్చుని
చుట్టూ ఆవరించిన
చీకటి తునకలను చెదరగొడ్తూ
ఒక్కో పాటని
గాలి వీస్తున్నంత సహజంగా
నేర్పుగా
పాడుతాడు

రాతి కాలాన్ని
నిర్దయగా ఛీకొట్టే
వొక్కడు
మనిషిని మనిషిని కలిపే
వొక రాగాన్ని అన్వేషిస్తూ భంగపడ్తూ
యిదే బతుకు అన్నాడు
చెట్టుని కొమ్మని పువ్వుని
మనుషుల్లోకి మళ్లించే
మహా కంకణమేదో కట్టుకున్నట్టున్నాడు
నావైపు తిరిగి ఒక దరువు వేశాడు

అతని దరువు
రాత్రి నిద్రలోనూ వినిపిస్తుంది
----------------------------------------------------
రచన: బాలసుధాకర్ మౌళి, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, January 30, 2019

ఆనందం


ఆనందం




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..........

అన్ని రకాల భేదాల నుండి మనకి
వస్తు ప్రపంచం విముక్తి కలిగిస్తుంది
కాని, లాలస అనే ఒకే ఒక తాటితో
తిరిగి అందర్నీ బంధిస్తుంది.

క్రయవిక్రయ చింతనలు విరామ కాలాన్ని హరిస్తాయి
కలలు కూడా కమర్షియల్ బ్రేక్స్‌తో నడుస్తాయి

పొందిన వస్తువు నుండి ఆశించిన ఆనందం పొందలేక
పొందటమే ఆనందంగా భ్రమిస్తాము
పొందలేని దానిలో ఇంకేదో ఉంటుందని
నిత్యం దాని చుట్టూ పరిభ్రమిస్తాము

మరొక వైపు
అందరికీ అందేంత ఎత్తులోనే ఉన్నా
ఎందుకో ఎవరికీ పట్టని పండులా
అసలైన ఆనందం విచారంగా చూస్తుంది

తడబడే అడుగుల పసివాడి
పాదం తగిలితే చాలు
పుడమితల్లి పుత్రవాత్సల్యంతో పులకిస్తుంది
రెండడుగులు తనవైపు నడిచి పలకరిస్తే చాలు
చుట్టాల్ని చూసిన చిన్నపిల్లలా
సముద్రం అరుస్తూ గంతులు వేస్తుంది

నిన్నటి పాట మనం విన్నామో లేదోనని
కొమ్మ మీద వాలిన పక్షి
అదే పాటని పదేపదే పాడి వినిపిస్తుంది

పున్నమి రాత్రి ఆరుబయట విశ్రమిస్తే చాలు
ఎన్నిసార్లు ముద్దుచేసినా
మళ్ళీ తన ఒళ్ళు నిమరమని
కళ్ళలోకి గోముగా చూసే తెల్ల కుక్కపిల్లలా వెన్నెల
ఒడిలో చేరి ముడుచుకు పడుకుంటుంది

ఏదీ పట్టదు
మూసిన ఈ మది తలుపుల్ని
ఏ మృదుహస్తమూ తట్టదు
అన్నీ మరిచి ముందు రాబోయే దేనికోసమో
ఎదురుచూస్తూ బతుకుతాము
కళ్ళ వెలుగులు చుట్టూ మిరుమిట్లు గొలుపుతున్నా
కనిపించని దేనికోసమో వేళ్ళతోనే వెతుకుతాము.
-----------------------------------------------------
రచన: విన్నకోట రవిశంకర్, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, January 29, 2019

మంటో కథలు: కాలీ సల్వార్


మంటో కథలు: కాలీ సల్వార్



సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి...........

ఢిల్లీకి రావడానికి ముందు ఆమె అంబాలా ఛావనీలో ఉండేది. అక్కడ ఆమెకు చాలామంది తెల్లవాళ్ళు కస్టమర్లుగా ఉండేవారు. వాళ్ళతో కలవడం మాట్లాడ్డంతో ఆమెకు కూడా పది పదిహేను ఇంగ్లీష్ ముక్కలు వంటబట్టాయి. ఆమె వాటినెప్పుడూ మామూలు పిచ్చాపాటి కబుర్లలో వాడేది కాదు కానీ ఢిల్లీ వచ్చాక అక్కడ వ్యాపారం నడవకపోయేసరికి ఒకసారి పక్కింటి తమంచాజాన్‌తో ‘దిస్ లైఫ్… వెరీ బాడ్’ అని అంది. అంటే ఈ జీవితం చాలా చెడ్డదని, కనీసం తినడానికి కూడా ఏమీ దొరకటం లేదని.

అంబాలా ఛావనీలో ఆమె దందా బాగా నడుస్తుండేది. ఛావనీలో తెల్లవాళ్ళు ఆమె దగ్గరకు తాగి వచ్చేవారు. ఒక మూడు నాలుగు గంటల్లో ఆమె షుమారు పదిమందిదాకా తెల్లవాళ్ళను తృప్తి పరచి ఇరవై ముప్ఫై రూపాయలదాకా పుట్టించేది. ఈ తెల్లవాళ్ళు దేశీలకన్నా మంచివాళ్ళు. వాళ్ళేం అంటున్నారో సుల్తానాకు అర్థం అయేది కాదు నిజమే కాని, వాళ్ళ భాష అర్థం కాకపోవటం అనేది ఆమెకి బాగా ఉపయోగపడింది. వాళ్లు ఆమె చెప్పినదానికన్నా తక్కువ రేటుకి బేరమాడబోతుంటే తల అడ్డంగా ఊపుతూ అనేది: “సాహెబ్! నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!” అప్పుడప్పుడూ వాళ్ళు ఆమెతో కొంత మోటుగా సరసమాడితే వాళ్ళపై తన భాషలో తిట్లు మొదలుపెట్టేది. వాళ్ళకి అర్థం కాక హైరానాపడి ఆమె వైపు చూస్తే, వాళ్ళతో అనేది: “సాహెబ్! నువ్వో పెద్ద దద్దమ్మవి, తప్పబుట్టిన ముండాకొడుకువి… అర్థమైందా?” ఆ మాటలు చాలా గోముగా గొంతులో కరుకుతనం ఏమీ లేకుండా అనేది. తెల్లవాళ్ళు నవ్వుకునేవాళ్ళు, అలా నవ్వుతుంటే సుల్తానాకి వాళ్ళు అచ్చం దద్దమ్మల్లా కనిపించేవారు.

అదేమిటో కాని, ఈ ఢిల్లీకి వచ్చిన రోజు మొదలుకొని ఒక్క తెల్లవాడు కూడా ఆమె దగ్గరకి రాలేదు. ఇక్కడ ఒక పెద్ద లార్డ్ సాహెబ్ ఉంటాడట, ఆయన వేసవిలో సిమ్లాకి వెళ్లిపోతాడట, ఆయనకు చాలా బలగం ఉందిట– ఇలాంటి కబుర్లేవో సుల్తానా విన్నది. కాని, ఇంత పెద్ద ఊర్లో కూడా ఈ మూడు నెలల్లో ఆమె దగ్గరకు కేవలం ఆరుగురంటే ఆరుగురు మగవాళ్ళు వచ్చారు. అంటే నెలకి ఇద్దరు. ఆ ఆరుగురు కస్టమర్లనుండి ఆమె, ఖుదా అబద్ధం చెప్పించడు, పద్దెనిమిదన్నర రూపాయలు వసూలు చేసింది. మూడు రూపాయలకన్నా ఎక్కువకు ఎవరూ ఒప్పుకోనేలేదు. సుల్తానా వాళ్ళల్లో ఐదుగురికి తన రేటు పది రూపాయలు అని చెప్పింది కానీ విడ్డూరంగా వాళ్ళలో ప్రతివాడూ కూడా ‘నేను మూడు రూపాయలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వ’ననే అన్నాడు. వాళ్ళకి ఆమె మూడు రూపాయలకంటే ఎందుకు ఎక్కువ ఖరీదు అనిపించలేదో మరి. చివరికి ఆ ఆరోవాడు వచ్చినప్పుడు, ఆమే చెప్పింది: “చూడూ, ఒక్కసారి చేసినందుకు మూడు రూపాయలు అవుతుంది. ఒక్క పైసా కూడా తగ్గించను. నువ్వు బేరం చేయకు. ఇక నీ ఇష్టం. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు.” ఆరోవాడు ఈ మాట విని ఎదురు చెప్పలేదు, ఆమె దగ్గరే ఉండిపోయాడు. అతడు పక్క గదిలో తలుపులు మూసుకొని తన కోటు విప్పుతున్నప్పుడు సుల్తానా అంది: “ముందు ఒక రూపాయి ఇవ్వండి, పాలకి…” అతడు ఒక రూపాయి ఇవ్వలేదుగానీ, మెరుస్తున్న ఆఠానా జేబులోంచి తీసి ఆమెకి ఇచ్చాడు, సుల్తానా కూడా గమ్మున తీసేసుకుంది, దక్కిందే చాలనుకొని.

పద్దెనిమిదన్నర రూపాయలు మూడు నెలల్లో! ఆమె ఇంటి అద్దె ఒక్కటే నెలకి ఇరవై రూపాయలు. ఇంటి యజమాని ఇంటిని ఇంగ్లీషులో ఫ్లాట్ అని అనేవాడు. ఆ ఫ్లాట్‌లో పాయఖానా పక్కన ఒక గొలుసు వేలాడుతూ ఉండేది. అది లాగితే చాలు, నీళ్ళు ఒక్కసారిగా పడి పెద్దగా చప్పుడు చేసుకుంటూ నిండి కసువు అంతా కింద తూములోకి మాయమైపోయేది. మొదట్లో ఆ చప్పుళ్ళు ఆమెను భయపెట్టేవి. మొదటి రోజు ఆమె ఆ పాయఖానాలోకి వెళ్లినప్పుడు ఆమెకు బాగా నడుము నొప్పిగా ఉండింది. పని అయ్యాక లేవడం కష్టమయింది. ఆ గొలుసు చూసి ‘ఇలాంటి ఇళ్ళు మాలాంటి వారికోసమే కదా కట్టింది. అందుకనే మా ఇబ్బందులన్నీ తెలిసి లేచేప్పుడు ఆసరా కోసం వేలాడదీసుంటార’నుకుంది. అలా అనుకొని ఆ గొలుసు పట్టుకుని పైకి లేవబోయింది. ఇంకేముంది, పైన కటకటమని కొట్టుకొని, నీళ్ళు ఒక్కసారిగా పెద్ద చప్పుడు చేసుకుంటూ వచ్చేసరికి ఆమె హడలిపోయి ఒక గావుకేక పెట్టింది.

ఖుదాబక్ష్ పక్క గదిలో తన ఫోటోగ్రాఫీ సామానంతా సర్దుకుంటూ ఒక కడిగిన బాటిలులో హైడ్రోకోనైన్ పోస్తుండగా వినిపించింది సుల్తానా కేక. పరిగెత్తుకుంటూ బయటకొచ్చి, సుల్తానాని అడిగాడు: “ఏమయ్యింది? నువ్వేనా అరిచింది?”

సుల్తానా గుండె దడదడా కొట్టుకుంటూనే ఉంది: “థత్ తెరీకీ! ఇది పాయఖానానా ఇంకేమన్నానా? మధ్యలో రైళ్ళల్లో ఉన్నట్టు ఈ గొలుసులేంటి? నాకు నడుం నొప్పిగా ఉందని, దీన్ని ఆసరాగా పట్టుకోని లేవబోయాను. కానీ ఈ మాయదారి గొలుసు లాగానో లేదో ఎంత రచ్చయ్యిందో నేనేం చెప్పను నీకు…”

అది విని ఖుదాబక్ష్ గట్టిగా నవ్వాడు. సుల్తానాకి ఆ పాయఖానా గురించి వివరంగా చెప్పాడు; ఇది కొత్త ఫాషనని, గొలుసు లాగగానే కసువంతా నాలా లోకి వెళ్ళిపోతుందని.

ఖుదాబక్ష్‌కి, సుల్తానాకి ఎలా సంబంధం కుదిరింది అన్నది ఒక పెద్ద కథ. ఖుదాబక్ష్ రావల్పిండికి చెందినవాడు. ఎంట్రన్స్ పాస్ అయ్యాక అతడు లారీ నడపడం నేర్చుకున్నాడు. ఓ నాలుగేళ్ళ వరకూ అతడు రావల్పిండి-కశ్మీరు మధ్య లారీ నడిపేవాడు. ఆ తర్వాత అతడికి ఒక కశ్మీరీ అమ్మాయి పరిచయమయ్యింది. ఆమెను తనతో లేపుకువచ్చాడు. లాహోరులో అతడికి పనేం దొరక్కపోయేసరికి ఆమెనే వ్యాపారానికి కూర్చోబెట్టాడు. రెండుమూడేళ్ళు ఇలానే గడిచాయి. ఆ తర్వాత ఆమె ఇంకెవరితోనే లేచిపోయింది. ఖుదాబక్ష్‌కి ఆమె అంబాలాలో ఉందని చూచాయగా తెలిసింది. ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు, అక్కడ సుల్తానా దొరికింది. సుల్తానాకి అతడు నచ్చాడు. అలా వాళ్ళిద్దరి మధ్య సంబంధం కుదిరింది.

ఖుదాబక్ష్ వస్తూనే సుల్తానా వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆమెకు నమ్మకాలు అవీ కాస్త ఎక్కువ. ఖుదాబక్ష్ దేవుడు లాంటివాడనీ, అందుకే అతడు వచ్చాక వ్యాపారం ఇంతగా జోరందుకుందనీ అనుకునేది. అతణ్ణి గొప్ప అదృష్టంగా భావించేది. అలా అతగాడి విలువ ఆమె దృష్టిలో పెరిగిపోయింది.

ఖుదాబక్ష్ కష్టజీవి. రోజంతా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అతడికి నచ్చేది కాదు. ఖాళీగా ఉండకుండా ఎలాగోలా ఒక ఫోటోగ్రాఫరుతో స్నేహం కట్టాడు. రైల్వే స్టేషను బయట ఉండి మినిట్ కెమేరాతో ఫోటోలు తీసి ఇచ్చే అతనికి దోస్తు అయ్యాడు. అతడి దగ్గర ఫోటోలు తీయడం నేర్చుకున్నాడు. తర్వాత సుల్తానా నుండి అరవై రూపాయలు అప్పు తీసుకొని కెమేరా కూడా కొన్నాడు. మెల్లిమెల్లిగా ఒక తెర చేయించాడు. రెండు కుర్చీలు, ఫోటోలు కడగడానికి కావాల్సిన అన్ని సామాన్లు సమకూర్చుకుంటూ మొత్తానికి తన పని మొదలుపెట్టాడు.

ఫోటోల పని బాగా నడిచింది. అతడు కొద్ది కాలానికే తన అడ్డాను అంబాలా ఛావనీలో కుదుర్చుకున్నాడు. ఇక్కడ అతడు తెల్లవాళ్ళ ఫోటోలు తీసేవాడు. ఒక నెల లోపే అతడికి అంబాలా ఛావనీలో లెక్కలేనంతగా ఉన్న తెల్లదొరలంతా పరిచయమైపోయారు. సుల్తానాని కూడా అక్కడికే తీసుకెళ్ళాడు. అలా ఛావనీలో ఖుదాబక్ష్ వల్ల తెల్లవాళ్ళంతా సుల్తానాకి రోజుఖాతాదారులయ్యారు.

సుల్తానా చెవులకి దుద్దులు చేయించుకుంది. ఐదున్నర తులాలవి ఎనిమిది గాజులు చేయించుకుంది. పది పదిహేను మంచి మంచి చీరలు కొనుక్కుంది. ఇంటిలోకి ఫర్నీచర్ వగైరా కూడా చేయించింది. ఒక ముక్కలో చెప్పాలంటే అంబాలా ఛావనీలో ఆమె జీవితం హాయిగా గడుస్తుండేది. కానీ ఉన్నట్టుండి ఎందుకో ఖుదాబక్ష్ మనసులో ఢిల్లీకి వెళ్ళాలన్న పట్టు మొదలయ్యింది. సుల్తానా కాదనలేదు కదా. ఖుదాబక్ష్‌ పక్కన ఉంటే చాలు వ్యాపారం ఎక్కడైనా జోరుగా సాగుతుంది. అందుకని ఆమె సంతోషంగానే ఒప్పుకుంది ఢిల్లీ వెళ్ళడానికి. పైగా అంత పెద్ద ఊర్లో, లార్డ్ సాహెబ్ లాంటివాళ్ళు ఉండే చోట, తన దందా ఇంకా బాగా నడుస్తుందని ఆమె అనుకుంది. ఆమె స్నేహితురాళ్ళు ఢిల్లీని పొగడ్డం ఆమె విన్నది. అక్కడ హజరత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా కూడా ఉంది. ఆమెకు ఆ దర్గా అంటే బాగా నమ్మకం. అందుకని త్వరత్వరగా ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద సామాన్లన్నీ అమ్మేసి ఆమె ఖుదాబక్ష్‌తో పాటు ఢిల్లీకి వచ్చేసింది. ఇక్కడికొచ్చాక ఖుదాబక్ష్ నెలకి ఇరవై రూపాయల అద్దెకి ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, దానిలో ఇద్దరూ ఉంటున్నారు ఇప్పుడు.

ఒకటే పొడుగాటి రోడ్డు. దానికానుకుని ఒకవైపు ఒకే రకం మూడంతస్తుల మేడలు వరుసాగ్గా ఒకదానికొకటి ఆనుకొని వుంటాయి. మొదటి అంతస్తులో అన్నీ దుకాణాలు, పైన రెండు అంతస్తుల్లో ఒక్కోదానిలో రెండేసి ఫ్లాట్‌లు. మునిసిపల్ కమిటీవారు ఈ ప్రాంతాన్ని వేశ్యలకని ప్రత్యేకంగా కేటాయించారు, వాళ్ళు నగరంలో ఎక్కడబడితే అక్కడ తమ అడ్డాలు మొదలుపెట్టకుండా ఉంటారని. అన్ని మేడలూ ఒకే రకంగా ఉండడంతో మొదట్లో సుల్తానాకి తన ఫ్లాట్ వెతుక్కోవడం చాలా కష్టమయ్యేది. కానీ కింద లాండ్రీవాడు ఇంటి ఎదురుగా బోర్డు వేలాడదీసేసరికి ఆమెకి ఒక బండ గుర్తు దొరికింది. ‘ఇక్కడ మురికి బట్టలు ఉతకబడును’ అన్న బోర్డు చదవగానే ఆమెకి తన ఫ్లాట్ తెలిసిపోయేది. ఇలానే ఆమె ఇంకా ఎన్నో గుర్తులు పెట్టుకుంది. పెద్ద పెద్ద అక్షరాలతో ‘బొగ్గుల దుకాణం’ అని రాసున్న చోట, ఆమె స్నేహితురాలు హీరాబాయి ఉంటుంది, ఆమె అప్పుడప్పుడూ పాటలు పాడడానికి రేడియో స్టూడియోకి వెళ్ళేది. ‘ఇక్కడ పురుషులకోసం భోజనం తయారు’ అని రాసున్న చోటున ఆమె ఇంకో స్నేహితురాలు ముఖ్తార్ ఉండేది. నవారు పట్టీలు తయారుచేసే కార్ఖానా పైన అన్వరీ ఉండేది, ఆమెను ఆ కార్ఖానా సేటే ఉంచుకున్నాడు; సేటు సాహెబు రాత్రి పూట కార్ఖానా చూసుకోవాల్సి రావడంతో అతడు అన్వరీ దగ్గరే ఉండేవాడు.

దుకాణం తెరిచిన కొత్తల్లో కస్టమర్లు కొద్దిమందే ఉంటారు. రానూ రానూ పెరుగుతారు. అదే అనుకున్న సుల్తానా ఒక నెల పాటు ఖాళీగానే ఉండాల్సి వచ్చినప్పుడు కుదురుగానే ఉంది. కాని, రెండు నెలలు గడిచాక కూడా ఎవరూ రాకపోయేసరికి ఆమెకు కొద్దిగా దిగులు పట్టుకుంది. మూడో నెలలో ఆమె ఖుదాబక్ష్‌తో అదే అంది: “బైట బజారు మందకొడిగా ఉందని తెలుసు కాని, మరీ నెలరోజుల్లో ఒక్క కస్టమరూ రానంత మందకొడిగా ఉందా? ఏమవుతోందంటావు?”

ఖుదాబక్ష్‌ని కూడా ఈ విషయం చాలా రోజులనుండి నమిలేస్తోంది గాని, అతడు దాని ఊసు ఎత్తలేదు ఇప్పటిదాకా. కానీ సుల్తానా అడిగినప్పుడు మాత్రం నోరు విప్పక తప్పలేదు. “నేను చాలా రోజులనుండి ఈ సంగతి గురించి ఆలోచిస్తున్నాను. ఒకటి అర్థమవుతోంది. యుద్ధం కారణంగా బాబూలు, అయ్యలు వేరే వ్యాపారాలు మొదలెట్టి మన ఇంటి దారి మర్చిపోయినట్టున్నారు… లేదూ, ఇంకో సంగతేంటంటే…” అతడింకా ఏదో చెప్పబోయేలోపే ఎవరో మెట్లు ఎక్కుతున్న అలికిడి అయ్యింది. ఖుదాబక్ష్, సుల్తానా అటువైపుకి చూశారు. కొద్దిసేపటికి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఖుదాబక్ష్ ఒక్క అంగలో వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక మగమనిషి లోపలికి వచ్చాడు. ఇతడే మొదటి కస్టమరు, మూడు రూపాయలకి బేరం కుదుర్చుకున్నవాడు. ఆ తర్వాత అదే నెలలో ఇంకో ఐదుగురు వచ్చారు. అంటే, మూడు నెలల్లో ఆరుగురు, వాళ్ల నుండి సుల్తానా పద్దెనిమిదిన్నర రూపాయలు వసూలు చేసింది.

ఇరవై రూపాయలు ఫ్లాటు అద్దెకే వెళ్లిపోతుంది; దానిపైన నీళ్ళ టాక్సు, కరెంటు బిల్లు. ఇవి కాకుండా ఇంట్లో ఖర్చులు; తిండి-నీళ్ళు, బట్టలు-గిన్నెలు, మందు-మాకు. ఆదాయం మాత్రం ఏమీ లేదు. పద్దెనిమిదిన్నర రూపాయలు మూడు నెలల్లో సంపాదిస్తే ఏమైనా అనండి కాని దాన్ని ఆదాయమని మాత్రం అనరు కదా! సుల్తానా పరేషానీ పెరుగుతూనే ఉంది. ఐదున్నర తులాల ఎనిమిది గాజులు, ఆమె అంబాలాలో చేయించుకున్నవి, మెల్లిమెల్లిగా అమ్ముడు పోయాయి. చివరి గాజు వంతు కూడా వచ్చేసరికి ఆమె ఖుదాబక్ష్‌తో అంది: “నా మాట విను. పద, అంబాలాకు వాపసు పోదాం. ఇక్కడేం ఖజానాలు ఉన్నాయని? ఉన్నా కూడా, ఈ నగరం మనకి అచ్చి రాలేదు. నీ పని కూడా అక్కడ బాగా నడిచేది. పద, అక్కడికే పోదాం. నష్టపోయినదంతా మన తలరాత అనుకుందాం. ఈ గాజుని అమ్ముకొని రా! సామాను గట్రా అన్నీ చుట్టి తయారుగా ఉంచుతాను. ఇవ్వాళ రాత్రి బండికే వెళ్ళిపోదాం…”

ఖుదాబక్ష్ ఆమె చేతి నుండి గాజు మాత్రం తీసుకున్నాడు. తీసుకొని, అన్నాడు: “లేదు జానేమన్, అంబాలా వెళ్ళం. ఇక్కడే ఢిల్లీలో ఉండి సంపాదిద్దాం. ఈ గాజులు అన్నీ ఇక్కడే తిరిగి వస్తాయి. అల్లా మీద నమ్మకముంచు. మనకి ఏదో ఒక దారి దొరక్కపోదు.”

