Sunday, September 4, 2016

ఎప్పుడు ఈ లోకపు సుఖాలన్నీ లభిస్తాయి?


ఎప్పుడు ఈ లోకపు సుఖాలన్నీ లభిస్తాయి?



సాహితీమిత్రులారా!

మన పెద్దలు అనేక విషయాలు చెప్పారు.
వాటిలో ఉన్న విషయాలను పాటిస్తే
తగిన సుఖం సంతోషం లభిస్తాయి.

విష్ణుపురాణంలోని 4వ ఆశ్వాసంలోని ఈ పద్యం చూడండి.

రతితంత్రములయందుఁ బ్రౌఢయై తనమీఁద
          నత్యంతభయభక్తు లతిశయిల్ల
సౌకుమార్యముచేత నే కొదవయు లేక
          సుందరాకారత సొంపు గలిగి
సరసశృంగారవేషముల నెంతయు మించి
          యుచితప్రియాలాపరచన లెఱిఁగి
వినయవిధేయవివేకశీలతలచే
          ననుకూలమగు నెఱతనము నేర్చి
నిర్మలాంగియు నిపుణయు నిర్మలాభి
జాత్యయును బుణ్యవతియును సతియునైన
తన కులాంగన రతికేళిఁ దనిపె నేని
యతని కైహికలోక సౌఖ్యములు గలుగు


కామశాస్త్రములందు విద్వాంసురాలై ఉండాలి.
మగనిమీద భయం, భక్తీ కలిగి ఉండాలి.
నాజూకుతనములో కొదవలేనిది కావాలి.
అందమైన ఆకారం ఉండాలి.
మనస్సుకు ఆహ్లాదం కలిగేటట్లు సందర్భానికి తగినట్లు మాట్లాడాలి.
 పెద్దలయెడల అణకువ ఉండాలి. మంచిచెడులు తెలిసి ఉండాలి.
పనులపట్ల నిబద్ధత(విధేయ) ఉండాలి.
ఇవన్నీ ఉంటూ జాణతనం ఉండాలి.
ఇవన్నీ మగనికి అనుకూలమైనవి కావాలి.
శరీరం స్వచ్ఛంగా ఉండాలి. నేర్పరితనం ఉండాలి.
స్వచ్ఛమైన వంశంలోనిది కావాలి. పుణ్యవంతురాలు కావాలి.
పతివ్రత కావాలి. అటువంటి తన భార్యను రతిక్రీడలలో
సంతోషపెడితే ఆ వ్యక్తికి ఈ లోకపు
సుఖాలన్నీ లభిస్తాయి - లభించినట్లే. - ఆని భావం.

No comments:

Post a Comment