Monday, February 28, 2022

ఇలాంటి లింగం భూమిపై ఒక్కటే ఉంది

ఇలాంటి లింగం భూమిపై ఒక్కటే ఉంది 




సాహితీమిత్రులారా!

ఇలాంటి లింగం భూమిపై ఒక్కటే ఉంది 

అనే  నండూరి శ్రీనివాస్ గారి ఈ వీడియో వీక్షించండి-



Saturday, February 26, 2022

కురుక్షేత్రంలో పాల్గొన్న సేనలు

 కురుక్షేత్రంలో పాల్గొన్న సేనలు




సాహితీమిత్రులారా!



కురుక్షేత్రంలో పాండవుల వైపు 7 అక్షౌహిణులు

కొరవులవైపు 11 అక్షొహిణులు సేనాబలం ఉన్నట్లు

మనం వింటుంటాం కదా అవి ఎవరెవరి బలాలు ఎంతెంత

అనే విషయం ఇక్కడ గమనిద్దాం-

మొదట పాండవుల వైపు చేరిన బలాలు


సాత్యకి                                - 1 అక్షౌహిణి

ధృష్టకేతుడు                       - 1 అక్షౌహిణి

మాగధ సహదేవుడు           - 1 అక్షౌహిణి

కేకయ పతులు                    - 1 అక్షౌహిణి

ద్రుపదుడు                           - 1 అక్షౌహిణి

విరాటుడు

పార్వతీయ మహీపాలుడు - 1 అక్షౌహిణి

పాండ్యరాజు తక్కిన వారు - 1 అక్షౌహిణి

                                                  -----------

మొత్తం                                - 7 అక్షౌహిణులు

                                           ------------------


కౌరవుల పక్షం చేరిన రాజసైన్యాలు

భగదత్తుడు, కిరాత                   - 1 అక్షౌహిణి

భూరిశ్రవుడు, శల్యుడు           - 1 అక్షౌహిణి

సుదక్షిణుడు                           - 1 అక్షౌహిణి

జయద్రథుడు, సౌవీర             - 1 అక్షౌహిణి

నీలుడు                                    - 1 అక్షౌహిణి

కృతవర్మ                                - 1 అక్షౌహిణి

విందాను విందులు               - 2 అక్షౌహిణులు

తక్కిన రాజులు                      - 3 అక్షౌహిణులు

                                            ----------------------

మొత్తం                                   - 11 అక్షౌహిణులు

                                            ----------------------

Thursday, February 24, 2022

ఎంత ఘాటుప్రేమయో

 ఎంత ఘాటుప్రేమయో




సాహితీమిత్రులారా!



తన ప్రియురాలికి తాను అ ప్రియమైన పని దేన్నో

చేసినందువల్ల కోపశీలి యైన ఆమె ప్రణయ కోపంతో

కాలితో పతిన్ తన్నింది. అతడు ఆమె పైగల

రాగాతిశయంతో అనునయిస్తూ పలికిన శ్లోకం ఇది.

దాసే కృతాగసి భవే దుచితః ప్రభూణాం

పాదప్రహార ఇతి సుందరి నాస్మిదూయే

ఉద్యత్క ఠోరపులకాంకుర కంటకాగ్రై

ర్యత్ఖిద్యతే మృదు పదం నను సా వ్యథా మే

సేవకుడు తప్పుచేసినప్పుడు యజమానులు

కోపించి పాదంతో తన్నటం సరైనదే.

నీకు దాసుడనైన నేను నీవిషయంలో

అపరాధం చేసినందుకు నన్ను నీవు

పాదప్రహారం చేసినందుకు బాధపడను.

కానీ నీ పాదస్పర్శతో నా శరీరం పుకించి

నిక్కబొడిచిన కంటకాల్లాంటి రోమాల వల్ల

కోమవమైన నీ పాదానికి నొప్పి కలిగిందేమో

అని బాధపడుతున్నాను - అని భావం.


Tuesday, February 22, 2022

సర్ప రహస్యాలు

 సర్ప రహస్యాలు




సాహితీమిత్రులారా!

సర్పా రహస్యాలు - అనే

నండూరి శ్రీనివాస్ గారి వీడియో

ఆస్వాదించండి-




Sunday, February 20, 2022

పూర్వం యుద్ధాల్లో పన్నిన వ్యూహాలు

పూర్వం యుద్ధాల్లో పన్నిన వ్యూహాలు




సాహితీమిత్రులారా!