సుల్తానా ఎదురు చెప్పలేదు. ఆఖరి గాజు కూడా చేతి నుండి తీసేసింది. మొండి చేతులు చూసుకుంటే ఆమెకు చాలా బాధేసింది, కానీ ఏం చేస్తుంది, ఏదో రకంగా పొట్ట నింపుకోవాలిగా.

ఐదు నెలలు గడచిపోయాక కూడా ఖర్చుతో పోలిస్తే వచ్చే ఆదాయం నాలుగోవంతు కన్నా తక్కువ ఉండడంతో సుల్తానా దిగులు ఇంకా పెరిగిపోయింది. ఖుదాబక్ష్ కూడా ఇప్పుడు రోజంతా ఇంటినుండి మాయమైపోతున్నాడు. సుల్తానాకి దీని గురించి కూడా బాధ. చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు ఆడ స్నేహితులున్నారామెకు. ఆమె వారితో సమయం గడపవచ్చు. కానీ రోజూ అలా వెళ్ళడం, వెళ్ళి గంటల తరబడి కూర్చోవడం ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. రానురాను ఆ స్నేహితురాళ్ళని కలవడం, మాట్లాడ్డం మొత్తంగా తగ్గించేసింది. రోజంతా ఆమె తన ఇంట్లో కూర్చుని ఉండేది. వక్కలు దంచుతూ, చిరిగిపోయిన తన పాత బట్టలు కుట్టుకుంటూ ఉండేది. అప్పుడప్పుడూ బయటకొచ్చి బాల్కనీలో పిట్టగోడను ఆనుకుని నిలబడి, ఎదురుగా ఉన్న రైల్వేషెడ్‌లోకి వచ్చీ పోయే రైలు ఇంజన్లను గంటల తరబడి చూస్తూ ఉండేది.

రోడ్డుకి అవతల కుడివైపున ఆ మూల నుండి ఈమూల దాకా ఒక పెద్ద గోదాము ఉండేది. దాని ఇనుపకప్పు కింద పెద్దపెద్ద ఇనుపపిడులు, ఇంకా అన్ని రకాల సామానులు గుట్టలుగా పోసి ఉండేవి. ఎడమవైపంతా ఒక వెడల్పాటి మైదానం, దానిలో బోలెడన్ని రైలు పట్టాలు వేసి ఉండేవి. ఎండలో ఈ ఇనుప పట్టాలు మెరుస్తుంటే, సుల్తానా తన చేతుల వంక చూసుకునేది. వాటిపై నీలంగా నరాలు అచ్చంగా ఆ పట్టాలలానే ఉబ్బెత్తుగా ఉండేవి. ఆ పొడుగాటి మైదానంలో ఎప్పుడూ రైళ్ళూ, ఇంజన్లూ నడుస్తూ ఉండేవి, అటు కొన్నిసార్లు, ఇటు కొన్నిసార్లు. ఆ ఇంజన్లు, బండ్ల ఛక్-ఛక్ ఫక్-ఫక్ చప్పుళ్ళు ఎప్పుడూ ఇంట్లో తిరుగాడుతుండేవి. పొద్దున్నే ఆమె లేచి బాల్కనిలోకి వచ్చినప్పుడల్లా ఒక వింత దృశ్యం కళ్ళకి కనిపించేది. గోదాము మీద, మైదానం మీద పొగమంచు పట్టివుండేది. ఆ పొగమంచులో ఇంజను నోటినుండి చిక్కటి పొగ పైకి వెళ్తూంటే లావుపాటి మనుషులు ఆకాశం వైపు పోతున్నట్టు అనిపించేది. ఇంజన్ల తలనుంచి హడావిడిగా తన్నుకొచ్చే ఆవిరి, మేఘాల్లా పెరిగి రెప్పపాటులో గాలిలో కలిసిపోయేది. ఒక్కొక్కప్పుడు, ఇంజను ఒక చిన్న ధక్కా ఇచ్చి వదిలేసిన రైలు డబ్బా ఒంటరిగా పట్టాలపై పోతూ కనిపిస్తే ఆమెకి తనే గుర్తుకొచ్చేది: ఆమె జీవితాన్ని కూడా ఎవరో పట్టాలపై ఒక తోపు తోసి వదిలేశారు. ఆమె అలా వెళుతోంది. ఆమె జీవితపు బండిని ఇంకెవరో నెడుతున్నారు, ఆమె పట్టాలు మారుతూ పోతోంది, తన ప్రమేయం లేకుండా. ఎక్కడికో మరి? ఏదో ఒక రోజు వస్తుంది, ఆమెను తోసిన తోపు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, ఆమె ఎక్కడో ఆగిపోతుంది, ఆమె బాగోగులు కూడా పట్టించుకోడానికి ఎవరూ ఉండని ఏదో ఒక చోట.

సుల్తానా ఇలా ఊరికే గంటల తరబడి ఈ వంకర టింకర పట్టాలను, ఆగివున్నవి, నడుస్తున్నవి ఇంజన్లను చూస్తున్న కొద్దీ ఆమెకు ఏవేవో ఆలోచనలు వస్తుండేవి. అంబాలా ఛావనీలో ఉన్నప్పుడు కూడా స్టేషనుకి దగ్గర్లోనే ఆమె ఇల్లు ఉండేది గానీ, అప్పుడు వాటిని ఈ రకంగా చూడలేదు. ఇప్పుడేమో ఆమెకి ఇలా కూడా అనిపిస్తుంది: ఎదురుగా ఉన్న ఈ రైలు పట్టాలు ఒక వల. పైకి లేస్తున్న ఆ పొగ, ఆవిరి తానున్న సానివాడ. ఎన్నో బండ్లు ఉండేవి, వాటిని లావుపాటి పెద్ద ఇంజన్లు ధక్కా ఇస్తూ అటు ఇటు తోస్తూ ఉండేవి. అప్పుడామెకి అవి అంబాలాలోని సేట్‌జీల్లా అనిపించేవి. అప్పుడప్పుడూ ఆగివున్న రైలు డబ్బాల వరుసల మధ్య ఒక ఇంజను నిదానంగా వెళ్తూ ఉంటే, ఆమెకి తమ బజారులో పైకి చూస్తూ చిన్నగా నడిచి వెళ్తున్న మగవాళ్ళలా అనిపించేది.

సుల్తానాకి తెలుసు ఇలా ఆలోచించడం బుర్రను పాడు చేసుకోవడమేనని. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయనే బాల్కనీ వైపు వెళ్ళడం మానేసింది. ఖుదాబక్ష్‌తో ఎన్నోసార్లు అంది: “చూడు, నా మీద కొంచెం జాలిపడు. ఇంట్లో ఉంటుండు కాసేపైనా. నేను రోజంతా జబ్బు పట్టినదానిలా ఇంట్లోనే పడుంటున్నాను.” కానీ అతడు ప్రతిసారి సుల్తానాను ఇలా సముదాయించేవాడు: “జానేమన్! నేను బయట ఏదైనా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను. అల్లా అనుకుంటే కొద్ది రోజుల్లోనే మనం గట్టెక్కిపోతాం.”

మొత్తం ఐదు నెలలు గడిచాయి, కానీ ఇప్పటి వరకూ సుల్తానా గట్టెక్కలేదు, ఖుదాబక్ష్ కూడా. మొహరమ్ నెల నెత్తిమీదకు వస్తుంది, సుల్తానా దగ్గరేమో నల్లబట్టలు కుట్టించుకోడానికి ఏమీ లేవు. ముఖ్తార్ చక్కగా లేడీ హామిల్టన్‌లా ఒక కొత్త కమీజ్ కుట్టించుకుంది, చేతులు జార్జెట్టుతో చేసినవి. దానికి మాచింగ్‌గా ఆమె దగ్గర కాటుకలా మెరిసిపోయే నల్ల సల్వారు ఉంది. అన్వరీ సిల్కు జార్జెటు చీర కొనుక్కుంది. ఆ నల్ల చీర కింద తెల్ల బొస్కీ పెటీకోటు వేసుకుంటానని ఆమె సుల్తానాతో చెప్పింది, ఇప్పుడు అదే ఫాషన్ అని. ఆ చీరతో పాటు వేసుకోడానికి వెల్వెట్ చెప్పులు కూడా తీసుకుంది. నాజుగ్గా ఉన్నాయవి. ఇవ్వన్నీ చూశాక సుల్తానాకి మొహరమ్‌కి ఇలాంటి బట్టలు కొనుక్కునే తాహతు తనకి లేదని అర్థమయ్యింది.

అన్వరీ, ముఖ్తార్‌ల దగ్గర వాళ్ళ బట్టలు చూసి ఆమె ఇంటికి వచ్చేసరికి మనసంతా దిగులుగా అయ్యింది. ఆమెకి తన లోపల ఏదో కణితి మొలిచినట్టు అనిపించింది. ఇల్లంతా ఖాళీగా ఉంది. ఖుదాబక్ష్ ఎప్పటిలానే ఇంట్లో లేడు. ఆమె చాలాసేపటి వరకూ తివాచీ పైన దిండు మీద తల పెట్టుకొని పడుకుంది. కాసేపటికి దిండు ఎత్తువల్ల మెడ పట్టేసినట్టయి లేచి, తన దిగులు పోగొట్టుకోవడానికని బయట బాల్కనీలోకి వచ్చి నుంచుంది.

ఎదురుగా పట్టాల మీద బండ్ల డబ్బాలు ఆగి వున్నాయి, కానీ ఇంజన్లు ఏమీ లేవు. సాయంకాలం అయింది. రోడ్లపై దుమ్ము రేగకుండా మునిసిపాలిటీ వాళ్లు వచ్చి నీళ్ళు చల్లి వెళ్ళారు. బజారులో మగవాళ్ళు అటూ ఇటూ జాగ్రత్తగా చూసి తమ ఇళ్ళ వైపు వెళ్ళడానికి తయారవుతున్నారు. అలాంటి మగమనిషి ఎవరో తలపైకెత్తి సుల్తానా వైపు చూశాడు. సుల్తానా కూడా చూసి నవ్వి, అతని గురించి మర్చిపోయింది. ఎదురుగా పట్టాలపై ఒక ఇంజను వచ్చేసరికి, సుల్తానా శ్రద్ధగా దాని వైపు చూడ్డం మొదలెట్టింది. మెల్లిమెల్లిగా ఇంజను కూడా నల్ల బట్టలు వేసుకునుందని ఆమెకు ఒక ఊహ వచ్చింది. ఈ వింత ఊహను బుర్రలోంచి తీసేయడానికి ఆమె కళ్ళు తిప్పుకుని రోడ్డు మీదకు చూసింది. ఆ మనిషే ఎండ్లబండి దగ్గర నుంచొని కనిపించాడు, ఆమెను ఇందాక కోరికగా చూసిన మనిషి. సుల్తానా అతడికి చేతితో సైగ చేసింది. అతడు అటూ ఇటూ చూసి మళ్ళీ సైగ చేశాడు: ఎటునుండి రాను? సుల్తానా అతడికి దారి చెప్పింది. అతడు కొంతసేపు అక్కడే నిల్చొని ఉన్నాడు, కానీ తర్వాత వేగంగా పైకి వచ్చాడు.

సుల్తానా అతణ్ణి తివాచీపై కూర్చోబెట్టింది. అతడు కూర్చున్నాక, ఆమె మాటామంతీ మొదలెట్టడానికి అడిగింది: “మీరు పైకి రావడానికి భయపడ్డారెందుకు?”

అతడు ఆమె మాటలకి నవ్వాడు: “నీకెలా తెల్సూ? భయపడ్డానికేముంది?”

“ఎందుకన్నానంటే మీరు పైకి రాకుండా చాలాసేపు కిందనే నించొని ఉన్నారు. ఏదో ఆలోచించుకొని ఇక్కడికి వచ్చారు.”

అది విని అతడు మళ్ళీ నవ్వాడు: “నీకు తప్పుగా అర్థమయింది… నేను మీ పైన ఫ్లాటువైపు చూస్తూ ఉన్నాను. అక్కడ ఒక ఆడామె నుంచొని ఎవరో మగవాడికి నాలుక చూపి వెక్కిరిస్తోంది. నాకు అది నచ్చింది. అప్పుడే బాల్కనీలో ఆకుపచ్చ రంగు బల్బు వెలిగేసరికి నేను దాన్నే చూస్తుండిపోయాను. నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. కంటికి బాగా అనిపిస్తుంది…” ఇది చెప్పి అతడు గదిని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. తర్వాత లేచి నుంచున్నాడు.

సుల్తానా అడిగింది: “మీరు బయలుదేరుతున్నారా?”

అతను జవాబు ఇచ్చాడు: “లేదు. నేను మీ ఇంటిని చూడాలనుకుంటున్నాను. రా, నాకు అన్ని గదులు చూపించు…”

సుల్తానా అతడికి ఒక్కొక్కటిగా మూడు గదులూ చూపించింది. ఆ మనిషి మౌనంగా ఇల్లంతా జాగ్రత్తగా పరిశీలించాడు. వాళ్ళిద్దరు మళ్ళీ ఆ గదిలోకే వచ్చాక, అతడు ముందు కూర్చుండిపోయాడు. తర్వాత అన్నాడు: “నా పేరు శంకర్.”

సుల్తానా మొదటిసారిగా శంకర్‌ని నిశితంగా చూసింది. అతడు మామూలు పొడుగు, మామూలు మొహం ఉన్న మనిషి. కానీ అతడి కళ్ళు తెల్లగా, స్వఛ్ఛంగా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో ఒక వింతైన మెరుపు కనిపిస్తుంది. దట్టమైన, కసరత్తు చేసిన శరీరం. నుదుటి వద్ద జట్టు తెల్లబడుతోంది. ఊదా రంగు ఊలు పాంటు వేసుకున్నాడు. తెల్ల చొక్కా, కాలర్ మెడ మీద లేచి నుంచునుంది.

శంకర్ తివాచీపై కూర్చున్న పద్ధతి చూస్తే కస్టమరు అతడు కాదు, సుల్తానా అని అనిపిస్తుంది. అది గమనించి సుల్తానా తడబడింది. అది కప్పిపుచ్చుకోటానికి ఆమె శంకర్‌తో అంది: “చెప్పండి.”

శంకర్ కూర్చున్నవాడు కాస్తా ఇది విని తివాచీ మీదకు వాలి మోచేతి మీద ఆనుకుని అన్నాడు: “నేనేం చెప్తాను, నువ్వే ఏదో ఒకటి చెప్పు. నన్ను రమ్మంది నువ్వే కదా …”

సుల్తానా ఏమీ అనకపోయేసరికి అతడు లేచి కూర్చున్నాడు: “నాకు అర్థమయ్యింది… అయితే నేను చెప్పేది విను. నువ్వు ఏదైతే అనుకున్నావో, అది తప్పు. నేను అలాంటి మనిషిని కాను, ఏదోవొకటి ఇచ్చి వెళ్ళేవాళ్ళలా కాదు. డాక్టర్లలా నేను కూడా ఫీజు తీసుకుంటాను. నన్ను పిలిస్తే, నాకు ఫీజు ఇవ్వాల్సి వస్తుంది…”

సుల్తానా ఇది విని ఖంగు తిన్నది కానీ ఆమెకి ఆపుకోలేనంత నవ్వు కూడా వచ్చింది: “మీరేం పని చేస్తారు?”

శంకర్ బదులిచ్చాడు: “అదే, నీలాంటి వాళ్లు చేసే పనే!”

“ఏంటి?”

“నువ్వేం చేస్తుంటావ్?”

“నే.. నేనా… నేనేం చెయ్యను.”

“నేను కూడా ఏమీ చేయను.”

“ఇదేం ముచ్చట! మీరు ఏదోవొకటి చేస్తుండచ్చు.”

శంకర్ చాలా నిదానంగా బదులిచ్చాడు: “నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తుండచ్చుగా?”

“నేను కాలక్షేపం చేస్తుంటాను.”

“నేను కూడా కాలక్షేపం చేస్తుంటాను.”

“అయితే రా, ఇద్దరం కలిసి కాలక్షేపం చేద్దాం.”

“నేను తయారే! కాని కాలక్షేపానికి నేనెప్పుడూ ఖరీదు ఇచ్చుకోను.”

“మతుండే మాట్లాడుతున్నావా? ఇదేం లంగర్‌ఖానా కాదు.”

“నేను కూడా వాలంటీరును కాను.”

సుల్తానా ఆగిపోయింది. ఆమె అడిగింది: “ఈ వాలంటీరు అని ఎవర్ని అంటారు?”

“దద్దమ్మా!”

“నేనేం దద్దమ్మను కాను.”

“కానీ నీతో పాటుండే ఖుదాబక్ష్ ఖచ్చితంగా దద్దమ్మే!”

“ఎందుకు?”

“ఎందుకంటే, అతను కొన్నాళ్ళబట్టీ ఒక ఫకీరు దగ్గరకి తన జాతకం బాగుపడుతుందని వెళ్తున్నాడు, ఆ ఫకీరు జాతకమే తుప్పు పట్టిన తాళంలా మూసుకుపోయుంది.” శంకర్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు.

“నువ్వు హిందువువి కాబట్టే మా ఫకీర్లను అలా మజాక్ చేస్తున్నావు.”

శంకర్ నవ్వాడు: “ఇక్కడ హిందూ లేదూ ఇస్లామ్ లేదూ. పెద్దపెద్ద పండితులు, మౌల్వీలు కూడా ఇక్కడకి వస్తే మర్యాదస్తులైపోతారు.”

“ఏం తలతిక్కవాగుడో ఏంటో… చెప్పు, ఉంటావా, ఉండవా?”

“ఉంటాను కాని, ముందు చెప్పిన షరతు మీదే!”

సుల్తానా లేచి నిలుచుంది: “అయితే వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో…”

శంకర్ తీరిగ్గా లేచి, పాంటుకు ఉన్న రెండు జేబుల్లో రెండు చేతులూ జొప్పించి, వెళ్తూ వెళ్తూ అన్నాడు: “నేను అప్పుడప్పుడూ ఈ బజారులో తిరుగుతుంటాను. నీకు ఏవైనా అవసరం పడితే నన్ను పిలిపించు. నేను పని బాగా చేస్తాను.”

శంకర్ వెళ్ళిపోయాడు. సుల్తానా నల్ల దుస్తుల గురించి మర్చిపోయి, చాలాసేపు అతడి గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. అతడి మాటలు ఆమె బాధను కొంతవరకూ తగ్గించాయి. అతడు ఒకవేళ ఆమె సంతోషంగా ఉన్నప్పుడు అంబాలాకి వచ్చుండుంటే, అతణ్ణి ఇంకో లెక్క మీద చూసుండేది. అతణ్ణి గెంటుతూ బయటకు పంపించే అవకాశాలే ఎక్కువగా ఉండేవి. ఇక్కడామె బాగా దిగులుగా ఉన్నందున శంకర్ మాటలు ఆమెకి బాగా నచ్చేశాయి.

సాయంత్రం ఖుదాబక్ష్ వచ్చినప్పుడు సుల్తానా అతణ్ణి అడిగింది: “నువ్వు రోజంతా ఎక్కడికి మాయమైపోతున్నావ్?”

ఖుదాబక్ష్ అలసిపోయి ఉన్నాడు: “పురానా ఖిలా దగ్గరనుండి వస్తున్నాను. అక్కడో ఫకీర్‌సాబ్ కొన్ని రోజులుగా ఆగున్నాడు. అతడి దగ్గరకే రోజూ వెళ్తున్నాను. మన రోజులు బాగుపడాలని…”

“ఆయన ఏమైనా చెప్పారా నీకు?”

“లేదు. ఇంకా ఏం చెప్పలేదు, ఆయన దృష్టి నా మీద పడలేదింకా. కానీ సుల్తానా, నేను ఆయనకు చేస్తున్న సేవ, అది ఉత్తిగా పోదు. అల్లా మనల్ని కరుణిస్తాడు. మనం బాగుపడతాం.”

సుల్తానా మదిలో మొహరమ్ చేసుకోవాలన్న ఆలోచన నిండిపోయి ఉంది. ఆమెకు ఏడుపొచ్చింది. ఖుదాబక్ష్‌తో ఏడుపు గొంతుతో అంది: “నువ్వు రోజు రోజంతా బయటకి మాయమైపోతావ్. నేనిక్కడ పంజరంలో ఖైదీలాగా ఉంటున్నాను. ఎక్కడికీ వెళ్ళలేను. ఎక్కడికీ రాలేను. మొహరమ్ నెత్తి మీదకొచ్చేస్తుంది. నాకు నల్లబట్టలు కావాలన్న ధ్యాసైనా ఉందా నీకు? ఈడ్చితంతే అణా లేదు ఇంట్లో. ఉన్న గాజులూ ఒక్కోటిగా అమ్ముకోవడం అయ్యింది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఎలానో… ఇలా ఫకీర్ల వెంట ఎప్పటివరకూ తిరుగుతూ ఉంటావ్? ఈ ఢిల్లీలో ఖుదా కూడా మనమంటే మొహం చాటేస్తున్నాడు. నా మాట విని నీ పని మొదలెట్టు. ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది.”

ఖుదాబక్ష్ తివాచీ మీద పడుకొని అన్నాడు: “కానీ ఆ పని మొదలెట్టడానికి కూడా ఎంతో కొంత డబ్బు కావాలిగా… ఖుదా కోసమైనా, ఇలాంటి ఏడుపుగొట్టు మాటలు అనకు. వీటిని తట్టుకోవడం నా వల్ల కాదు. అంబాలా వదిలిరావడం నేను చేసిన పెద్ద తప్పు అని ఒప్పుకుంటున్నాను. కానీ, ఏది చేసినా అల్లానే చేస్తాడు, మన బాగు కోసం చేస్తాడు. ఏమో ఎవరికి తెల్సు, కొంతకాలం ఈ కష్టాలు అనుభవించాకా…”

సుల్తానా మధ్యలోనే అతడి మాట అడ్డుకుంది: “ఆ అల్లా కోసం నువ్వేం కావాలనుకుంటే అది చేస్కో. దొంగతనం చేయి, దోపిడి చేయి. నాకనవసరం. నాకో సల్వారు మాత్రం పట్టుకొనిరా. నా దగ్గర తెల్లరంగు బోక్సీ కమీజ్ ఉంది, దానికి రంగేయిస్తాను. కొత్త తెల్లటి నైలాను దుపట్టా కూడా ఉంది నా దగ్గర. అదే, నువ్వు దీపావళికి నాకు తెచ్చిచ్చింది. దానిక్కూడా కమీజుతో పాటు రంగు వేయడానికి ఇచ్చేస్తాను. ఒక్క సల్వారుకి మాత్రమే కొరత. అది ఎలానోలా ఎక్కడినుంచైనా సరే పుట్టించుకొని రా… చూడు, నా మీద ఒట్టే! ఏదో ఒకటి చేసి పట్టుకొని రా…. లేకుంటే కడుపు నిండా తింటావ్ నా చేతుల్లో.”

ఖుదాబక్ష్ లేచి కూర్చున్నాడు: “నువ్వెందుకిలా మొండి చేస్తున్నావ్. తెమ్మంటే మాత్రం నేనెక్కడ నుండి తెస్తాను… గింజ తినడానికి కూడా ఒక పైసా లేదు నా దగ్గర.”

“ఏమైనా చేయి… కానీ నాకు మాత్రం నాలుగున్నర గజాల నల్ల సాటిను బట్ట తెచ్చివ్వు.”

“దువా చేయి, ఈ రాత్రికే ఇద్దరు-ముగ్గురు మనుషులు రావాలని.”

