కవిసామ్రాట్టుని జన్మదినం
సాహితీమిత్రులారా!
జననం - 10-09-1895, 8.25 ఉదయం.
మన తెలుగులో మొదటి జ్ఞానపీఠఅవార్డును పొందివారు.
నిరంతర కావ్యసృజనమే కలిగినవారు అయిన
మన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జన్మదినం నేడు
వారిపై అలంకారం కోటంరాజుగారి "విశ్వనాథశతి" నుండి ఈ పద్యం
ఎవ్వాని పద్యమ్ము యితరాంధ్ర కవికృత పద్యప్రతి కొజ్జబంతియౌను
ఎవ్వాని శిల్పమ్ము హేమంతసీమంతి నీవేణి చేమంతి నేవగించు
ఎవ్వాని కథనమ్ము మవ్వంపు పెను వేడ్క జన మనోహరణమ్ము సల్పుచుండు
ఎవ్వాని కావ్యమ్ము యిందుశేఖరు జటాజూటావతంసమై నీటుగొల్పు
అతడు విజ్ఞానఖనిగ మహాంద్ర భూమి
సకల జన గణస్తుతి పాత్రుడై కడాని
గుణ గరిష్ఠుడై కవితా దురీణుడై,న
వీనుడై, విరాజిల్లు మావిశ్వనాథ
No comments:
Post a Comment