Friday, September 2, 2016

ఎవరితో కలువకూడదు?


ఎవరితో కలువకూడదు?


సాహితీమిత్రులారా!

మంత్రి యప్పన్న చారుచర్యలో చెప్పిన పద్యం
ఎటువంటి స్త్రీతో కలువకూడదో
ఇందులో వివరించారు చూడండి.

వనితలు సంభోగమున వర్జనీయులు
                    తగఁదన్ను నేలునాతని పురంధ్రి
బంధువునిల్లాలు బ్రాహ్మణోత్తము భార్య
                   చెలికాని పడఁతి వీరలఁదలంప
మాతృసమానలు మనువు దప్పిన యింతి
                  కన్నియ ముదిసిన కాంత రూప
శీలగుణమ్ములచేత నిందితయైన
                  మగువయుఁ దనజాతి మాత్రకంటె
నతిశయంబగు వర్ణంబునతివ బొగ్గు
చాయ మేనిది కడుఁబల్ల చాయ పడఁతి
పెద్దవళులది కడురోగి తద్ద బడుగు
గేడి గుజ్జనఁబడువీరిఁగూడఁజనదు
                                            (చారుచర్య - 57)


సంభోగంలో విడిచి పెట్టవలసిన స్త్రీలు -
1. తన యజమాని భార్య
2. బంధువు భార్య
3. ఉత్తమబ్రాహ్మణుని భార్య
4. స్నేహితుని భార్య
వీరు తల్లి వంటి వారు.
వీరు కాకుండా ఇంకా
చెడిపోయిన స్త్రీ, రజస్వలకాని స్త్రీ, వృద్ధురాలు
రూపం- శీలం - గుణం లేని స్త్రీ, తనకంటే పైజాతికి చెందిన స్త్రీ,
బొగ్గులాంటి నల్లని రంగుకల స్త్రీ, ఎర్రరంగు(పల్ల- పాటల వర్ణం) కలది.
పొట్టపై పెద్దపెద్ద ముడుతలు కలది, పెద్ద జబ్బున్నది, బాగా ఓపికలేనిది, 
పొట్టిపొట్టి కాళ్ళు చేతులు(గుజ్జు అనబడు) శరీరంగలది 
ఇటువంటి స్త్రీలతో సంభోగించరాదు.

No comments:

Post a Comment