“నువ్వు మాత్రం ఏమీ చేయవు. నువ్వనుకుంటే తప్పకుండా కాసిని పైసలు పుట్టించగలవు. యుద్ధానికి ముందు ఈ సాటిను గజానికి పన్నెండు-పధ్నాలుగు అణాలు ఉండేది, ఇప్పుడు రూపాయిపావలా లెక్కన దొరుకుతుంది. నాలుగున్నర గజాలకి ఎంత ఖర్చైపోతుంది?”

“నువ్వు అంటున్నావు కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తాను.” ఖుదాబక్ష్ లేచాడు: “సరే, ఇప్పుడీ సంగతి మర్చిపో. నేను హోటల్ నుండి భోజనం తెస్తాను.”

హోటల్ నుండి భోజనం వచ్చింది. ఇద్దరూ కలిసి మొక్కుబడిగా తిని, నిద్రపోయారు. తెల్లారగానే ఖుదాబక్ష్ పురానా ఖిలా ఫకీరు దగ్గరకు వెళ్ళిపోయాడు. సుల్తానా ఒంటరిగా ఉండిపోయింది. కొంచెంసేపు పడుకుంది, కొంచెంసేపు నిద్రపోయింది. కొంచెంసేపు అటూ ఇటూ గదుల్లో తిరిగింది. మధ్యాహ్నం భోజనం చేశాక తన తెల్ల నైలాను దుప్పట్టా, తెల్ల బోక్సీ కమీజు తీసి, కింద లాండ్రీవాడికి రంగు వేయడానికి ఇచ్చి వచ్చింది. బట్టలు ఉతకడంతో పాటు అక్కడ రంగులు వేసే పని కూడా చేస్తారు. ఈ పని అయ్యాక ఆమె మళ్ళీ పైకి వచ్చి కాసిని సినిమా పుస్తకాలు చదివింది. ఆమె చూసిన సినిమాల కథలు, పాటలు ఉన్నాయి వాటిల్లో. ఆ పుస్తకాలు చదువుతూ చదువుతూ అలాగే నిద్రపోయింది. లేచేసరికి నాలుగైపోయింది, ఎండ వాకిట్లోంచి మోరీ వరకూ వచ్చి ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఊలు దుప్పటి కప్పుకొని బాల్కనీలో నిల్చుంది. దాదాపుగా ఒక గంటసేపు ఆమె అలా బాల్కనీలో నిల్చుంది. ఇంతలో సాయంకాలమయ్యింది. లైట్లు వెలగటం మొదలెట్టాయి.

కింద రోడ్డు మీద వెలుతురు పరుచుకుంది. చలి పెరిగింది గానీ ఆ సంగతి సుల్తానాకు కొంచెం కూడా తెలియలేదు. రోడ్డు మీద వస్తూ పోతున్న టాంగాలు, మోటర్ల వైపు ఎంతోసేపు అలా చూస్తూ ఉండిపోయింది. ఉన్నట్టుండి ఆమెకు శంకర్ కనిపించాడు. ఇంటి కిందకు వచ్చి మెడ ఎత్తి చూస్తూ, సుల్తానాని చూసి నవ్వాడు. సుల్తానా అప్రయత్నంగా చేత్తో సైగ చేసి, అతణ్ణి పైకి రమ్మంది.

శంకర్ పైకి వచ్చాక అతడికి ఏం చెప్పాలా అని సుల్తానా సతమతమయింది. నిజానికి ఆమె ఏమీ ఆలోచించకుండా సైగ చేసింది. శంకర్ మాత్రం అదేదో తన ఇల్లే అయినట్టు ఏ ఇబ్బందీ లేకుండా ఉన్నాడు. ముందటి రోజులానే దిండుపై తలవాల్చి పడుకున్నాడు.

సుల్తానా చాలాసేపటివరకూ ఏమీ అనకపోయేసరికి అతడే అన్నాడు: “నువ్వు నన్ను వందసార్లు పిలవచ్చు, వందసార్లు వెళ్ళిపోమనచ్చు… నేను ఇలాంటి విషయాలపై కోపం తెచ్చుకోను.”

సుల్తానాకి ఏమనాలో పాలుపోలేదు: “లేదు కూర్చో, నిన్ను వెళ్ళమని ఎవరన్నారు?”

దీనికి శంకర్ నవ్వాడు: “అయితే నా షరతులు నీకు మంజూరేనా?”

“ఏం షరతులు?” సుల్తానా నవ్వుతూ అంది: “ఏం, నిఖా గానీ చేసుకుంటున్నావా నన్ను?”

“నిఖా, పెళ్లి, ఏంటవీ? నువ్వు జీవితాంతం ఎవరినీ పెళ్ళి చేసుకోలేవు, నేనూ చేసుకోలేను. ఈ సంప్రదాయాలన్నీ మనలాంటి వాళ్ళ కోసం కాదు. వదిలేయ్ ఈ ఊసుపోని కబుర్లు. ఏదైనా పనికొచ్చే మాట చెప్పు,”

“చెప్పు… ఏం మాట్లాడను?”

“నువ్వు ఆడదానివి… ఓ రెండు గంటలు మంచిగా హాయిగా ఏవైనా కబుర్లు చెప్పు. ఈ ప్రపంచంలో దందా ఒక్కటే దందా కాదు, ఇంకా వేరేవీ ఉన్నాయి…”

ఆమాట అనడంతో సుల్తానా మనసుకు శంకర్ నచ్చాడు. అడిగింది: “సూటిగా చెప్పు, నీకేం కావాలో?”

శంకర్ లేచి కూర్చున్నాడు: “వేరేవారికి కావాల్సిందే.”

“నీకూ, వాళ్ళకూ మధ్య తేడా ఏముంటుంది?”

“నీకూ నాకూ మధ్య ఎలాంటి తేడా లేదు. వాళ్ళకూ నాకూ నింగీ నేలకి ఉన్నంత తేడా ఉంది. చాలా విషయాలుంటాయి, వాటిని చెప్పకూడదు, అర్థం చేసుకోవాలంతే…”

సుల్తానా కాసేపు శంకర్ అన్న ఈ మాటను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాక, అంది: “నాకు అర్థమయ్యింది.”

“అయితే చెప్పు, నీ ఉద్దేశ్యమేంటి?”

“నువ్వు గెలిచావ్. నేను ఓడిపోయాను. కానీ చెప్తున్నానుగా, ఇప్పటివరకూ ఇలాంటి మాట ఎవరూ ఒప్పుకొని ఉండరు.”

“నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ ప్రాంతంలోనే నీకు ఇలాంటి సాదాసీదా ఆడవాళ్ళు బోలెడంతమంది దొరుకుతారు, వాళ్ళెప్పటికీ ఒప్పుకోలేరు ఆడది ఇలాంటి నీచమైన పనికి ఒప్పుకుంటుందంటే, అదే నువ్వేమీ ఆలోచించకుండా ఒప్పుకునే పని. వాళ్ళు ఒప్పుకోకపోయినా మీలాంటి వాళ్ళు వేల సంఖ్యల్లో ఉన్నారుగా… నీ పేరు సుల్తానా కదూ?”

“సుల్తానానే.”

శంకర్ లేచి నించుని నవ్వడం మొదలుపెట్టాడు: “నా పేరు శంకర్. పేర్లు కూడా భలే అర్థంపర్థం లేకుండా ఉంటాయి. సరే పద, లోపలికి పద…”

శంకర్, సుల్తానా తివాచీ ఉన్న గదిలోకి వాపసు వచ్చేసరికి నవ్వుతూ ఉన్నారు, దేని గురించో మరి. శంకర్ బయలుదేరుతుండగా సుల్తానా అంది: “శంకర్, నేనొకటి అడగనా?”

“ముందు అడుగు.”

సుల్తానా కొంత మొహమాటపడింది: “నువ్వు నేను రేటు వసూలు చేస్తున్నాననుకుంటావేమో గానీ…”

“చెప్పు చెప్పు… ఆగిపోయావేం?”

సుల్తానా తెగించి అడిగింది: “సంగతేంటంటే… మొహరమ్ వచ్చేస్తుంది, నా దగ్గర కాలీ సల్వారు కొనుక్కునేంత డబ్బులు లేవు. ఇక్కడి కష్టాలన్నీ నీకు చెప్పుకొచ్చాను. కమీజు, దుపట్టా నా దగ్గరున్నాయి. వాటిని ఇవ్వాళ రంగు వేయించడానికి ఇచ్చాను.”

“నువ్వు నల్ల సల్వారు కుట్టించుకోడానికి కొన్ని రూపాయలు ఇవ్వమంటావ్,”

“లేదు, లేదు. నా ఉద్దేశ్యం అది కాదు. నీకు వీలైతే నాకో కాలీ సల్వారు తెచ్చిపెట్టు.”

శంకర్ నవ్వాడు: “నా జేబులో పొరపాటున కూడా ఎప్పుడూ ఏమీ ఉండదు. అయినా నేను ప్రయత్నిస్తాను. మొహరమ్ మొదటి రోజున నీకు కాలీ సల్వార్ దొరుకుతుంది. ఊఁ, ఇక నవ్వుతావా?”

సుల్తానా దుద్దులవైపు చూసి అడిగాడు: “నువ్వు ఈ దుద్దులు నాకివ్వగలవా?”

సుల్తానా నవ్వింది: “నువ్వు వీటిని ఏం చేసుకుంటావ్? వెండివి, మామూలు దుద్దులు. మహా అయితే ఐదు రూపాయలవి.”

“నేను నిన్ను దుద్దులు అడిగాను. వాటి విలువ కాదు. చెప్పు, ఇస్తావా?”

“ఇదిగో… తీసుకో.” సుల్తానా తన దుద్దులు తీసి శంకర్‌కు ఇచ్చేసింది. తర్వాత ఆమె కొంచెం అయ్యో అనుకుంది కాని, అప్పటికే శంకర్ వెళ్లిపోయాడు.

సుల్తానాకి రవ్వంత కూడా నమ్మకం లేదు శంకర్ తన మాటను నిలబెట్టుకుంటాడని. కానీ ఎనిమిది రోజుల తర్వాత మొహరమ్ మొదటి రోజున ఉదయం తొమ్మిదింటికి ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయ్యింది. సుల్తానా తలుపు తెరిచింది. శంకర్ ఎదురుగా ఉన్నాడు. న్యూసుపేపరులో చుట్టిందేదో సుల్తానాకు ఇస్తూ అన్నాడు: “సాటిన్ కాలీ సల్వారు. చూసుకో, పొడుగవుతుందేమో. నేను వెళ్తానిక…”

శంకర్ సల్వారు ఇచ్చి సుల్తానాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతడి పాంటుకి ముడతలు పడున్నాయి. జుట్టు చెదిరుంది. అప్పుడే నిద్రలేచి, వెంటనే ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు.

సుల్తానా పొట్లాం తీసి చూసింది. నల్ల సాటిను సల్వారు. అచ్చం, ముఖ్తార్ దగ్గర చూసినదానిలా ఉంది. సుల్తానా సంబరపడిపోయింది. దుద్దులు ఇవ్వడం, అతడితో కుదుర్చుకున్న బేరం గురించిన విచారాన్ని సల్వారు, శంకర్ మాట నిలబెట్టుకోవడం దూరం చేశాయి.

మధ్యాహ్నం లాండ్రీవాడి నుండి రంగు వేయడానికి ఇచ్చిన కమీజు, దుపట్టా కూడా తెచ్చుకుంది. మూడు నల్ల రంగు బట్టలూ ఆమె వేసుకున్నాక తలుపు కొట్టిన చప్పుడు అయింది.

సుల్తానా తలుపు తెరవగానే ముఖ్తార్ లోపలకి వచ్చింది. ఆమె సుల్తానా వేసుకున్న మూడు నల్ల రంగుల బట్టలూ చూసి అడిగింది: “కమీజూ, దుపట్టా అంటే రంగు వేయించావని అర్థమవుతుంది. కానీ ఈ సల్వారు… ఇదెప్పుడు కుట్టించావు?”

సుల్తానా జవాబు ఇచ్చింది: “ఇవ్వాళే దర్జీ ఇచ్చి వెళ్ళాడు…” అంటుంటే ఆమె చూపు ముఖ్తార్ చెవుల మీద పడింది.

“ఈ దుద్దులు నీకెలా వచ్చాయి?”

“ఇవ్వాళే తెప్పించాను…”

ఆ తర్వాత కాసేపటి వరకూ వాళ్ళిద్దరు మౌనంగా ఉండాల్సి వచ్చింది.
-----------------------------------------------------------
రచన: పూర్ణిమ తమ్మిరెడ్డి 
మూలం: సాదత్ హసన్ మంటో
(మొదటి ప్రచురణ: అదాబె లతీఫ్ పత్రిక, లాహోర్, 1942.)
ఈమాట సౌజన్యంతో

Monday, January 28, 2019

ఎక్కడ నుంచి…?


ఎక్కడ నుంచి…?





సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...............

”ఎక్కడి నుంచి?”

నమస్కారం. బాగున్నారా అన్న తరువాత, ఓ అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన రెండో ప్రశ్న ఇది.

వరుసగా బారులు దీరి ఉన్న కార్ల మధ్యన స్థలం కనపితే, కారు పార్క్‌ చేసి తాళం చెవితోపాటు ఉన్న రిమోట్‌ని నొక్కి, ఆ కారును లాక్‌ చేసి, ఇటు తిరిగానో లేదో, ఈ ఆగంతకుడు ప్రశ్నలతో ప్రత్యక్షం. వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. ముఖంలో ముడుతలు ఉన్న, జీవితంలో తిన్న డక్కామొక్కీలతో సంపాదించిన ఓ అనిర్వచనీయమైన ప్రశాంతత. ఓ చిరునవ్వు, కొద్దిగా వంగిన శరీరం, వేసుకున్నది పసిఫిక్‌ ట్రైల్‌ కోటు. డాకర్స్‌ పాంటు, నైకీ బూట్లు అయినా, ఎందుకో ఓ తెల్ల జుబ్బా, పంచ, చెప్పులు వేసుకున్నట్లనిపించింది. పడమట అస్తమిస్తున్న సూర్యుడు, అరుణ వర్ణాలను కలిపిన తెరను అతని వెనుక దించడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్ది దూరంలో లాండ్స్కేప్‌ కని నిర్మించిన సరస్సులో బాతులు చేస్తున్న చప్పుడు విని, ఆకాశంలో ఎగురుతున్న మరో గుంపు బాతులు, పలుకరించి పోదామనో ఏమో, పొలోమని గుంపుగా నీళ్ళలోకి దిగాయి.
”సీర్‌ రాప్స్‌ి నుంచి వస్తున్నానండి” అన్నాను బదులుగ.

”అబ్బే అది కాదండి. ఆంధ్రలో ఎక్కడి నుంచి” అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ ముసలతను చిరునవ్వుతోనే.

”తిరుపతి దగ్గర ఓ పల్లెనండి” అన్నాను.

సరస్సు దగ్గర నిలబడి ప్రశ్నలేసే యక్షుడిలాగ అతను మరో ప్రశ్న వేయబోయే ముందే, అతని కుటుంబ జనమనుకుంటా అప్పటికే ఓ వంద అడుగులు ముందుకు నడిచిన వారు, వెనక్కు వచ్చి ముఖాలు ఇబ్బందిగా పెట్టి, ”హలో, హాయ్‌ు” అంటూ నన్ను పలకరించి, ఇంకా నాతో మాట్లా లని ప్రయత్నిస్తున్న ఆ ముసలతనికి నచ్చచెప్పి, తీసుకెళ్ళడనికి ప్రయత్నం చేయసాగారు. మార్చి కాబట్టి, ఇంకా చిరు చలి వేస్తున్న, అప్పుడే నిక్కరు, షర్టు వేసుకున్న ఓ మధ్య వయస్కురాలు, ”ఈ ముసలాయనతో ఇదో పోరైపోయింది. కనబడిన ప్రతి మనిషితో కబుర్లేసుకోవాలనుకుంటాడు” అని తన భారీ శరీరాన్ని ఓ వందుగులు నడిపించం వల్ల కలిగిన గసల మధ్య విసుక్కోవడం వినిపించింది. అలా ఆ ముసలతనిని తీసుకొని ఆ కుటుంబం ముందు పోతుంటే కొద్దిగా వెనుక వారిని అనుసరించం మొదలెట్టాను. ఎదురుగా తెల్లటి గుడి గోపురం, అస్తమిస్తున్న సూర్యుని కాంతులకు కొత్త వర్ణాలను సంతరించుకొని కొత్తగా కనిపిస్తున్నది. జనాల రాకపోకలతో హడవిడిగానే ఉంది.

చికాగో ఆరోరాలో కట్టించిన బాలాజి గుడిని అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళితే మనస్సులో ఓ ప్రశాంతత. డువాన్‌ వీధిలో షాపింగుకని, ఓహేర్‌ ఏర్‌పోర్టులో రిసీవ్‌ లేక సెండ్‌ ఆఫ్‌ కనో చికాగోకు వచ్చి దారిలో గుడి సందర్శనానికని వచ్చిన జనాలతో గుడి సందిగా ఉంది. నేను గుడికి రావడనికి కారణం విస్సు. వాడిని చూసి ఓ ఆరేళ్ళపైనే అయ్యింది అనుకుంటాను. ఫోన్‌లో తరచు మాట్లా ుకున్నా, వాడిని ఇన్ని రోజుల తరువాత కలుస్తున్నామని ఆనందంగానే ఉంది. వాడు ఈ మధ్యనే చికాగోకి తూర్పున ఓ వంద మైళ్ళ దూరంలో ఉన్న వూరికి రిలొకేట్‌ అయ్యాడు. నేను చికాగోకి పమట ఓ రెండొందల మైళ్ళ దూరంలో ఉన్నాను. నేను చికాగోకు పనిమీద వస్తున్నానని విని, వాడు నన్ను కలుద్దామని చికాగో వస్తానన్నాడు. గుడిలో కలుద్దామని ప్లాన్‌ వేసుకున్నాము. పార్కింగ్‌ లాట్‌ నుంచి గుడికి వెళ్తా విస్సు జాడ కనిపిస్తుందేమోనని చుట్టూ
చూసాను. వచ్చినట్లు లేదు.

గుడిలో అడుగుపెట్టి, అర్చనకని డబ్బులు కట్టి, ఓ బ్రవును బేగ్‌లో అరటిపళ్ళు తీసుకొని, మెట్లెక్కి ఎడమ వైపున్న వినాయకునికి, వళ్ళి, నాయకి సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి, కుడివైపున్న మల్లికార్జున
స్వామి, భ్రమరాంభలకు మ్రొక్కి, నవగ్రహాలను శాంతింపజేయడనికి ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర గుడి ఆవరణలో ప్రవేశించాను. బంగారు నగలు, పట్టుబట్టలు, కార్నేషన్‌, చేమంతి, రోజా పూల అలంకరణలు ఓ ఎన్నారై టచ్‌ ఇవ్వగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు దేవుడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకుని చేతులెత్తి నమస్కరించాను. అలా దేవుని చూస్తుంటే ఎదో ఓ ప్రశాంతత. దేవుడు
కనపేటట్లు హాల్లోనే ఒకచోట పద్మాసనం వేసుకొని కూర్చుని విస్సు కోసం వేచి ఉన్నాను. ఆ ఆవరణలోనే ఓ మూల ప్రొద్దున సత్యనారాయణ వ్రతం చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. గర్భగుడికిరువైపుల శ్రీదేవి,
భూదేవిలకి దర్శనాలు, ప్రదిక్షిణలు జనం అవిరామంగా చేస్తూనే ఉన్నారు. అక్కడక్కడ మన సంస్క ృతిని పిల్లలకి పరిచయం చేయాలనే తపనలో ఉన్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. యాంకీ యాసతో పద్యాలు, శ్లోకాలు మురిపంతో చూస్తున్న వారి ముందు వల్లె వేస్తున్నారు చిన్నారులు. మరోవైపు పెళ్ళి చేసుకొని కొత్తగా ఈ దేశంలో అడుగు పెట్టిన యువతీ యువకులు స్వెట్‌ షర్ట్‌, షార్ట్‌లతో కనిపిస్తున్నారు. ఇండియా నుంచి రాగానే ఇక్కడి జనాలతో కలిసి పోయేలా మాటా, యాస, నడక, దుస్తులు మార్చే యువతరం, పిల్లలు పుట్టే సరికి పంచా, జుబ్బాలు, పట్టుచీరలు కట్టుకొని గుడికి రావాలనుకోవడం, పిల్లలను మన సంప్రదాయంలో పెంచాలనుకోవడం ఎన్ని సార్లు చూసిన అచ్చెరువు గొల్పుతూనే ఉంటుంది.

విస్సు నేను తరచుగా ఫోన్‌లో మాట్లాుకుంటూనే ఉంటాము. మా అబ్బాయి, అమ్మాయి చదువులు ముగించి ఉద్యోగరీత్యా టెక్సాస్‌ ఒకరు, వర్జీనియా ఒకరు మూవ్‌ అయ్యిపోయి, మా ఇంటిని కూడ ఓ ఖాళి గూడును చేసారు. విస్సుకు ఆలస్యంగా ఓ అబ్బాయి పుట్టాు. మొన్నీమధ్యనే కాలేజీలో చేరాడనుకుంటా. వాడిని చూసి ఓ ఆరేళ్లపైనే అయ్యి ఉంటుంది. తరచుగా కొడుకుని పెంచంలో తన బాధలు చెప్పుకొని నా సలహాలు విస్సు అడుగుతుండే వాడు. కొడుకు దేవుని మీద ఏ మాత్రం భక్తి లేకుండ ఓ నాస్తికునిలాగా తయారయ్యాడని విస్సు బాధ.
####
గుడిలో ఓ మూల ఫోల్డింగ్‌ కుర్చీలో ఓ ముసలమ్మ కూర్చుని ఉంది. ఆవిడ దరిదాపుల కూర్చున్న వారిని ఉద్దేశించి బోసుబాబుతో పాటు తను ఈ దేశం ఎలా వలస వచ్చి ఎలా గ్రీన్‌ కార్డ్‌ సంపాదించింది, బోసుబాబు తన కుటుంబంలోని వారినందరిని ఇక్కడికి తెచ్చే ప్రయత్నాలని గురించి ఓ మెగా సీరియల్‌ లాగా బ్రాడ్కస్ట్‌ చేయసాగింది. భరించలేక లేచే జనాలతో, తెలియక ట్రాప్‌ అవుతున్న కొత్త జనాలతో ఆ మూల ఓ వింత సందిని జోడించుకుంది. విస్సు కోసం ఎదురుచూస్తు, జనాలను, అక్కడ జరిగే దృశ్యాలను చూస్తు కాలం గపసాగాను. అలా జనసందోహం చూడటంలో అదో ఆనందం. విస్సు ఇంకా రాలేదమబ్బా అనుకుంటుండగానే భుజం మీద ఆప్యాయంగా చేయి పటం, తిరిగి చూస్తే నవ్వుతూ విస్సు ప్రత్యక్షం.

”ఏరా విస్సు ఎలా ఉన్నావు – చాలకాలం అయ్యింది నిన్ను చూసి.

ఎందుకింత ఆలశ్యం అయ్యింది?” అన్నాను నేను.

”180 మీద ఒకటే ట్రాఫిక్‌ జాం బ్రదర్‌. నీకెలా అయ్యింది ప్రయాణం” అని తిరిగి విచారించాడు.

