Wednesday, September 7, 2016

పుత్రుడు శత్రువట ఎప్పుడు?


పుత్రుడు శత్రువట ఎప్పుడు?


సాహితీమిత్రులారా!


లోకంలో ఎన్నో వింతలు అందులో మన జీవనమే ఒక వింత
అందులో భార్యా పుత్రులు మాత్రమేకాదు మనశరీరం సైతం వింతే,
శరీరంలో జరిగే వింతలతో వచ్చినవారే వీరంతా
సరే పుత్రుడు శత్రువట ఎప్పుడు అంటే ఈ శ్లోకం చూడాల్సిందే.


గాత్రం సంకుచితం, గతిర్వగళితా, భ్రష్టాచ దంతావళి:
దృష్టిర్నశ్యతి, వర్ధతే బధిరతా, వక్త్రంచ లాలాయతే
వాక్యం నాద్రియతేచ బాంధవ జనై:, భార్యా నశుశ్రూయతే
హా కష్టం! పురుషస్య జీర్ణవయస:, పుత్రోప్యపిమిత్రాయతే!

శరీరం ముడుతలు పడినది. నడక తూలుచున్నది.
 పండ్లూడినవి. దృష్టి మందగించినది. చెవుడు పెరుగుచున్నది.
నోరు చొంగకారుతున్నది. బంధువులు మాట మన్నించటం లేదు.
భార్య మాట వినటం లేదు. ఆహా! మానవునకు ముసలితనం ఎంత కష్టం!
పుత్రుడు కూడ శత్రువుగా మారుతున్నాడు!

No comments:

Post a Comment