పూర్వం మనదేశంలో యుద్ధాల్లో

ఎత్తుకు పై ఎత్తులు వేసి వ్యూహాలను పన్నేవారు

ఈ వ్యూహాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే

ఎదుటి సైన్యాన్ని నాశనం చేయగలిగేవిధంగా సైన్యాన్ని నిలబెట్టడమే

చతురంగ బలాలలను నిల బెట్టడంలో చాలా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. 

ఏ వ్యూహం ఎదుటివారు వేస్తే మనం ఏవ్యూహం వేయాలో తెలిసుండాలి. 

ఆ వ్యూహాల పేర్లను ఇక్కడ గమనిద్దాం-

కురుక్షేత్రంలో పన్నిన వ్యూహాలు-

మానుష వ్యూహం, చారు స్థానకం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, క్రౌంచ వ్యూహం, మండల వ్యూహం, కూర్మ వ్యూహం, సర్వతోభద్ర వ్యూహం, శకట వ్యూహం, అర్ధచంద్ర వ్యూహం, పద్మ వ్యూహం, సూచీ వ్యూహం, అచల వ్యూహం, శ్యేన వ్యూహం, వజ్ర వ్యూహం, శృంగాటక వ్యూహం, దుర్జయ వ్యూహం - అని17 వ్యూహాలు


కౌటిల్యుని అర్థ శాస్త్రంలో ఇవికాక మరో 16 వ్యూహాలున్నాయి-

అవి- భోగ, దండ, అసంహత, స్థూలక్ణ, ప్రదర, దృఢక, అసహ్య, విజయ, విశాలవిజయ, సంజయ, చమూముఖ, ఝషస్య, సర్పసరి, అరిష్ట, అప్రతిహత, ఉద్యానక - అనేవి.


దండ వ్యూహాలు 17 అని, భోగవ్యూహాలు 56 అని హిందూ ఆధిక్యం అనే గ్రంథంలో చెప్పబడింది.

                                                                           (పి రాజగోపాలనాయుడుగారి కురుక్షేత్రే ఆధారం) 

Friday, February 18, 2022

ఆ రాజుగారి కీర్తి ఎంతంటే ..................

 ఆ రాజుగారి కీర్తి ఎంతంటే ..................




సాహితీమిత్రులారా!



ఒక రాజు  కీర్తిని కవి

ఎంత చమత్కారంగా వర్ణించాడో

ఈ శ్లోకం చూడండి.


విద్వద్రాజ శిఖామణే తులయితుం ధాతా త్వదీయం యశ:

కైలాసంచ నిరీక్ష్య తత్రలఘుతాం, నిక్షిప్తవాన్ పూర్తయే

ఉక్షాణం, తదుపర్యుమా సహచరం తన్మూర్ధ్నిగంగాజలమ్

తస్యాగ్రే ఫణిపుంగవం తదుపరిస్ఫారం సుధా దీధితిమ్


ఓరాజా! నీ కీర్తిని తూచాలని బ్రహ్మ అనుకొన్నాడు.

తక్కెడ ఒక సిబ్బెలో కీర్తిని ఉంచి వేరొక సిబ్బెలో వెండి కొండను పెట్టాడు.

చాల్లేదు.

ఆపై నందీశ్వరుని -

(అదీ చాలక) ఆ పై శివుని -

ఆపై గంగాజలమును -

ఆపై వాసుకిని -

ఆపై చంద్రకళను పెట్టి

తూచలేక విఫలుడైనాడు -

అని భావం


Wednesday, February 16, 2022

అబద్ధం ఆడరాదా?

 అబద్ధం ఆడరాదా?




సాహితీమిత్రులారా!



ఒక ప్రమాణాన్ని అతిక్రమించటానికి

దారులు వెదకడం మానవ నైజం.

ఇలాంటి దారులు మన ఇతిహాసాల్లో----


ఆపద్ధర్మంగా అబద్ధమాడటానికి ఇవి లైసన్స్ లు


ఇది ఆంధ్రమహాభారతం ఆదిపర్వం

మూడవ ఆశ్వాసంలోని ఘట్టం-

యయాతి మహారాజు శుక్రాచార్యుల

కుమార్తె దేవయానిని వివాహమాడాడు.