విస్సు నన్ను బ్రదర్‌ అనే పిలుస్తాు. బంధువర్గాలకి సుదూరంగా వుండటం వల్ల స్నేహితులలోనే బంధువులను వెదుక్కుంటామేమో! అలా పల్కరింపుల తరువాత గర్భగుడిలోకి వెళ్ళి అర్చనలు చేయించి, పూజారి
ఇచ్చిన తీర్థం, శగోపురం, ప్రసాదాలని స్వీకరించి, ప్రసాదంగా ఇచ్చిన ఆల్మండ్‌ పలుకులని నముల్తూ క్రిందనున్న కెఫెటేరియాకి దారి తీసాం. వీకెండ్‌ కాబట్టి బాగా రష్‌గా వుంది. టోకెన్‌లు కొనడనికి ఓ
క్యూ, కొన్న టోకెన్‌లు మార్చి తిండి తెచ్చుకోవడనికి మరో క్యూ. రెండింటిలోను ఓ పాతిక దాకా మనుష్యులున్నారు. సీరియల్‌, మఫ్పిùన్‌లు, కేక్లు, పిజ్జాలు రెడుగా వంట చేయకుండ తినడనికి అలవాటు
పి, ఇడ్లు, దోశె అంటే చికాగో గుడిలోనో, దీవాన్‌ వీధిలోనో దొరికే ఎక్సోటిక్‌ డిష్‌లుగా మారింతరువాత, ఇలాంటి రద్ది సహజమే. దైవదర్శనంతో పాటు ఈ ‘వింతైన’ వంట కాలు భుజించ ం కూడ
చికాగో రావడనికి ఓ ముఖ్య కారణమేమో. ఇడ్లు, వడ, మసాలా చాయ్‌ు నేను తీసుకున్నాను. విస్సు దోశ, మసాల చాయి తీసుకున్నాడు. ఓ మూల టేబుల్‌ ఖాళీగా కనపడితే కొన్న టిఫిన్‌లు అక్కడ పెట్టి, స్ష్టెరో
ఫోం గ్లాసులలో నీరు తెచ్చుకొని కూర్చున్నాము.

విస్సు మనస్సులో ఏదో మధనప ుతున్నట్లు తెలుస్తూనే వుంది. మళ్ళీ వాళ్ళబ్బాయి చంటి గురించే అని ఊహించాను. టీనేజర్లని పెంచ ం తల్లిదండ్రులకి ఓ ఛాలెంజే. నేను, మా ఆవిడ, మా పిల్లలిద్దరిని ఆ స్టేజిలో భరించం కష్టమే అయ్యింది. తెలిసీ తెలియని తనం, తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న వితండ వాదం, అవివేకం వల్ల ఉండే ఓవర్‌ కాన్‌ఫి ెంసులు సురేకారం, గంధకం, బొగ్గులలాగ మిళితమైపోయి, తల్లిదండ్రులను చూస్తునే అగ్గిలా అంటుకొని భగ్గున రోజుకో గొడవ లేందే టేనేజి వారి రోజులు గ వవనుకుంటాను.

”ఏరా విస్సు, అదోలా ఉన్నావు” అన్నాను, ఇడ్లు ముక్క తుంచుతూ.

”పాత పాటే బ్రదర్‌. చంటి గురించే, వాడు టేనేజిలో అడుగు పెట్టినప్పటినుంచి శాంతి లేకుండ పోయింది. చెప్పిన మాట ఒకటీ వినడు.”

”మళ్ళీ ఏమైంది?” అన్నాను నేను.

”వాడు నేను ఇచ్చే సలహాలు ఒకటీ పాటించు. వాడి మంకుతనం వాడిదే. పొద్దున లేచి పేపర్‌ చదువురా అంటాను. ఊప˙, వాడు వింటే కదా. ఆ పేపర్‌ ముట్టు. మనమంతా ‘హిందూ’ పేపర్‌ చదివే
ఈ స్థితికి ఎదిగామా. దేశంలోను, ప్రపంచంలోను జరుగుతున్న విషయాలను గురించి సరి అయిన అవగాహన లేకపోతే ఎలా” అని విస్సు వాపోయాడు.

”పోనీ, వాడికి పేపర్‌ చదవడం వల్ల కలిగే లాభాలని గురించి వివరించావా?” అన్నాను నేను.

”చెప్పి చెప్పి నోరు పిపోయిందనుకో. వాడు వింటే కదా, అలానే పొద్దునే పూజ చేసి దేవుణ్ణి కూడ మ్రొక్కి మరీ సర్కార్‌కు పోరా అంటాను. వాడు ఆ పూజ గది వైపే పోడు. పూజకని ఎంత శ్రమపి, ఇంట్లోనే
విడిగా ఓ రూమును మందిరంగా ప్లాన్‌ చేసి కట్టించాను. ఇండియాలో నుంచి, పెద్ద మండపము, దేవుని విగ్రహాలు, పూజ సామానులు తెప్పించి పెట్టి, ఇంట్లోనే ఓ గుడి కట్టగలిగాను. ఆ పూజ గదిలో
కూర్చుంటూనే నా మనస్సు శాంతిగా ఉంటుంది. వాడికివేం పట్టవేంటి? ఆ గదిలోకి మేం బలవంతం చేస్తే కాని అడుగు పెట్టు”, విస్సు అలా చంటి గురించి చెప్పుతూనే ఉన్నాడు.

”పోనీలేరా. టీనేజి తరువాత వాడు మారుతాడేమో. మా పిల్లల లోను టేనేజి దాటిం తరువాత మంచి మార్పు వచ్చింది. వారిది తెలిసీ తెలియనితనం. మనం మన తరంలోనూ మన తల్లిదండ్రులు వద్దన్నా జుట్లు పెంచేసి, ‘దం మారో దం’ అంటూ హేపీగా దినాలు గ ిపేయలేదు. అప్పుడు మనల్ని చూసి మనవారూ జులాయిలా తిరుగుతున్నారని బాధపి వుండచ్చు కదా”

”మంచి అలవాట్లు ఒకటీ రాకపోతే ఎలారా బ్రదర్‌”

”పిల్లలన్న తరువాత, ఈ బాధలు పక తప్పదు. నీ శాయశక్తులా చంటిని మంచివాడిగా ్వ్చదిద్ద నికి ప్రయత్నించు.”

”ఇక చంటి గురించి చాల్లే కాని, మీ పేరెంట్స్‌ గురించి చెప్పు. ఎలా వున్నారు వారు. వారి ఆరోగ్యం బాగుందా?” – మాట మార్చాను నేను.

”నాన్న గురించి గుర్తుచేసావా? అదో తీరని సమస్యే!” అన్నాడు విస్సు.

విస్సు వాళ్ళమ్మా, నాన్నలకి ఒక ే కొడుకు. ఇద్దరికి బాగా వయస్సయ్యింది. వయస్సులో ఉన్నప్పుడు సంతోషంగానే విస్సును విదేశాలకి పంపించినా, వయస్సు మళ్ళడంతో చూసుకోవడనికి, కొడుకు కోడలు ఉండలనుకోవడం సహజమే. అందుకే వారు విస్సును రమ్మని పోరుతూ ఉన్నారని విన్నాను. ”మామూలే. ఇవ్వాళ పొద్దునే మాట్లా ను. ఆరోగ్యమా ఇద్దరికి తగ్గిపోతున్నదని, ఇండియాకి వచ్చేయమని ఒకటే గొడవ. పోయిన ఏడదో ఓ పదివేలు ఖర్చుపెట్టుకుని ఇంటిల్లిపాది వెళ్ళి ఓ నెల ఉండి వచ్చాము. ఉద్యోగాలు, ఇల్లు అన్ని ఇక్కడ సంపాదించి, పిల్లవాడికి ఓ మంచి చదువు చెప్పిస్తూ స్థిరప ిన తరువాత, అక్కడికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి కెరీర్‌ అదీ మొదలెట్టాలంటే ఎలా” అని వాపోయాడు.

”కాని వారి పరిస్థితి కూడ కష్టంగానే ఉంది కదా. ఏమి చేయాలనుకుంటున్నావు” అన్నాను నేను.

”బ్రదర్‌, మా కాలనీ పోయినసారి వెళ్ళినప్పుడు చూసాను. ప్రతీ ఇంట్లోను ఓ వయస్సు మళ్ళిన జంటనే. పిల్లలందరిలో సగం మంది పైగా విదేశాలకు, మరో సగం మంది ఇండియాలోనే మరో సిటీలకు
బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు. అమ్మాయి, అబ్బాయిలను కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, అమెరికా పంప నికి చదవమని ప్రోత్సహించిన వాళ్ళు, ఇప్పుడు వంటరితనం అంటే ఎలా? అంతెందుకు. మా నాన్నల కాలంలో వారూ పల్లెలు వదిలేసి హైదరాబాదు రాలా? ఇదీ అంతే. ఇలా వారు వంటరిగా ఉన్నారు అని గుర్తుకు వస్తే కొంచెం చివుక్కుమంటుంది. వారితో మాట్లాిన రోజు మనస్సు శాంతికి దూరం అవుతుంది”

నేనా విషయం ఎత్తింది విస్సుకు నచ్చినట్లు లేదు. ఆస్ట్రిచ్‌ పక్షిలాగా ఇసుకలో తల పెట్టుకుంటే సరిపోతుందన్నదే ఈ సమస్యకి పరిష్కారం అని ఇక్కడున్న చాలామంది అభిప్రాయం అనుకుంటా. డబ్బులు పంపించి, సహాయంగా పనిమనిషినో ఎవరినో పెట్టుకొని కాలం గ పమని ఈ సమస్యను కార్పెట్‌ క్రింద త్రోసేసినా, అసలు తల్లిదండ్రులు ఎదురు చూసేది పిల్లల సాంగత్యం అన్న విషయం చెప్పకనే మనస్సులో తొలిచేస్తూ ఉంటుంది. విస్సు కూడ అందరిలా ఈ బాధను భరిస్తూనే వుండచ్చు. ఈ దేశంలో ముసలితనం కంటే భయంకరమైనది ఏదీ లేదు. ముసలివారికి అవసరమైన పని సహాయం, డక్టర్లు, మందులూ ఏవీ అందుబాటులో ఉండవు. జీవితమంటే ఇల్లు, యూనివర్శిటీ డర్మ్‌, అపార్ట్‌మెంట్‌, ఇల్లు, కాండో, ఓల్డ్‌ ఏజ్‌ హోం – ఇదో లైఫ్‌ సైకిల్‌ ఇక్కడ. బహుశ విస్సు గ్లోబలైజేషన్‌తో అక్కడ మనుష్యుల జీవితానికి నిర్వచనం కూడ అంతేనని నిర్ణయించుకొని మనస్సును కుదుటపెట్టేసుకున్నాడేమో.

నా ఆలోచనలు ఊహించినట్లుగా విస్సు, ”బ్రదర్‌, ముందు చూడటమే మన కర్తవ్యం. పిల్లల్ని బాగా పెంచి మంచి భవిష్యత్తు ఇవ్వడమే మనకు ముఖ్యమైన జీవితాశయం. దానికోసం బాగా సంపాదించాలి. అలాగని మనం సుదూర తీరాలకు వెళ్ళవలసి వస్తే వెళ్ళాల్సిందే. ఇక పేరంట్స్‌ అంటావా, నాకు కూడ గిల్టీగానే ఉంటుంది. మరీ గిల్టీ అనిపించినప్పుడు, మా తాతలను వదిలి మా అమ్మా, నాన్నలు రాలేదా అని సరి పెట్టుకుంటాను” – ఖచ్చితమైన తన అభిప్రాయాలు చెప్పాడు.

సంభాషణ ఇక ఆ విషయంపైన పొడిగించం కష్టమనిపించి మాట మార్చాను. అలా మరో అరగంట అవీ, ఇవీ కబుర్లు చెప్పుకొని విస్సు దగ్గర వీడ్కోలు తీసుకున్నాను. పార్క్‌ చేస్తున్న కార్‌ వైపు వెళ్ళి డోర్‌ తెరుస్తుండగా కార్‌ హార్న్‌ వినపింది. ఏదో తప్పో, యాక్సిడెంట్‌ అయ్యితే కాని హార్న్‌ కొట్టరు కాబట్టి, ఏమైందో చూద్దామని, అప్రయత్నంగా తల తిప్పాను. ఎవరో గుడి ఆవరణలో ఉన్న దారిలో ఓ స్టాప్‌ సైను
చూడకుండ కారును ఆపకుండ అలానే ముందుకు నడిపించినట్లున్నాడు. ఆక్సిడెంట్‌ అయ్యి ఉండేదేమో, హస్తవాసిలో తప్పింది. హార్న్‌ శబ్దానికి పొలోమంటూ సరస్సులో ఈదుతున్న బాతులు కొన్ని
లేచి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇందాక అక్కడే పలకరించిన ముసలతను కనిపించినట్ల్షెనది. అంతా నా భ్రమనే. అక్కడెవరూ లేరు, సూర్యుడు కూడ. చీకట్లు మెల్లగా, పూర్తిగా చుట్టుకుంటున్నాయి.

2

”ఎక్కడి నుంచి?”

సిండి నా కొలీగ్‌ లిండ ఫ్రెండ్‌. లిండకు ్వకవేళలలో సమాజసేవ చేయడం ఇష్టం. ఈ మధ్యన హాస్పిస్‌కు ఎక్కువగా పనిచేస్తున్నట్లు చెప్పింది. దాని గురించి పెద్దగా తెలియపోవడంతో లిండను ప్రశ్నలేస్తూ
ఉండేవాడిని.

”వీకెండ్స్‌ నీవేం చేస్తూ వుంటావు. ఆ లాన్‌ కేర్‌ అని గ ి్డ పీకుకోవడం కొంచెం తగ్గిస్తే మా హాస్పిస్‌కు కూడ కొంత సహాయంగా ఉంటుంది కదా” అని నాతో నవ్వుతూ టీజ్‌ చేసేది. నేను హాస్పిస్‌ గురించి వేస్తున్న ప్రశ్నలకు, నా సందేహాలను తీర్చడనికి సిండుతో పరిచయం చేసింది. సిండు హాస్సిస్‌ వలంటీర్‌ రిక్రూట్మెంట్‌ కోఆర్డినేటర్‌. నా ప్రశ్నలు చూసి, నన్నూ ఓ వలంటీర్‌గా మార్చవచ్చు అనుకున్నారేమో. తను హాఫ్‌ ఐరిష్‌. క్వాటర్‌ ఆంగ్లో సాక్సన్‌, క్వాటర్‌ పోలిష్‌గా పరిచయం చేసుకొని సిండి నన్నడిగిన ప్రశ్న అది.

”ఇండియా నుంచి” అని చెప్పి ‘నా రక్తాలు ఇంకా అలా అంతర్జాతీయ వన్నెలు సంతరించుకోలేదు తల్లీ’ అని మనసులో అనుకొని, ఆంధ్రలోనే ఓ పల్లెల గుంపులో మా కుటుంబాన్ని ఓ పది తరాల వరకు వెనక్కుపోవచ్చు అనుకున్నాను. ఇంకో మూడు తరాల తరువాత ఎవరు చూసొచ్చారు. నా మునిమనవడో మనుమరాలో ”ఐ ఆం హాఫ్‌ ఇండియన్‌” అనినా అనవచ్చును.

”ఇండియా అంటే నీకు పెద్దగా వివరించాల్సిన పని లేదు. ఇది మధర్‌ తెరెసా అంతిమ దినాలు సమీపించిన ముసలివారికి చేసిన సేవ వంటిదే. ఇక్కడ కూడ, పేషంట్‌ కేన్సరో, మరో వ్యాధి వల్లనో టెర్మినాల్లి ఇల్‌ అని నిర్ధారించిన తరువాత, పేషంట్‌కు హాస్పిస్‌ ఓ మార్గంగా చూపెడతారు. హాస్పిస్‌ ఎంచుకుంటే, అతని రోగ నివారణకు చేయవలసిన ప్రయత్నాలన్నీ మానేస్తారు. ఉదాహరణకు కేన్సర్‌కు పెద్ద ఆపరేషనో, లేక, కీమొ తెరాపీ జరుగవలసి వుంటే హాస్పిస్‌ ఎన్నుకున్న తరువాత ఆ ప్రయత్నాలని మానుకుంటారు. దాని బదులుగా ఆ పేషంట్‌ చివరి క్షణాలు సుఖంగా గిచిపోయేటట్లు, అతనికి ఇంట్లోనే నర్సింగ్‌ సర్వీస్‌, పేయిన్‌ మేనేజిమెంట్‌, వాలంటీర్ల ద్వారా కంపానియన్‌షిప్‌ సదుపాయాలు అందచేస్తారు. నీవు వలంటీర్‌గా ఏ పనైన చేయవచ్చును. పేషెంట్‌తో సమయం గపవచ్చు. నా లాగా హాస్పిస్‌ గురించి మిగిలిన వారికి వివరించవచ్చును. డొనేషన్‌లకని ప్రజంటేషన్లు చేయవచ్చును. అది నీ చాయిస్‌” అని చెప్పింది.

”కొద్ది రోజులలోనే చనిపోతారని తెలిసి, వారితో సమయం గిపి అనుబంధం పెంచుకోవడం కష్టమనిపిస్తుంది” అన్నాను.

”నిన్ను వలంటీర్‌గా తీసుకొనే ముందే సైకలాజికల్‌గా ఈవల్యుయేట్‌ చేస్తారు, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడనికి ఓ ట్రైనింగ్‌ కూడ ఉంటుంది. మా దగ్గర వలంటీర్లుగా పెద్ద చిన్న అందరూ ఉన్నారు. ఈమధ్యనే ఓ కాలేజీ కుర్రాడు కూడ మా దగ్గర చేరాడు. హీ ఈజ్‌ డూయింగ్‌ ఏ గ్రేట్‌ జాబ్‌. యు షుడ్‌ మీట్‌ హిం” అంది సిండి.

”కుర్రవాడికి ఇంత వైరాగ్యం ఎలా అబ్బింది, ఆ అబ్బాయి కధేంటి?”అన్నాను.

”ఆ అబ్బాయి, మొదట్లో ప్రజెంటేషన్‌లకని, చందాలు ప్రోగు చేయడనికి చేరాడు. కాని హాస్పిస్‌ గురించి మాట్లా ేటప్పుడు ఆ అనుభవం ఉంటే కాని అది కన్విన్సింగ్‌ గా ఉండదనీ, తనే ఓ పేషెంట్‌ దగ్గర పనిచేయడనికి ఒప్పుకున్నాడు. నేనూ మొదట్లో ఈ అబ్బాయి ఆ పని సరిగ్గా చేస్తా ో లేదో అని అనుమానపడిన విషయం నిజమే. ఆశ్చర్యంగా, ఆ అబ్బాయి ఆ పనిని చాలా బాగ చేస్తున్నాడు. పేషంట్‌, పేషంట్‌
బంధువుల దగ్గరి నుంచి ఫ్బీేక్‌ అద్భుతంగా ఉంది” అంది.

”ఏమి చేసాడేంటి?” అన్నాను.

”పేషంట్‌ ఈ అబ్బాయి రాకకు వారం మొత్తం ఎదురు చూస్తుంటాడట. ఈ అబ్బాయి వచ్చే ఆదివారం ఆ పేషంట్‌కు ఓ హైలైట్‌ అయిపోతుంది. ఈ అబ్బాయి లైబ్రరీ నుంచి ఆ పేషంటుకు నచ్చిన విషయం పైనున్న పుస్తకాలు తీసుకెళ్ళి చదువుతాడు. దానిపై వారు చర్చించుకుంటారు. ఆ పేషంట్‌కు చేపలు పట్టం ఇష్టమని తెలిసి, ఆ అబ్బాయి మాకు వ్రాసి ప్రత్యేకంగా పర్మిషన్‌ తీసుకుని, తన కారులోనే ఓ ఆదివారం మొత్తం ఫిషింగ్‌కని వెళ్ళి ఎంజాయ్‌ు చేసి వచ్చారు. అలా వీల్‌ చెయిర్లో ఉన్న పేషెంట్‌ను బయటకు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. కాని ఈ అబ్బాయి పేషంట్‌కు ఇష్టమని ఆ పని చేసాడు. ఈ అబ్బాయి చాలా డిఫ్పùరెంట్‌. వి ఆర్‌ లక్కీ టు గెట్‌ హిం.నీవు అతనిని కలవాల్సిందే” అంది.

సిండి మాటల వల్ల నాకు ఆ అబ్బాయిని, ఆ పేషంటును కలుసుకోవాలనిపించింది. ఇంకా ముసలితనం, మృత్యువు గురించి ఆలోచించే స్టేజికి రాకపోయినా, ఆ పరిస్థితి తొందరలోనే వస్తుందని తెలుసు. బహుశ ఈ పని చేయడం వల్ల ఆ స్థితిని ఎదుర్కొనడనికి సహాయపవచ్చు అన్న స్వార్థం కూడ ఒక కారణం కావచ్చును.

”ఓ.కె. సిండి. ఆ అబ్బాయిని, పేషంట్లని పరిచయం చేయి, ఎప్పుడు కలుద్దాం.”

”హ∫ అబ∫ట్‌ నెక్ట్‌ ్స సండే” అంది సిండి.

”సరే ఎప్పుడు ఎక్కడ?” అన్నాను నేను.

”సరే నేను నీకు కాల్‌ చేస్తాను” అని సిండి నా ఫోన్‌ నంబర్‌ తీసుకుంది.

3

”ఎక్కడ నుంచి…..వచ్చాం మనం? ఏమిటి మనం? ఎక్కడికి ….. పోబోతున్నాం మనం?” పాల్‌ గ్యూగిన్‌ వేసిన చిత్రం నఖలు. బాస్టన్‌ మ్యూజియం ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌ ్సలో అనుకుంటా దాని ఒరిజినల్‌ చిత్రం చూసాను. జీవితార్ధం వెదుక్కుంటూ, దేశ విదేశాలు తిరిగి చివరికి తహితి దీవులు చేరి అక్కడ గ ిపిన చివరి దినాలలో గీసిన చిత్రం ఇది. 19దో శతాబ్దం చివర్లో గీసిన గొప్ప చిత్రాలలో, వాన్‌గో, మోనే చిత్రాలతో పాటు ఈ చిత్రం చిరకాలం నిలిచిపోతుంది. జీవిత చక్రంలో జరిగే పలుదశలు, జీవితార్ధాలకి సింబాలిక్‌గా గీసిన ఈ చిత్రం నాకు ‘మొనాలిస’ చిత్రం కన్నా ఓ గొప్ప మిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకో, హాస్పిస్‌ పేషంట్‌ ఇంట్లో ఈ చిత్రం చూడం ఒకవిధంగా తగిన చోటే అనిపించింది. ఆ చిత్రం క్రింద ఓ లెథంర్‌ సోఫా. దాని కటువైపు ఓ లవ్‌ సీటు మరోవైపు రిక్ల్షెనర్‌. వాటి మధ్య మ్యాచింగ్‌ కార్నర్‌ టాబిల్స్‌, ల్యాంప్సు, సెంటర్‌ టేబిల్‌, ఓ ఒరియెంటల్‌ కార్పెట్‌, సెంటర్‌ టేబిల్‌ మీద ఓ క్రిస్టల్‌ వేస్‌లో అందంగా అమర్చిన తాజా పూలు. నీటుగా అందంగా అమర్చిన ఆ గది, ఆ ఇంటతని టేస్ట్‌ గురించి చెప్పకనే చెప్పుతున్నాయి. అబ్బాయి పేషంట్‌తో లోపల రూంలో ఉన్నాడు.

నేను, సిండి సోఫాలో కూర్చుని ఆ అబ్బాయి కోసం వెయిట్‌ చేస్తున్నాము. కొంతసేపటికి ఓ ఇరవై ఏళ్ళ యువకుడు బయటికి వచ్చాడు. బాగా టాన్‌ అయిన స్కిన్‌తో, కోటేరు ముక్కుతో దాదాపు ఆరుగులు ఎత్తు, సన్నగా ఉన్నా, కండలతో బలంగా ఓ మాడల్‌ లాగా ఉన్నాడు. కళ్ళు పెద్దగా ఉండటంతో ఏ దేశం నుంచి వచ్చాడో కనిపెట్ట ంకష్టంగానే ఉంది. అన్ని దేశాల్లో నుంచి వలస వచ్చిన వారితో ఈదేశం నిండిపోయింది. ఎవరు ఎక్కడ నుంచి వచ్చారో చెప్పడం కష్టమే.

