Friday, September 9, 2016

మిత్రద్రోహం ఎలాంటిది?


మిత్రద్రోహం ఎలాంటిది?


సాహితీమిత్రులారా!


ద్రోహచింతన నేడు నిత్యకృత్యమైంది.
కాని ఏద్రోహం ఎలాంటిదో చెప్పే
ఈ శ్లోకం చూడండి.

సేతుం దృష్ట్వా సముద్రస్య
గంగా సాగర సంగమమ్
బ్రహ్మహత్యా ప్రముచ్యతే
మిత్ర ద్రోహో న ముచ్యతే

రామేశ్వరం వద్ద సేతుదర్శనం చేసినా
గంగానది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని దర్శించినా
బ్రహ్మహత్య వంటి మహాఘోరపాపాలు కూడా
అంతరించి పోతాయని ప్రతీతి.
 కానీ, ఏంచేసినా నమ్మించి చేసే మిత్రద్రోహం అనే
పాతకానికి నిష్కృతి లేదు.

No comments:

Post a Comment