అలాగే విధివశంగా దేవయాని దాసీగా

ఉన్న వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ

దాసీగా అయింది. దేవయాని దాసీ

కావున శర్మిష్ఠ కూడ యయాతి సొత్తే అయింది.

వివాహసమయంలో శుక్రాచార్యుల వద్ద  చేసిన

ప్రమాణం ఉల్లంఘించం ఎలా? అని,

అబద్ధం ఆడటం ఎలా? అని  బాధపడే సమయంలో

శర్మష్ఠ యయాతితో అన్న పలుకులు ఈ పద్యం చూడండి-


ఈ ఏడింటియందు నసత్యదోషము

లేదని ముని ప్రమాణంబు గలదు


చను బొంకగ బ్రాణాత్యయ

మున సర్వధనాపహరణమున వధగావ

చ్చిన విప్రార్థమున వధూ

జనసంగమమున వివాహసమయములందున్

                                                                           (ఆదిపర్వం - 3-178)

.ప్రాణాపాయ సమయాన,

సమస్త ధనం అపహరించ

బడే సమయాన, వధించబడేందుకు

సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుని రక్షించేందుకూ,

స్త్రీ సంగమ విషయానా, పెళ్ళివేళలందు

అసత్యమాడవచ్చు - అని భావం


ఇదే విషయాన్ని పోతన శ్రీమదాంధ్రమహాభాగవతం

వామన చరిత్రలో బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు

ఇలాంటి బోధనే చేస్తాడు -


వారిజాక్షులందు వైవాహిములందు

బ్రాణవిత్త మాన భంగమందు

చకితగోకులాగ్ర జన్మరక్షణమందు

బొంకవచ్చు నఘము వొందడధిప


ఈ పద్యం ఆబాలగోపాలం విన్నదే-


Monday, February 14, 2022

వీరిలో ఎవరు గొప్పనో చెప్పగలమా!

 వీరిలో ఎవరు గొప్పనో చెప్పగలమా!





సాహితీమిత్రులారా!


తండ్రి తొడపై కూర్చో నివ్వలేదని చిన్నవయసులో అడవులకు పోయి

తపస్సు చేసిన ధృవునిలాంటివారు ఉన్నారా


తండ్రి మాటపై తల్లినే తల నరికిన పరశురామునిలాంటి వారున్నారా


తండ్రి మాకై రాజ్యాన్ని వదలి అడవుల కెళ్లిన రామునిలాంటివారున్నారా


తండ్రి వివాహానికై తను వివాహమాడకుండా భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్మునిలాంటివారున్నారా


తండ్రి కొరకై తన యవ్వనాన్ని తండ్రి ఇచ్చిన పూరువు వంటి వారున్నారా


వీరందరూ పితృభక్తి పరాయణులే కదా వీరిలో ఎవరు గొప్పనో చెప్పగలమా!


Saturday, February 12, 2022

మూడు కళాఖండాలు

మూడు కళాఖండాలు




సాహితీమిత్రులారా!

కంచిపరమాచార్య, ఆదిశంకరాచార్య, షిరిడి సాయిబాబా

ఈ ముగ్గురి గురించిన ఫోటోలు, శిల్పాలు వాటిగురించి

నండూరి శ్రీనివాస్ చేసిన వీడియో ఆస్వాదించండి-



Thursday, February 10, 2022

వాల్మీకి - ఆధ్యాత్మ రామాయణాల తేడా

వాల్మీకి - ఆధ్యాత్మ రామాయణాల తేడా




సాహితీమిత్రులారా!



మనం రామాయణం అనగానే మనకు వాల్మీకి రామాయణం గుర్తుకు వస్తుంది. 

అది సంస్కృతంలో మొదటి కావ్యం మరియు దాని 

ఆదికావ్యమని పేరు. దీనిలో వాల్మీకి శ్రీరాముని ఒక ఉదాత్తమైన మానవునిగా చిత్రించాడు. 

అతని దివ్యత్వాన్ని నేపథ్యంలోనే ఉంచాడు. కారణం 

ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని విపులీకరించటానికి వాల్మీకి 

ఆ విధంగా చేశాడు. మనం సామాన్యవ్యక్తులం కనుక మనకు అలా ప్రవర్తించటం

వీలుకాదనుకుంటాం. శ్రీరాముణ్ణి మానవునిగానే చిత్రీకరించటంచేత అతడు

ఆదర్శపురుషుడైనాడు. కాబట్టి జనసామాన్యానికి  వాల్మీకి రామాయణం 

ఆదర్శప్రాయమౌతుంది.