సిండి ఆ అబ్బయిని ”హాయ్‌ు ఆడి” అని పలకరించి నాకు పరిచయం చేసింది. నేను హాస్పిస్‌ గురించి ఇంటరెస్ట్‌ చూపెడుతానని విని, ఆడి, ”గ్రేట్‌, ఓల్డ్‌ మాన్‌ను చూద్దాం” అని లోపలికి తీసుకెళ్లా ు. లోపల బ్‌ెరూంలో ఓ బ్‌ె దాని మీద ఎత్తుగా వేసుకున్న దిండు కానుకొని పేషంట్‌ కూర్చుని ఉన్నాడు. మంచం ఆనుకొన్న గోడ మీద మొనే ‘వాటర్‌ లిలీస్‌’ పేయింటింగ్‌ ప్రింట్‌ ఉంది. పేషంట్‌ చేతిలో ఓ ఆల్బం ఉంది. దానిలో ఫొటోలు చూస్తున్నాడు. సిండి నేను కూడ హాస్పిస్‌ గురించి తెలుసుకోవడనికి వచ్చినట్లు చెప్పింది.

ఆయన నన్ను నవ్వుతూ పలుకరించి, ”గత వారం ఆడి ఫిషింగ్‌కి తీసుకెళ్ళాడు కదా. ఇవిగో ఫోటోలు చూడండి” అంటూ ఆనందంగా ఆల్బం లోని ఫోటోలు చూపెడుతూ తాము ఏ విధంగా ఎంజాయ్‌ు చేసిందీ వర్ణించసాగాడు.

”ఎన్ని చేపలు పట్టారు” అంది సిండి.

”అబ్బే అన్ని చిన్న చిన్నవే. పట్టి వదిలేసాము. ఓ పెద్ద దాన్ని చివర్లో పట్టాం. కోసి బార్బెక్యు చేసి తిందాం అన్నాను నేను. ఆడినే దానిపై తెగ జాలిప ి వదిలేసాడు” అని నవ్వాడు ఆ ముసలతను.

అలానే ఆ అల్బంలో ఉన్న పాత ఫోటోలు చూపెడుతూ, తన భార్యని కొడుకులను పరిచయం చేసాడు. కొడుకు మిలిటరీ డ్రెస్‌లో కనిపించాడు. ఓ మిలిటరీ డక్టర్‌గా వియెత్నాంలో పనిచేసాడని ఓ
ఫోటోలో చూపెట్టాు.

”ఆడి నేను వీళ్ళని తొందరలోనే కలుస్తానని జోక్‌ చేస్తుంటాడు” అని మరోసారి ఆడితో పాటు నవ్వాడు.

ఆయన ముఖంలో చనిపోతున్నానన్న విచారం ఇసుమాత్రం కూడ కనపలేదు. అప్పుడే మాటలలో ఆయన భార్య పిల్లవాడు అప్పటికే చనిపోయారని తెలిసింది. ఆయన కొడుకు చేతికొచ్చి, వియత్నాం యుద్ధంలో పిన్న వయస్సులోనే చనిపోయాడని తెలిసి నాకే తెగ బాధ వేసింది. ఆయన పక్కనున్న టేబుల్‌ పైన ఆంటిక్‌ కార్ల ఫోటోలతో ఓ లైబరరీ పుస్తకం ఉంది. దానిలో కార్లు చూస్తూ ఆ రోజు ఆడితో సమయం చాలా బాగా గిచిందని చెప్పాడు. అలా కొంతసేపు ఆడి గురించి మంచి మాటలు ఆ ముసలతని దగ్గర మరీ మరీ విని వీడ్కోలు తీసుకొని బయటి లివింగ్‌ రూంకు వచ్చాము. సిండి పని వుందంటూ, మళ్ళీ ఫోన్‌లో మాట్లాుతానని వెళ్ళిపోయింది. నేను, ఆడి సోఫాలో కూర్చున్నాము. ఆడి చేస్తున్న పనికి నిజంగానే ఇంప్రెస్స్‌ అయ్యి గొప్ప పని చేస్తున్నావని పొగిడను.

”అబ్బే ఆయన మంచితనంతో ఆ మాటలన్నాడు. నాకే అతను మంచి కంపెనీ ఇచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి కార్లంటే తెగ ఇష్టం. మా ఇంట్లో మా నాన్నకి టైం లేదు. మా అమ్మకి ఇంటరెస్ట్‌ లేదు.
ఈయన దగ్గర అవి రెండూ పుష్కలంగా ఉన్నాయి. ఆయనతో ఆ కార్ల గురించి మాట్లాుతుంటే గంటలు క్షణాలుగా గిచిపోతాయి. నాకున్న ఆ లోటు కాస్తా ్వపోయింది. ఈయన చిన్నప్పుడు టెక్సాస్‌లో పెరిగాడు.
నాకు లాస్సొ త్రాడుతో తిప్పడం తెలీదని, అది ఎలా చేయాలో ఓపిగ్గా ఓ రెండు వారాలు నేర్పాడు. హాస్పిస్‌ జీవితంలో ఎదగనికి నాకు ఎంతో ఉపయోగంగా ఉంది” అన్నాడు.

లోపల ఉన్నప్పుడు, ఆ అబ్బాయి, ఆ ముసలతను కరెంట్‌ అఫైర్స్‌ కూడ చక్కగా విశ్లేషించి మాట్లాం చూసాను.

”నీవేం న్యూస్‌ పేపర్లు చదువుతావు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలపైన మంచి అవగాహన ఉంది” అన్నాను.

ఆడి నవ్వుతూ ”అబ్బే పేపర్లు ఏమి చదవనండి. నాది విజువల్‌. ఇంటర్‌ ఆక్టివ్‌ అప్రోచ్‌. టి.వి.లో న్యూస్‌ ఫాలో అవ్వుతాను. వెబ్‌సైట్లలో విమర్శలు చదువుతాను. తెలిసిన వారితో చర్చలు చేస్తాను. వీటి
వల్ల నాకంటూ ఓ అభిప్రాయం అన్ని విషయాల మీద ఏర్పరచు కోవడనికి వీలవుతుంది” అన్నాడు.

నిజమేనేమో. కాలం మారుతూ ఉంటే మనుష్యుల జీవన విధానంలోను మార్పులు వస్తాయేమో. వార్తలు తెలుసుకోవడనికి ఈ కాలంలో టముకు కొట్టే వారి అవసరం లేదు కదా. రేపొద్దున ఈ ప్రింట్‌ె పేపర్లకి కూడ అవసరం లేదేమో అనుకున్నాను. మన లాగే మన తరువాతి తరం గ పాలనుకోవడం ప్రగతికి తిరోగమనమైన ఆలోచన ఏమో? ఈ తరతరాంతరాల విభేదాలను అంగీకరించక పోవడమే జెనెరేషన్‌ గేప్‌ అనుకుంటా.

ఆడి అలాగే మాట్లా ుతూ, ”మరో విషయం. రెండో ప్రపంచ యుద్ధం గురించి చరిత్ర పుస్తకాలు, సినిమాల ద్వారానే తెలుసుకున్నాను. కాని ఈయన ఆ యుద్ధంలో జెర్మనీలో పాల్గొని అక్కడే వారికి దొరికిపోయి ఆంఇగా ఓ ఏడది పైనే ఉన్నాడు. ఆయన అనుభవాలు ఏ పుస్తకంలోను దొరకవు. అలాగే ఆయన పిల్లనాడిని వియత్నాం యుద్ధంకు పంపించింది. ఆ కాలం కబుర్లు వింటుంటే టైం మెషీన్‌లో మరో తరంలో జీవించినట్లనిపిస్తుంది. ఇదో అపురూపమైన అవకాశమే కదా” అంటూ హాస్పిస్‌ ఉపయోగాలను గురించి చెప్పసాగాడు. అలా తను చేస్తున్న పని మంచిదని, ఎంతో ఇంటరెస్టింగ్‌గా ఉందని అతను చెపుతుంటే, విషాదపూరితమైన ఓ సీరియస్‌ వాతావరణాన్ని ఎదురు చూస్తున్న నాకు ఒక షాక్‌ లాగే ఉంది. నాకూ హాస్పిస్‌ చేరాలనే కుతూహలం కలిగింది. ఇక మిగిలినది ఒకే ప్రశ్న. దానికి యువకుడి దగ్గర జవాబు దొరుకుందా? ప్రయత్నిస్తే పోయింది కదా అని, ”మరి ఈయన కొన్ని రోజులలోనే పోతున్నాడని తెలిసి ఎలా అడ్జస్ట్‌ అవ్వగలుగుతున్నావు. మరీ యిలా అనుబంధం పెంచుకోవడం మంచిది కాదేమో కదా” అని అడిగాను.

దానికా అబ్బాయి చిరునవ్వు నవ్వి ఆలోచించసాగాడు. ఎలా జవాబు చెప్పాలని ఆలోచిస్తున్నాడేమో. ఓ క్షణం నిలబడి, తిరిగి, పాల్‌ గ్యూగిన్‌ పేయింటింగ్‌ చూస్తూ అనర్గళంగా ఫ్రెంచ్‌లో, వఈ’ళి తి ఙలిదీళిదీరీ దీళితిరీ? గతిలిరీ రీళిళీళీలిరీ దీళితిరీ? ఈ’ళితి బిజిజిళిదీరీ దీళితిరీ? అంటూ ఆ పేయింటింగ్‌ పేరు చదివి ”ఇలాంటి ప్రశ్నలు మనిషి పుట్టినప్పటి నుంచి, బుద్ధుని దినాలు నుండి, గ్యూగిన్‌ కాలం వారి నుండి, ఇప్పటి వరకు ఉన్నవే, ఇక ముందు కూడ జవాబు లేక ఉండిపోవాల్సిందే. వీటి గురించి ఆలోచించనికి నాకు అనుభవం బహుశ తెలివి లేవు. నాకు ఆలోచించాలన్నా ఓపికా లేదు. నా కర్థం అయ్యిందల్లా అవతలి మనిషి బాధలో ఉన్నప్పుడు దానికి నాకు చేతనైనంతా సహాయం చేయాలి అన్న మంచి ఆలోచననే. ఈ హాస్పిస్‌ నాకు అలాంటి అవకాశం ఇస్తుంది. ఆ ఆలోచనే నా స్పూùర్తికి, సంతోషానికి కారణం. అలా అనుకొని ఆ భావనలు నింపుకుని, బాధాకరమైన ఇలాంటి ఆలోచనలకి చోటు ఇవ్వలేదు. ఏమో మనకేమీ తెలుసు – ఆయన చనిపోయిన తరువాత చనిపోయిన భార్య పిల్లవాడిని కలిసి సుఖంగా ఉంటాడేమో” అని
నవ్వాడు.

అనుభవం లేకున్నా ఆ అబ్బాయి రీజనింగ్‌ విని ముచ్చట ప్డను. హాస్పిస్‌లో చేర నికే నిశ్చయించుకున్నాను. చివరగా వీడ్కోలు తీసుకోబోతుండగా, ఆడి మళ్ళీ నవ్వుతూ –

”మీరు నన్ను గుర్తు పట్టినట్లు లేదు?” అన్నాడు.

”నేను ముందే తెలుసా?” ఆశ్చర్యంగా అడిగాను నేను.

”ఓ ఆరేళ్ళ క్రితం కలిసాం మనం. ఇప్పుడు ఇక్కడే ఓ యూనివర్సిటీలో చదువుతున్నాను”

”ఇంతకి నువ్వు…” ఇంకా గుర్తు తెచ్చుకోవడనికి ప్రయత్నిస్తూ సందిగ్ధంగా అడిగాను నేను.

”విను వాళ్ళబ్బాయి ఆదిత్య నండి. అదే…. చంటి అంటే వెంటనే గర్తువస్తుందో ఏమో నండి” అన్నాడు చేతులు జోడిస్తూ…..
---------------------------------------------------------
రచన: నిర్మలాదిత్య, 
ఈమాట సౌజన్యంతో

Sunday, January 27, 2019

గాంధీ అభిమాని


గాంధీ అభిమాని





సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి...............
ఆ శనివారం, మార్చి 8న అర్ధరాత్రికింకా పన్నెండు మిమిషాలుంది. ఆ రోజు జరిగిన హాకీ మ్యాచ్ వివరాలను రేడియోలో వింటున్నాడతను. కాసేపట్లో టి.వి.లో ‘గాంధీ’ సినిమా రాబోతోంది. ఆ సినిమా చూస్తూ తాగడం కోసం అతను వంటింట్లో చాక్లెట్ డ్రింక్ కలుపుకుంటున్నాడు. ఇంతలో హఠాత్తుగా రేడియోలో ఓ ప్రకటన వెలువడింది. దాన్ని వింటూనే అతడి నోట్లోంచి ఒక శాపనార్థం వచ్చింది.

బాంబు దాడులకి కనీసం ఓ చిన్న నిట్టూర్పు కూడా అతనినుంచి రాదు. వేర్వేరు తెగల మధ్య గొడవలు, గుంపు హత్యలు, క్రూరమైన ఆచారాలలానే బాంబు దాడులు కూడా రోజూవారీ వార్తలలో సర్వసాధారణమైపోయాయి. మాంట్రియల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగి దాదాపుగా మూడువందల మంది చనిపోయినప్పుడు కూడా అతను అంతగా చలించలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి, విమానయాన చరిత్రలో ఎక్కువ ప్రమాదాలు జరిగిన సంవత్సరాలలో ఒకటిగా ఈ ఏడాది అప్పుడే పేరు సంపాదించేసింది. కానీ, ఇప్పుడీ రేడియో ప్రకటన – ‘ఓ-పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తులను తక్షణం సెయింట్ ల్యూక్ ఆసుపత్రికి రమ్మని ప్రాధేయపడుతూ – అతన్ని వ్యక్తిగతంగా బాధ్యుణ్ణి చేసింది. అతనిది ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తమే; పైగా సెయింట్ ల్యూక్ ఆసుపత్రి అతనుండే అపార్ట్‌మెంట్ నుంచి పది నిముషాలు, అంతే.

అతను రేడియో కట్టేశాడు. “గాంధీ ఎంతగొప్పవాడైనా సరే, కానీ అవతల ఓ మనిషి ప్రాణం నేనివ్వబోయే కొద్దిపాటి రక్తంపై ఆధారపడి ఉన్నప్పుడు, ఓ చనిపోయిన వ్యక్తి గొప్పతనాన్ని టీవీలో చూడ్డం కోసం నేనాగలేను. చాక్లెట్ డ్రింక్ తాగేసి, తయారై ఆసుపత్రికి వెళ్లిపోతాను.” అని అనుకున్నాడు.

చాక్లెట్ డ్రింక్‌ని కప్పులోకి వంపుకున్నాడు.

చాక్లెట్ డ్రింక్ చాలా వేడిగా ఉంది. చల్లార్చేందుకు దానిపై నోటితో ఊదుతూ వంటింటి కిటికీలోంచి బైటికి చూశాడు. కిటికీ అవతల దాదాపుగా మూడంతస్తుల ఎత్తు పెరిగి, ఆకులు రాలిపోయిన మేపుల్ చెట్టు గాలికి ఊగడం చూసి అతని ఒళ్ళు జలదరించింది. బైట కురుస్తున్న మంచు రోడ్డు పక్కగా నిలిపి ఉంచిన అతని కారు చుట్టూ తెరలు తెరలుగా సుళ్ళు తిరుగుతోంది.

“కార్ బ్రేక్ డౌన్ అవకుండా ఉంటే బావుండు” అనుకున్నాడతను. ఎక్కువగా ప్రయాణాలు చేసే ఓ సేల్స్‌మాన్‌ షికాగో నుంచి బయల్దేరి వెడుతుండగా అతని కారు హైవే మీద పాడైపోయి మంచు తుపానులో నిల్చిపోయిన దారుణ సంఘటన అతనికి గుర్తొచ్చింది. ఆ రోడ్డు మీదుగా వెళ్ళేవారెవరైనా ఆగి సాయం చేస్తారేమోనని ఆ సేల్స్‌మాన్‌ దాదాపుగా మూడు గంటలు వేచి చూశాడు. కానీ ఎవరూ ఆగలేదు. నిరాశతోనూ, చలికి సగం గడ్డ కట్టుకుపోయీ అతను తన కార్లో ఎక్కి కూర్చుని, తన సహోద్యోగులకి ఒక చిన్న వీడ్కోలు ఉత్తరం మనసుకు తాకేట్టుగా రాసి నోటిలో తుపాకీ పెట్టుకుని కాల్చుకున్నాడు.

“ఇటువంటి సంఘటనలు పెద్ద నగరంలో జరగవు, ప్రతీ వీధి మూలన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉంటుంది కదా,” అని అనుకున్నాడు.

అంతలోనే: “ఈ మాంట్రియల్ ఎలా పెరిగిపోయిందంటే, ఎవరైనా సాయం చేయడానికి వస్తే వాళ్ళెలాంటివాళ్ళో అని భయం పుడుతుంది, ధైర్యం రావడానికి బదులుగా!”

అలా అనుకోడానికి కారణం అతని అపార్ట్‌మెంట్‌కి కొన్ని బ్లాక్‌ల అవతలే జరిగింది. ఒక పిల్లల డాక్టరు, కుర్రాడే, ఓ సాయంత్రం పూట వాళ్ళమ్మని ఇంటికి తీసుకువెడుతుండగా, కారు టైరు పంచరయింది. సాయం చేస్తామంటూ ఆ దారిన వెడుతున్న ఇద్దరు ఆగారు. అందులో ఒకడు కడ్డీతో డాక్టర్ తలమీద గట్టిగా మోదాడు, ఇంకోడేమో వాళ్ళమ్మపైకి దూకాడు. అయితే ఆవిడ భయంతో గట్టిగా కేకలు వేయడంతో దుండగులు ఆమె హాండ్‌బ్యాగ్‌ని లాక్కుని పారిపోయారు.

“సమాజానికింకా ఎంతో ఇవ్వగలిగిన ఓ యువ డాక్టర్ సాయం కోసం ఎదురుచూస్తూ, మాదకద్రవ్యాలకు బానిసలైన వ్యక్తుల చేతుల్లో హత్యకి గురయ్యాడు.” అతని ఆలోచన కొనసాగింది.

“ఇటువంటి ప్రమాదకరమైన వాతావరణంలో, గాయపడడానికి లేదా చావడానికి సిద్ధమై, నేనిప్పుడు ఓ గూండాకి సాయం చేయడానికి వెళ్ళడం అంత అవసరమా? లేకపోతే ఈ సమయంలో రక్తం ఎవరికి అవసరమవుతుంది? ఆగిపోయిన కార్లను తీస్కెళ్ళే టో-ట్రక్ డ్రైవర్ని దోపిడీ చేయబోయి తన్నులు తిన్న ఏ వ్యసనపరుడో అయుంటాడు. లేదంటే చేతిలో డబ్బులేకపోతే మత్తుమందు కోసం మాదక ద్రవ్యాలమ్మే వాడిని ఎవడో కత్తితో పొడిచేసి ఉంటాడు.లేదంటే నైట్‌క్లబ్‌ గొడవల్లో బదులు తీర్చుకునేందుకు మోటార్ సైకిల్‌ గ్యాంగు వాణ్ణెవరో కాల్చేసి ఉంటారు. ఇలాంటివి ప్రతీ రాత్రి జరుగుతునే ఉంటాయి. వెధవ! రక్తం పోయి ఛస్తే ఛావనీ.”

కిటికీ దగ్గర నుంచి కదిలాడు. వంటింట్లో దీపం ఆర్పేయబోతుండగా గాయపడిన వ్యక్తి నిజానికి చీకటి ప్రపంచానికి చెందినవాడు కాకపోయుండచ్చని అతని మనసుకి తట్టింది. పైగా నేరస్తుల వలన ప్రమాదానికి గురైన వ్యక్తి కావచ్చు. ఉదాహరణకి, ఆ టో-ట్రక్ డ్రైవర్, ఎంతో కష్టపడి పనిచేసే నిజాయితీ మనిషి, మంచు తుఫానును కూడా లెక్కచేయకుండా రక్తదానం ఇవ్వడానికి వచ్చే వ్యక్తి అయ్యుండచ్చు.

వేడిగా ఉన్న చాక్లెట్ డ్రింక్ కప్పుని గట్టు మీద ఉంచాడు. కిటికీకి అవతల మేపుల్ చెట్టు కొమ్మలు గాలికి కిర్రుమంటూ చప్పుడు చేస్తున్నాయి.

“వాడు తప్పకుండా గూండా అయ్యుంటాడు” తనలో తాను అనుకున్నాడు. “బ్లడ్ గ్రూప్‌లు అనువంశికంగా ఉంటాయి. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి కాపాడచ్చుగా? వాడు కోలుకుని మళ్ళీ మత్తుమందులు అమ్మడం కన్నా, లేదంటే హ్యాండ్‌బ్యాగ్‌లు దొంగిలించడం కన్నా, వాడు చచ్చిపోవడమే మంచిదని వాళ్ళు అనుకున్నారేమో? అలాంటి వాడికి నేను నా రక్తం ఇచ్చి వాణ్ణి బతికించాలా? వాడు చెడ్డలవాట్లలో మళ్ళీ కొనసాగడానికా? ఇలాంటివన్నీ కొందరికి తమాషాగా అనిపిస్తాయేమో కానీ, నాకు మాత్రం కాదు.” సాగుతున్నాయి అతని ఆలోచనలు.

తన సహోద్యోగి బాబ్‌ గుర్తొచ్చాడు. నిన్న సాయంత్రం బాబ్ అతనితో పందెం వేసి అయిదు డాలర్లు గెలుచుకున్నాడు. ఏ వృత్తిలోని అబ్బాయిల వెనుక అమ్మాయిలు ఎక్కువగా పరిగెడతారనే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయాడతను. ఓడిపోయానని ఒప్పుకున్నాక, “ఓరి దద్దమ్మా! పర్సులు కొట్టేవాడి వెనక!” అంటూ నవ్వాడు బాబ్.

అతను గట్టు మీది కప్పుని అందుకున్నాడు. అయినా అతను దాన్ని తీసుకుని వంటింట్లోంచి బయటకి రాలేకపోయాడు, గాంధీ సినిమా మరో ఏడెనిమిది నిముషాలలో మొదలవబోతున్నా కూడా.

“ఒక వేళ రక్తం కావల్సింది ఎవరైనా యాత్రికుడికేమో? లేదా మాంట్రియల్‌లో కుటుంబమే లేని ఏ ప్రవాసికో అయితే? పోనీ, రక్తం కావల్సింది మాంట్రియల్ మనిషికే కావచ్చు. అతను తన తల్లిదండ్రులతో కారులో బయటకి వెళ్ళి ఉండచ్చు, దారిలో కారు పాడైపోయుండచ్చు, ఈ వాతావరణంలో జారిపోయి ఏ గోడనో స్తంభాన్నో గుద్దుకుని అందరూ ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో ఉండి ఉండచ్చు.”

కప్పు పక్కన బెట్టి, టాక్సీని పిలిచేందుకు ఫోన్ అందుకున్నాడు. “టాక్సీ ప్రయాణం క్షేమం! హాయిగా గుమ్మం ముందు ఎక్కి, ఆసుపత్రి ముంగిట్లో దిగచ్చు. పైగా నేను నా టయోటా వేసుకెళ్ళి అది ఈ వాతావరణంలో పాడయిపోతే టో-ట్రక్‌కి పెట్టే ఖర్చుకన్నా టాక్సీకయ్యే ఖర్చే తక్కువ. ఎటొచ్చీ, టాక్సీ డ్రైవర్ హైతీ దేశంవాడయితేనే ఇబ్బంది.”

