కాల్చు వాడొకడు భూమిజనింపక పోయెనక్కటా!
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి కవి ఎంత చమత్కారంగా
బాధాతప్తహృదయంతో రాశాడో
నరుడనువాడు ఖాండవ వనంబు వృధాదహనంబు చేసె, వా
నరవరుడైన ఆపవననందను డూరక లంకగాల్చె, ఆ
హరుడు పురంబులార్చెనన, అంతియెగాని, మహాదరిద్ర వి
స్ఫురణను గాల్చువాడొకడు భూమిజనింపకపోయెనక్కటా!
అర్జునుడు ఖాండవ వనాన్ని అగ్నిదేవుని
అజీర్ణరోగాన్ని నివారించటం కోసం కాల్చాడు.
హనుమంతుడు చాల అందమైన నగరం
లంకా పట్టణాన్ని కాల్చి బూడిదచేశాడు.
శివుడు త్రిపురాసురుల సుందర
నగరాలను కాల్చి బూదిచేశాడు.
వీరందరు ఏ ఒకరికోసమో కొందరి కోసమో
సాయంచేయటానికి వాటిని కాల్చారు.
కాని ప్రపంచంలోని దరిద్ర నారాయణులైన
ప్రజలందరినీ ఎన్నోచోట్ల, ఎన్నో యుగాలుగా,
ఎన్నోవిధాలుగా బాధించే ఆ మహాదరిద్ర దేవత విజృంభణను అడ్డుకొని ,
దాన్ని కాల్చి బూదిచేసే నాథుడు ఒక్కడుకూడ భూమిలో పుట్టకపోవటం
చాల ఆశ్చర్యంగా ఉంది.
కొద్దిమందికి చేసిన సేవకంటె,
ఎక్కువ మందికి చేసిన సాయం ప్రకృష్టమై,
సార్థకమౌతుందని కవి భావన.
No comments:
Post a Comment