ఆధ్యాత్మరామాయణం బ్రహ్మాండపురాణంలో 61వ అధ్యాయంలో ఉంది.

దాన్ని వ్రాసింది వ్యాసుడు. దీనిలో శ్రీరాముడు భగవంతుని అవతారమని 

అడుగడుగునా తెల్పబడుతూంది. సీతాపహరణం యథార్థ సీతాపహరణం 

కాదనీ, మాయా సీతాపహరణం అనీ, కైకదయీ మందరలు కూడా 

దైవప్రేరణచేతనే ఆ విధంగా ప్రవర్తించారని, రావణుడుకూడ శ్రీరాముడే 

పరమాత్మ అని తెలిసి శ్రీరామునిచే వధింపబడి వైరభావంతో మోక్షం 

సముపార్జించటానికే సీతాపహరణం చేశాడని ఆధ్యాత్మ రామాయణం 

చెబుతుంది. దీన్ని ముముక్షువులు మోక్షసాధనకోసం ముక్తిని కాంక్షించి 

ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేస్తారు.

                                                                                            (ఆధారం ఆధ్యాత్మరామాయణం పీఠిక)


Tuesday, February 8, 2022

నేల (కథ)

 నేల (కథ)




సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి

నేల (కథ)

ఆస్వాదించండి-



Sunday, February 6, 2022

క్షీరసాగర మథనం అంటే.........

 క్షీరసాగర మథనం అంటే.........



సాహితీమిత్రులారా!



గణపతివాశిష్ఠముని కృత

ఉమాసహస్రంలోని 1వ స్తబకములో

వివరించబడిన అమృత మథన

అంతరార్థం రెండు శ్లోకాలలో కలదు అవి-


ప్రాణిశరీరం మన్దరశైలొ

మూలసరోజం కచ్ఛపరాజః

పూర్ణమనన్తం క్షీర సముద్రః

పృష్ఠగవీణా వాసుకురజ్జుః


ప్రాణిశరీరం - మందర పర్వతం

మూలాధార కమలము - కచ్ఛపరాజు(కూర్మరాజు)

పూర్ణమగు ఆకాశము -

దహరము అను హృదయము క్షీరసముద్రము

వెన్నెముకగల వీణాదండము -వాసుకి యగు త్రాడు


దక్షిణనాడీ - నిర్జరసేనా

వామగనాడీ - దానవసేనా

శక్తివిలాసో - మన్ధనకృత్యం

శీర్షజధారా - కా2పిసుధోక్తా

దక్షిణనాడి - దేవసేన

వామగనాడి - అసుర సేన

శక్తివిలాసము - మన్ధనకృత్యము

శీర్షజమను నొకానొక ధార - అమృతము.


శరీరము మధ్యనున్న సుషుమ్నా నాడికి అపసవ్యమున ఉన్న

పింగళ అను పేరుగలనాడి దక్షిణనాడి - దేవతలసేన అగుచున్నది

ఆ సుషుమ్నకు సవ్యభాగమున ఉన్న ఇల లేక ఇడా అనే నాడి

వామగ నాడి - ఇది అసురసేన అగుచున్నది. శక్తి యొక్క క్రీడయే

మధనమను కార్యము అగుచున్నది.

సహస్రారకమలమునుండి వెలువడిన అనిర్వచనీయమైన

ఆనందధారయే అమృతము - అని చెప్పబడుచున్నది.


Friday, February 4, 2022

దుర్గాబాయి దేశముఖ్ గారి జీవితవిశేషాలు

 దుర్గాబాయి దేశముఖ్ గారి జీవితవిశేషాలు




సాహితీమిత్రులారా!

దుర్గాబాయి దేశముఖ్ గారి జీవితవిశేషాలు

వివరించే కిరణ్ ప్రభ వీడియో ఆస్వాదించండి-



Wednesday, February 2, 2022

ఆనందీబాయి జోషీ - అమెరికాలో చదివిన మొదటి వైద్యురాలు

 ఆనందీబాయి జోషీ - అమెరికాలో చదివిన మొదటి వైద్యురాలు




సాహితీమిత్రులారా!

అమెరికాలో చదివిన మొదటి వైద్యురాలు  ఆనందీబాయి జోషీ

గురించిన వీడియో - కిరణ్ ప్రభ గారి వీడియో ఆస్వాదించండి-