హైతీ దేశస్తుల పట్ల అతనికేం వ్యతిరేకత లేదు, కానీ హైతీ డ్రైవర్లపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులు చాలా ఎక్కువయ్యాయి. వాళ్ళకి ఉద్యోగాలిచ్చిన సంస్థలు వాళ్ళని తొలగించాలనుకుంటున్నాయి. దీని పట్ల మానవ హక్కుల సమితి, హైతీ అసోసియేషన్ వారు నిరసన తెలిపారు, కొంతమంది హైతీ డ్రైవర్లకి మాంట్రియల్ నగరంలోని వీధులు ఇంకా పూర్తిగా తెలియవని వాదించారు.

“మరి వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు ఎలా వచ్చాయి?” తనని తానే ప్రశ్నించుకున్నాడు. “నా అభిప్రాయంలో వీళ్ళు నగరానికి కొత్తగా వచ్చిన వారిని ఊరంతా తిప్పి ఎక్కువ డబ్బులు గుంజుతారు.’ఓ-పాజిటివ్’ గ్రూప్ రక్తాన్నివ్వడం కోసం నేనిప్పుడు హైతీ డ్రైవర్ నడిపే టాక్సీ ఎక్కి ఆసుపత్రికి వెళ్ళేసరికి నాకే రక్తమార్పిడి చేయాల్సిన అవసరం రావచ్చు,” అతను ఫోన్ పెట్టేసాడు. కానీ ఫోన్ చేయాలనే ఆలోచన మాత్రం అతన్ని వీడలేదు. ఓ టాక్సీని తప్పకుండా పిలిపించుకోవాలనుకున్నాడు. కానీ డ్రైవర్ హైతీ దేశస్తుడు అయ్యుండకూడదని మాత్రం చెప్పదలచుకోలేదు. “నాకు జాతి వివక్ష లేదు,” తనకి తాను చెప్పుకున్నాడు.

“మరిప్పుడు నేనేం చేయాలి?”

అతను తన నుదురు రుద్దుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారమంతా అతనికి తలనొప్పి కలిగిస్తోంది. ఒకసారిగా భార్యని గుర్తు చేసుకున్నాడు. ఆమె నిద్రపోయి అప్పుడే గంటపైనే అవుతోంది. “తను తన కొత్త హోండా కారుని గారేజ్‌లో ఉంచకపోయినట్టయితే, నేను దానిలో సెయింట్ ల్యూక్ ఆసుపత్రికి పది నిముషాలలో వెళ్ళి, రక్తం ఇచ్చేసి ఇంటికొచ్చి గాంధీ సినిమా కనీసం ఇంటర్వల్ తరువాతి భాగమన్నా చూసుండేవాడిని” అని అనుకున్నాడు. కానీ,నిజానికి అతనికి సినిమాలు మొదటి నుంచి చూడడమే ఇష్టం.

“ఇక వీసిఆర్‌ని బాగు చేయించక తప్పదు.”

ఫ్రిజ్ మీద అంటించిన పలకపై ఆ విషయం గుర్తుకోసం రాయబోతుండగా, వంటింటి గోడ వెనక నుంచి నీళ్ళు పారుతున్న చప్పుడు వినిపించింది. వెంటనే పక్క వాటాలో ఉండే ఆవిడ ఓ నర్సనే సంగతి గుర్తొచ్చింది.

“ఆవిడ నర్సు కాబట్టి, పరిస్థితి చెప్తే అర్థం అవుతుంది, తన కారుని కాసేపు ఇవ్వమంటే ఇవ్వచ్చు. కాకపోతే, ఈ సమయంలో నన్ను ఇంట్లోకి రానిస్తుందో లేదో. పైగా ఆవిడ చాలా తిక్క మనిషి.” అనుకున్నాడు.

అతనికి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ (ఉదాహరణకి, అన్ని కాలాలలోను, వాతావరణం ఎలా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా అతను రోజూ రాత్రి భోజనమయ్యాక సుమారుగా అరగంట సేపు నడుస్తాడు). అందుకని లిఫ్ట్ సౌకర్యం లేని ఓ నాలుగు అంతస్తుల భవనంలో పై అంతస్తులోకి మారిపోయాడు. మెట్లెక్కి దిగుతూ ఉంటే శరీరం అనుకూలంగా ఉంటుందని భార్యతో చెప్పాడు. అయితే ఈ నర్సు కూడా ఇదే కారణంతో పై అంతస్తులో ఉంటోందని అతను అనుకోవడం లేదు. ఆవిడ రోజు విడిచి రోజు తినడానికి పీజ్జా, చైనీస్, సౌవ్లాకీ, ఇలా తిండి ఆర్డరిచ్చి తెప్పించుకుంటుంది. పాపం, డెలీవరీ చేసేతను మెట్లెక్కి ఆమె గుమ్మం వద్దకి చేరేసరికి ఆయాసంతో రొప్పుతుంటాడు. పైగా ఆవిడ తలుపు తీయడానికి దాదాపుగా రెండు నిముషాల సమయం తీసుకుంటుంది. అవతల గుమ్మం దగ్గర ఓ మనిషి ఆయాసపడుతూ నిలబడి ఉంటే, రెండు నిముషాల పాటు ఆవిడ ఏం చేస్తుందో అతనికి అర్థం కాదు. ప్రతీరాత్రీ, పక్కన పడుకున్న భార్య నిద్రపోయి చాలాసేపయినా, అతనప్పుడూ ఇదే ఆలోచనలో మేల్కునుండేవాడు. “ఎందుకో తెలుసుకోటానికి ఇప్పుడిది మంచి అవకాశం. ఎలానూనేనూ ఆయాసపడ్డానికి ఇప్పుడు కారణం కూడా ఉంది కదా…”

ఇంతలో కింద రోడ్డు మీద సైరన్ మోగిస్తూ వెళ్ళిన ఓ అంబులెన్స్ సమయం వృధా అవుతోందని అతనికి గుర్తుచేసింది. “బాబ్ అనుకునేటట్లుగా ఒంటరిగా ఉండే ఆడవాళ్లందరూ తల తిక్కవాళ్ళు కాదు. అలాగే కొందరు హైతీ డ్రైవర్లు మోసగాళ్ళయినంత మాత్రాన అందరు హైతీ డ్రైవర్లు వంచకులు కారు. అంతే కాకుండా, ఎయిడ్స్ క్రిమి ఆఫ్రికా నుంచి వచ్చినంత మాత్రాన అందరు నల్లవాళ్ళకి ఎయిడ్స్ సోకదు. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలన్నీ కట్టిబెట్టి టాక్సీని పిలు.”

వెంటనే ఫోనందుకుని, టాక్సీని పంపమని చెప్పడానికి నెంబర్ డయల్ చేయసాగాడు. కాని అంతలోనే ఓ క్షణం ఆగాడు. “ఇలా చేయడం వల్ల నాకు ఎయిడ్స్ సోకే ప్రమాదం లేదు కదా?” అని ప్రశ్నించుకున్నాడు. హైతీ టాక్సీ డ్రైవర్నుంచి కాదు. అతను ఎన్నో ప్రకటనలు చూసాడు, దినపత్రికలలో చదివాడు – కేవలం స్పర్శ వలన ఎయిడ్స్ సోకదని అతనికి తెలుసు. కాకపోతే అతని బెంగంతా రక్తం తీయడానికి ఉపయోగించే సూదుల గురించే. నిధులు లేకపోవడం వలన ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి కేటాయింపులు బాగా తగ్గించేసింది, కొన్ని ఆసుపత్రులలో దాదాపు సగానికి పైగా గదులను మూసేసారు.

“ఆసుపత్రి వాళ్ళు సిరంజిని మళ్ళీ మళ్ళీ వాడితే నా పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు నా చేతికి గుచ్చేముందుగా సిరంజిని స్టెరిలైజ్ చేయడం చాలా ముఖ్యమని నర్స్‌కి తెలిసుండాలి. కానీ ఆసుపత్రిలో నర్స్ కూడా మా పక్కింటావిడలానే తిక్కదైతే? ఒక వేళ వాళ్లు డిస్పోజబుల్ సిరంజి వాడినా, నాకు ‘లీజనేర్స్ వ్యాధి’ రాదనే భరోసా అయితే లేదుగా? విజ్ఞానం అభివృద్ధి పుణ్యమా అని, క్రిస్మస్ నుంచి ఈ కొత్త రోగం వల్ల మాంట్రియల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.”

అతను ఫోన్ పెట్టేసాడు.

“ఆవిడ చాలా మంచిది, నిజం చెప్పింది” అంటూ కొత్త సంవత్సరం వచ్చిన రోజు ఓ షాపింగ్ మాల్‌లో ఎదురైన ఓ చిన్న సంఘటనని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు తన భార్య కోసం ఎదురుచూస్తుండగా, ఓ చిన్నపిల్ల దాదాపు అరవై ఏళ్ళున్న ఓ ముసలావిడని ‘సెలవు రోజున ఒంటరిగా షాపింగ్ మాల్‌లో ఎందుకు కూర్చున్నారు?’ అని ఆడగడం అతనికి వినిపించింది.

“ఎందుకంటే, నేను పెద్దదాన్ని! మా లాంటి పెద్దవాళ్ళ బుర్రలు అత్యంత సృజనాత్మకంగా ఉంటాయి. మాకు మేమే ఎప్పటికప్పుడు సమస్యలని, శతృవులని సృష్టించుకుంటూంటాం” అందా ముసలావిడ.

“ఆవిడ చెప్పినది నిజం!” అనుకుంటూ అతను తన చేతి గడియారం కేసి చూసుకున్నాడు. “ఇంత ఆరోగ్యంగా ఉండే నేను – తథాస్తు – ఎవరికో మంచి చేయడం కోసం ఉన్నట్టుండి చావును పిలిచి తెచ్చుకోడమేనేమో ఇది! మంచికి పోయి క్రిస్మస్ కల్లానో, ఈస్టర్ వచ్చేలోపో నేనే చచ్చిపోనూ వచ్చు!”

తలూపుతూ అతను చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకున్నాడు. అతని చేయి వణుకుతోంది. కప్పుని మళ్ళీ గట్టు మీద పెట్టేసాడు.

“నేను సాయం చేయాలి.” పైకే అనుకున్నాడతను. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రక్తదానం చేసాను. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కెనడియన్ హార్ట్ అసోసియేషన్‌కి ఇరవై డాలర్లు, కెనడియన్ మెంటల్ హెల్త్ సొసైటీకి ఇరవై డాలర్లు, ఆర్థరైటిస్ సొసైటీకి పది డాలర్లు విరాళంగా ఇస్తునే ఉన్నాను. ఇవి కాకుండా పదనాలుగు డాలర్ల నలభై మూడు సెంట్లు ప్రతీ వారం ప్రొవిన్షియల్ హెల్త్ ప్లాన్ కోసం కడుతున్నాను. మరి అలాంటప్పుడు – అత్యవసర పరిస్థితుల కోసం ఒక్క పైంట్ ఓ-పాజిటివ్ రక్తాన్ని కూడా నిలువ ఉంచుకోలేని బుద్ధిహీనుల అసమర్థత నా తప్పా? పైగా ఈ మంచుతుఫానులో రోడ్లమీద తిరిగి ఇలా ప్రమాదాలు తెచ్చుకునే వాళ్ళకోసం, ఇంట్లో కూర్చుని ఓ గొప్ప సినిమాని చూడకుండా నేనెందుకెళ్ళాలి?”

ఈ ఆలోచనల జడిలో అతను కొంత చాక్లెట్ డ్రింక్‌ని చేతిమీద ఒంపుకున్నాడు. వాటిని తుడుచుకుంటూ, “హాస్పిటల్‌లో ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా నాలానే మహాత్ముడైన గాంధీ గురించిన సినిమా చూద్దామనే, ఆయన జీవితంనుంచి స్ఫూర్తి తెచ్చుకుందామనే అనుకున్నారేమో, కాకపోతే హఠాత్తుగా వాళ్ళింటికి నిప్పంటుకుని ఉండచ్చు; లేదా హాస్పిటల్‌లో పరీక్ష చేసినప్పుడు నిలవ ఉన్న ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం చెడిపోయిందని తెలిసిందేమో.” అని అనుకున్నాడు.

తన నుదురు మరోసారి రుద్దుకున్నాడు. తలనొప్పి ఎక్కువైపోతోంది. బయట ఈదురుగాలి మరింత ఎక్కువయింది. భార్య మరోసారి గుర్తొచ్చింది. ఆమె ప్రతీ రోజు రాత్రి పదకొండు గంటల కల్లా నిద్రబోతుంది. వార్తలు వినదు. ప్రతీ చలికాలంలోను తన కార్‌ని గరాజ్‌లో భద్రంగా పెడుతుంది. ఆమె కంటే ముందు రోజు పొద్దున్నే నిద్ర లేచి, ఆ చలిలో బయటికెళ్ళి కారు మీద మంచు గీకి, వేడి చేసుకుని ఆఫీసుకెళ్ళాల్సింది తనే అయినా కూడా.

“వాళ్ళ నాజూకుదనం చూసి మోసపోవద్దు” అన్నాడు వాళ్ళ నాన్న అతనితో ఒకసారి. “డాక్టర్ల గదిలో వేచివున్న ఆడవాళ్ళ సంఖ్య కంటే సమాధులలో ఉన్న మగవారి సంఖ్య రెండింతలు ఉంటుంది”

“ఆయనకేం తెలుసని అలా తిట్టడానికి? ఆయన ముగ్గురు భార్యలని సమాధి చేసాడు. పుట్టిన పిల్లల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. తన ఎనభై ఎనిమిదో ఏట గుర్రపు స్వారిలో మజా చేస్తూ, కాలు జారిపడి చనిపోయాడు. ఒకసారి తను “నాన్నా, నీ జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి, నీకేమీ పట్టినట్లు లేదా?” అని తండ్రిని అడిగితే, “నువ్వు చాలా విషయాలకి బెంగపడతావురా” అన్నాడాయన. అతనికది నిజమేననిపించింది. “నా తోటివాళ్ళలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంది తాజా గణాంకాలని గమనిస్తే, క్విబెక్‌లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎనభై శాతం మంది మగాళ్ళేనని తెలుస్తుంది.” అని అనుకున్నాడు.

బయట మేపుల్ చెట్టు కొమ్మలు మరింత గట్టిగా విరిగిపోయేంతగా ఊగుతున్నాయి.

“ఆ ప్రకటన బహుశా ఏ ఆత్మహత్య కేసుకో సంబంధించినదై ఉంటుంది. ఎక్కువమంది చలికాలం అయిపోయే ముందు రోజుల్లో మణికట్లు కోసుకుంటారట. ఎందుకు కోసుకోరూ? అయిదునెల్లపాటు ఈ చలినీ, ఈ పొడుగు రాత్రులనీ, ముసురు బట్టిపోయిన ఆకాశాన్ని చూసి చూసీ, చివరికి మదర్ థెరెసా అయినా సహనం పోయి కిటికీలోంచి దూకేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరుద్యోగం, హింస, పస్తులు, తీవ్రవాదుల దాడులు, ఆర్ధిక మాంద్యం, ఆమ్ల వర్షాలు, సామూహిక హత్యాకాండ, స్టార్‌వార్స్ రక్షణ వ్యవస్థ, ఇలాంటివన్నీ పక్కన పెట్టినా ఈ చలి బాధ తప్పదు. అయితే మన ప్రియమైన వైద్య వ్యవస్థ మాత్రం – ఇంత నిరాశతో చద్దామని చూసేవారికి ఓ పైంట్ రక్తం ఎక్కిస్తే వారి జీవితం ఆనందమయం అవుతుందని భావిస్తోంది. అయ్యోరామ! వారు రక్షిద్దామని ప్రయత్నిస్తున్న వ్యక్తి బతికి బయటపడ్డాక, నన్నెందుకు బతికించారంటూ వారిని తిట్టుకోకుండా ఉంటాడా? వాళ్ళకి ఆ మాత్రం వివేకం లేదా? ఈ సారి చేయి కోసుకోడానికి ప్రయత్నించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాడని గ్రహించరెందుకు? కానీ పాపం మన వైద్యులు మాత్రం రోగి బాధపడుతుంటే చూడలేరు. తాము తీసుకుంటున్న ఘనమైన జీతాలకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తారు లేదంటే తమ సొంత ప్రతిష్టని పెంచుకోవాలని చూస్తారు. ఇలాంటి అపరబ్రహ్మలకి తోడుదొంగగా నేను ఉండాలా?” అనుకున్నాడు.

హఠాత్తుగా అతని కళ్ళ ముందు ఊగిసలాడుతున్న బోడి చెట్టు కొమ్మలు – ఎక్కడో ఆఫ్రికాలోనో లేదా గాంధీ ఉపఖండంలోనో తీసిన ఓ డాక్యుమెంటరీలో, ఎముకల గూడులా ఉన్న చిన్న పిల్లాడిని అతనికి గుర్తు చేసాయి. గాంధీ గురించి ఆలోచించాడు. గత ఎనిమిది నిముషాలుగా తన ధోరణి పట్ల తనకే చిరాకు కలిగింది. గబగబా బాత్‌రూంకి పరిగెత్తాడు. రెండు ఆస్ప్రిన్ బిళ్ళలు మింగాడు. తనపై తనకి కాస్త గర్వం కలిగింది. ఫోన్ అందుకుని టాక్సీ కోసం ఫోన్ చేసాడు.

తన చిరునామా చెబుతుండగా, తను రక్తదానం చేయడానికి పనికిరాననే సంగతి అతనికి స్ఫురించింది.

అతను చివరిసారిగా రక్తదానం చేసి ఇరవై ఏళ్ళయింది. కానీ ఆ సందర్భంలో రక్తం తీసుకోడానికి ముందుగా నర్స్ అతడిని ఎన్నో ప్రశ్నలు అడగడం అతనికి గుర్తుంది. ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న గత ఇరవై నాలుగు గంటలలో అతనేమయినా తలనొప్పికి గానీ వేరే రకమైన మందులు గానీ వాడారా అని! ఈ ప్రశ్న ఎందుకడిగిందా అని అతను ఆలోచించాడు. అంతలో అతనికి జవాబు దొరికింది – ‘రక్తదానం చేసేవారు రక్తం ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటల ముందుగా ఎటువంటి మందులు గానీ ఉపయోగిస్తే, అటువంటి వారి రక్తం రోగికి పనికిరాదు.’

కోపంతో ఫోన్ పెట్టేసాడు. “నేనో మందమతిని, ఈ సంగతి ముందే ఎందుకు గుర్తు చేసుకోలేదు?” అనుకుంటూ తనని తాను తిట్టుకున్నాడు.

కాసేపయ్యాక: “ఈ ప్రకటన విన్న వాళ్ళలో ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉన్నది నేనొక్కడినే అయ్యుండనేమో.”

నుదురు చిట్లించి, తన పరిచయస్తులలో ఎవరికైనా ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉందేమో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు. ఎవరి పేరయినా తడితే, వెంటనే సెయింట్ ల్యూక్ ఆసుపత్రికి వెళ్ళమని చెబుదామనుకున్నాడు. కానీ ఎవరూ గుర్తు రాలేదు. అతను ఆశ కోల్పోలేదు.

“ఈ ప్రకటన విన్నది నేనొక్కడినే అయ్యుండను. మాంట్రియల్లో కనీసం పది శాతం ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం వున్నవాళ్ళయితే వారి సంఖ్య దాదాపుగా రెండు లక్షలుంటుంది. వాళ్ళలో కనీసం ఒక్క శాతం మంది రేడియో ప్రకటన విన్నా, రెండువేల మంది దాతలు దొరికినట్లే.”

కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.

తదుపరి సన్నివేశం – గాంధీ గారి అంత్యక్రియల దృశ్యం నడుస్తుండగా అతను తన సహోద్యోగి బాబ్‌ని తలచుకున్నాడు. వెంటనే ఓ కపటమైన నవ్వొకటి అతని పెదాలపై వెలిసింది. తను పోగొట్టుకున్న అయిదు డాలర్లను రాబట్టుకునే మార్గం – ఊహూ, అంతకంటే ఇంకా ఎక్కువే, దానికి రెట్టింపు పొందే ఉపాయం అతనికి తట్టింది. సోమవారం ఆఫీసుకి వెళ్ళగానే బాబ్‌తో పందెం వేస్తాడు. “బాబ్, ఓ ప్రశ్న అడుగుతాను. నువ్వు మూడు సార్లు ప్రయత్నించి సరైన జవాబు చెబితే నీకు పది డాలర్లు ఇస్తా. ప్రశ్న ఏంటంటే : పది నిముషాలలో తేలికగా, సంతృప్తికరంగా ఓ పౌండ్ బరువు తగ్గడం ఎలా?” అని అడుగుతాడు. ఈ ప్రశ్నకి జవాబు తెలియని బాబ్ నోరెళ్లబెడతాడు. అప్పుడు అతను బాబ్‌ని వెక్కిరిస్తూ, “ఓరి దద్దమ్మా, ఓ పైంట్ రక్తం దానం చేస్తే సరి” అని అంటాడు.
----------------------------------------------------------
రచన: కొల్లూరి సోమ శంకర్ 
మూలం: పాన్ బూయూకాస్
ఫ్రెంచ్ మూలం – లె అద్మిరాచుర్ దె గాందీ. రచయిత: పాన్ బూయూకాస్. ఈ అనువాదానికి పాల్ కర్టిస్ డా (Paul Curtis Daw) ఆంగ్లసేత “Gandhi’s admirer” ఆధారం.
ఈమాట సౌజన్యంతో

Saturday, January 26, 2019

70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
భారతరాజ్యాంగ నిర్మాతలకు
భారతదేశ ప్రజలకు
70 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Friday, January 25, 2019

వెలుగు


వెలుగు




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి..................

కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను.

ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను. నా అపాయింట్‌మెంట్ టైమ్‌కల్లా రిసెప్షన్‌లో ఉండాలి. అందుకు ఇంకా ఐదు నిముషాలు టైమ్ మాత్రమే ఉంది. ఆ హాస్పిటల్‌లో పార్కింగ్‌కి ఐదు ఫ్లోర్లున్నాయి. కానీ ఎక్కడా ఖాళీల్లేవు. పార్కింగు కోసం వెతుకుతూ కార్లు చక్కర్లు కొడుతున్నాయి. నేను కూడా కొన్ని రౌండ్‌లు తిరిగి ఒక ఖాళీ చూసి నా కార్ పార్క్ చేసి డాక్టర్ దగ్గరకు పరుగుతీశాను. ఆ తొందర్లో కారు ఎక్కడ పార్క్ చేశానో, ఆ పార్కింగ్ స్లాట్ నెంబర్ ఏంటో చూసుకోలేదు.

అది మధ్యాహ్నం రెండు గంటల సమయం. నేను డాక్టర్‌ని కలిసి తిరిగి వచ్చేసరికి కారెక్కడ పార్క్ చేశానన్నది గుర్తు రావడంలేదు. ఏ ఫ్లోరన్నది, ఏ వింగ్, ఏ స్లాట్ అన్నది కూడా గుర్తు లేదు. నా చేతిలో ఉన్న రిమోట్ తాళంతో నొక్కి ఎక్కడైనా హెడ్‌లైట్స్ వెలుగుతాయా అని నెమ్మదిగా ఒక్కో వరసా చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడిలా రాస్తున్నాను గాని, నిజానికి అప్పుడు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఒక క్రమమంటూ లేకుండా వెతుకుతూ తిరిగాను. కారు కనిపించలేదు.

