చిత్తగించుమయ్యశ్రీగణేశ!
సాహితీమిత్రులారా!
ఒక్కొకరు ఒక్కొక ప్రత్యేక పద్ధతిలో వారి రచనలు చేస్తుంటారు.
అలాంటిదే ఈ చిత్తగంచుమయ్యశ్రీగణేశ శతకం. దీన్ని
సినీసంభాషణరచయిత, స్క్రీన్ ప్లే రచయిత,
కథారచయిత అయిన గణేష్ పాత్రోగారి రచన
దీనిలోని ప్రత్యేకత ఏమంటే ఇది వివిధ భాషల్లోని
సామెతలకు ఆటవెలదులు కూర్చటం
ఇవి ధారావాహికగా ఆంధ్రజ్యోతివారపత్రికలో
13-10-2000 నుండి వచ్చినవి.
వాటిలో ఇపుడు కొన్ని చూద్దాం.
ఇందులో మొదటి పద్యం మాత్రం ఆయన విషయం రాసుకున్నాడు - అది
అక్షరసముదాయ మభ్యసించితిదప్ప
ఛందమెరుగ శాస్త్రగ్రంధమెరుగ
శ్రీగణేశశతక - మేగతివ్రాతునో
చిత్తగించుమయ్య శ్రీగణేశ!
Adam ate the apple ,
and our teeth still ache
- Hungarian proverb
ఇది ఒక హంగేరియన్ సామెత దీనికి పద్యం
ఆదిమానవుండు అపుడెప్పుడో ఒక
కొరకరాని ఫలము కొరికెనంట
ఫలితమిప్డు మనకు పండ్లన్నిపుండ్లాయె
చిత్తగించుమయ్యశ్రీగణేశ!
The bee is more honoured
than other animals
not because she labours ,
but because she labours for others
- St. John
ఈగలందు తేనెటీగకు మరియాద
ఆమె కాయకష్టమరసికాదు
సొంతలాభ మనక ఇంత కష్టించునే
చిత్తగించుమయ్యశ్రీగణేశ!
Drink for you know not whence you came nor why
Drink for you know not why you go nor where
---Omar Khayyam
ఏడనుండి వచ్చి తెందుకు వచ్చితి
వేడపోదునిప్పుడెందుకొరకు
తెలియలేద నీకు తెలివేల, త్రాగుము
చిత్తగించుమయ్యశ్రీగణేశ!
Beware the fury of a patient man.
- Dryden
ఎడమ చెంపగొట్టకుడిచెంపచూపించు
బాపూజీ అసలగురూపమేమి
ఓరిమిగలవానియుగ్రావతారమే
చిత్తగించుమయ్యశ్రీగణేశ!
No comments:
Post a Comment