Sunday, September 11, 2016

వెలయగాఁ నివె పదివేల విన్నపములు


వెలయగాఁ నివె పదివేల విన్నపములు



సాహితీమిత్రులారా!

వేటూరి వారి చాటుపద్యమణిమంజరిలో
రామాయణచాటువులు పేర ఉన్న పద్యం ఇది.
జనకుడు దశరథునికి సీతారాముల వివాహ
విషయమై తెలిపి వివాహానికి ఆహ్వానిస్తున్న పద్యం.

శ్రీమత్సకల గుణశ్రేయోర్థసంపన్ను
                    లయిన శ్రీరాజ్యభ్యుదయ సమృద్ధి
మన్మహామేరు సమానధీరులయిన
                    దశరథేశ్వరులకుఁ దాల్మితోడ
జనకమహారాజు సాష్టాంగములు చేసి 
                   వేడ్కఁజేయంగల విన్నపములు -
ఇక్కడ శుభము మీయొక్క సంతోషంబు
                   వ్రాయించి పంపించవలయు సుండి
తరువాత - శ్రీరామధాత్రీశునకుఁ జైత్ర
                    శుద్ధపంచమినాఁడు సొంపుమీర
మాపటి లగ్నాన మాపట్టి సౌభాగ్య
                    వతి సీత నిచ్చి వివాహమహము
ఇక్కడ మిథిలలోనే చేయఁ బెద్దలు
                     నిశ్చయించిరిగాన నిండు వేడ్క
సహకుటుంబము పరివారసహితముగను
విభవమున వచ్చి మీరలీ శుభముహూర్త
మెలమిఁజేయించి ప్రమదంబు కొలుపవలయు
వెలయఁగా నివె పదివేలవిన్నపములు

వివాహమునకు పిలుపు ఏలావుందో తెలిపే పద్యం
పూర్వం ఇలాగే ఉత్తరాలు రాసేవారు అదే విధంగా ఉందీ పద్యం.

No comments:

Post a Comment