అలా రిమోట్ తాళం చెవిని సెకండుకొకసారి నొక్కుకుంటూ తిరుగుతున్నప్పుడే చూశాను ఆ ఇంగ్లీషు జంటని. భార్యని వీల్‌చెయిర్‌లో కూర్చోబెట్టి తోసుకుని వెళ్తున్నాడు. అతనికి సుమారు 45 ఏళ్ళుంటాయి, ఆమెకు ఒక రెండు మూడేళ్ళు తక్కువుండచ్చు. ఆమెను ఉత్సాహపరిచేందుకు గట్టిగట్టిగా ఏవో చెప్పుకుంటూ నడుస్తున్నాడు. ఆమె ఒకప్పుడు మంచి అందగత్తె అయుండొచ్చు. ఇప్పుడు మాత్రం చిక్కిపోయి 70 పౌండ్‌ల బరువుతో వీల్‌చెయిర్‌లో సగం కూడా నింపలేకపోతోంది ఆమె దేహం. ఆమె తల ఒక పక్కకి వాలిపోయివుంది. జుత్తు చాలామటుకు రాలిపోయింది. భర్త చెప్పినదాన్ని విని నవ్వే ప్రయత్నం చేస్తూ ఉంది. నన్ను దాటుకుని హాస్పిటల్ ఎంట్రన్స్‌ వైపుకి వీల్‌చెయిర్ నడుపుతూ వెళ్ళిన ఆ మనిషి నేను తాళం చెవి నొక్కుతూ కార్‌ వెతకడాన్ని గమనించి,

“కార్ తప్పిపోయిందా?” అనడిగాడు.

“కార్ అక్కడే ఉంది. నేనే తప్పిపోయాను,” అన్నాను.

ఓ నవ్వు నవ్వి, “వెతకండి దొరుకుతుంది. మీరు కుక్కనో, పిల్లినో పోగొట్టుకోలేదు. అవైతే తప్పిపోయినచోటే ఉండవు. కాళ్ళున్న జీవులు కదా, వెతికిపట్టుకోవడం కష్టం. మీ కార్ కదలకుండా మీరు పార్క్ చేసిన చోటే ఉంటుంది. కనిపెట్టేయగలరు,” అని చెప్పి వీల్‌చెయిర్ తోసుకుంటూ వెళ్ళిపోయాడు.

నేను నా వెతుకులాట కొనసాగించాను. ఒక గంటసేపు పైనా కిందా అన్ని ఫ్లోర్‌లలోనూ వెతికినా కార్ దొరకలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఒక పిల్లర్‌కి పక్కన కుడివైపు పార్క్ చేసినది మాత్రం గుర్తుంది. ఇప్పుడు కుడివైపు పిల్లర్లున్న స్లాట్‌లు మాత్రం వెతుకుతూ, రిమోట్ బటన్ నొక్కుకుంటూ వచ్చాను. ఎక్కడా హెడ్‌లైట్‌లు వెలగలేదు. అంత పెద్ద పార్కింగ్ లాట్‌లో ఐదు ఫ్లోర్లలో అటూ ఇటూ తిరిగి నా కాళ్ళు అలసిపోయాయి. పార్కింగ్ లాట్‌ ఉద్యోగి దగ్గరకెళ్ళి నా పరిస్థితిని వివరించాను. అతను అది రోజూ జరిగే ఒక సాధారణ విషయంలా తేలిగ్గా తీసుకుంటూ నాకేసి చూసి, “క్షమించండి. ఇప్పుడు విజిటర్స్‌ను వదిలి రాలేను. ఇంకో గంటలో నా డ్యూటీ అయిపోతుంది. అప్పుడు వచ్చి మీకు సాయపడగలను,” అన్నాడు.

మళ్ళీ నా అన్వేషణ కొనసాగించాను. మరోగంట సమయం వెతికుంటాను. బయట ఒక అడుగు ఎత్తున మంచు కురిసి ఉంది. ఇంతలో, ఇందాక నేను చూసిన వీల్‌చెయిర్ అతను తిరిగొచ్చాడు. ఇప్పుడు వీల్‌చెయిరూ లేదు, భార్యా లేదు. నన్ను చూసి నవ్వి,

“ఇంకా వెతుకుతున్నారా?” అనడిగాడు.

“కారు ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే ఎక్కడో ఉంది,” అన్నాను.

అతని భార్యకి డాక్టర్‌లు పరీక్షలు చేస్తున్నారు. ఇంటికెళ్ళి ఏవో కొన్ని సామాన్లు తీసుకురావాలి- అని చెప్పి తన కారు వైపుకు వెళ్ళిన అతను మళ్ళీ వెనక్కొచ్చాడు.

“ఏం కారు?” అడిగాడు. చెప్పాను. “ఏం రంగు?” చెప్పాను. “ప్లేట్ నెంబర్?” అదీ చెప్పాను.

కారు తాళాలు తీసుకున్నాడు. అతను రిమోట్ తాళం నొక్కుతూ ఒక వైపునుండి వస్తే నేను మరో వైపునుండి చూస్తూ అతని వైపుకి నడిచాను. ఇలా పదినిముషాలు వెతగ్గా ఒక పిల్లర్ పక్కన కార్ హెడ్‌లైట్ మిణుకు మిణుకుమంటూ కనిపించింది.

“అదే! అదే!” అని అరిచాను.

అతను తాళం చెవి నా చేతికిచ్చాడు. ధన్యవాదాలు చెప్పాను. అతని పేరడిగాను.

“నా పేరు తెలుసుకుని ఏం చేస్తారు?” అనడిగాడు.

“మీకు ప్రతి ఉపకారం ఏమీ చెయ్యలేనేమోగానీ, కనీసం మీ పేరైనా గుర్తుపెట్టుకుంటాను,” అన్నాను.

“నోమ్” అన్నాడు.

“మీ భార్య త్వరగా కోలుకుని ఇంటికి వస్తారు.”

“ఇక రాదు.” అన్నాడు. అతని ముఖకవళికలు మారిపోయాయి. ఎందుకు చెప్పానా అన్నట్టు అయిపోయిందతని ముఖం.

నాకు వీపు చూపి తన కారు వైపుకి నడుస్తూ వెనక్కి తిరక్కుండానే చేయెత్తి ఊపుతూ వీడ్కోలు చెప్పాడు.
---------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్ 
మూలం: ఎ. ముత్తులింగం
[మూలం: ‘వెళిచ్చం’ 16 నవంబర్ 2010 ‘సొల్వనం’ అన్న ఆన్‌లైన్ పత్రికలో వెలువడిన కథ], 
ఈమాట సౌజన్యంతో

Thursday, January 24, 2019

ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము


ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము




సాహితీమిత్రులారా!

ఈ అనువాద లేఖను ఆస్వాదించండి...........

(1910 – భారతి మాసపత్రిక , సాధారణ సంవత్సరాది సంచికనుండి)

[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలు లో 1877 లో జన్మించారు. భువనగిరి, నాగపూర్లలో విద్యాభ్యాసం. సంస్కృతం, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. చరిత్ర పరిశోధకులుగా ప్రసిద్ధికెక్కారు. మహమ్మదీయ మహాయుగం, హిందూమహాయుగం, శివాజి, హైందవ చక్రవర్తులు అన్న గ్రంథాలు రాశారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల స్థాపించి, భౌతిక శాస్త్రం, దేశ చరిత్రలపై పుస్తకాలు ప్రకటించారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పేరుతో తెలుగులో మొట్టమొదటి ఎన్‌సైక్లోపీడియా మూడు సంపుటాలు ముద్రించారు.

ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం ఆయన 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు  పాఠకులు గుర్తించగలరు. లక్ష్మణరావు గారు 1923 లో మరణించారు]

ఔరంగజేబునెడల నెన్ని దుర్గుణములున్నను అతడు గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యమును, లౌకికవ్యవహార జ్ఞానమును, దూరదృష్టియు గలవు. అతని యక్షరములు ముత్తియములవలె ముద్దులమూట గట్టుచుండెను. తనయొద్దకు బంపబడిన ముఖ్యమైన యర్జీల కన్నిటికిని, అతడు స్వహస్తముతో బ్రత్యుత్తరములు వ్రాయుచుండెను. అతనికి చిన్ననాడు చదువు చెప్పిన ముల్లా సాలె అనునతడొకప్పుడు తనకు గొప్పయుడ్యోగ మీయుమని యర్జీ పంపగా, అందుకు బాదుషహా ఈ క్రింది విధమున బ్రత్యుత్తర మంపెను.

” మీరు నాకు అనావశ్యక మైనట్టి అరబ్బీభాష నేర్పుటయందు పెక్కు సంవత్సరములు నిరర్థకముగ గడిపి కోమలమైన నా బుద్ధిని, తీక్ష్ణమైనట్టి నా స్మరణశక్తిని వ్యర్థపుచ్చితిరి. జీవితమునందెన్నడును ఉపయోగపడని భాష రాజపుత్రులకు నేర్పుటకు పది పన్నెండు వత్సరములు వెచ్చించుటయు, ఆభాషయందు నన్ను వైయాకరిణిగను, ధర్మశాస్త్ర జ్ఞు నిగను చేయ యత్నించుటయు నెంత హాస్యాస్పదములు. ఉపయోగమైన విద్యలును, జ్ఞానమును బాలకులకు వారి వారి బుద్ధిననుసరించి చిన్ననాడు నేర్పుటయందు కాలము గడుపుటకు మాఱుగా మా గురువులవారగు మీరు మా బాల్యమును వ్యర్థపుచ్చితిరిగదా! అయ్యో! భూగోళజ్ఞానమా ఏమియును లేదు. పోర్చుగలు, హాలండు, ఇంగ్లండు మొదలగు దేశములు కొన్ని కలవనియు, అవి ఆయా స్థలము లందు కలవనియు, నాకు నేర్పితిరా? ఆ దేశములు ద్వీపములా, ద్వీపకల్పములా, సమభూమియందున్నవా, లేక ఎత్తుస్థలములందున్నవా యన్న సంగతులు నాకు తెలియ వలదా? చీనా, పారసీకము, పెరు, తార్తారి మొదలైనదేశముల రాజులు హిందూదేసపు బాదుషహా పేరువిని గజగజ వణికెదరని నా ఎదుట మీరు చేసిన ముఖస్తుతి వలననే దేశ దేశ చరిత్రములన్నియు నాకు తెలిసినవనుకొంటిరా? ఈ జగత్తుమీదనున్న వేరువేరు రాజ్యములెవ్వి? అందలి ఆచారవిచారములు, రాజ్యవ్యవహారములు, మతములు నెట్టివి? ఆ యా రాజ్యములను గల సంపత్తులును, విపత్తులును, ఆ యాదేశము సంపద్విపత్తులలో, ఆ దేశస్థు ల యొక్క ఏ యే గుణావగుణములవలన ఎట్టి యెట్టి మార్పులు గలిగినదియు, ఎట్టి మహత్కారణములచే గొప్పరాజ్యములు తలక్రిందగునదియు అను మహద్విషయములు చరిత్రాధ్యయనములేకయే మా కెట్టుల తెలియ గలవు? ఈ విషయములు మాకు నేర్పితిరా?

రాజపుత్రులు పైని వర్ణింపబడినట్టి యత్యంతావశ్కములగు వివిధ విషయములను నేర్చుకొని జ్ఞానసంపన్నులై తమ బుద్ధిని వికసింపజేయవలయును. కావున రాజపుత్రులయొక్క జ్ఞార్జనకాలమగు బాల్యదశయందలి యొక్కొక్క క్షణము మిక్కిలి విలువ గలదియని యెఱింగి నా బాల్యదశను మీరు చక్కగ వినియోగపఱచితిరా? మీరు నాకు లేనిపోనట్టియు, బుద్ధినిభ్రమింపజేయునట్టియు లౌకికవ్యవహారమునకు నిరుపయోగకరమైనట్టియు పరభాషాజ్ఞానము గఱపుటయందే కృతకృత్యులమైతిమని తలంపలేదా? మొదట పరకీయ భాషనొకదానిని నేర్పి దాని మూలముగా శాస్త్రములు, ధర్మవివేచనము, న్యాయనీతి మొదలైన యావశ్యకములైన విద్యలనేర్పుట సులభమని తలంచితిరా? ఈయావశ్యకములగు విద్యలన్నియు మీరు నాకు నామాతృభాషలోనే నేర్పియుండకూడదా? “నేను ఔరంగజేబునకు తత్త్వజ్ఞానశాస్త్రమును నేర్పెదను” అని మీరు నా తండ్రియగు శహజహాను బాదుషహా గారితో వొకప్పుడనియుంటిరి. మీ రనేకసంవత్సరములకు బ్రహ్మ, ఆకాశము, ఖటపటములు, మొదలైన నీరస శబ్దములచే నేదోయొక విషయము నాకు బోధింప యత్నించినట్లు నాకు జ్ఞాపకమున్నది. ఆ విషయమును గ్రహింపవలయునని నేను పెక్కు పర్యాయములు యత్నించితిని. కాని యందువలన నా జ్ఞాన భాండారమునకును, రాజ్యకర్తృత్వమునకును, ఏమి లాభము కలిగినది? మీరి తేప తేప యుచ్చరించుచున్నందున నీరసములును, పలుకుటకు కఠినములును అగు ఖటపటాది పదములు కొన్ని నాకు జ్ఞాపకమున్నవి. కాని వానితోసంబంధించిన, విషయచర్చ మాత్రము నేను ఎప్పటిదప్పుడు మర చిపోవుచుంటినని మీఱెరుగరా? నేడు ఆవిషయచర్చ జ్ఞాపకమున్నను దాని వలన నాకు ప్రయోజనమేమి? ఇట్లు మీరు కోమలమైనటువంటి నా బుద్ధిని, చురుకుదనమును, వ్యర్థము చేసితిరిగాదే?

నిజముగా నిరుపయోగములైనను మీరు ఆవశ్యకములని తలచిన ఈ విషయములు మీరు నాకు నేర్పినందున మీకు మాత్రమొక లాభము కలిగినది. మూఢులును, అజ్ఞానులును అగు మావంటివారికి మీరు సర్వజ్ఞులనియు, సర్వశాస్త్రపారంగతులనియు, అత్యంతపూజ్యగురువర్యులనియు, నిరథకగౌరవభావమును కొంతకాలమువఱకు పుట్టింపగలిగితిరి. అందువలన పెక్కుదినములవఱకు మీ మాటను మేము మన్నించుట తటస్థించెను. రాజులను వ్యర్థముగా స్థుతించుట, సత్యమును తలక్రిందు చేయుట, నక్కవినయములు నటించుట యను గుణములు మాత్రము మీయందు చక్కగ వసించుచున్నవి. మిమ్ముల నేను నారాజసభయందు, ఒక సరదారునిగ నియమింపవలయునని మీరు కోరితిరిగదా. మీ యొక్క ఏ గుణమును జూచి నేను మీకాపదవినొసగవలయును? మీరు నాకు రాజకీయ, సైనిక, వ్యావహారికవిద్యలలో నేవిద్య నేర్పితిరని మిమ్ములను నేను గౌరవింతును? నన్ను నావశ్యకములైన విద్యలలో బారంగతునిజేసి యుండిన యెడల సికందరు (అలెగ్జాండరు) బాదుషహాకు పరమపూజ్యగురువర్యుడగు మహావిద్వాంసుడైన అరిస్టాటుల్‌ ఎడలగల పూజ్య భావమునే చూపియుందును. అట్టి యుపయోగకరములగు శిక్షణ గాని లాభకరములగు విద్యలనుగాని నేను మీవలన బడయలేదు. కావున మీ విషయమై గౌరవముగాని, పూజ్యభావముగాని నాకు లేదు. మీరు వచ్చిన త్రోవనే వెళ్ళుడు. మీ పల్లెటూరిలోనే దేవుని స్మరణ చేసికొనుచు కాలము గడుపుడు. మీరు నారాజసభలో ప్రవేసింపకూడదనియు, మీరెవరో ఇచ్చటివారెవరికిని తెలియకూడదనియు నా యభిప్రాయము.”

ప్రస్తుతకాలమందు బాలబాలికా విద్యను గుఱించియు, జాతీయవిద్యను గుఱించియు మనదేశమందు కొంత యత్నము జరుగుచున్నది. ఇందును గుఱించి పాటుపడుతున్న మహనీయులకీ యుత్తరములోని రెండుమూడు సంగతులాదరణియములు. బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగానుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రదము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాషవచ్చిన తరువాత, ఆభాషలో శాస్త్రములనభ్యసించుటకంటె మొదటనుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును. ఇప్పుడు మనదేశమందు ఇంగ్లీషువారి ప్రభుత్వమున్నందునను, ఇంగ్లీషుభాషలో గ్రంథభాండార మసంఖ్యముగ నున్నందునను ధనము గలవారు కొందఱా భాషనభ్యసించుట యావశ్యకమే. మేము వలదనము. కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషాప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.

జ్ఞానార్జనమార్గము లన్నియు పరభాషయొక్క యధీనమునందుండిట కంటె దేసము పాలించి మూర్తీభవించిన యజ్ఞానాంధకారము మఱొకటి కలదా? కావున స్వభాష మూలముననే జ్ఞానార్జనము చేయవలయునని ఔరంగజేబు నుత్తరములో నున్న విషయమును నా జాతీయపాఠశాలాధ్యక్షులు గమనింపవలెను. అట్లు చేయక వారు ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు.
-----------------------------------------------------------
రచన: కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, 
మూలం: ఔరంగజేబు, ఈమాట సౌజన్యంతో 

Wednesday, January 23, 2019

ఏనాడూ విడిపోని ముడి వేసెనె


ఏనాడూ విడిపోని ముడి వేసెనె



సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి................

One of those nights!
మంచం ఒకటే అయినా నీ-నా పక్కలంటూ సరిహద్దులు పుట్టుకొచ్చే రాత్రి. ఇరువైపులా సైన్యాన్ని మోహరించి, కాల్పులకు సిద్ధంగా ఉండే రాత్రి కాదు. కయ్యానికి కాళ్ళుదువ్వననీ, సరిహద్దులను గౌరవిస్తాననీ కుదురుకున్న సంధిని ఉల్లంఘించలేని రాత్రి. తాను సత్య అయినా అతడు సముద్రాలు దాటి, యుద్ధాలు ముగించి వచ్చేవరకూ సీతలా వేచిచూడాల్సిన రాత్రి.

అతడు మంచానికి అటు చివర పడుకునున్నాడు, నల్లరగ్గు ముసుగులో. ఇంకా నిద్రపోయినట్టు లేడు. ఎలా పోతాడు? నిద్ర పట్టేంత సుఖమే అతనికుంటే, ఆ నల్లరగ్గెందుకు ఉంటుంది? ఆమె చడీచప్పుడూ లేకుండా మంచానికి ఇటు చివర పడుకుంది. అంత అలసటలోనూ ఇది ఇక నిద్రరాని రాత్రని తెలుస్తూనే ఉంది.

ఆఫీసునుండి వచ్చాక మాడిపోయున్న అతడి మొహం చూసి, ‘ఏమయ్యిందని?’ నిలదీసి, ‘ఏం లేద’న్న సమాధానాన్ని నమ్మలేక, నమ్మినట్టు నటించలేక, అంతకు మించిన సమాధానం అతనినుంచి రప్పించలేక, అర్థరాత్రి దాటేవరకూ పని నెపంతో లాప్‍టాప్ ముందు కూర్చొని కీబోర్డు మీద అసహనాన్ని అంతా చూపించి, మనసూ శరీరమూ అలసిపోయి అప్పుడే గదిలోకి వచ్చిందామె.

దుప్పటి గుండెలదాకా కప్పుకొని చీకటి గది నాలుగువైపులకూ చూసింది – అటుకీ ఇటుకీ పైకీ పక్కకీ. అతడు మూగబోయినప్పుడల్లా, చిత్రంగా ఈ గది కూడా మూగబోతుంది. బహుశా, అతడితో దానికి అలాంటి సంధి కుదిరిందేమో. పెళ్ళై కొత్తగా ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు —

“నీకో విషయం చెప్పనా? నువ్వు నవ్వినప్పుడల్లా ఈ గదికూడా నవ్వినట్టనిపిస్తుంది.” అంది. ఆమె చెవిలో పూర్తవ్వబోతున్న అతడి మునపటి నవ్వులోంచి మళ్ళీ కొత్త నవ్వు మొదలయ్యింది.

“రహస్యం కనిపెట్టేశావన్నమాట.” చెవిలో గుసగుసలాడాడు. అంతలోనే దూరంగా జరిగి, రెండు చేతులూ చాచి – “Welcome to the sorcerer’s world, My Lady! Anything and everything, you wish for!” అని వినయాన్ని నటిస్తూ ఓ మోకాలి మీద కూర్చొని, చేయి అందిపుచ్చుకొని ముద్దుపెట్టుకున్నాడు.

అవును. అతడు మాయగాడు. మాటల మాంత్రికుడు. వశీకరణం తెల్సినవాడు.

ఇప్పుడు మాత్రం పక్కనే అతడు ఉన్నాలేనట్టే! ఉండి కూడా లేకుండా ఎలా పోతారు, మనుషులు?

క్రాస్‌వర్డ్స్‌లో కూర్చొని గంటలు గంటలు పుస్తకాలని బ్రౌజ్ చేయటం మొదలెట్టిన సాయంత్రాల్లో, అప్పటికి ఇద్దరికీ తెలియని మిలన్ కుందేరాను కనుక్కున్నారు. కలిసి చదవటమనే ప్రయోగం మొదలెట్టిన మొదటి పుస్తకంలో, వంతులవారిగా పైకి చదువుతున్నప్పుడు, “కంటిముందున్న మనిషి మీద బెంగెలా పుట్టుకొస్తుంది?” అని ఉన్న వాక్యాన్ని అతడు…

ఆ వాక్యమేమిటో వెంటనే గుర్తురాక, దిండు పక్కనే పెట్టుకున్న తన ఫోన్‍ తీసుకొని, గూగుల్ చేసింది.

“How could she feel nostalgia when he was right in front of her? How can you suffer from the absence of a person who is present?”

How can you? How can you? — చదవటంలో అతడు తీసుకొచ్చిన నాటకీయతను నిజమనుకొని, ఏదైనా గొప్ప సమాధానం ఇచ్చి ఇంప్రెస్ చేద్దామనుకొంది. కానీ ఏం తోచలేదు ఆ క్షణాల్లో. తనని ఇంప్రెస్ చేయడానికి అతడిమీదా అంతే ప్రెజర్ ఉందని ఇంకా గ్రహించని రోజులవి.

ఇంకా అదే వెబ్ పేజ్‍లో తచ్చాడుతుంటే కనిపించిన మరో వాక్యం: “You can suffer nostalgia in the presence of the beloved if you glimpse a future where the beloved is no more.”

అప్పుడు కాదు. ఇప్పుడు అడిగితే బాగుణ్ణు, అతడు, How can you? అని. తను సమాధానంతో సిద్ధంగా ఉంది:

You can suffer nostalgia in the presence of the beloved when you know he isn’t yours. Worse, when you know he isn’t his. Though in his arms, you still pine for him, when you know he alone is being engulfed by a monster, unknown to you. I suffer with you. I suffer from you. Can you listen? Damn you!

అతడు కప్పుకున్న రగ్గులోంచి కొన్ని నల్లటి ఊలు దారాలు గొంగళి పురుగుల్లా పాక్కుంటూ ఆమెవైపుకి రావడం అప్పటికే మొదలయింది. ఆమె శరీరం పైకి మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాయి కొన్ని. కొన్ని ఆమె బట్టల మీదనుంచి, మరికొన్ని బట్టల మడతల్లోంచి లోపలికి. వాటిని పక్కకు తోసేయాలనో, లేచి పక్కకు వెళ్ళిపోవాలనో ఆమె ప్రయత్నించలేదు. ఆ రగ్గులో ఆమెకు ఎటూ చోటు లేదు, కనీసం ఇలా అయినా సరిపుచ్చుకుందామనుకుంది మొదట్లో. అదే అలవాటైపోయింది. అదేం విచిత్రమైన అలవాటో, అలవాటైనా కానట్టే ఉంటుంది. అప్పజెప్పగలిగిన పాఠమే అయినా, పరీక్షల సమయంలో మర్చిపోయినట్టు.

