Thursday, September 1, 2016

ఎలాంటివారితో స్నేహం చేయాలి?


ఎలాంటివారితో స్నేహం చేయాలి?


సాహితీమిత్రులారా!

స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం
అంటూ పాటలు వింటున్నాము
అలాంటిది ఎలాంటివారితో స్నేహం చేయాలో తెలుసుకోవాలికదా
అందుకే ఈ శ్లోకం చూడండి.

హీయతేహి మతిస్తాత!  హీనైస్సహ సమాగమాత్
సమైశ్చ సమతామేతి విశిష్టైశ్చ విశిష్టతామ్!

నీవు తక్కువవారితో స్నేహం చేస్తే
నీ బుద్ధి క్రిందికి దిగజారుతుంది.
నీతో సమానమైన వారితో చెలిమితో
లాభమూ లేదు నష్టమూ ఉండదు.
ఉత్తములతో స్నేహం చేస్తే
నీవు గొప్పతనం పొందగలవు.
కావున నీ చెలిమి ఎవరితో మేలో నీవే తేల్చుకో..

No comments:

Post a Comment