Monday, September 5, 2016

సకాలములో చేయని పని ఎలాంటిది?సకాలములో చేయని పని ఎలాంటిది?


సాహితీమిత్రులారా!


ఏదైనా సకాలంలో చేస్తే మంచి ఫలితాన్నిస్తాయి.
లేకుంటే ఎలా ఉంటుందో ఈ శ్లోకం చెబుతుంది చూడండి.

నిర్వాణే దీపే కిము తైలదానం?
చోరేగతేవా కిము సాధానమ్?
వయోగతే కిం వనితా విలాస:?
పయోగతే కిం ఖలు సేతుబంధ:?

దీపం ఆరిపోయిన తరువాత నూనె పోయడం ఎందుకు?
దొంగిలించుకు పోయిన తరువాత మేల్కొనటం వలన ప్రయోజనమేమి?
వయసు అయిపోయిన తరువాత స్రీవ్యామోహం ఎందుకు?
నీళ్ళు పోయిన తరువాత గట్టువేయడం వలన ప్రయోజనమేమి?
- సకాలంలో జాగ్రత్త పడక తరువాత ఎంత కృషిచేసినా ఏెం లాభం?
అందుకే పెద్దలు దీపమం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు కాదా!

No comments:

Post a Comment