గొంగళి పురుగుల్లా ఆమెపై పాకుతున్న నల్లని దారాలలో కొన్ని ఆమెపై అల్లుకుంటున్నాయి. కొన్ని ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి తాళ్ళలాగా మారి ఆమె కాళ్ళనీ, చేతులనీ కట్టేస్తున్నాయి. కుదిరితే సముద్రంలోనో, కుదరకపోతే కనీసం స్విమ్మింగ్ పూల్‍లోనో దిగాలని ఆమెకు బలంగా అనిపించింది. అతడు తోడుంటే ఇంకా బాగుంటుందని అనిపించింది.

ఆమె పాదాలకు ఇసుకంటుకుంది. గాలికి జుట్టు ఎగిరిపోతోంది. ఆమె సముద్రం ఎదురుగా, అతడితో… పరిచయం ప్రణయమవుతున్న రోజుల్లో, ఒకరి ఒడిలో మరొకరు ఒదిగిపోవటం మామూలైన క్షణాల్లో.

“సముద్రమంటే నీకెందుకంత ఇష్టం?”

“ఇష్టమని ఎవరు చెప్పారు?” ఆ పూట సముద్రం కూడా అలానే ఉంది, చిరాగ్గా, పరాగ్గా.

“మరెందుకు ఇక్కడికే వచ్చి, దాన్నే అలా చూస్తుండిపోతావ్?”

అతడు బదులివ్వలేదు. అతడు పెట్టుకున్న కళ్ళద్దాలను తీసేసి, ఆ కళ్ళల్లోకి చూసింది. కళ్ళు చిట్లిస్తూ ఆమె చేతుల్లోంచి అద్దాలను అందుకోబోయాడు. ఆమె నిలువరించింది.

“నన్నేం చూస్తావు? సముద్రాన్ని చూడు.” కళ్ళద్దాలను వెనక్కి తీసుకున్నాడు.

“అదే చూస్తున్నాను.” అంది, కళ్ళల్లో సముద్రాన్ని చూస్తూ.

“సముద్రం ఎందుకంత అల్లకల్లోలంగా ఉందంటావ్?”

భుజాలు ఎగరేశాడు. ఆమె రెట్టింపు ఆసక్తితో చూసింది ఏం చెప్పబోతున్నాడో అని. అతడు చేసిన అలవాటే. తనకు సమాధానాలు తెలీని ప్రశ్నలకు కట్టుకథలు చెప్పేవాడు. అసలు జవాబులకన్నా అప్పుడవే ఆమెకు మరింతగా నచ్చేవి.

“ఏ దేవుడో ఇచ్చిన శాపమైయుంటుంది.”

ఆ పూట కథల ఖార్ఖానా కట్టేసుందని అర్థమయ్యింది. నీటిలోకి దిగిన పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఓ వైపు అలలు వేగంగా వస్తున్నాయి. పడుతున్నారు. నవ్వుతున్నారు. లేస్తున్నారు. మళ్ళీ పడ్డానికి సిద్ధపడుతున్నారు.

“నాకు దాన్ని దూరంనుండి చూస్తుంటేనే భయంవేస్తుంది. మీరంతా ఎలా ఈదుతారో, ఏంటో?” అతడేం మాట్లాడలేదు.

“ఒక మాట చెప్పు… నేనంటే భయంవేస్తే ఏం చేస్తావ్?” అడిగాడు కాసేపటికి. ఆమె సమాధానంగా, ఆ ఊహ కలిగించిన భయంతో అతడిని గట్టిగా కౌగిలించుకుంది.

“నన్ను వదిలిపోవుగా?” పోనని తలాడిస్తూ అతడినింకా గట్టిగా పట్టుకుంది. అతడి వీపును నిమిరింది.

శరీరం మీద పాకుతున్న గొంగళి దారాలు నెమ్మదించాయి. చుట్టుకున్న తాళ్ళు కొంచెం పట్టు సడలించాయి. ఒక్కసారి అవకాశమిస్తే, ఇప్పుడు కూడా అలా హత్తుకోగలిగితే, ఈ రాత్రి గడవడం పెద్ద విషయం కాదని ఆమె నమ్మకం. కానీ అతడు అందుకు ఒప్పుకోడు. తనలోని నలుపు ఆమెను నల్లగా మార్చటం అతడు భరించలేడు.

హత్తుకొని ఎంతో సేపు అలానే బీచ్‍లో ఉండిపోయేసరికి, ఆలస్యమవుతుందని బయటచేయాల్సిన డిన్నర్‍ను మానుకొని, ఆమె ఉంటున్న పి.జి. దగ్గర దిగబెట్టాడు. అతడి బైక్ శబ్ధం కనిపెట్టేసిన రూమ్మేట్, ఆమెను ఆట పట్టిస్తూ భోజనానికి పిలిచింది. చేతులు కడుక్కొని వస్తానని చెప్పి బాత్రూమ్‍లోకి వెళ్ళింది. లిక్విడ్ సోప్ చేతుల్లోకి పోసుకొని, ఏదో ఆలోచిస్తూ, చేతులు రుద్దటం మొదలెట్టింది. అలవాటు లేనిదేదో తగులుతున్నట్టు అనిపించి చేతులకేసి చూసుకుంది.

చీప్ క్వాలిటీ రగ్గులను ఎక్కువసేపు పట్టుకుంటే చేతులకి అంటుకునే పొడిపొడి ఊలులా, ఆమె చేతులకు ఏదో నల్లగా అంటుకొనుంది. ఎంతసేపు కడిగినా వదల్లేదు. ఆ పూటకు భోజనం స్పూన్‍తోనే కానిచ్చింది. గోరింటాకు ఆరకముందే నిద్రపోవాల్సి వచ్చినప్పుడు చేతులను ఓ మూలకి జాగ్రత్తగా పెట్టుకొని పడుకున్నట్టు పడుకుంది ఆ రాత్రికి.

మర్నాడు మీటింగ్స్‌లో మునిగిపోయిన అతడు తేలేసరికి రోజూ కలిసే సాయంత్రం వేళ అయ్యింది. మళ్ళీ బీచ్‍కే బైక్‍ని పోనిచ్చాడు. ఆ పూట వెళ్దామనుకున్న సినిమా గురించి గుర్తుచేసినా పట్టించుకోలేదు. బీచ్‍కు వెళ్ళినప్పుడల్లా దూరంగా కూర్చునే ఆమెను, ఆ పూట నీళ్ళల్లోకి తీసుకెళ్ళాడు. ఆమె రానురానని గోలచేసినా వినలేదు. ఆమెకు చచ్చేంత భయం వేసింది. “నన్ను నమ్ము. మళ్ళీ పుడతావు.” అని నూరిపోశాడు. ఆమె అతడిని నమ్మింది. అతడినే నమ్ముకుంది. అలసిపోయి మళ్ళీ గట్టుకు చేరాక —

“సముద్రమంటే ఎందుకు ఇష్టమని అడిగావ్ కదా నిన్న? ఇష్టం కాదు. అవసరం. అది ఇష్టాయిష్టాలకన్నా బలమైంది.”

నీళ్ళోడుతున్న బట్టల్ని పిండేసి, బైక్ మీద ఆరబెట్టుకోవటంలో బిజీగా ఉందామె.

“సముద్రంలో ఏదో మాజిక్ ఉంటుంది. అదేంటో తెలీదుగానీ…”

ఆమె తన చేతులు చూసుకుని గుర్తొచ్చినట్టుగా అతడికేసి చూసింది. అతడికి అర్థంకాక దగ్గరకొచ్చాడు.

“ఆ నలుపు నా వల్లే!”

“నీ మొహం. నువ్వేం చేశావ్? నిన్న మానిక్యూర్ చేయించుకున్నా, దాని సైడ్ ఎఫెక్టేమో!”

అతడు ఒప్పుకోలేదు. తనని తాను నిందించుకున్నాడు. ఎంతసేపూ తన వల్లే అంటాడు గానీ, ఎందుకో చెప్పకపోవటంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అతడు తప్పు చేసినవాడిలా తలవంచుకొని వెళ్ళిపోయాడు, ఆమెను వదిలేసి. కొన్ని రోజుల వరకూ ఫోన్లు ఎత్తలేదు. కొన్ని వారాలవరకూ కలవడానికి ఒప్పుకోలేదు. పరిస్థితి చేయి దాటి పోతుందని ఆమెకు భయం వేసింది. సంధించాల్సిన అస్త్రమే సంధించింది.

“ఓయ్! ఏం అనుకుంటున్నావ్ నా గురించి, నీ గురించి? తిరిగినన్నాళ్ళూ తిరిగి, ఇప్పుడు ఈ వంక చూపించి నన్ను వదిలించుకుందామనుకుంటున్నావా?” అన్న అర్థంలో నిలదీసింది, అనకూడనివి ఒకట్రెండు మాటలు కూడా కలిపి. వాటికి రెచ్చిపోయి, వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో అతడే మాట కదిపి, ముహూర్తం పెట్టించి, మూడు ముళ్ళూ వేశాడు.

ఆ మొదటి రాత్రి…

కాదు, కాదు. మొదటిరాత్రులు! ఎన్నో. ఆమె పున్నమై అతడిని మరిగించిన మొదటి రాత్రి. ఆమె తీరమై అతడిని లాలించిన రాత్రి. ఆమె అతడిలో స్నానాలాడిన మొదటి రాత్రి. ఆమె వానై అతడికే స్నానాలు చేయించిన రాత్రి.

ఆ మొదటి రాత్రి…

అతడు రగ్గు కప్పుకొని ముసుగు తన్నిన మొదటి రాత్రి. ఎందుకలా ఉన్నావని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. చెప్పుకుంటే బాధ తగ్గుతుందని బతిమిలాడినా వినలేదు. తన తప్పేం లేకపోయినా తనను నిందించుకుంది, తనను వారించడానికైనా ఏమైనా చెప్తాడన్న ఆశతో. లాభం లేకపోయింది. అతడి చుట్టూ పుట్టుకొస్తున్న కనిపించని గోడలని కన్నీటితో కరిగించాలని చూసింది. అవ్వడానికి అది తనగది కూడా అయినా, చెప్పుకోవడానికి అతడు తనవాడే అయినా, పరాయిదానిలా, చేతకానిదానిలా ఓ మూలకు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చింది.

అతణ్ణి కప్పుకున్న రగ్గు లాగేయబోయింది అలాంటి ఎన్నో రాత్రుల్లో. కుదరలేదు. తర్వాత ఒక రాత్రి తెలివిగా, రగ్గు ఒక చివర బలమంతా ఉపయోగించి కొద్దిగా చించి, దారపు పోగులను లాగేస్తూ పోయింది. తీసేకొద్దీ వస్తూనే ఉన్న దారాలు. అవి అలా వస్తూనే ఉండడంతో ఆమెకు ఆశ్చర్యం, అంతకంటే ఎక్కువగా భయం కలిగాయి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే, ఆమెకు తెల్సివచ్చిన విషయం — సమస్య పైన కప్పుకునే రగ్గు కాదని, అది కేవలం లోపలి దారాలు దాచటానికి మాత్రమేనని.

అతని ముఖంలో ఏ మార్పూ కనిపించటం లేదు కానీ అతడి ఒంటిమీద వెంట్రుకలన్నీ గొంగళి దారాలుగా మారిపోయుండడం చూసి హడలిపోయింది. భయంతో వణికిపోయింది. పట్టుకొని లాగటానికి చూసింది. బలంగా పీకితేగానీ ఊడి వచ్చేలా కనిపించలేదు. అందుకని వెళ్ళి తన వాక్సింగ్ స్ట్రిప్ తెచ్చి, అతడి చేతికి అతికించి, కాసేపుంచి ఫట్‍మని లాగింది. అది ఊడి రాలేదు గానీ, అతడు లేచి కూర్చున్నాడు కెవ్వుమని అరుస్తూ. విపరీతమైన నొప్పితో అల్లాడుతున్నా, ఆమె భయపడుతుందని పక్కకు పోయి మరీ స్ట్రిప్ పీకి పడేశాడు. తిరిగి మంచం దగ్గరకు వచ్చేసరికి, ఆమె ఇంకొన్ని స్ట్రిప్స్ తీసుకొని సిద్ధంగా ఉంది. వద్దంటున్నా వినిపించుకోలేదు. ఆమెను ఆపడానికి కోపంతో అరవక తప్పలేదు అతడికి.

ఆ క్షణంలో గుండెలవిసిపోతూ బైటికి తన్నుకొచ్చిన ఏడుపు మర్నాడు ఆఫీసులో తెలుగురాని స్నేహితురాలు పంచిన అనుభవసారం వినేంతవరకూ ఆపలేదు. “Men aren’t like us. They think different. Their brains function differently. They have thicker skins. What works for us, doesn’t work for them.”

ఆమెకో ఆలోచన వచ్చింది, దాన్ని అమలుపరుద్దామంటే, అతడేమో రగ్గు కప్పుకోలేదు చాన్నాళ్ళ వరకూ. కప్పుకుంటే బాగుణ్ణని చాలా అనుకొంది. అతను బలవంతంగా రగ్గు కప్పుకునేలా ప్రవర్తించింది, ప్రయత్నించింది. కుదర్లేదు. అదెప్పుడు తిరిగివస్తుందో అన్న భయంతో అనుక్షణం బతికేకన్నా, దానితో తాడో పేడో తేల్చుకోవడమే నయమని ఆమెకు అనిపించింది.

గొంగళి దారాలు తిరిగి ఆమె శరీరాన్ని వడివడిగా ఆక్రమించుకుంటున్నాయి. కొన్ని నల్లపూసలకి చుట్టుకుపోయి ఉన్నాయి. కాళ్ళకి, చేతులకి చుట్టుకొని ఉన్న తాళ్ళల్లోంచి ముళ్ళు పుట్టుకొచ్చాయి. ఆమె తాళ్ళని వదులుజేసుకుందామని ప్రయత్నించే కొద్దీ ఆ ముళ్ళు గట్టిపడుతున్నాయి. ఒరుసుకొని చర్మం మీద గాట్లు పడుతున్నాయి. గింజుకోవటంవల్ల లాభంలేదని గుర్తు తెచ్చుకొని, కదలకుండా ఉండడానికి ప్రయత్నించింది.

అతను మళ్ళీ రగ్గు కప్పుకుని పడుకున్న రాత్రి. ఆ గొంగళి దారాలు తిరిగొచ్చిన రాత్రి. చాలా కాలం తరువాత తిరిగొచ్చాయేమో అవి అతడిని పూర్తిగా ఆక్రమించుకున్నాయి. ఆమె తెచ్చుకున్న పనిముట్లు అన్నింటితో రంగంలోకి దిగింది. పని చకచకా కానిచ్చింది. అతను ప్రతిఘటించాడు. అతడికి ఒళ్ళంతా గాట్లు పడ్డాయి. ఆమెకూ కొన్ని గాయాలయినాయి. కొంత సేపటికి అతడు, ఆమె రక్తపు మడుగులో ఉన్నారని గ్రహించుకున్నారు. ఇద్దరికీ భయం వేసింది. ఒకరినొకరు పట్టుకున్నారు. ఆమె చేతిలోని రేజర్, చిన్నపాటి సర్జికల్ నైఫ్, అవన్నీ లాక్కొని విసిరేశాడు. అప్పటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

కోలుకోడానికి ఇద్దరికీ చాలా సమయం పట్టింది. ఎవరికి తగిలిన గాయాలు వాళ్ళకి తగ్గితే సరిపోలేదు. అవతలవాళ్ళ గాయాలు కూడా మానేంతవరకూ ఇద్దరూ మామూలు మనుషులు అవలేకపోయారు. అపరాధభావాన్ని పోగొట్టుకోడానికి, పరిచయమైన తొలినాళ్ళల్లో ఒకరినొకరు అర్థంచేసుకోడానికి పడిన శ్రమకన్నా ఎక్కువ కష్టపడ్డారు. అప్పుడు కలవడానికి. ఇప్పుడు కలిసుండడానికి.

ఆమె తనని ఎక్కడ వదిలివెళ్ళిపోతుందో అన్న అపనమ్మకంతో, ఆమెకు తనని అర్థంచేసుకునే అవకాశం ఇవ్వకపోవటం దారుణమని అతడికి బాగా తెలిసొచ్చింది. మునుపటిలా కాకుండా ఈసారి అతడు మనసులో కడిగేస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తిరిగొచ్చి గూడు కట్టుకునే నలుపును దాచకుండా చూపించాడు. ఆమెకు బాగా బోధపడిన విషయమొక్కటే – అతడు ఉన్నన్నినాళ్ళు అదీ ఉంటుందని, తను అతడితో పాటూ ఆ నలుపుతో కాపురం చేయాలని. కాపురమంటే అంత తేలికైన విషయమా? అదీ ఇష్టంలేని దానితో. తను తరిమేయలేని దానితో. ఆమె చూడగలిగినంత వరకూ చూసింది. ఆ నలుపు పోగొట్టలేక పోయానని బాధపడింది. కానీ తాను చేయగలిగింది ఇంకా చాలా ఉందని తెల్సుకుంది. అవైనా సరిగ్గా చేయాలని తీర్మానించుకుంది.

ఇన్ని రోజుల తరువాత మళ్ళీ ఈరోజు — ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరేముందు చేసిన కాల్‍లో ఏ మాత్రం అనుమానం రాలేదు. ఇంటికి చేరేసరికి మాడిపోయి, వాడిపోయున్న మొహం. పలకరించలేదు. పలకలేదు. పుస్తకమేదో ముందేసుకొని కూర్చున్నాడు. తెలియనివ్వదుగానీ, అతడు చదువుతున్న వాక్యాల భావం అతడి మొహంలో చదివేంతటి అనుభవం ఆమెది. దొరికిపోయాడు. తనవంతుగా ఆమె ఏవేవో ప్రయత్నించింది. ఏదీ పనిజేయకపోవటంతో అసహనంతో కూడిన కోపం వచ్చి అదుపు తప్పింది. తలుపు దభేలుమని వేసి, విసవిసా నడుచుకుంటూ పోయి, రెండు గంటలలా నడిచి తిరిగొచ్చి, లేని పని కల్పించుకొని లాప్‍టాప్ ముందు కూర్చొనీ కూర్చొనీ చివరికి గదిలోకి వచ్చింది. తప్పదు, తను చేయాల్సింది, చేయగలిగింది, చేయక తప్పదు.

ఆమె ఒంటినిండా పాకుతున్న దారాలు అప్పటికి పల్చని నల్లటి రగ్గులా ఆమెను కప్పుకుంటూ అల్లుకుపోయాయి. అతడి గుట్టేమిటో చెప్పగలిగే ట్రిక్కేదో తనకి తెల్సుంటే బాగుండేదని అనిపించింది, మళ్ళీ ఓసారి. గుండె మీద వేసుకున్న చేతికి తాళి తగిలింది. అతడు కట్టింది. అది హార్ట్-టు-హార్ట్ స్టెత్‍స్కోప్‍లా పనిచేయగలిగితే, ఎంత బాగుణ్ణో కదా. కానీ దానికంత శక్తి లేదు. ఒక మనిషిని, మనసును, ఒక జీవితాన్ని పూర్తిగా పంచుకునే వీలు కల్పించలేదు. దానికన్నా ఈ నల్లదారాలే నయం, తాను అటువైపుకి వెళ్ళలేకపోయినా, అవే ఇటు వచ్చేస్తాయి, ఏదోలా అతడిని తన దగ్గరకు చేరుస్తాయి. పొంగుకొస్తున్న మమతతో ఆమె గీత దాటింది. అతని దగ్గరకు జరిగి అతడి గుండెపై చేయి వేసింది. అతడి లయబద్ధమైన గుండె చప్పుడు తెలియగానే హాయిగా ఊపిరి పీల్చుకుంది. నిద్రపట్టినట్టుంది, అతడి శ్వాస కూడా మామూలుగా ఉంది. తుఫాను తీరం దాటి చాలాసేపయ్యింది. దాని ప్రభావం సన్నగిల్లుతోంది. ఆమె కాళ్ళకూ, చేతులకూ ఉన్న తాళ్ళు వాటంతట అవి వదులై ముళ్ళు ఊడిపోయాయి.

అతడి నవ్వు ఆమె చెవులకి గుసగుసగా అప్పుడే వినిపించేసింది. ఆ నవ్వు ఆమె పెదాలపైకి వచ్చేసింది. మరో రాత్రి దాటిపోతోంది, ఇద్దరూ చిన్నపాటి గాయాలతోనే బయటపడబోతున్నారు. గాయాలకు ఇద్దరి దగ్గరా మందులు ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే, రేపటిలోగా వాళ్ళిద్దరి మధ్య తప్పనిసరిగా జరిగబోయేది ఆమెకు కంటి ముందు కనిపించేసింది.

అతడొచ్చి తన మంత్రదండంతో ఆమె చేతికంటుకున్న నల్లరంగును చిటెకలో మాయం చేస్తాడు. ఆమెకి అయిన గాయాలను క్షణాల్లో నయం చేస్తాడు. ఆమె దగ్గర అలాంటి మహిమలేవి ఉండవు. ఆమెకు తెల్సిన ఒకే ఒక్క మాజిక్, తన ప్రాణాలను అతడిలో దాచటం.

“నాకూ మాజిక్ నేర్పవూ? నేను కూడా ‘ఉఫ్’ అనగానే నీ బాధలన్నీ పోయేట్టు?”

అతడు నవ్వి ఊరుకుంటాడు. ఆమె మళ్ళీ అడుగుతుంది. “చెప్పూ. నేర్పిస్తావా?” అయినా ఏమనడు. ఆమె ఉక్రోషంతో తిట్టడం మొదలెడుతుంది. చేతికి అందేంత దూరంలో ఉంటే రెండు వేస్తుంది. “ఎందుకు చెప్పవ్? యేఁ? యేఁ?” అని చెవిలో పోరుపెడుతుంది.

అతడు ఉండుండి, ఒక్కసారిగా ఆమెను చుట్టేసి, “because you are my magic! మాజిక్‌కే మాజిక్ ఎలా నేర్పించటం?” అని అడుగుతాడు. ఆ మాటలు తొలిసారిగా వింటున్నట్టు, మళ్ళీ పడిపోతుంది వాటి మాయలో.

రాత్రంతా కంటిమీద కునుకు లేకపోయినా, ఆమెకు కొత్త ఉత్సాహం వచ్చింది. లేచి పనులు మొదలెట్టుకుందామా అనుకుంటూ, టైమ్ ఎంతయిందో చూడ్డానికి మొబైల్ స్విచాన్ చేసింది. ఆ వెలుతురు అతడి మొహం మీద పడ్డంతో కొద్దిగా కదులుతూ, అప్పటి వరకూ మునగదీసుకొని ఉన్న చేతిని ఆమెవైపు చాచాడు. ఆమె క్షణం ఆలోచించకుండా ఆ చేతిలోకి ఒదిగిపోయింది. ఆమె సర్దుకోగానే, అతడి చేయి ఆమెను చుట్టుకుంది. ఆశ్చర్యపోయి, తలపైకెత్తి చూడబోయింది. అప్పటికే అతను ఆమె తలపై గెడ్డం ఆన్చి ఉన్నాడు. కదిలితే మళ్ళీ ఎక్కడ లేచేస్తాడోనని, అలాగే ఉండిపోయి, చేతిని మాత్రం ఇంకా దగ్గరకు లాక్కొని ఆమె కూడా దుప్పటిలో ఒదిగిపోయింది తృప్తిగా, రేపు తనదవుతుందన్న ఆశతో. అయినా, అవకపోయినా అతడు తనవాడేనన్న నమ్మకంతో.

మంచం మీద నుండి రగ్గు జారిపోయింది వాళ్ళను చుట్టుకున్న దారాలతో సహా. బిక్కుబిక్కుమన్న గది, మళ్ళీ మామూలుగా ఊపిరి పీల్చుకుంది.

And it is, as it turned out, just one of those nights!
----------------------------------------------------------
రచన: పూర్ణిమ తమ్మిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో